శుక్రవారం, ఫిబ్రవరి 15, 2013

పిజ్జా...


దదాపు మూడునెలల ఎదురు చూపుల తర్వాత ఇవ్వాళ పిజ్జా చూసి వచ్చాను. ఆగండాగండి పిజ్జా తిని కదా రావాలి చూసి రావడమేంటి అని అహనాపెళ్ళంట లో కోటా లాగా చూరుకు వేళ్ళాడేసి చూస్తూ మంచినీళ్ళు తాగినట్లో లేక 'చూపులు కలిసిన శుభవేళ' లో బ్రహ్మానందం లాగా దగ్గర్లోని పిజ్జా సెంటర్ కి వెళ్ళి తినేవాళ్ళ పక్కన నిలబడి పిజ్జావంక పిచ్చి చూపులు చూసినట్టో ఊహించేస్కోకండి మరి. నే చూసింది తినే పిజ్జాని కాదనమాట ఈరోజే విడుదలైన తెలుగు సినిమా ’పిజ్జా’ని. "హ్మ్ పిజ్జానా ఇంకేమీ దొరకనట్లు ఇదేం సినిమా పేరోయ్ ఇది హిట్టైతే రేపొద్దున్న పాస్తా, బర్గర్, ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు అని దొరికిన తిండి పేర్లన్నీ పెట్టి సినిమాలు తీసేస్తారా?" అని తిట్లు లంకించుకోకండి మరి. ఇది ఒక పిజ్జా డెలివరీ బోయ్ చుట్టూ తిరిగే కథ కనుక దీనికి ఆ పేరు పెట్టారనమాట. నాలుగు నెలల క్రితం తమిళనాట విడుదలైన ఈ సినిమా కోటిన్నర బడ్జెట్ తో తీస్తే ఎనిమిది కోట్లు (వికీ లెక్కల ప్రకారం) కలెక్ట్ చేయడమే కాక అవార్డులు సైతం సాధించిందట ఆ చిత్రాన్ని డబ్ చేసి తెలుగులో ఈ రోజు విడుదల చేశారు. 



మైఖేల్ (విజయ్ సేతుపతి) పిజ్జా డెలవరీ బోయ్ గా పనిచేస్తూ తన చిన్నప్పటి క్లాస్మెట్ ప్లస్ లవర్ అయిన అను(రమ్య నంబీశన్) తో కలిసి సహజీవనం చేస్తుంటాడు. అను ఆత్మల గురించి ఒక నవల రాయాలని రీసెర్చ్ చేస్తూ దెయ్యాలకు సంబంధించిన వీడియోలు పుస్తకాలు సేకరించి ఎప్పుడూ అవే చూస్తూ అదే ధ్యాసలో ఉంటుంది. అయితే మైఖేల్ దెయ్యాలున్నాయనే విషయం నమ్మకపోగా వెటకారం చేస్తుంటాడు, ప్రతి వ్యక్తికి మొదట్లో ఇలాంటి అపనమ్మకమే ఉంటుంది ఐతే వారి జీవితంలో ఏదో ఒక క్షణం వస్తుంది అపుడు వాళ్ళే ఆటోమాటిక్ గా నమ్ముతారు “Your moment is waiting” అని చెప్తుంటుంది అను.
 

ఇంట్లో ఇలాంటి డిస్కషన్ పెట్టుకుని రెస్టారెంట్ కి వెళ్ళిన మైఖేల్ కి అక్కడ గడ్డాలు మీసాలు పెంచుకుని పిచ్చివాడిలా కనిపిస్తున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు, ఎవరో అని తిట్టి పంపించబోతే బయటకి వచ్చిన రెస్టారెంట్ ఓనర్ అతనిని గౌరవంగా రిసీవ్ చేస్కుంటాడు. అతని ఆహార్యం అలా ఉన్నా స్వచ్చమైన ఇంగ్లీష్ మాట్లాడుతూ చదవుకున్న వ్యక్తిలా కనిపిస్తాడు. ఒకరోజు రాత్రి ఆలశ్యంగా పిజ్జా డెలివర్ చేయడానికి ఒక బంగళాకి వెళ్ళిన మైఖేల్ కి అక్కడ చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి అవి ఏమిటి వాటి వలన మైఖేల్ జీవితం ఎలాంటి అలజడికి గురైంది? పిజ్జా రెస్టారెంట్ ఓనర్ ని కలవడానికి వచ్చిన పిచ్చివాడిలా కనిపించిన మనిషి ఎవరు? ఈ ఓనర్ కు మైఖేల్ జీవితానికి సంబంధం ఏమిటి? అనేది తెలుసుకోవాలంటే మీరు పిజ్జా సినిమా చూడాల్సిందే.

నిజానికి ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే, అయితే ఎక్కువ చెప్పే కొద్దీ ఏం చెప్పేస్తానో మీకు థ్రిల్ ఎక్కడ మిస్ అవుతుందో అనే భయం నన్ను ఎక్కువ మాట్లాడకుండా ఆపుతుంది. ఈ సినిమాని హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ అని మూడు జెనర్స్ ని మిక్స్ చేసి చెప్పచ్చేమో. రెండుగంటల ఎనిమిది నిముషాల నిడివి ఉన్న ఈ సినిమాలో హార్రర్ ఎలిమెంట్స్ టిపికల్ హార్రర్ సినిమాలతో పోలిస్తే తక్కువే ఉన్నాయి కానీ అవి ఎఫెక్టివ్ గా ఉన్నాయి. సినిమాలో సహజత్వం ఉంది తక్కువ బడ్జెట్ తో తీసినా ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు కనిపించదు కథకు తగినట్లుగా లొకేషన్స్ ఎన్నుకుని సన్నివేశాల రూప కల్పన చేశారు.
 
ఇది పూర్తిగా టెక్నీషియన్స్ సినిమా, చెప్పాలనుకన్న కథ నుండి ఎక్కడా కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో డీవియేట్ అవ్వదు, ఉన్న ఒకటి రెండు పాటలు కూడా కథలో కలిసిపోయి నేపధ్య సంగీతం లాగే అనిపిస్తాయి. సినిమాకి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు రాసుకున్న గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే దానికి తగినట్లుగా ప్రతి సన్నివేశాన్ని సహజంగా కనిపించేలా మాక్సిమమ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా సపోర్ట్ చేసిన గోపీ అమర్నాథ్ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణన్ అందించిన నేపధ్య సంగీతం అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 

మైఖేల్ గా విజయ్ సేతుపతి నటన విశేషంగా ఆకట్టుకుంటుంది దానికి తగ్గట్టు తన పాత్రకి శివాజీ చెప్పిన డబ్బింగ్ ప్లస్ అయింది, అలాగే పిజ్జారెస్టారెంట్ ఓనర్ కి నాగబాబు చెప్పిన డబ్బింగ్ కూడా బాగా అమిరింది. నటీనటులు అందరూ తెలుగు తెరకి కొత్తవాళ్ళే అందరూ తమ తమ పరిధిలో బాగా చేశారు. అక్కడక్కడ తమిళ్ నేటివిటీ కనిపించినప్పటికీ టిపికల్ విలేజ్ తమిళ్ నేటివిటీ కాకుండా చెన్నై వాతావరణం కావడంతో పెద్దగా ఇబ్బంది పెట్టదు.

రొటీన్ ప్రేమ/ఫాక్షన్ కథలంటేనూ మూడు ఫైట్లు, ఆరు పాటలు, ఒక కామెడీ ట్రాక్ తో చుట్టేసే ఫార్ములా సినిమాలంటేనూ విసుగొచ్చి భిన్నమైన సినిమా కోసం ఎదురు చూసే ప్రతీ సినీ ప్రేమికులు మిస్ అవ్వకుండా ఒకసారి తప్పక చూడాల్సిన సినిమా పిజ్జా. ఇంత చెప్పానని మరీ విపరీతమైన అంచనాలు పెంచేస్కుని చూడకండి, అలాగే హార్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకుని చూడండి. సినిమా ముగిశాక ఒక వైవిధ్యమైన సినిమా చూశామన్న ఫీలింగ్ తో చిరునవ్వుతో బయటకి వస్తారు.

22 కామెంట్‌లు:

  1. ఇలా ఏడు సముద్రాల ఆవల మర్రి చెట్టు తొర్రలో దాక్కున్న సినిమాల గురించి కూడా ఎలా తెలుస్తుందండీ మీకు? :-):-) ఈ పేరు తో సినిమా ఉన్నట్టు కూడా తెలియదు నాకు. మీరు బాగుందన్నారు కనుక ఎప్పుడైనా ఈ సినిమా టి.వి లో వస్తే చూస్తాను. :-) బాగుంది మీ సమీక్ష.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. With all respect to you, it would be great if people like you support these type of films by going to theaters.

      తొలగించండి
    2. idlebrain, greatandhra , cinejosh & andhravilas ee sites chuste chaalu, telugu lo ye cinema ekkada shooting lo unnaado, eppudu release avutunnayo telisipotundi.

      తొలగించండి
    3. అజ్ఞాత15 ఫిబ్రవరి 2013 10:36 PM,

      విత్ ఆల్ రెస్పెక్ట్ టూ యూ.. ఎదుటి వారికి సలహాలిచ్చేముందు మీరు మీ ఐడెంటిటీని చెప్పి ఇవ్వడం మీ కనీస ధర్మం.
      అలాగే అలా 'యూ' అని పాయింటౌట్ చేసే ముందు వారి వారి పరిమితులను కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలనేది మరువకండి. చిన్న సినిమాలకు వచ్చే మేజర్ ప్రాబ్లం ఎవైలబిలిటీ. అన్ని ఊర్లలోనూ విడుదలయ్యే అవకాశాలు తక్కువ.

      మీరు ఇదే కామెంట్ ఎవరినీ పాయింటౌట్ చేయకుండా జెనరల్ గా మీ ఐడెండిటిటీతో చేస్తే మరింత గౌరవప్రదంగా ఉండేది.

      తొలగించండి
    4. I accept it. I should have thought about the bigger picture before commenting. But didn't. That could be one of the reasons why I burned my hands with film distribution.

      Anyways, thanks for writing reviews about good films. Appreciate it.

      తొలగించండి
    5. Samar,

      Thanks a lot for understanding my concern. No need for apologies I was just irked by the addressing “People like you” that too from an anonymous. Once again thanks a lot for taking time to come back and respond I really appreciate that.

      >> I burned my hands with film distribution. <<
      Now I clearly understand what made you to write that comment.

      I live in Guntur which is district headquarter with 25 screens. Still good movies like Mithunam , Barfi, Special 26 doesn’t release in my city and big flicks like Nayak, SVSC release in 12-15 screens. That’s how the industry is working these days.

      భరణి గారు మిథునం అనౌన్స్ చేసిన రోజునుండీ ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నాను కానీ నాకు టి.వి. లో చూడడమో డివిడి కొనడమో తప్ప వేరే ఆప్షన్ లేదు. 40kms దూరంలో ఉన్న విజయవాడలో కొన్నిరోజులు ఆడింది కానీ ఆ షార్ట్ స్పాన్ లో నేను సిటీ వదిలే పరిస్థితులలో లేను. ఒకప్పుడంటే సినిమాలు యాభై/వంద రోజులు ఆడేవి కాబట్టి తీరిగ్గా ఎంతదూరమైనా వెళ్ళి చూడగలిగే అవకాశం ఉండేదండీ. ఇపుడు ఒకటి రెండు వారాలకు మించి ఏ సినిమా సరిగా ఆడడంలేదు ఏం చేయగలం.

      తొలగించండి
    6. థాంక్స్ ఫర్ ద కామెంట్ శిశిర గారు,
      టివిలో వచ్చినపుడు మాత్రం మిస్సవకండి వర్త్ వాచింగ్. ఇక నాసంగతి అంటారా పైన అనానిమస్ ఫ్రెండ్ చెప్పినట్లు సినీ వెబ్ సైట్స్ ఫాలో అవుతుంటే అవే తెలుస్తుంటాయండీ :-) ఐతే ఈ సినిమా తమిళ్ వర్షన్ విడుదలైనపుడే చూసిన తమిళ మిత్రులు బాగుందని చెప్పారు నేను అప్పటి నుండి ఎదురు చూస్తూ ఉన్నాను సినిమా కోసం.

      తొలగించండి
  2. @అజ్ఞాత15 ఫిబ్రవరి 2013 10:36 PM గారూ,
    మీ సూచనని నేనూ గౌరవిస్తున్నానండీ. కాకపోతే మాది చాలా చిన్న ఊరండీ. కొన్ని పెద్ద సినిమాలే రావండీ మాఊరు. ఈ సినిమా వచ్చే అవకాశం లేదు. పైన నేను వ్రాసినది వేణూ గారి బ్లాగుని చాలాకాలం నుండీ ఫాలో అవుతున్న రీడరుగా వేణూ గారిని ఉద్దేశించి సరదాగా రాసిన వ్యాఖ్య. నా వ్యాఖ్య వారికి అభ్యంతరకరంగా ఉంటుందని నేను అనుకోవడం లేదండీ. ధన్యవాదాలు.

    అజ్ఞాత15 ఫిబ్రవరి 2013 10:44 PM గారూ,
    ఆ సైట్స్ ఉంటాయని తెలియజేసినందుకు ధన్యవాదాలండీ. పైన చెప్పినట్టు నేను రాసిన వ్యాఖ్య వేణూగారిని ఉద్దేశించి సరదాకి రాసినది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాత15 ఫిబ్రవరి 2013 10:44 PM --idi nene
      అర్ధం అయిందండీ . నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే

      తొలగించండి
    2. Please accept my apology. I have no intention to hurt anyone.
      I am aslo not aware of your town. Sorry about that.

      By, the way the other anonymous comments written in Telugu are not by me.

      తొలగించండి
    3. samar గారూ,
      No need for apologies. Thanks for understanding. :)

      తొలగించండి
  3. బాగుందండి మీ రివ్యూ.మాకెలాగూ రాదు.టీవీలో వచ్చినప్పుడన్నా చూడాలి.

    రిప్లయితొలగించండి
  4. mee review chadivaake memu pizza ku vellaamu.baagundandee movie.manchi movie chooselaa chesaaru.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చూసొచ్చి ఆ విషయం మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ధరణిజ గారు. మీకు నచ్చినందుకు సంతోషం.

      తొలగించండి
  5. ఒక మంచి భయానిక భీభత్సరసమయ చిత్రాన్ని పరిచయం చేసారు. ధన్యవాదములు. మామూలుగా నేను అనువాద చిత్రాల జోలికి వెళ్ళను. ;)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు చాతకం గారు. టిపికల్ అనువాద చిత్రాలలో తమిళ్ నేటివిటీ ఎక్కువ ఉంటుందండీ అది భరించడం కొంచెం కష్టమే కానీ ఈ సినిమాలో అది బాగానే మానేజ్ చేశాడు. థాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బాక్.

      తొలగించండి
  6. missed this post :(
    ఎప్పుడో రాసారే.. ! ప్లస్లో లింక్ ఇచ్చారా? మిస్సయినట్లున్నాను.. నేనింకా ఈ సిన్మా గురించి మీరు రాయలేదింకా అనుకుంటున్నా...:) హారర్ కాబట్టి నేనిది హాల్లో చూడాలి అనుకోలేదు కానీ మంచి సినిమా అని విని ఎవరన్నా రివ్యూ రాస్తారేమో అని చూస్తున్నా..!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ మధ్య ప్లస్ పోస్టులు సరిగా కనపడలేదు కదండీ అందులో మిస్ అయి ఉంటుంది. ఈ సినిమా రివ్యూలు చదవకండి తృష్ణ గారు. వీలైతే ఈ సినిమా గురించి ఏం తెలుసుకోకుండా చూడండి మీకు తప్పక నచ్చుతుంది. థాంక్స్ ఫర్ ద కామెంట్.

      తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.