శనివారం, అక్టోబర్ 05, 2013

అత్తారింటికి దారేది

నాకు గుర్తున్నంతవరకూ తెలుగులో అత్తా అల్లుళ్ళ సినిమాలు అదీ ఒక స్టార్ హీరో అల్లుడు కారెక్టర్ వేస్తున్నాడంటే సాధారణంగా మరదలితో పెళ్ళే అల్టిమేట్ గోల్ గా ఉంటాయి. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే అత్తని ఒక దుర్మార్గురాలిగా చూపించి హీరో తన పొగరణచడానికి మరదలు(ళ్ళ)తో పాటు అత్తతో కూడా సరసాలాడటం, డబల్ మీనింగ్ డైలాగులు/సీన్లు ఇలా నానా చెత్తతో నింపేస్తారు.

నిజానికి త్రివిక్రమ్ ఇలా అత్తా అల్లుళ్ళ త్రెడ్ తీస్తున్నాడు అనగానే కాస్త భయపడినమాట వాస్తవమే కానీ తను “అత్తారింటికి దారేది” సినిమాకోసం అదే మూసలో వెళ్ళకుండా... ప్రేమ పెళ్ళి చేసుకుని తండ్రిమీద అలిగి ఇల్లొదిలి వెళ్ళిపోయిన అత్తని తన తాత కోరికపై తిరిగి తమ ఇంటికి తీస్కురావడినికి వెళ్ళే మేనల్లుడు అనే ఒక డిఫరెంట్ త్రెడ్ ని ఎన్నుకుని సగం మార్కులు కొట్టేశారు.

ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే త్రివిక్రమ్ తన గత చిత్రాలలోలాగా ఏదో ఒక జెనర్ కే ఫిక్స్ అయిపోకుండా మంచి పాటలతో పాటు కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, క్లాస్ సీన్స్, మాస్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నిటినీ సరిసమానంగా బాలెన్స్ చేసుకుంటూ కథనాన్ని నడిపాడు.

ఈవిధంగా బాలెన్సింగ్ చేయడంతో రివ్యూస్ లో 4 రేటింగ్ చూసి త్రివిక్రమ్ ఏదో మ్యాజిక్ చేసుంటాడని విపరీతమైన అంచనాలతో వెళ్ళిన తన అభిమానులను నిరాశ పరిచినా కూడా అన్ని సెక్షన్ ఆడియన్స్ కీ అప్పీల్ అయ్యే సీన్స్ పెట్టుకోవడంతో సేఫ్ జోన్ లోకి వెళ్ళి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ డెలివర్ చేయగలిగాడు.

కథకి కీలకమైన ఫ్లాష్బాక్ ఎపిసోడ్ ని ఒక్క సారిగా కాకుండా సినిమాకి కీలకమైన ఘట్టాలలో కొద్దికొద్దిగా రివీల్ చేసుకుంటూ ముఖ్యమైన పాయింట్ ని క్లైమాక్స్ లో రివీల్ చేసి ఎమోషన్ ని పీక్ కి తీసుకెళ్లడం నాకు చాలా నచ్చింది. అలాగే పెద్ద హీరో, లిమిట్ లేని బడ్జెట్ మన చేతిలో ఉన్నాయికదా అని భారీ యాక్షన్ క్లైమాక్స్ కాకుండా సినిమా టైటిల్ కి కథకి తగినట్లుగా ఎమోషనల్ సీన్స్ తో నిండిన క్లైమాక్స్ పెట్టడం కూడా నాకు బాగా నచ్చింది.


పవన్ ని కూడా అతని గత చిత్రాలలోలాగా అక్కర్లేని సీన్స్ లో కూడా ఎగురుతూ గెంతుతూ హైపర్ ఎనర్జీతో యాక్ట్ చేయనివ్వకుండా ఎక్కడ తన కోపాన్ని ప్రదర్శించాలో ఎక్కడ తగ్గి ఉండాలో కాలిక్యులేటెడ్ గా చాలా బాలెన్స్డ్ గా నటింపచేశాడు. ఇక క్లైమాక్స్ సీన్స్ లో అయితే తన నటనతో డైలాగ్ డెలివరీతో త్రివిక్రమ్ పదునైన డైలాగ్స్ తో రాసిన ఎమోషనల్ క్లైమాక్స్ ని యథాతథంగా మనముందు పెట్టి చూపించి అందరినీ మెప్పించగలిగాడు.

దేవీశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ఒక మేజర్ ఎస్సెట్, చక్కని పాటలు సీన్స్ ను ఎలివేట్ చేసే నేపధ్యసంగీతం అందించాడు. పాటలని చిత్రీకరించిన తీరు కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా చాలా సింపుల్ స్టోరీ లైన్ని చక్కని కథనంతో గుండెని తాకే సన్నివేశాలు, కామెడీ, మంచి డైలాగ్స్ సూపర్ సాంగ్స్ అండ్ పిక్చరైజేషన్ తో రెండున్నర గంటలు కదలకుండా కూచోబెట్టగలిగాడు చివరి ఇరవై నిముషాలు ఎమోషన్స్ ని పీక్ కి తీస్కెళ్ళాడు.

రావురమేష్, బొమ్మన్ ఇరాని పాత్రలు కొన్ని సీన్స్ లో చెప్పే డైలాగ్స్ గుర్తుండిపోతాయి. హీరోయిన్స్ ఇద్దరి గురించీ పెద్దగా చెప్పుకోవాల్సింది లేదుకానీ అత్తగా చేసిన నదియా చాలా గ్రేస్ యాడ్ చేసింది సినిమాకి. రేటింగ్స్ చూసి మరీ ఎక్కువ ఆశించకుండా టిపికల్ పవన్ సినిమాకి త్రివిక్రమ్ టచ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళండి డిజప్పాయింట్ అవ్వరు. కళాఖండం ఏమీ కాదు కానీ సాధారణ తెలుగు సినిమాలతో పోలిస్తే పైసావసూల్ అనిపించే మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అత్తరింటికి దారేది. 

ఇకముందు రాసే వ్యాసంలో త్రివిక్రమ్ అభిమానుల కంప్లైంట్స్ కి జవాబిచ్చే ప్రయత్నంలో చేసిన విశ్లేషణలో కొన్ని స్పాయిలర్స్ ఎదురవ్వచ్చు సో సినిమా చూసే ఉద్దేశ్యం ఉన్నవాళ్ళు ఇక ముందుకు చదవకండి. ఇది నాకు ఈ సినిమా ఎందుకు నచ్చిందో చెప్పే ప్రయత్నమే కానీ త్రివిక్రమ్ ని సమర్ధించాలని ఆలోచించి రాసినది కాదు. కొందరు ఆడియన్స్ కి మాత్రమే పరిమితమైనా సరే త్రివిక్రమ్ తరవాతి సినిమా తన అభిమానులకు నచ్చినట్లు మరింత ఇంటెలెక్ట్ తోనే తీస్తారని ఆశిద్దాం. 

ఈ సినిమాపై త్రివిక్రమ్ అభిమానులు చేస్తున్న మేజర్ కంప్లైంట్ పక్కవాడ్ని కొట్టి కామెడీ పుట్టించడమేంటి అని. త్రివిక్రమ్ హీరోలెపుడూ తమ కారెక్టరైజేషన్ ని బట్టి నడుచుకుంటూ ఉంటారు, నువ్వేనువ్వేలో కుర్రాడు ఫిలాసఫీలు చెప్పినా, అతడులో హిట్మాన్ తక్కువ మాటాడినా, ఖలేజా లో టాక్సీ డ్రైవర్ అయిన హీరో బూతులు మాట్లాడినా తన పాత్రకి తగ్గట్టు సహజంగా ప్రవర్తించారు.

ఈసినిమాలో హీరో కూడా అదే చేశాడని నాకనిపించింది. లక్షకోట్లకి అధిపతి, యంగ్ బ్లడ్ పైగా చిన్నతనంనుండీ కంటికి కనపడని శత్రువుతో బయటకి కనపడని యుద్దం చేస్తున్న మనిషి, పైగా కోపిష్టి దాన్నంతా ఎవరిమీద చూపిస్తాడు ? చిన్నప్పటినుండీ తనవెంటే తిరుగుతూ పక్కనే ఉంటున్న వాళ్ళమీదే కదా. తన వెంట ఉండే ఆరుగురిలో నలుగురు బాడీ గార్డ్స్ వాళ్ళని కొట్టినట్లు ఎపుడూ చూపించడు కేవలం పర్సనల్ అసిస్టెంట్స్ అయిన ఇద్దరిపై మాత్రమే చూపిస్తాడు.

మీరు చూసిన రిచ్ కిడ్స్ అలా ఉండి ఉండకపోవచ్చు కానీ గౌతంనందా అలాంటోడు. అవి హీరో పాత్ర ఫ్రస్టేషన్ నీ గొప్పదనాన్ని ఎలివేట్ చేయడానికి పెట్టుకున్న సీన్సే కానీ కేవలం కొట్టి కామెడీ పుట్టించడానికి పెట్టుకున్న సీన్స్ కాదని నాకనిపించింది. అలా ఎవరినీ లెక్కచేయని ఏంకావాలన్నా క్షణాలలో కాళ్ళదగ్గరికి రప్పించుకోగల హీరో అత్త దగ్గర మాత్రం ఒదిగి ఉండడం తనకోసం డ్రైవర్ గా పనివాడిగా చేయడానికి సిద్దపడడమే ఎమోషన్ నీ బాగా కారీ చేయడానికి ఉపయోగపడిందని నాకనిపించింది.

ఇక మరో కంప్లైంట్ త్రివిక్రమ్ గతచిత్రాలలో ముఖ్యపాత్ర పోషించిన చాలామంది కారెక్టర్ ఆర్టిస్టులు వచ్చిపోతుంటారు కానీ ప్రాముఖ్యత ఉండదు అని. (నిజానికి వాళ్ళంతా త్రివిక్రమ్ పవన్ సినిమాలో కనిపిస్తే చాలని సంబర పడిపోతున్నారు). వాళ్ళకి డైలాగ్స్ లేవనీ ప్రాముఖ్యతలేదని ఫీల్ అవడంలో అర్ధంలేదనిపించింది. ఫామిలీలో ఉన్న  అందరికీ డైలాగులు సీన్సూ రాయాలంటే సూరజ్ బరజాత్యా సినిమాల్లోలా ఇంట్రడక్షన్ కే ఇంటర్వెల్ వచ్చేస్తుంది. అక్కడ తెలిసిన మొహాలు కనపడితే చాలు సీన్ రక్తి కట్టేస్తుందని వాళ్ళని పెట్టి ఉంటారు. నిజానికి ఇలాపెట్టడం బడ్జెట్ పరంగా నష్టమే. 
  
అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్ల ప్రేమ మెయిన్ థ్రెడ్ కాదు, పెద్దమ్మాయి తనని ఇష్టపడుతుందని అనిపించి తనని ఇష్టపడినా తర్వాత నిజం తెలిసి సైడైనా, చిన్నమ్మాయి తనని ముందునుండి ఇష్టపడుతుందని తెలిసి తనూ పెళ్ళి చేస్కోడానికి సిద్దపడినా హీరో గోల్ ఎప్పుడూ తన అత్తని తనతాత దగ్గరికి ఎలా చేర్చాలనే కానీ పెళ్ళి చేస్కుని సెటిల్ అవ్వాలని కాదు. అందుకే వాళ్ళెవరినీ ప్రేమించినట్లుగా కానీ అది సాధించడానికి ప్రాకులాడుతున్నట్లుగా కానీ సన్నివేశాలు రాసుకోలేదు.

ఇక చిత్తూరు యాసలో సిద్దప్పగా కోట చేసిన పాత్ర మరోసారి సీమవాసులపై నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేదిగా ఉంది కాకపోతే సినిమాటిక్ లిబర్టీస్ లో దీనితో సర్దుకు పోవచ్చు. అలాగే సిద్దప్పని తన పెద్ద కొడుకుని మూర్ఖులుగా రౌడీలుగా చూపించినా సిద్దప్ప రెండో కొడుకుని చదువుకున్నవాడిగా సంస్కారిగా తెలివైన వాడిగా చూపించారన్న విషయం గుర్తుంచుకోవాలి. అలాగే సిద్దప్ప మీ ఇంటి మనిషి వల్ల నా పరువు పోయిందని రావురమేష్ ఇంటికి వస్తే తనకి కొడుకుల్లేరు కనుక తమ ఇంటి మర్యాద అయిన తమ కూతుర్ని ఆయన రెండో కొడుక్కు ఇచ్చి పరువు నిలబెడతాననడం నాకు సబబే అనిపించింది.

త్రివిక్రమ్ డైలాగ్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి కాదనను కానీ తను ఇంతకు ముందు రాసిన డైలాగ్స్ లో కూడా ప్రాస కోసం ప్రయత్నించడం నాకు ఎపుడూ కనిపిస్తూనే ఉంటుంది. బహుశా ప్రాస ఉన్నా పవర్ కూడా ఉండడంతో తన అభిమానులకు ఇదివరకూ ప్రాస కనిపించి ఉండకపోవచ్చు ఇందులో మాత్రమే ప్రాసకోసం ఎక్కువ  పాకులాడినట్లుగా కనిపించి ఉండవచ్చు.

ఎనీవేస్ ఈ సినిమాలో డైలాగ్స్ లో కొన్నిటిని ఇక్కడ లిస్ట్ చేస్తున్నాను. ఆసక్తి ఉన్నవాళ్ళు చదవండి. సినిమా చూడని వాళ్ళు చూసే ఉద్దేశ్యం ఉన్నవాళ్ళు చదవద్దని నా ఉచిత సలహా.

“లక్ష కోట్లా !! ఎన్ని సున్నాలుంటాయ్ ?” “వాడి వాచ్ అమ్మితే మీ బ్యాచ్ సెటిలైపోద్ది చాలా..”

“గాలొస్తుందని మనమే తలుపు తెరుస్తాం.. దాంతో పాటే దుమ్ముకూడా వస్తుంది..”

“బుల్లెట్ అరంగుళమే ఉంటుంది కానీ ఆరడుగుల మనిషిని చంపుతుంది.. అదే బుల్లెట్ ఆరడుగులుంటే ఎలా ఉంటుందీ.. నా మనవడు గౌతం నందా అలా ఉంటాడు.”

“నీ టెబుల్ మీద యాపిల్ తింటే బలమొస్తుందిరా అదే పక్కనోడి యాపిల్ కొట్టేద్దామంటేనే ఇదిగో ఇలా బలవంతంగా తీసుకు రావాల్సొస్తుంది.”

“ఆనందం ఎలా ఉంటుందిరా.. వెతుకు.. డబ్బులో ఉంటదా.. అమ్మాయిలు తిరిగే క్లబ్బులో ఉంటదా లేదంటే వాళ్ళ ఒంటిమీద జారే సబ్బులో ఉంటదా..”

“రేయ్.. సింహం పడుకుందికదా అని చెప్పి జూలుతో జడేయకూడదురా.. అలానే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో తీయించుకోకూడదు రోయ్..”

“ఆడపిల్లరా అదీ.. అభిమానముంటుంది..” “కొడుకుని నాన్నా నేను.. కోపముంటుంది”

“వద్దనుకుని వదిలేసి ఒడ్డుకెళ్ళి ఏడుద్దామా.. కొంచెం కష్టమైనా సరే మోస్కుని తీస్కెళ్ళి జీవితాంతం నవ్వుదామా?”

“ఇదే సార్ హైడ్రాబాడ్.. ఇక్కడ ట్రాఫిక్ చాలా బాడ్.. పెద్దమ్మతల్లి ఫేమస్ గాడ్”

“ఇదివరకూ ఉంగరాల జుట్టుండేది.. ఇపుడు ఉంగరాలన్నీ వేళ్ళకొచ్చేసి జుట్టు ప్లెయిన్ అయిపోయింది”

“రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళాక బ్రిడ్జెలా కట్టాలో ప్లాన్ చేశాడు కానీ అడివిలో కూర్చుని బ్రిడ్జిప్లాన్ గీస్కుని సముద్రం దగ్గరికి వెళ్ళలేదు..”

“అత్తని తీస్కురావడమెలాగ అని నేనేమైనా పుస్తకం రాశానా.. ఏవనిపిస్తే అది చేస్కుంటూ వెళ్ళిపోడమే..”

“డబ్బిస్తే కారిచ్చేస్తారా?" "ఏం వార్నింగ్ కూడా ఇవ్వాలా?”

“మంచి వాళ్ళని హర్ట్ చేస్తే ఏడుస్తారు.. నాలాంటి వెధవల్ని హర్ట్ చేస్తే ఏడిపిస్తారు.. దానిదగ్గర ఖర్చీఫ్ లేని టైం చూస్తాను డెఫినెట్ గా కన్నీళ్ళు పెట్టిస్తాను.”

“ఐదుకిలోమీటర్లు వెళ్తే ఇంకా మంచి హాస్పటల్ ఉంది అక్కడ జాయిన్ చేయచ్చుగా.. రెండుకిలోమీటర్ల లోపు స్మశానం కూడా ఉంది.. కొంచెం లేటైతే అక్కడకెళ్ళాల్సొచ్చేది.. కరెక్ట్ టైంకి తీస్కొచ్చాడు, యూ బెటర్ థాంక్ హిమ్”

“చేతులు పట్టుకు థాంక్స్ చెబుతుందనుకున్నాను కాలర్ పట్టుకుని కరిచేస్తందేంటండీ ?" "ఆవిడ ఆగి ఆలోచించే మనిషైతే మనం ఇంతదూరం రావాల్సిన అవసరమేముంది బాలూ.”

“అంత పొసెసివ్ అయితే ఆడపిల్లలని కనకూడదండీ ఒకవేళ కన్నా డాన్సులవీ చేయించకూడదు.. వాళ్ళు చూపిస్తేనేమో గ్లామరూ.. మేం చూస్తేనేమో వల్గరూ.. ప్రాణాలు తోడేస్తున్నారనుకోండి”

“ఇలాగే కంట్రోల్ చేసి చేసి ఏ ఐఐటీ ఇంజనీరో అని ఏ శాడిస్ట్ కో ఇచ్చి కట్టబెడతారు.. వాడు తెలివితేటలన్నీ వీళ్ళని టార్చర్ చేయడానికి ఉపయోగిస్తాడు.. అప్పుడు తెలిసొస్తది”

“అబ్బో మీ ఐ బ్రోస్ అండీ రివర్స్ లో ఉన్న నైకీ సింబల్ లా ఏం తిప్పారండీ”

“ఆల్టర్నేటివ్స్ లేనపుడు పక్కనోళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు రోయ్ కాలిపోద్ది”

“జీతాలిచ్చేవాడి మీద జోకులేస్తే ఇలాగే జీవితం తలకిందులైపోద్ది”

“నేను కత్తిలాంటోడ్నిరా కూరగాయలూ తరుగుతా మెడకాయలూ నరుకుతా నాకు ఎమోషన్స్ ఉండవు డ్యూటీ తప్ప”

“ఏడిస్తే ఎత్తుకున్నాను కదా అని ఎదిరిస్తే తోలు తీసేస్తాను”

“తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది.. విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది”

“నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా.. కానీ దరిద్రం మాష్టర్ బెడ్రూంలో ముసుగుతన్ని పడుకునుంది”

“ఆ కళ్ళు చూడండి.. ఆకళ్లలోకి ఏ మగాడికైనా సరే లప్ అని దూకి ఫుల్లుగా ఈత కొట్టేయాలనిపిస్తుంది”

“సగం కట్టేసి వదిలేసిన బిల్డింగ్ లాంటి నీకే అంత పొగరుంటే ఏడంతస్థులమేడని నాకెంత పొగరుండాలి”

“ఏయ్ శశి.. రాక్షసి.. గిన్నెకి పట్టిన మసి..”

“భయమున్నోడు అరుస్తాడు.. బలమున్నోడు భరిస్తాడు”

“అమ్మితే కొనుక్కో అది వ్యాపారం.. లాక్కోవద్దు అది దౌర్జన్యం..”

“ఆడికి మనిషిని చంపేంత ధైర్యంలేదు మనిషికోసం చచ్చేంత కమిట్మెంటూ లేదు”

“ఒంట్లో పట్టు తగ్గగానే మీ తాతకి పట్టుదల తగ్గిందా”

“నాకు మీమీదేం కోపం లేదు.. ఎందుకంటే అందుకు మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకోవాలి.. అది నాకు ఇష్టంలేదు”

“ఫ్లడ్ లైట్లేసున్న స్టేడియంలో దాగుడు మూతలాడుతూ దొరికిపోయాం”

“ఈ ఆడపిల్లలకి అసలు టేస్ట్ లేదురా టీవీ యాంటెన్నాకి టీషర్టేసినట్లున్నాడు వెళ్ళి ఆడ్ని లవ్ చేస్తుంది”

“అది ఎదురైతే దరిద్రం.. తగిల్తే తద్దినం”

“నిజం డివిడిలో సినిమాకాదండీ, ఎప్పుడుపడితే అపుడు పాజ్ నొక్కేయడానికి.. థియేటర్లో సినిమా.. ఒక్కసారి మొదలెట్టామంటే శుభంకార్డ్ పడేదాకా తెరదించకూడదు అంతే”

“నిజం నిప్పులాంటిది చెప్పేవాడికి కాల్తది కానీ వినేవాడికే వెచ్చగా ఉంటది” (నిజం తెలిసిన విలన్స్ అటాక్ చేశాక) “ఇప్పుడర్ధమైందా.. నిజం చెప్పేవాడికి కాలుద్దీ.. వినేవాడికి మండుద్ది..”

“ఆగిపోయే పెళ్ళికి హడావిడెక్కువ అనీ..”

“చదరంగంలో రాజు కూడా నీలాగే ముసలాడు ఎటేపైనా ఒక్కడుగు మాత్రమే వేయగలడు అయినా వాడ్నే కింగ్ అని ఎందుకన్నారంటే పక్కనే పవర్ఫుల్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి”

“ఇది నా పొగరు.. దాన్ని ముట్టుకుంటే నన్ను కొట్టినట్టే.. పెట్టుకుంటే సచ్చినట్టే”

“పాము పరధ్యానంగా ఉందని పడగమీద అడుగేయకూడదు రోయ్..ఆ..”

“ఒక్కడ్ని కొడితే అయినట్లేనా.. నాదగ్గర ఉన్నోళ్ళు ఒక్కొక్కడు కరెంట్ తీగతో ఉయ్యాలూగుతాడొరేయ్..”
“కానీ పవర్ ప్లాంట్ తో పేకాడకూడదురోయ్ పేలి పోతారు”

“నీ బిడ్డది పెళ్ళే.. కానీ ఆ బిడ్డది చావు.. ఏది పెద్దకష్టం?... నా కొశ్చన్ లో క్లారిటీ ఉంది నీ ఆన్సర్ లో షూరిటీ ఉంటుందా?”

“చూడప్పా సిద్దప్పా.. నేనోమాట చెప్తాను పనికొస్తే ఈడ్నే వాడుకో గుర్తుకొస్తే ఏడ్నైనా వాడుకో.. నేను సింహం లాంటోడ్నబ్బా.. అది గడ్డం గీస్కోలేదు నే గీస్కుంటాను అదొక్కటే తేడా.. మిగతా అంతా సేం టు సేం... ఆ... అయినా లాస్ట్ పంచ్ మనదైతే దానికొచ్చే కిక్కే వేరబ్బ”

“నా బతుకు దూదికంటే చులకనా నీటికంటే పలచన ఐపాయే”

“పలావు మిగిలిపోతే పాలేర్లు తింటారు సార్.. కానీ ఆడపిల్ల పుట్టింట్లో మిగిలిపోతే మీరు ప్రశాంతంగా ఒక్క ముద్ద కూడా తినలేరు..”

“ఏంట్రా కత్తులు చూపిస్తున్నావ్.. ఇవున్నది పంటలు కోయడానికి పీకలు కోయడానికి కాదు”

“హా.. సరిపోయింది.. హీరో విలను కొట్టుకుని కమెడియన్ ని చంపేసినట్టు నామీద పడాతారేంటి వీళ్ళు”

“వీళ్ళు మంచోళ్ళు కాబట్టి మజ్జిగిచ్చి మాట్లాడతన్నారు నాన్నా మన్లాంటాళ్ళైతే మనుషుల్ని పెట్టి బయటకి గెంటేసే వాళ్ళు”

“మీకు డబ్బిస్తాం అనడం తప్పు.. పోయిన మీ పరువుకి బదులుగా మా ఇంటి మర్యాదని మా రెండో అమ్మాయిని మీ అబ్బాయికిస్తాం”

“మంచి విషయాలు కూడా ఎందుకు వదులుకోవాలో నాకిప్పుడు అర్ధమవుతుంది.. రావి చెట్టుకి పూజ చేస్తాం.. దేవుడంటాం.. అదే మనింటి గోడలో మొలిస్తే.. పీకేస్తాం... నీవల్లే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయ్ కానీ రేపా పెద్దాయన నీవల్ల ఏదైనా ఇరిటేట్ అయితే అవే పెళ్ళిళ్ళు ఆగిపోతాయ్. నువు మెడిసిన్ లాంటోడివి సిద్దూ.. కానీ దానికి కూడా ఒక  expiry date ఉంటుంది.”

“గెంటితే గేట్ కూడా డబల్ స్పీడ్ లో వస్తుంది..”

“నా దగ్గరనుండి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి..?”
“కొంచెం సంస్కారం..”

“అదేంటయ్యా లక్ష్మీ దేవి ఇంటికొస్తుంటే.. రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రావాలి.. రెడ్ సిగ్నల్ ఏస్తే ఆగాలని రూల్స్ చెప్తాడేంటి”

“ఆకలి తీరింది కదా అని అడుక్కోడం మానేస్తామా స్వామీ”

“మదిలో మీరుండగా నదికి మేమెలా పోగలం”

“ఈ నెక్లెస్ అమ్మినా సంవత్సరం పాటు రెక్లెస్ గా బతికేయచ్చు”

“నీకు ఉర్దూ వచ్చా..?” “వాడు కొట్టేది చూస్తే చైనీసూ చిత్రలేఖనం కూడా వచ్చుండాది”

“కార్లో ముందు సీట్ కీ వెనక సీట్ కీ మధ్య దూరం ఎవ్వరూ తగ్గించ లేరు”

“మీది ప్రేమ.. అవతల వాళ్ళది వ్యామోహం..  మీరు చేస్తే ఆదర్శం.. వేరే వాళ్ళు చేస్తే ఆవేశం.. మీరరిస్తే మమకారం మా తాత అరిస్తే మటుకు అహంకారం..”

“జీవితంలో ప్రతీ సమస్య మనిషికి రెండు దారులిస్తుంది.. ఒకటి ప్రేమతో ఉన్నది, రెండు ద్వేషంతో నిండింది”

“కంటికి కనపడని శత్రువుతో బయటకి కనపడని యుద్దం చేసేవాడ్ని”

“బాగుండడం అంటే బాగా ఉండడం కాదు.. నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం”

“కుదిరితే క్షమించు.. లేదంటే శిక్షించు.. కానీ మేం ఉన్నామని గుర్తించు.. దయచేసి గుర్తించు..”

“ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు..”

ఇది సినిమా చివర్లో ఎండ్ క్రెడిట్స్ తో వచ్చే నేపధ్య గీతం. దేవదేవం భజే పాట లోని రెండో చరణం.

ఆఆఆఅ...
కనుల తుది అంచునొక నీటి మెరుపూ..
కలలు కలగన్న నిజమైన గెలుపూ..
పెదవి తుది అంచునొక తీపి పిలుపూ..
సెగల ఏడబాటుకది మేలి మలుపూ..
భళ్ళున తెల్లారే తళ తళ తూరుపులా
వెలుగులు కురిసిందీ ఈ ఆనందం..
ఋతువులు గడిదాటే చెరగని చైత్రములా
నవ్వులు పూసిందీ ఈ ఆనందం..
జీవమదె మాధురిగ మమతలు
చిలికెను మనసను మధువనం.

దేవ దేవం భజే దివ్య ప్రభావం
దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం
రామం
దేవ దేవం భజే దివ్య ప్రభావం

20 కామెంట్‌లు:

  1. ఎన్ని సార్లు చూసేసారు వేణు గారు, డైలాగ్స్ తో సహా రాసారు :)
    పాటలు చాలా బాగున్నాయి...

    రిప్లయితొలగించండి
  2. థాంక్స్ ఫర్ ద కామెంట్ ఫోటాన్ :-) డైలాగులు టైప్ చేయడం ఏవుంది బాబు ఈ మోడర్న్ ఏజ్ లో ఎన్ని టూల్స్ లేవు అందులో నా గొప్పదనమేమీ లేదు :-)

    రిప్లయితొలగించండి
  3. మీరు అద్భుతం మాషారూ.. కుమ్మేశారు ;)

    ఈ గోడలపై దాని నవ్వులు, ఈ వాకిట్లో దాని జ్ఞాపకాలు, ఈ రక్తం తో దాని బంధుత్వం ....etc.. ఈ డైలాగు మిస్ చేసేసినారే? ;)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ రాజ్ :-)) పవన్ చెప్పాడుగా.. నిలువెల్లా ద్వేషంతో నిండిన ఆ డైలాగ్ వదిలేద్దాంలే అని వదిలేశా :-))

      తొలగించండి

  4. good work వేణూశ్రీకాంత్ గారు.
    సిన్మా చూస్తుంటే తెలియలేదు కానీ డైలాగులు చాలానే ఉన్నాయండీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఎ లాట్ అండీ... పవర్ ఫుల్ గా అనిపించిన డైలాగ్స్ రెలెటివ్ గా గత చిత్రాలతో పోలిస్తే కొంచెం తక్కువ ఉన్నా ఇందులో కూడా బాగానే ఉన్నాయనిపించిందండీ.

      తొలగించండి
  5. సమీక్ష బాగుంది. సమస్యేమిటంటే మీరు రాసినట్టే త్రివిక్రం కూడ ముందే అంత్యప్రాసలతో ఈ డైలాగులు రాసుకొని సినిమాలో ఇరికించినట్లు అనిపించింది:-)

    రిప్లయితొలగించండి
  6. కాపీ కొట్టడానికి డైలాగ్స్ ఓపిగ్గా ఎవరు వ్రాస్తారా అని ఎదురు చూస్తున్నా!

    great work ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహ థాంక్స్ a2zdreams గారు :-) విచ్చలవిడిగా వాడేసుకోండి ఏం పర్లేదు :-))

      తొలగించండి
  7. వేణూశ్రీకాంత్ గారూ
    మీ రివ్యూ బాగుంది. కాని "త్రివిక్రమ్ హీరోల కారెక్టరైజేషన్ గురించి" మీర్రాసిన లాజిక్ సరి కాదు. ఇండియాలో అయితే, యజమానులు చాలావరకు తమ పనివాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వరు. కాని, ఈ సినిమాలో హీరో ఇటలీలో పుట్టి పెరిగినవాడు. పశ్చిమ దేశాలలో "డిగ్నిటీ ఆఫ్ లేబర్" అనేది ఒకటుంది. ఇక్కడ పనివాళ్ళని చాలావరకు యజమానులు గౌరవిస్తారు. యజమానులు తమ చేతులు ఖాళీగా ఉన్నాయనో, లేదా తమ చేతుల దగ్గరగా తమ పనివాళ్ళ లెంపలు ఉన్నాయనో చెప్పి, ఊరికే స్టీరియో ఎఫెక్ట్‌లో అదేపనిగా తమ కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ని చూపించరు. అదే గనక జరిగితే, ఆ యజమానులు మర్నాడే కటకటాల రుద్రయ్యలై జైలు ఊచల్ని లెక్కపెట్టాల్సి వస్తుంది. త్రివిక్రమ్ ఇలాంటివాటిలో స్క్రీన్‌ప్లేలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ కేకే గారు మీరు చెప్పినది చాలా వాలీడ్ పాయింట్ అండీ. సాధారణంగా త్రివిక్రమ్ అలాంటి జాగ్రత్తలు తీస్కుంటుంటారు. కాకపోతే ఈ సినిమాలో పవన్ చేతిలో దెబ్బలు తినే అనుచరులు ఇద్దరూ కారణంలేకుండా ఏం తినరు ఏవో తిక్క సలహాలు ఇచ్చి తిక్కపనులు చేసే తింటారు. అదికూడా పనివాళ్లందరిమీద చేయి చేసుకున్నట్లు చూపించలేదు. ఈ ఇద్దరితో గౌతంకి ఉన్న రిలేషన్ కేవలం యజమాని పనివాడు మాత్రమే కాదు.

      అలాగే హీరోతో ఇలా కమెడియన్స్ ని తన్నించడం కూడా త్రివిక్రమ్ ఈ ఒక్క సినిమాలో మాత్రమే చేయలేదు, గత చిత్రాలలో కూడా సునీల్ బ్రహ్మానందం లాంటివాళ్ళపై అలాంటి సీన్స్ రాశారాయన.

      తొలగించండి
  8. Hi Venu garu,

    its very nice. dialogues with power kabatti chala bavunnai.

    రిప్లయితొలగించండి
  9. ఇన్ని డైలాగ్స్ ఉన్నాయా గమనించనే లేదు

    అది సరే .. బ్రహ్మానందం కారెక్టర్ సంగతి ఏంటి.. అస్త వ్యస్తంగా ఉంది

    అహల్య సీన్, సినిమా లో ప్రతీ సీన్ డబ్బుంటే ఏమైనా చెల్లుతుంది అనే అండర్ కరెంట్ థీమ్ , హీరోయిన్ amnesia సీన్ ఇలా నాకు నచ్చనివి చాలానే ఉన్నాయి.

    అలాగే సరిగ్గా గమనించని మంచి డైలాగ్ లు, కొన్ని మంచి establishing సీడ్ సీన్స్ కూడా కొన్ని పోస్టులు చదివాకా కనిపిస్తున్నాయి.

    అక్కడ వరకూ ఎటు వెళ్తోంది ఈ సినిమా అని చిరాకు వచ్చినా క్లైమాక్స్ లో అన్నీ నీట్ గా కొలిక్కి తీసుకొచ్చి ఎమోషనల్ గా తియ్యడం హిట్ కి అది పెద్ద కారణం అనిపించింది నాకు. ఇందులో పి కె కి త్రివిక్రమ్ కి equal credit ఇవ్వాలి

    BTW, ఈ కథంతా పేరుకి సమంతా చెబుతుంది కానీ, చెప్పేది దర్శకుడు /రచయిత.

    ఇలాటివి తెలుగు లో చాలా కామన్ అనుకోండి శంకరా భరణం తో సహా.

    రచయిత, కథ చెప్పేవాడు ఒకళ్ళు కాదని మరచి - కాదు కాదు లైట్ తీసుకుంటారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఫర్ ద కామెంట్ వాసుగారు, ఈ సినిమాకి ఒక శాపం సమీక్షకులు ఇచ్చిన హై రేటింగ్స్ అయితే మరో శాపం ఇది త్రివిక్రమ్ సినిమా కావడంతో కొన్ని మినిమమ్ సెన్సిబిలిటీస్ ని తన అభిమానులు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీస్కోడం. చిన్న చిన్న పొరపాట్లతో సినిమా ఆశించినంత గొప్పగా లేకపోయేసరికి వాళ్ళు సినిమాని మరీ క్రిటికల్ గా చూశారనిపించింది.

      నేను రేటింగ్స్ బయటకు రాకముందే చూడడంతో సినిమాని ప్లెయిన్ గా చూడగలిగానేమో అనిపిస్తుంది. అందుకే నోటీస్ చేయకుండా వదిలేసినవి కనిపించాలనే కొన్ని పూర్తి సంభాషణలు రాసేశాను.

      సినిమా మొత్తంలో నాకు బోర్ కొట్టింది అహల్య ఎపిసోడే అండి, బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా కాస్త అస్తవ్యస్తంగా ఉందనడం కరెక్టే. ఇకపోతే కాటమరాయుడా పాటని ఈ విధంగా పొంతన లేకుండా వాడుకుంటాడని నేను పాట విడుదలైన దగ్గరనుండి ఊహిస్తూనే ఉన్నాను. అయితే అది త్రివిక్రమ్ ఐడియా అని పాట ఔన్నత్యం తెలిసీ ఇలా వాడారనీ తెలిసాక మాత్రం బాధనిపించింది.

      కళ్ళద్దాల ఫైట్ విషయమైనా ఈ పాటైనా అహల్య ఎపిసోడ్ అయినా త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో పవన్ చేస్తే చెల్లుతుంది అన్న ఉద్దేశ్యంతో కొంత అలక్ష్యం చేశారన్నమాట మాత్రం వాస్తవమేనని ఈ పోస్ట్ రాశాక నేను చూసిన త్రివిక్రమ్ ఇంటర్వ్యూల వల్ల తెలుసుకున్న విషయం. సో తన తర్వాత సినిమా తన పంథాలోనే తీస్తాడనే ఆశిద్దాం.

      నిజమేనండీ తెలుగు సినిమాల్లో అంత కేర్ ఎక్కడ తీస్కుంటారు. అక్కడికీ త్రివిక్రమ్ ఆ జాగ్రత్త కూడా తీస్కున్నాడు ఇందులో సమంతా ఫ్లాష్బాక్ చెప్పడం అయ్యాక కమెడియన్ వేణు “వాడి హిస్టరీ నీకెలా తెలుసు?” అని సమంతాని అడుగుతాడు. దానికి సమంతా “ఫోన్ లో ఇంటర్నెట్ ఉంది కదా.. వాడి పేరు కొడితే వంద పేజీలుందిక్కడ” అని చెప్తుంది. నెట్ లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందా అని నన్నడక్కండి గౌతంనందా బ్లాగ్ డైరీ రాసేవాడు అని నేను జవాబు చెప్పాల్సి వస్తుంది :-D

      ఇక ఈ సినిమా ఎందుకు హిట్ అయిందో అని మీరు చెప్పిన కారణం చాలా కరెక్ట్, సినిమా అంతా ఎలా ఉన్నా మెజారిటీ ఆడియన్స్ ఆ ఎమోషనల్ క్లైమాక్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు అదే చాలా హెల్ప్ అయింది సినిమాకి, పవన్ త్రివిక్రమ్ ఇద్దరూ కూడా దాన్ని నమ్ముకునే సినిమాని చుట్టేశారు.

      తొలగించండి
  10. మీరు రివ్యూ బాగా రాసారు. త్రివిక్రమ్ తో నాకు ఉన్న ఒక కంప్లైంట్ ఏమిటంటే హీరోఇన్స్ ని బుర్ర తక్కువగా, హీరో తో సభ్యతగా వెటకారం చేయించుకునే వాళ్ళ లాగా చూపిస్తాడు అని :-)
    ఈ సినిమా లో నాకు బాగా నచ్చిన ఇంకో డైలాగ్, పోసాని తో చెప్పించిన "నేను చెత్త పనులు చేసినంత కాలం ఎవ్వరూ ఎందుకు అని అడగలేదు. ఒక్క మంచి పని చేస్తే మాత్రం ఎందుకు ఎందుకు అని ప్రతి ఒక్కరూ అడగటమే".

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ అజ్ఞాత గారు. అవునండీ తన హీరోయిన్స్ గురించి మీరు చెప్పినది కరెక్టే. మంచి డైలాగ్ గుర్తుచేసినందుకు థాంక్స్, అందులో చెప్పిన విషయం కూడా ఎంత కరెక్టో లోకం పోకడ అంతే ఉంటుంది.

      తొలగించండి
  11. hammayya... inka cinema chudakkarledu. max dialogues meeruu, migataa commentators ichesarugaa... :)

    phani

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహ ఫణి గారు అసలు మీరు సినిమా చూడకపోతే ఆ డైలాగ్స్ చదవకూడదు అని చెప్పానుకదా ఎందుకు చదివారు :-)) అయినా ఆ డైలాగ్స్ సీన్స్ లో నటులు చెప్తుంటే వినాలండీ అపుడే అసలు కిక్కు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ ఎనీవే.. :-))

      తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.