“ఎప్పుడూ నీళ్ళలో ఉండే చేపకి జలుబు అంటుకోనట్లు ఇంత సంపాదించినా ఆయనకి డబ్బుపట్టలేదు”“మోసపోవడం ఫూల్ అవడం ఇవన్నీ ఒక మనిషి ప్రాణం కన్నా ఎక్కువా?”“తెలివి తేటలు వాడాల్సింది అవతలి వాళ్లని మోసం చేయడానికో లేదా వాళ్ళు ఎప్పుడు మోసం చేస్తారా అని కనిపెట్టడానికో కాదు... పని చేయడానికి అంతే”“రావణాసురుడు సీతని పట్టుకున్నాడు రాముడి చేతులో చచ్చాడు, వదిలేసుంటే కనీసం బ్రతికుండేవాడు. కౌరవులు జూదంలో గెలిచారు, కురుక్షేత్రంలో పోయారు, ఓడిపొయి ఉంటే బ్రదర్స్ అంతా కలిసి పార్టీ చేస్కునే వారేమో. అందుకే కొన్ని సార్లు పట్టుకోవడం కన్నా వదిలేయడమే కరెక్ట్, గెలవడం కన్నా ఓడిపోవడమే కరెక్ట్.“హరికథలు ఎంత బాగా చెప్పినా పళ్ళెంలో పదిపైసలే వేస్తారు”“కోటి రూపాయల లాటరీ తగిలినా కాని ముప్పైలక్షలు టాక్స్ లో పోతుంది అందుకేనేమో అదృష్టం డిస్కౌంట్ తో వస్తుంది అంటారు, దురదృష్టం మాత్రం బోనస్ తో వస్తుంది”“భార్యని గెలవాలంటే కప్పులు కాదుసార్ మీ మధ్యనున్న ఆ గోడని బద్దలు కొట్టండి”“ఫ్రెండుని రా.. ప్రాణం ఇవ్వలేకపోవచ్చు.. పార్టనర్ షిప్ ఇస్తాను”“మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు”“కొందరుంటారు కోటి రూపాయలు కొట్టే లాటరీ టిక్కెట్ ఇస్తే కలర్ బాలేదని పారేస్తారు”“కిడ్నాప్ చేసి పెంచుకోవడం అంటున్నాడు రేపు చంపేసి నేల్లో దాచి పెట్టుకోడం అంటే”“యాక్సిడెంటంటే బైకో కారో రోడ్ మీద పడ్డం కాదు ఒక కుటుంబం మొత్తం రోడ్డుమీద పడిపోడం”“మనం కావాలనుకునే అమ్మాయ్ వస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ మనల్ని వద్దన్న అమ్మాయి తిరిగి వస్తే మాత్రం ఆ ఫీలింగ్ చాలా హై ఉంటుంది”“తెలిసి చేస్తే మోసం... చేశాక తెలిస్తే తప్పు”“కత్తి ఎత్తితే కోతే కోయగలవు కత్తి దించి చూడు కొత్త రాత రాయగలవు”“అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేలోపు దరిద్రం వచ్చి లిప్ కిస్ పెట్టేస్తుంది”“బాగా బతికి పేరుతెచ్చుకునే ఓపిక లేదు... బాగా చంపి ఫేమస్ అయ్యేదా”“ఎక్కడో జరిగిన యాక్సిడెంట్లని ఎవరో చేసిన తప్పుల్నీ జాతకాలంటూ ఆడాళ్ళ మీద రుద్దటం తప్పు”“దూసుకెళ్ళే బాణం రేసుకెళ్ళే గుర్రం వెనక్కి తిరగదు”“కుందేలు పులిబోన్లోకి సైట్ సీయింగ్ కి వచ్చినట్లు నేను ఈయన దగ్గరకొచ్చానేంటి”“మా నాన్న దృష్టిలో భార్యంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మోయాలనుకునే బరువు, నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం”“నేను ఒక్కడ్నేఉన్నవి రెండే దార్లు చంపడం లేదా చావడంనేను ముగ్గురికి సమాధానం చెప్పాలినాలుగు వారాల క్రితం కాసిన పందెంఅయిదు వేల మంది జనాభా ఉన్న ఒక ఊరుఆరు వందలమంది ప్రైవేట్ సైన్యం ఉన్న ఒక నియంతఏడు అడుగులు నాతో నడవడానికి సిద్దంగా ఉన్న ఒక అమ్మాయినా జీవితాన్ని మార్చేసిన ఎనిమిది వేల గజాల స్థలంతొమ్మిది నిముషాలు మిగిలిన గడువుపది మీటర్ల దూరంలో చావు”... ఇదీ నా కథ.

అమ్మ జ్ఞాపకాల కబుర్లు
చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం
మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు
నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్
ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..
నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.
శుక్రవారం, ఏప్రిల్ 17, 2015
సన్నాఫ్ సత్యమూర్తి...
నేను ???

- వేణూశ్రీకాంత్
- అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.