అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

శుక్రవారం, ఫిబ్రవరి 15, 2013

పిజ్జా...


దదాపు మూడునెలల ఎదురు చూపుల తర్వాత ఇవ్వాళ పిజ్జా చూసి వచ్చాను. ఆగండాగండి పిజ్జా తిని కదా రావాలి చూసి రావడమేంటి అని అహనాపెళ్ళంట లో కోటా లాగా చూరుకు వేళ్ళాడేసి చూస్తూ మంచినీళ్ళు తాగినట్లో లేక 'చూపులు కలిసిన శుభవేళ' లో బ్రహ్మానందం లాగా దగ్గర్లోని పిజ్జా సెంటర్ కి వెళ్ళి తినేవాళ్ళ పక్కన నిలబడి పిజ్జావంక పిచ్చి చూపులు చూసినట్టో ఊహించేస్కోకండి మరి. నే చూసింది తినే పిజ్జాని కాదనమాట ఈరోజే విడుదలైన తెలుగు సినిమా ’పిజ్జా’ని. "హ్మ్ పిజ్జానా ఇంకేమీ దొరకనట్లు ఇదేం సినిమా పేరోయ్ ఇది హిట్టైతే రేపొద్దున్న పాస్తా, బర్గర్, ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు అని దొరికిన తిండి పేర్లన్నీ పెట్టి సినిమాలు తీసేస్తారా?" అని తిట్లు లంకించుకోకండి మరి. ఇది ఒక పిజ్జా డెలివరీ బోయ్ చుట్టూ తిరిగే కథ కనుక దీనికి ఆ పేరు పెట్టారనమాట. నాలుగు నెలల క్రితం తమిళనాట విడుదలైన ఈ సినిమా కోటిన్నర బడ్జెట్ తో తీస్తే ఎనిమిది కోట్లు (వికీ లెక్కల ప్రకారం) కలెక్ట్ చేయడమే కాక అవార్డులు సైతం సాధించిందట ఆ చిత్రాన్ని డబ్ చేసి తెలుగులో ఈ రోజు విడుదల చేశారు. 

ఆదివారం, ఫిబ్రవరి 10, 2013

క్రైస్తవ 'కడలి'

కొత్తగా పరిచయమవుతున్న హీరో హీరోయిన్ లూ.. అరవింద్ స్వామీ, అర్జున్ లాంటి నటీనటులతో రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీతో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ’కడలి’ సినిమా మీద నాకు బోలెడు అంచనాలున్నాయ్. అసలు ఈ అన్ని కారణాలకన్నా నాకు సముద్రమంటే ఉన్న చచ్చేంత ఇష్టం ముఖ్య కారణం అని చెప్పచ్చేమో. సముద్రాన్ని అపుడపుడు చూపిస్తేనే మణిరత్నం గారు పిచ్చెక్కిస్తారు, ఇక అదే థీంతో అంటే ఎంత బాగా తీసి ఉంటారో సముద్రాన్ని పోలుస్తూ ఎంత మంచి కథ రాసుకుని ఉంటారో అని గంపెడాశతో ఎదురు చూసాను. విడుదలైన దగ్గర నుండి రివ్యూలు చూస్తూ కాస్త నిరాశపడుతూ ఉన్నా కూడా ఇక ఆగలేక మొన్న ధైర్యం చేసి చూడ్డానికి వెళ్ళాను.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.