దదాపు మూడునెలల ఎదురు చూపుల తర్వాత ఇవ్వాళ పిజ్జా చూసి వచ్చాను. ఆగండాగండి పిజ్జా తిని కదా రావాలి చూసి రావడమేంటి అని అహనాపెళ్ళంట లో కోటా లాగా చూరుకు వేళ్ళాడేసి చూస్తూ మంచినీళ్ళు తాగినట్లో లేక 'చూపులు కలిసిన శుభవేళ' లో బ్రహ్మానందం లాగా దగ్గర్లోని పిజ్జా సెంటర్ కి వెళ్ళి తినేవాళ్ళ పక్కన నిలబడి పిజ్జావంక పిచ్చి చూపులు చూసినట్టో ఊహించేస్కోకండి మరి. నే చూసింది తినే పిజ్జాని కాదనమాట ఈరోజే విడుదలైన తెలుగు సినిమా ’పిజ్జా’ని. "హ్మ్ పిజ్జానా ఇంకేమీ దొరకనట్లు ఇదేం సినిమా పేరోయ్ ఇది హిట్టైతే రేపొద్దున్న పాస్తా, బర్గర్, ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు అని దొరికిన తిండి పేర్లన్నీ పెట్టి సినిమాలు తీసేస్తారా?" అని తిట్లు లంకించుకోకండి మరి. ఇది ఒక పిజ్జా డెలివరీ బోయ్ చుట్టూ తిరిగే కథ కనుక దీనికి ఆ పేరు పెట్టారనమాట. నాలుగు నెలల క్రితం తమిళనాట విడుదలైన ఈ సినిమా కోటిన్నర బడ్జెట్ తో తీస్తే ఎనిమిది కోట్లు (వికీ లెక్కల ప్రకారం) కలెక్ట్ చేయడమే కాక అవార్డులు సైతం సాధించిందట ఆ చిత్రాన్ని డబ్ చేసి తెలుగులో ఈ రోజు విడుదల చేశారు.
అమ్మ జ్ఞాపకాల కబుర్లు
చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.
అందమైన బాల్యం
మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.
ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు
నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.
ఇంజనీరింగ్ కాలేజ్
ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.
సినిమాలు రివ్యూలు..
నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.
శుక్రవారం, ఫిబ్రవరి 15, 2013
పిజ్జా...
దదాపు మూడునెలల ఎదురు చూపుల తర్వాత ఇవ్వాళ పిజ్జా చూసి వచ్చాను. ఆగండాగండి పిజ్జా తిని కదా రావాలి చూసి రావడమేంటి అని అహనాపెళ్ళంట లో కోటా లాగా చూరుకు వేళ్ళాడేసి చూస్తూ మంచినీళ్ళు తాగినట్లో లేక 'చూపులు కలిసిన శుభవేళ' లో బ్రహ్మానందం లాగా దగ్గర్లోని పిజ్జా సెంటర్ కి వెళ్ళి తినేవాళ్ళ పక్కన నిలబడి పిజ్జావంక పిచ్చి చూపులు చూసినట్టో ఊహించేస్కోకండి మరి. నే చూసింది తినే పిజ్జాని కాదనమాట ఈరోజే విడుదలైన తెలుగు సినిమా ’పిజ్జా’ని. "హ్మ్ పిజ్జానా ఇంకేమీ దొరకనట్లు ఇదేం సినిమా పేరోయ్ ఇది హిట్టైతే రేపొద్దున్న పాస్తా, బర్గర్, ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు అని దొరికిన తిండి పేర్లన్నీ పెట్టి సినిమాలు తీసేస్తారా?" అని తిట్లు లంకించుకోకండి మరి. ఇది ఒక పిజ్జా డెలివరీ బోయ్ చుట్టూ తిరిగే కథ కనుక దీనికి ఆ పేరు పెట్టారనమాట. నాలుగు నెలల క్రితం తమిళనాట విడుదలైన ఈ సినిమా కోటిన్నర బడ్జెట్ తో తీస్తే ఎనిమిది కోట్లు (వికీ లెక్కల ప్రకారం) కలెక్ట్ చేయడమే కాక అవార్డులు సైతం సాధించిందట ఆ చిత్రాన్ని డబ్ చేసి తెలుగులో ఈ రోజు విడుదల చేశారు. ఆదివారం, ఫిబ్రవరి 10, 2013
క్రైస్తవ 'కడలి'
మంగళవారం, జనవరి 22, 2013
అమ్మ.
సోమవారం, డిసెంబర్ 03, 2012
కృష్ణం వందే జగద్గురుం
సోమవారం, అక్టోబర్ 29, 2012
శుభసంకల్పం-ఈనాడు కథ
బుధవారం, అక్టోబర్ 17, 2012
బ్రదర్స్-లెంత్ తో బెదుర్స్
ఏదైనా ఒక సినిమా మనకి విపరీతంగా నచ్చడం ఆ సినిమా దర్శకుడికి హీరోకి ఒక రకంగా శాపమనే చెప్పచ్చు. “రంగం” లాంటి సినిమా తీసిన దర్శకుడు కె.వి.ఆనంద్ నుండి ఎప్పుడు అంతటి ప్రత్యేకత ఉన్న సినిమాలు, ప్రతి సినిమాకి అలాంటి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేనే ఆశించడం మన తప్పేనని నిరూపిస్తూ మనల్ని పూర్తిగా నిరాశ పరిచే సినిమా అతని కొత్త సినిమా ’బ్రదర్స్’. మంగళవారం, అక్టోబర్ 16, 2012
RGV 3D బూచి !!
సోమవారం, అక్టోబర్ 08, 2012
అవును !!!
ఆదివారం, అక్టోబర్ 07, 2012
ENగ్LISH VINGLIష్
సోమవారం, జులై 30, 2012
ఓనమాలు
కథ విషయానికి వస్తే అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కొడుకుదగ్గర నివాసముండే నారాయణరావు మాష్టారు (రాజేంద్రప్రసాద్) తన ఊరు గురించిన జ్ఞాపకాలతో బ్రతుకుతూ చనిపోయేలోపు మళ్ళీ ఒక్కసారి తనఊరు చూసిరావాలని అనుకుంటూ ఉంటారు. అయితే నగర జీవితంలో క్షణం తీరికలేకుండ బ్రతుకుతున్న మాష్టారి కొడుకు ఆయనను ఇవ్వాళా రేపు తీసుకువెళ్తానంటూ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటాడు. ఇలాలాభంలేదని ఒంటరిగా ఇండియా వచ్చేస్తారు నారాయణరావు మాష్టారు. ఎయిర్ పోర్ట్ నుండి తన పల్లెకు వెళ్ళే దారిలో ఊరిగురించి, తన విధ్యార్దుల గురించి, ఊరిప్రజల మధ్యన ఆప్యాయతలను గురించిన అందమైన జ్ఞాపకాలలో ప్రయాణించిన మాష్టారు ఊరు చేరుకునేసరికి అక్కడ పరిస్థితులన్నీ మారిపోయి, అప్పటిమనుషులంతా చెల్లాచెదురై, ఊరు పట్నపు పోకడలకు పూర్తిగా అలవాటుపడలేక పాత పద్దతులను మిగుల్చుకోలేక సతమౌతుండడం చూసి బాధపడతారు. ఎంతో ప్రతిభ ఉన్న తన విధ్యార్ధులు సైతం మారుతున్న విలువలకు తలవంచలేక సరైన ఉపాధిలేక ఇబ్బందులు పడుతుండడం చూసి మనసు విరిగి వారికోసం ఊరుకోసం తనపరిధిలో సాధ్యమైన పరిష్కారం ఏంచేశారనేది ముగింపు.
సినిమాటోగ్రాఫర్ హరి అనుమోలు పల్లె అందాలను చక్కని పచ్చదనంతో తెరకెక్కించారు. సినిమా అంతా కూడా కంటికి ఆహ్లాదంగా హాయైన అనుభూతినిచ్చింది. కోటి నేపధ్యసంగీతం సంధర్బోచితంగా ఉంది, పాటలలో పల్లెలో మేలుకొలుపు గురించి సాగే “సూరీడు ఒచ్చిండు సూడయ్యో” హుషారుగా అలరిస్తే, క్లైమాక్స్ లో వచ్చే “పిల్లలూ బాగున్నారా” పాట తన పిల్లలగురించి పడుతున్న పల్లె ఆవేదనను ప్రతిబింబించింది. “అరుదైన సంగతి” భార్యా భర్తలమధ్య అనురాగాన్ని చూపిస్తే “పండుగ అంటే పచ్చదనం పచ్చదనం మా పల్లెధనం” పాట పల్లెల్లోని పండుగ సందడినంతా చూపిస్తుంది. చాలారోజుల తర్వాత ఈసినిమాలోని పాటలన్నీ సీతారామశాస్త్రిగారే రాశారు. ఎడిటింగ్ కానీ కొరియోగ్రఫీకానీ ఇతర విభాగాలేవీ నన్ను ఎక్కడా ఇబ్బందిపెట్టలేదు. ఖదీర్ బాబు ప్రాసకోసం పంచ్ లకోసం ప్రాకులాడకుండా అవసరమైనమేరకు చక్కని సంభాషణలు అందించారు. మాష్టారి పాత్రకు రాసిన కొన్నిమాటలు మనుషులమధ్య ఆప్యాయతల ఆవశ్యకతను, మతసామరస్యాన్ని చూపిస్తే మరికొన్ని మాటలు మారిన ప్రస్తుత విలువలను పరిస్థితులను సూటిగా ఎత్తి చూపిస్తాయి.
రొటీన్ ఫాక్షన్ / ప్రేమ కథా సినిమాలకు భిన్నంగా, నిజాయితీతో ప్రస్తుత పరిస్థితులకు అద్దంపడుతూ, చూసిన ప్రతిఒక్కరినీ ఆలోచింపజేసే ఓ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించిన క్రాంతిమాధవ్ అభినందనీయుడు. తెలుగుదనమున్న మంచి సినిమాలు వైవిధ్యమైన సినిమాలు తెలుగులో రావడంలేదని బాధపడే ప్రతిఒక్కరూ తప్పక చూసి ప్రోత్సహించవలసిన చిత్రం “ఓనమాలు”.
నాకు నచ్చిన కొన్ని మాటలు, చిత్రం చూసే అవకాశమున్నవారు దయచేసి చదవకండి.
“స్కూల్ బస్సులో పడుకున్న పిల్లల్ని ఉద్దేశించి: బళ్ళో ఉపాధ్యాయులు పుస్తకాల మధ్య బాదేస్తారు ఇంట్లో తల్లిదండ్రులు ర్యాంకుల కోసమంటూ ఉతికేస్తారు. ఇంటికీ బస్సుకీ మధ్య ఉండే ఈ గంటే పిల్లలకి రెస్టు, ఇక ఆడుకోడానికి పాడుకోడనికి పిల్లలకి టైమెక్కడుంటుందిసార్, నెమలిపిల్లలు జూలో బతికినట్టే.”
“అసలు మనిషికూడా ఒక పశువేనయ్యా కాకపోతే జ్ఞానం నేర్చుకుని మనిషయ్యాడు, మానవత్వం మర్చిపోయి పశువవుతున్నాడు.”
“కూర్చుని తింటే కొండలైనా కరుగుతయ్యేమో కానీ పెడితే కరగవయ్యా ఆ, పెట్టడం పల్లె సంస్కృతి అదీగాక పెట్టేవాడి చేతిని పరమాత్మ ఎప్పుడూ వదలడంటారు.”
“పొద్దునలేస్తే సవాలక్ష వ్యవహారాల్లో మునిగితేలే మగాళ్ళకి కాస్తంత మురిపెం కావాలి ఎందుకంటే మగాళ్ళుకూడా మీసం వచ్చిన పసిపిల్లలే.”
భార్య: “మొగుడికి పట్టని అందం ఏం అందమండీ?”
భర్త: “భార్య అందాన్ని భర్తప్రత్యేకంగా చూడడు ఆమె అందం అతని మనసులో ఉంటుంది, ఆమె కదిలినా, తిరిగినా, పూలుకోసినా, నీళ్ళుచేదినా, పిల్లాడికి జోలపాడినా ఇలా ప్రతి సంధ్రర్భంలోనూ భార్య భర్తకి అందంగానే కనిపిస్తుంది.”
“మతం అంటేనే మంచి, అది దేవుడి చేతిలో బెత్తం.”
“వాడికి గళ్లచొక్క తీస్కురాకురోయ్ ఆడా చొక్కామీదున్న గడికీ గడికీ మధ్య కూడా తగాదా పెడతాడు.”
“ప్రతి గురువుకీ మూడులక్షణాలుండాలి మంచి కంఠం, మంచి రూపం, మంచి ఆహార్యం.”
“మాష్టారంటే పిల్లలకు సహాయకుడు మాత్రమే, అటువెళ్ళు ఇటువెళ్ళు అని దారిచుపించేవాడు మాత్రమే, నేర్పించేవాళ్ళకన్నా సహాయం చేసే వారే ఉత్తమ ఉపాధ్యాయుడు, నేర్పిస్తే పిల్లలు ఆధారపడిపోడానికి అలవాటుపడతారు, అదేనేర్చుకోడంలో సహాయం చేస్తే స్వతంత్రంగా నిలబడతారు.”
మాష్టారు మరణశయ్యపైనున్న భార్యతో : “రుక్మిణీ నన్ను ఒంటరివాడ్ని చేసి వెళ్ళద్దు, పుస్తకాలు పరీక్షపేపర్లు తప్ప నా అన్నం ఎక్కడుందో నా బట్టలెక్కడున్నాయో తెలియని వాడ్ని నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళకు.”
“పరాయి భాషకి కిరీటం పెట్టడానికి మాతృభాష శిరస్సు ఖండించడం ఎంత పొరపాటు.”
“ఏమోయ్ వాళ్ళింట్లో పదారు రకాల స్వీట్లు మరో పదారు రకాల హాట్లు ఉంటాయ్ మన స్వీట్లు అవసరమా?” "ఎన్నున్నా ఐనవాళ్ళు పెట్టిన స్వీట్ కే తీపెక్కువ, తీపి పంచితే ప్రేమ పెరుగుతుంది.”
“పోయే ముందు కానీ ప్రాణం విలువ తెలియదు.”
“లీగల్ గా చేస్తే స్కీము ఇల్లీగల్ గా చేస్తే స్కాము.”
“అమెరికాలో తాగాలనుకున్నా యజ్ఞం చేసినట్లుగా అందరూ ఇలా కూర్చుని మగ్గులు మగ్గులుగా తాగరు కాలం విలువ కష్టం విలువ తెలిసి పని చేస్తారూ, వీకెండ్లో ఏదో ఒక పెగ్గు పుచ్చుకుంటారు.”
“కుక్కను చంపాలంటే పిచ్చిదని పేరుపెట్టాలి, సాంప్రదాయాన్ని చంపాలంటే ఛాదస్తమని పేరుపెట్టాలి, అంతేకదా? పనైపోయిందికదా అని పాల సీసాను పారేయచ్చు అమ్మని పారేయలేం కదా?”
“నా మిసెస్ మాష్టారూ, తనన్న ప్రతిదానికీ ఓఎస్ అన్నాలి లేదంటే వాయిస్ పెంచుతుంది.”
“పిల్లలు ఏదడిగితే అదివ్వడం కాదమ్మా, వాళ్ళ అవసరాన్ని గుర్తించి ఏది కావాలో అదివ్వాలి.”
“మనిషి ప్రమేయాన్నీ మనిషి ఉపాధినీ అడ్రస్ లేకుండా చేసే టెక్నాలజీని ఒప్పుకోకూడదు.”
“ఈ ఊరంటే నాకు గౌరవం, ఈ ఊరు నేర్పించిన సంస్కారమంటే నాకు గౌరవం, ఊరంటే కొందరు ఉండే సమూహం కాదు, ఊరు ఒక క్వాలిటీ కంట్రోలర్, మన క్యారెక్టర్ కి ఎప్పటికప్పుడు మార్కులేసే ఒక టీచర్, అలాంటి ఊరు ముందు నేను ఫెయిల్ కాలేను.”
“మా తరానికి అడ్వైస్ ఇచ్చే వాళ్ళుకావాలి, వార్నింగ్ ఇచ్చే వాళ్ళు కావాలి అలాంటి ఊరికి మేం వెళ్ళం ఊరు మాదగ్గరికి రాదు ఇట్సె బిగ్ గ్యాప్”
“పాలు ప్యాకెట్లనుంచి వస్తాయని, బియ్యం బస్తాల్లో పండుతాయనీ, కూరగాయలు ఫాక్టరీల్లో తయారవుతాయని నమ్మే హైటెక్ పిల్లలకి మనదేశపు మట్టివాసన గురించి, మన కన్నీటి సువాసన గురించీ తెలియాలంటే అది పల్లెటూళ్ళనుండే నేర్పించాలి.”
నేను ???
- వేణూశ్రీకాంత్
- అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.


.jpg)








