అవి నేను మా పాత వీధి బళ్ళోనే కొత్తగా నాలుగో తరగతిలో చేరిన రోజులు. ఆ ఏడాది మా బళ్ళో హనుమంతరావ్ అని ఒకడు చేరాడు. నిజానికి వాడి వయసు ప్రకారం వాడు ఏ ఏడోతరగతిలోనో ఉండాల్సిన వాడు కానీ డిటెన్షన్స్ తో బళ్ళు మారి ఇంకా నాలుగులోనే ఉన్నాడు. మా అందరికంటే పెద్దాడవడంతో వాడికి తెలియని విషయం, చేయని అల్లరి ఉండేది కాదు. నాఖర్మ కొద్దీ వాడు నాకు ఆర్యా-2 లాంటి ఫ్రెండ్. నేనెంత వదిలించుకోవాలని చూసినా తుమ్మబంకలా అంటుకునేవాడు.
వాడిదగ్గర నేర్చుకునే కొత్త కొత్త ఆటలు, ఇంకా స్కూల్ దగ్గరలో ముళ్ళకంపల్లోకి సైతం ధైర్యంగా వెళ్ళి కోసుకొచ్చుకున్న సీమ చింతకాయలు, రేగుపళ్ళు, చింతకాయలు లాంటివాటిలో వాటా తీస్కోడం బానే ఉండేది కానీ వీడితో కలిసి అల్లరి చేస్తూ స్కూల్ పక్కనే ఉన్న మా ఇంట్లో వాళ్ళకి నేనెక్కడ దొరికిపోతానో అని అనుక్షణం భయంతో చచ్చేవాడ్ని. వాడికి ఎక్కడెక్కడి డబ్బులు చాలేవి కాదు అమ్మ ఇంటర్వల్ లో కొనుక్కోమని నాకు ఇచ్చే పదిపైసలు బతిమాలో భయపెట్టో వాడే తీసేస్కునేవాడు.

ఆటల్లో పందెంగా నోట్ బుక్స్ మధ్యలో ఉండే తెల్లకాయితపు ఠావులు పెట్టి నిక్కచ్చిగా అవి వసూలు చేసేవాడు. ఒకోసారి అవి చాలక ఇంటర్వెల్ లో క్లాస్ లో ఎవరూ లేని టైం చూసుకుని పిల్లల నోట్సుల్లో పేపర్లు దొంగతనం చేసేవాడు వాడికి పార్టనర్ ని నేను :-) ఇదే నాకు గుర్తుండి నేను చేసిన మొదటి దొంగతనం. ఎక్కడ దొరికిపోతానో అనే భయంతో ఒకోసారి నేను రానురా అని చెప్పి తప్పించుకోడానికి నా నోట్స్ లో పేపర్లు కూడా యధేచ్చగా చింపి ఇచ్చేసేవాడ్ని. అయితే నా నోట్సులన్నీ ఒకటొకటిగా సైజ్ తగ్గిపోడం మా ఇంట్లో అమ్మానాన్న ఇద్దరూ గమనించారు.
నన్ను అడిగితే "ఏమీ తగ్గలేదు" అని కాసేపు బుకాయించినా వాళ్ళు పాత కొత్త నోట్సులు కంపేర్ చేసి చూపించేసరికి “నాకు తెలియకుండా ఎవరో కొట్టేస్తున్నారమ్మా...” అని అలవోకగా ఆబద్దమాడేసి ఆ విషయం మర్చిపోయాను. కానీ అలా వదిలేస్తే మా పేరెంట్స్ మా పేరెంట్స్ ఎందుకవుతారు సైలెంట్ గా నామీద నిఘా పెట్టారు. ఒకరోజు మా హనుమంతు గాడు పేపర్లు నొక్కేయడం నేనేమో గుమ్మంలో కాపలా ఉండి ఎవరైనా వస్తున్నారేమో అని చూస్తూ వాడికి హెల్ప్ చేయడం మా వాళ్ళ దృష్టిలో పడింది. ఇంక అంతే ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చాక అమ్మా నాన్న ఇద్దరి చేతిలో దెబ్బలు పడ్డాయ్. నా లైఫ్ లో నాకు గుర్తున్నంతవరకూ వాళ్ళతో దెబ్బలు తిన్న సంధర్బం అదొక్కటే. అన్నేళ్ళుగా ఎపుడూ చేయిచేస్కోని వాళ్లు ఆపని చేసేసరికి బాగానే బుద్దొచ్చి వెంటనే హెడ్ మాస్టార్ కి కంప్లైంట్ చేస్తానని బెదిరించి హనుమంతుగాడి స్నేహం వదిలించుకున్నా.
అంత మాత్రం చేత నేనేదో బుద్దిమంతుడ్ని అయిపోయాను అనుకుంటున్నారా హహహ :-) బుద్దిసంగతి ఎలా ఉన్నా ఒక విషయం స్పష్టంగా అర్ధమైంది “అల్లరి చేసినా కూడా పెద్దోళ్ళకి దొరికిపోకుండా చేయాలి” అనే విషయం వారం రోజులు తగ్గని వాతల సాక్షిగా బోధపడింది :-) ఐతే అప్పటినుండీ నేను చేసే దొంగతనాలు మా వంటింటికే పరిమితం చేశా. అవికూడా ఆ వయసులోనే ఎంతో ప్లాన్డ్ గా చేసే వాడ్ని.

ఉదాహరణకి కోటా ప్రకారం అమ్మ మనకి ఇచ్చే ఒకటి రెండు లడ్డూలు చాలేవి కాదు, అదనంగా తినాలనిపించేది. అప్పుడు అమ్మని అడిగితే “అన్నం తినకుండా అన్నీ చిరుతిళ్ళే తింటావేం రా” అని తిడుతుంది కదా... అందుకని సైలెంట్ గా వంటగదిలో లడ్డూల డబ్బాలోనుండి నాలుగు లడ్డూలు తీసి వాటిలో నుండి కొంచెం కొంచెం తుంచుకుని ఒక చిన్న లడ్డూ చేసుకుని ఆ నాలుగింటినీ తుంచినట్లు తెలియకుండా నంబర్ తేడా రాకుండా మళ్ళీ బుద్దిగా కొంచెం చిన్న సైజ్ లడ్డూల్లాగా చుట్టేసి డబ్బాలో పెట్టేసేవాడ్ని. అపుడు ఒకవేళ అమ్మ తర్వాత చూసుకున్నా కూడా లెక్క తేడా రాదు కదా సో చిన్న చిన్న లడ్డూలు చేశాను గాబోలు అనుకుని సరిపెట్టేసుకుంటుంది కానీ మనమీద అనుమానం పడదనమాట.
అలాగే కారప్పూస/జంతికలు/చక్రాలు లాంటివి ఉన్నాయనుకోండి అవి ప్లెయిన్ డబ్బాలో అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు ఎన్ని కావాలంటే అన్ని తీస్కోవచ్చు అదే లెవల్ తెలిసేలా అడ్డగీతలున్న డబ్బాలోనో లేక నిండుగా ఉన్నపుడో తీస్కోవాలనుకోండీ అపుడు మనకి నచ్చినన్ని పైపైనుండి తీస్కుని లెవల్ తగ్గినట్లు తేడా తెలియకుండా చక్రాలని చేత్తో కొంచెం పైకి లాగి తేలికగా లెవల్ పైకి కనపడేలా సెట్ చేయాలనమాట. కానీ వీటితో అసలు ఇబ్బంది దొంగతనం చేసేప్పుడుకన్నా జోబులో ఎత్తుగా కనపడో, నోట్లో కర కర మంటూనో దొంగని పట్టించేస్తాయ్. అందుకని ఎత్తుగా కనపడకుండా వాటిని కొంచెం చిన్న ముక్కలుగా నలిపేసి జోబులో పోస్కుని ఒక్కోముక్కని ముందు నోట్లో నానేసి అపుడు చప్పుడు రాకుండా తినాలనమాట.

ఇంత ప్లాన్డ్ గా చేసినా ఒకోసారి దొరికిపోతాం. ఒకసారి ఏమైందంటే అప్పుడు నేను ఏడో, ఎనిమిదో చదువుతున్నాను. అమ్మ సగ్గుబియ్యం వడియాలు చేద్దామని మూడు కేజీల సగ్గుబియ్యం తెప్పించి రామనవమికి పానకం చేసుకునే చిన్న స్టీల్ బిందెలో పోసి ఒక అట్టముక్క దానికి మూతగా పెట్టింది. మనకి ఆటల మధ్యలో ఏదో ఒకటి నమలడానికి ఉండాలి టైంకి వంటింట్లో ఏవీ దొరకలేదు సో సగ్గుబియ్యం కూడా తినేవే కదా ట్రైచేసి చూద్దాం అని చూస్తే భలే ఉన్నాయనిపించింది, ఎక్కువసేపు నమలచ్చు పైగా ప్యూర్ స్టార్చ్ కావడంతో ఎనర్జిటిక్ గా కూడా ఉండేవి. ఇక చూస్కోండి పదినిముషాలకోసారి లోపలికి వెళ్ళడం ఆ అట్టముక్కని చేయి మాత్రం పట్టేట్లుగా కొంచెం పైకి లేపి ఓ గుప్పెడు జోబులో పోస్కుని రావడం.
ఇలా ఓ పదిరోజులు పోయాక ఓ ఆదివారం ఉదయం వడియాల కోసం అమ్మ అన్నీ సిద్దం చేస్కుని సగ్గుబియ్యం తీస్కురమ్మంది. నేను కొంచెం టెన్షన్ పడ్డా అయినా “ఆ నేనెన్ని తినుంటా రోజుకి కొన్ని గుప్పెళ్ళేగా మహా ఐతే ఒక అరకేజీ తగ్గుంటాయ్ అమ్మకి తెలీదులే” అనుకుని సైలెంట్ గా బిందె తీస్కొచ్చి ఎదురుగా పెట్టా. మూత తీసిన అమ్మ షాక్... బిత్తరపోయి లోపలికి చేయిపెట్టి బిందెను అటూ ఇటూ తిప్పి ఎంతచూసినా అరకేజీనే ఉన్నాయ్. నేను అరకేజీ తిన్నాననుకుని రెండున్నర కేజీలు తినేసి కేవలం అరకేజీ మిగిల్చానన్న విషయం నాకు అర్ధమైంది. సరుకుల్లో మూడుకేజీలు రాస్తే అరకేజీనే తెచ్చారా అని మొదట సందేహపడ్డారు కానీ మెల్లగా నన్నడిగారు “ఏం జరిగింది నాన్నా?” అంటూ.

ఆబద్దమాడితే ఏం జరుగుతుందో అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి నిజం చెప్పేసి అన్ని తిన్నాననుకోలేదమ్మా అని అమాయకంగా ఫేస్ పెట్టేశాను. ఇక ఆ రోజంతా ఒకటే నవ్వులు, “అన్ని తిని ఎలా అరిగించుకున్నావురా అది కడుపా గ్రైండరేమైనా మింగేశావా?" అని జోకులేసినా ఎక్కడ వాతం చేస్తుందో అని భయపడి వాము, అల్లం మురబ్బా లాంటివి తెప్పించి పెట్టి నాల్రోజులు జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ తర్వాత చాలా రోజులు ఇదే విషయం మీద నాపై జోకులు పడ్డాయనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుకదా. దెబ్బలకన్నా జోకులు చాలా మేలులే అని భరించేశా అనుకోండి.
సరే ఇక అలా అలా పెరిగి పెద్దయ్యాక ఇంజనీరింగ్ లో చేరిన తర్వాత ఎపుడైనా డిన్నర్ కోసం పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కి వెళ్ళినపుడు వాళ్ళు చివర్లో స్వీట్ సోంఫ్ ఇస్తారు కదా అది ఖర్చీఫ్ లోనో వాడే ఇచ్చే పేపర్ నాప్‌కిన్స్ లోనో పొట్లం కట్టేసి తీస్కొచ్చేయడం బాగా అలవాటైంది. డిమ్ లైటింగ్ ఉండేదేమో ఈ కొట్టేసే కార్యక్రమం నిర్విఘ్నంగా పక్కటేబుల్ వాడిక్కూడా తెలియకుండా చేసేసే వాడ్ని, అది కొన్ని రోజులు బాగానే ఎంజాయ్ చేశా ఎప్పుడూ ఎవరికీ దొరకలా.

అయితే అసలు క్లెప్టోమానియా అని అనుమానించేంత సంఘటన నాకు ఉద్యోగం వచ్చిన కొన్నేళ్ళకి జరిగింది. అప్పట్లో వృత్తిరీత్యా తరచూ ఇండియాలోనూ అమెరికాలోనూ రకరకాల ఊర్లు తిరుగుతూండేవాడ్ని కంపెనీ డబ్బులే కాబట్టి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో బస చేసే వాడ్ని. ఆ హోటల్స్ లో వాళ్ళు ఇచ్చే హాండ్ టవల్స్, ఒకటీ అరా చిన్న చిన్న డెకరేటివ్ ఆర్టికల్స్, రూం సర్వీస్ కి తెచ్చిన కట్లెరీలో ఆసక్తికరమైనవి ఉంటే అవి ఇలాంటి వాటిలో ఏదో ఒకటి సైలెంట్ గా బాగులో సర్దేసే వాడ్ని, అదికూడా అస్సలు అనుమానం రాకుండా పొరపాటున సర్దినట్లు సర్దేవాడ్ని. ఇది తరచుగా ప్రతి ట్రిప్ లో చేయకపోయినా అప్పుడప్పుడూ హోటల్ కి ఒక ఐటం చొప్పున సావనీర్ లాగా కలెక్ట్ చేసేవాడ్ని. అయితే ఇదంతా పూర్తి స్పృహలో కాకుండా ఏదో యధాలాపంగా జరిగిపోతుండేది కానీ అదృష్టవశాత్తు ఎపుడూ దొరికిపోలేదు.
అలాంటి టైంలో ఒక సారి ఇల్లుమారుతున్నపుడు ఇలా కలెక్ట్ చేసినవి అన్నీ ఓ పది వస్తువులు వరకూ కప్ బోర్డ్ లో ఒకే చోట కనిపించేసరికి అప్పుడు సడన్‌గా షాక్ కొట్టింది. “అరే నాన్న సావనీర్స్ అనేవి నువ్వు తెచ్చుకునేవి కాదురా వాళ్ళు ఇచ్చేవి, ఇది పూర్తిగా దొంగతనమే” అని ఎరుక వచ్చేసరికి ఒక్కసారిగా చాలా ఎంబరాసింగ్‌గా ఫీల్ అయ్యాను. ఒకవేళ దొరికి ఉంటే నా పరువుతో పాటు నేను పని చేస్తున్న కంపెనీ పరువు కూడా ఏమయ్యేదో తలచుకుంటేనే ఒళ్ళు జలదరించింది. ఇలా లాభంలేదని వాటినన్నిటిని అక్కడే డస్ట్ బిన్ లో పడేసి అప్పటినుండీ ఇలాంటి టెండెన్సీ పట్ల కాస్త ఎరుకతో అప్రమత్తంగా ఉండటం ప్రారంభించాను. ఆ తర్వాతెపుడూ మళ్ళీ రిపీట్ అవలేదు. ఆఖరికి కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సర్వీస్ మొదలెట్టిన కొత్తలో ఫ్లైట్లో కాంప్లిమెంటరీ హెడ్ ఫోన్స్ ఇచ్చినా కూడా అవి కాంప్లిమెంటరీనే కదా అని ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేస్కున్నాక కానీ ఇంటికి తెచ్చుకోలేదు.

అవండీ నాలోని తీఫ్ తిరుమలై కబుర్లు. నిన్న నా క్లాస్మేట్స్ చేసిన దొంగతనం గురించీ, ఈరోజు నేను చేసిన సరదా దొంగతనాల గురించీ విన్నారు కదా ఇక ఓ సీరియస్ దొంగతనం (నేను చేసింది కాదులెండి) గురించి వచ్చేనెల్లో తెలుసుకుందాం. నెలా అని అలా ఆవలించకండి... మరి మూడ్రోజుల్లో నెలమారిపోతుంది :-)
కెవ్వ్వ్... రెండున్నర కేజీల సగ్గుబియ్యం !!
రిప్లయితొలగించండిబావున్నాడండి మీలోని తీఫ్ తిరుమలై :)))
రెండున్నర కిలోల సగ్గుబియ్యం!!!
రిప్లయితొలగించండిసామేఏఏ, మీరు కేక.. ;)
ఎన్నాళ్ళకి సేమ్ పించ్..!
రిప్లయితొలగించండిమేమూ స్కూల్లో పాఠాలు వింటూ నోట్లో సగ్గుబియ్యాన్ని ఆడించేవాళ్ళం. సగ్గుబియ్యం తేవల్సింది మాత్రం రోజుకో అమ్మాయి వంతు.
బావుంది మీ పోస్ట్.. చిరునవ్వుల్ని పూయిస్తూ..
కెవ్వ్వ్వ్వ్ సేంపించ్ గీతిక గారు :-) ఇన్ని రోజులు ఇలా ఒట్టి సగ్గుబియ్యం తినే వ్యక్తిని నేనొక్కడినే అనుకుంటూ ఉండేవాడ్ని నాకూ తోడున్నారని మీరు చెప్పినమాటకి బోలెడు హాపీస్ యూ మేడ్ మై డే :-)
తొలగించండిఅన్నట్లు సగ్గుబియ్యంతో పాటు ఒక చిన్న బెల్లం ముక్కనో చాక్లెట్ ముక్కనో కలిపి ఎపుడైనా నమిలారా భలే ఉంటుంది :-)) నా ఫేవరెట్ స్వీట్ కూడా సగ్గుబియ్యం పాయసం లెండి.
తీఫ్ తిరుమలై :)))
రిప్లయితొలగించండిబంతి, నాగార్జునా, గీతిక గారు, జ్యోతిర్మయి గారు ధన్యవాదాలండీ :-)
రిప్లయితొలగించండిసగ్గు బియ్యం తినడమేంటండీ బాబో... అదీ కేజీల్లెక్కన ;)
రిప్లయితొలగించండిబాగు బాగు ;)
దొంగతనం అని కాదు గానీ ఇక్కడ కూడా బింగో అనుకోవాల్సిన సంగతి ఓటుంది. రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు సోంపు గుప్పెట నిండా తీసుకొని (అధికారికంగానే), బయట ఫ్రెండ్స్ అందరికీ పంచడం, టిష్యూ పేపర్లు మంచి క్వాలిటీవి ఉంటే ఓ రెండు జేబులో వేస్కోడం (కళ్లద్దాలు తుడుచుకోడానికన్నమాట) ;)
హహహహ ఏంచేస్తాం బాబు కొన్ని అలవాట్లలా ఐపోతుంటాయ్ :)
తొలగించండిఅనుకున్నా సోంఫ్ విషయంలో ఖచ్చితంగా బింగో చెప్తావని. అంటే ఓపెన్ గా చేశామనుకో పొరపాటున వాడు నో అంటే ఎంత నామోషీ అందుకే అలా సీక్రెట్ గా అనమాట :ఫ్
థాంక్స్ ఫర్ ద కామెంట్.
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్ కెవ్వ్వ్వ్వ్ :)))
రిప్లయితొలగించండినీ కేక గుంటూర్ దాక వినబడింది, థాంక్స్ ఫోటాన్ :-)
తొలగించండిచిన్నప్పుడు చిన్నచిన్న తిండి దొంగతనాలు మా ఇంటిలో తెలివిగా చేయడం నాకు పరమఇష్టంగా ఉండేది!ఒకసారి ఏమయిందంటే నేను అతి తెలివిగా అనగా - very intelligentగామా ఇంటిలో ఒక నిండు బిస్కట్ డబ్బాను బీరువా చాటునదాగి ఆరగిస్తున్నాను ఆనందంగా!నా పనిలో నేను పూర్తిగా కుత్తుకబంటిగా నిమగ్నమైపోయాను! ఆబగా డబ్బాకుడబ్బా ఏకబిగిన non stopగా పరపరా మేకలా నమిలెయ్యడం అప్పటి నా concept!ఇంటిదొంగను ఇంటి ఈశ్వరుడు పట్టుకున్నాడు!ఎప్పుడు ఎలా కనిపెట్టాడో కాని మా నాన్న ముందుగా చూసి మా అమ్మను వెంటపెట్టుకొనిమరీ వచ్చి నన్ను చూపించాడు!ఎరుపు హస్తాలతో అనగా red handed గా దొరికిపోయాను!అప్పుడు బొత్తిగా పసిపిల్లాడిని కదా!వాళ్ళు సరదాగా పడీపడీ నవ్వుకున్నారు కానీ నాకు ఎక్కడలేని ఉక్రోషం పొంగుకొచ్చింది!చూసినవాళ్ళు చూసీ చూడనట్లు ఉండిపోవాలి కాని ఇలా పిల్లకాయను రచ్చకెక్కించడం ఎంత అన్యాయం!ఇక మనకు దొంగతిండి చేతకాదని గ్రహించి బహిరంగంగానే ఎగబడి చిరుతిండ్ల మీదికి సిగ్గులేకుండా లంఘించి తమ్ముల్లకంటే ముందు చిక్కించుకోవడం ప్రారంభించాను!వేణూశ్రీకాంత్ గారి రచన నా చిన్ననాటి ఆకతాయితనాన్ని గుర్తుచేసి బాల్యంలోకి లాక్కెళ్ళింది!
రిప్లయితొలగించండిథాంక్స్ సూర్య ప్రకాష్ గారు :) హహహ ఈ పెద్దాళ్ళింతేనండీ పిల్లల మనోభావాలని అస్సలు పట్టించుకోరు :-) మీ బాల్యాన్ని గుర్తు చేసుకుని మాతో పంచుకున్నందుకు సంతోషం.
తొలగించండిహ హ వేణు గారు సూపర్ గా ఉంది ఫ్లాష్ బాక్ :-)
రిప్లయితొలగించండిఅసలు మీ తెలివితేటలు ఒక రేంజ్ లో వాడారు గా :-) పెద్ద లడ్డులు చిన్న లడ్డులు గా చేయటం అసలు ఎంత లేబర్ ఇంటెన్సివ్ పని :-) సగ్గు బియ్యం అదీ 2 1/2 kg . హ హ మామూలు గా లేదు ఈ పోస్ట్ :-)
లేబర్ ఇంటెన్సివ్... కెవ్వ్వ్వ్వ్ :-)) థాంక్స్ శ్రావ్యా ఏదో చిన్నపుడు తెలీకుండా అలా ఐపోయిందనమాట.
తొలగించండిమంచి,మంచి బ్లాగులను అందించాలనే లక్ష్యంతో ఈ బ్లాగ్ వేదిక {తెలుగు బ్లాగుల వేదిక}ను ప్రారంభించాను.ఈ వేదికలో 100 బ్లాగులకు తప్ప మిగతా వాటికి చోటు లేదు.మీ బ్లాగును కూడా దీనిలో అనుసంధానం చేయాలనుకుంటే బ్లాగ్ వేదిక నియమాలు పాటించవలసి ఉంటుంది.వివరాలకు క్లిక్ చేయండి.
రిప్లయితొలగించండిhttp://blogvedika.blogspot.in/
Too many advertisements and clumsy interface వలన బ్లాగ్‌వేదిక నాకు నచ్చలేదండీ, నేను ఎన్‌రోల్ చేసి నియమాలు పాటించలేను. దయచేసి మళ్ళీ మళ్ళీ అడిగి స్పామ్ చేయకండి. థాంక్స్ ఇన్ అడ్వాన్స్.
తొలగించండిఖర్చీఫ్ లోనో వాడే ఇచ్చే పేపర్ నాప్‌కిన్స్ లోనో పొట్లం కట్టేసి తీస్కొచ్చేయడం ...
రిప్లయితొలగించండిSame pinch :)
హహహ థాంక్స్ అనూ గారు :-) ఈ విషయంలో మా ఫ్రెండ్స్ లో కూడా చాలమందిమి సేంపించ్ లు చెప్పుకుంటామండి :-))
తొలగించండినేను వ్రాయాల్సిన టపా మీరెందుకు వ్రాసారు అని ప్రశ్నిస్తున్నాను?.............దహా.
రిప్లయితొలగించండికెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ గురూజీ... థాంక్స్... మీరు కూడా అన్నిటిలో సేంపించ్ లా ఏవిటండీ :-))
తొలగించండి:)) మీరు రాసింది చదువుతుంటే మేం హాస్టల్ లో ఉండగా జామపళ్ళు ,చాక్లెట్లు,హెయిర్ క్లిప్స్ ఇలా చిన్న చిన్నవి కొట్టేసిన రోజులు గుర్తొచ్చాయి .హోటల్ లో సోంపు విషయంలో మా వారు అచ్చు మీరు చెప్పినట్టే చేస్తుంటారు :))
రిప్లయితొలగించండిఅంత సగ్గుబియ్యం ఎలా తిన్నరండి బాబు .ఏమి తేడా చేయలేదు సంతోషం.సగ్గుబియ్యం ,బెల్లం తోపాటు కొద్దిగా పాలు కూడా నోట్లో పోసుకుంటే సరి సగ్గుబియ్యం పాయసం తిన్నట్టే :)
హహహ థాంక్స్ రాధిక గారు, సోంఫ్ విషయంలో నాకు బోలెడంత కంపెనీ ఉందనమాట అయితే :) హాస్టల్ రోజుల్లో సరదాలే వేరులెండి :-)
తొలగించండిహహహ ఒట్టి పాల రుచి నాకు సయించదండీ లేకపోతే మీరు చెప్పినట్లే చేసేవాడ్ని :)) పాయసంలో పాల రుచి మళ్ళీ ఓకే.
saggu biyyama yela tinnaavu babu ?adhee rendu kg .
రిప్లయితొలగించండిbhaale unnayi nee chinna saradhalu . theef thirumalai ki jai bholo...
hu..ha..hu..ha
థాంక్స్ శశి గారు :) హహహ అన్నీ ఒక్కసారేకాదు కదండీ మెల్లగా అలా వెళ్ళిపోయాయంతే :-)
తొలగించండిరెండు కేజీల స..గ్గు..బి..య్య..మా!!!!!
రిప్లయితొలగించండిలడ్డూలు రీ రౌండింగ్స్ చేయడమా లేక సగ్గుబియ్యం తినడమా.. ఏది ఎక్కువ లేబర్ ఇంటెన్సివో తేల్చుకోవడం చాలా ఖష్ఠం! :)))
హహహహ థాంక్స్ నిషీ, నిజమే తేల్చడం కష్టం :) అసలు సగ్గుబియ్యం కాసేపు నమిలితేనే దవడలు నొప్పి పుట్టేస్తాయ్ :)
తొలగించండివోహో..పచ్చి సగ్గుబియ్యం కూడా తినొచ్చన్నమ్మాట...నేను ఇవాళ ట్రై చెయ్యాలి...:)))
రిప్లయితొలగించండిథాంక్స్ స్ఫురిత గారు :-) ఆహా బ్రహ్మాండంగా తినచ్చండీ ట్రైచేసి ఎలా ఉన్నాయో చెప్పండి :-)
తొలగించండిSweet..! పోస్ట్ లోని ప్రతి మాటను ఎంజాయ్ చేశాను వేణు గారు. ఆ రోజులు మళ్ళీ వస్తే బావుండు కదా.. :)
రిప్లయితొలగించండిThanks ప్రియ గారు, అవునండీ ఆరోజులు మళ్ళీ వస్తే బాగుంటుంది కానీ నేను కూడా అప్పటంత చిన్నగా అయిపోవాలి అప్పుడే చక్కగా ఎంజాయ్ చేయగలను :-)
తొలగించండిhahaha bagundi andi me thief tirumalai. nenu chinnappudu suger and toothpaste tinesedanni. rendu ki dorikipoyeddanni. nenu me anta telivi gala dani kadu gaa :( suger tinesi chetulu akkade dulipesedanni so akkada kinda padindi na mooti ki antindi chusi ma amma vayinchesedi. paste ite mari ekkuva tinesedanni. 1 week kuda ravatledu ani ma nanna adigevadu nenu gupchup ;). adi tinadam kosam andari kanna mundu lechedanni (still i woke up early morning, made as my habit) ma vallemo ma ammayi enta budhi manturalo ani murisipoyevaru. oka roju adi kuda dorikipoyanu. :( ikkada badha kaliginche vishayam enti ante ma amma nanna intiki vachina andariki cheppesevaru adedo krishna leela laga. vachina vallu nannu chusi adedo goppa pani laga navvadam. siggu to chachipoyedanni. :( :( aroju decide ayyanu ne pedda ayyaka na own suger dabba and na own 500grms paste appudu nannu evaru adagaruga. so still continue chesutunnalendi adi vere vishayam. :) :) hahahhaahha ippudu dongatanam kadu na sonta dabbulu andi babuuu
రిప్లయితొలగించండిహహహ బాగున్నాయి శ్రీగారు మీ కబుర్లు :-) ఇలా చిన్న చిన్న దొంగతనాలవల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉంటాయనమాట (మీకు పొద్దున్నే లేవడం అలవాటైనట్లు:-) థాంక్స్ ఫర్ ద కామెంట్.
తొలగించండిmeeru grt andi babu. chinna comment lo kuda positive dimension chustunnare.
రిప్లయితొలగించండి"అంత మాత్రం చేత నేనేదో బుద్దిమంతుడ్ని అయిపోయాను అనుకుంటున్నారా హహహ :-) బుద్దిసంగతి ఎలా ఉన్నా ఒక విషయం స్పష్టంగా అర్ధమైంది “అల్లరి చేసినా కూడా పెద్దోళ్ళకి దొరికిపోకుండా చేయాలి” అనే విషయం వారం రోజులు తగ్గని వాతల సాక్షిగా బోధపడింది :-) ఐతే అప్పటినుండీ నేను చేసే దొంగతనాలు మా వంటింటికే పరిమితం చేశా. అవికూడా ఆ వయసులోనే ఎంతో ప్లాన్డ్ గా చేసే వాడ్ని"..
రిప్లయితొలగించండిహేవండీ బులుగు గారూ..మరి రాచ్చసుడూ పదమూడో యెక్కం లాంటి సాహసం చేసి రచ్చించిన సీగానపెసూనాంబలు యెవరూ లేరా మీ బాల్య లీలలో..
హహహ ఏంటో శాంతిగారు సీగానపెసూనాంబలెవరూ అప్పట్లో పరిచయమవలేదు మరి.. బహుశా పదమూడో ఎక్కం అంటే నాక్కూడా భయమవడం చేతవలనేమో.. పదమూడు దాకా ఎందుకు లెండి అప్పట్లో నాకు తొమ్మిదో ఎక్కానికే తొంభై చుక్కలు కనిపించేసేవి.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు. నేనూ మీతోపాటు మరో సారి ఈ పోస్ట్ చదువుకుని నవ్వుకున్నాను :-)
తొలగించండి