సోమవారం, జూన్ 23, 2008

వాసంత సమీరం లా

ఏవో కొన్ని ప్రోగ్రాం లు, పండగల కి ప్రత్యేకించి తీసిన టెలీఫిల్మ్ లు తప్ప అంత గా ఆకట్టుకోని కార్యక్రమాల మధ్య బాగా ప్రాచుర్యాన్ని పొందిన మొదటి తెలుగు ధారా వాహిక ఋతురాగాలేనేమో. అప్పట్లో నాకు తెలిసి ఆదివారం ఉదయం వచ్చే రామాయణం తర్వాత మా ఊరిలో దాదాపు ప్రతి ఇంట్లోను ఒకే సమయం లో high volume లో పెట్టుకుని చూసే ప్రోగ్రాం లో ఇది ఒకటి. ఋతురాగాలు దూర దర్శన్ లో సాయంత్రం నాలుగు గంటలకు వచ్చేది అనుకుంటాను, స్కూల్ / కాలేజి నుండి ఇంటికి వచ్చే టైము. నాకు ఇంకా బాగా గుర్తు, ఇంటికి వస్తుంటే దారి పొడవునా ప్రతి ఇంట్లోనూ ఈ పాట మార్మోగిపొతుంటుంది. నేను ఈ సీరియల్ ఎప్పుడూ చూడక పోయినా ఈ పాట మాత్రం చెవులు రిక్కించి వినే వాడ్ని. ప్రారంభం లో వచ్చే ఝుం తన నం తననం... వినగానే చాలా హాయిగా అనిపించేది. ఇప్పటికీ ఈ పాట వింటుంటే మనసు అప్పటి ఙ్నాపకాలలోకి వెళ్ళి పోతుంది. అప్పట్లో బాగా పేరుపొందిన కార్యక్రమాలలో చిత్ర లహరి, చిత్ర హార్, చిత్రమాల కూడా వుండేవి. వరుసగా గురు, శుక్ర, ఆది వారాలలో వచ్చేవనుకుంటా.

జెమినీ లో ఈ ధారావాహిక ఇప్పుడు తిరిగి ప్రసారం చేస్తున్నారల్లే వుంది. తెలుగు TV కి access లేని వాళ్ళు ఈ పాట ని ఇక్కడ చూడవచ్చు.

http://www.youtube.com/watch?v=OW_DaYkE-_Eసంగీతం : బంటి, రమేష్
సాహిత్యం : బలపద్ర పాత్రుని మధు
గానం : సునీత, బంటి.

వాసంత సమీరం లా
నునువెచ్చని గ్రీష్మం లా
సారంగ సరాగం లా
అరవిచ్చిన లాస్యం లా

ఒక శ్రావణ మేఘం లా
ఒక శ్రావణ మేఘం లా
శరత్చంద్రికల కల లా..

హేమంత తుషారం లా
నవ శిశిర తరంగం లా
కాలం.. జాలం.. లయలొ కలల అలల సవ్వడి లొ
కాలం.. జాలం.. లయలొ కలల అలల సవ్వడి లో
సాగే జీవన గానం అణువణువున ఋతురాగం
సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

వాసంత సమీరం లా
నునువెచ్చని గ్రీష్మం లా
సారంగ సరాగం లా
అరవిచ్చిన లాస్యం లా

13 కామెంట్‌లు:

 1. బాగుంది. ఈ ధారావాహిక చాలా మందికి నచ్చిందనుకుంటా.

  నిర్మాతల వివరాలు నాకు పూర్తిగా తెలియవుకానీ, ఈ మధ్య నేను MAA TV లో "రాధా-మధు" అని ఒక సీరియల్లోని కొన్ని ఎపిసోడ్లు చూడటం తటస్థించింది. చాలా సహజమైన నటన, మంచి అదుపు ఉన్న టెలీప్లే దీనిలో ఉన్నాయనిపించింది. అసలే డబ్బింగ్ సీరియళ్ళుతప్ప ఏమీ రావటంలేని మన తెలుగు TV ఈ సీరియల్ ఒక పెద్ద రిలీఫ్ అనిపించింది. వీలైతే దీన్ని చూసికూడా ఒక టపా వెయ్యండి.

  రిప్లయితొలగించండి
 2. మీ వ్యాఖ్యకు నెనర్లు మహేష్ గారు. నాకు సీరియల్స్ చూడటం చాలా కష్టం అండీ అమృతం లాంటి సిట్‌కాం ల వరకు పర్లేదు కాని ధారావాహికలు చూడాలంటే బోలెడు సహనం కావాలి :-) రాధా మధు గురించి నేను కూడా విన్నాను బావుంది అని. నాకు మొదటి నుండి సీరియల్స్ కన్నా వాటి టైటిల్ సాంగ్స్ అంటే బోలెడు ఇష్టం అన్నీ కాదు కాని కొన్ని చాలా బావుండేవి. వాటిలో గంగమ్మకు.. కృష్ణమ్మకు.. తోడెవరమ్మా.. అని సాగే "పిన్ని" సీరియల్ పాట ఒకటి ఇంకా రాధిక గారిదే మధ్యాన్నం వచ్చేది ఒకటి ఇంకా కొన్ని వుండేవి కాని సరిగా గుర్తు లేవు.

  రిప్లయితొలగించండి
 3. నాకు కూడా ఋతురాగాలు టైటిల్ సాంగ్ ఇష్టం... మహేష్ గారన్నట్లు రాధ-మధు సీరియల్ కూడా బానే ఉంటుంది.. నేను రెగ్యులర్ గా చూడను కానీ, చూసిన అప్పుడప్పుడు మాత్రం నచ్చింది.. ఎవరూ ఓవర్ యాక్షన్ చేయరు.. కక్ష్యలు, కార్పణ్యాలు ఏమీ ఉండవు.. చూసినందుకు మన మూడ్ ఏమాత్రం పాడవదు.. అది మాత్రం గ్యారంటీ!!!

  రిప్లయితొలగించండి
 4. నెనర్లు మేధ గారు. ఓ అవునా... ఆ ఓవర్ యాక్షన్ విలన్ లు లేరంటే నే గొప్ప రిలీఫ్ లెండి, అయితే ధైర్యం గా చూడచ్చనమాట.

  రిప్లయితొలగించండి
 5. దూరదర్శన్లో ఆ పాట కోసమే చూసే వాణ్ణి అప్పట్లో ఈ సీరియల్ ను. మొదటి భాగం యద్దనపూడి సులోచనారాణి రాసారు.

  ఇప్పటి సీరియల్స్ ఏవీ నాకు గుర్తు లేవు.

  రిప్లయితొలగించండి
 6. వేణు గారు, ఈ పాట నాక్కూడా చాలా ఇష్టం.. లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు..

  నేనీ సీరియల్ వచ్చేరోజుల్లో కాలేజ్ లో ఉన్నా.. సెలవల్లో ఇంటికొచ్చినప్పుడు ఇంట్లో అంతా సీరియల్ కి ఎంతలా ఎడిక్ట్ అయిపోయారో చూసి భలే ఆశ్చర్యమేసింది! రోజూ మా పిన్ని బాంక్ నించి డైరెక్ట్ గా మా ఇంటికొచ్చి సిరియల్ అయ్యాక వాళ్ళింటికెళ్ళేది! అసలు ఆడవాళ్ళు సీరియల్స్ కి అతుక్కుపోవడం అనేది ఋతురాగాల నించే మొదలైందనుకుంటాను.

  రిప్లయితొలగించండి
 7. సీరియల్స్ ని చూడటం మొదటి నుంచి తక్కువే నేను. అందులోనూ ఫామిలీ డ్రామాలైతే అసలు పడవు నాకు. చిన్నప్పుడు ఆనందో బ్రహ్మ, పోపుల పెట్టె లాంటి కామెడీ సీరియల్స్ చూసేవాణ్ణి. చిత్రలహరి, చిత్రహార్ మిస్ అవ్వకుండా చూసేవాణ్ణి. ఆదివారం ఉదయం అయితే రంగోలి తో మేలుకొలుపు.

  ఎందుకో ఇప్పుడు 24 గంటలు తెలుగులో ఏదో ఒకటి వస్తూనే ఉన్నా అప్పటి దూరదర్సన్ యే నాకిష్ఠం ! పండుగలప్పుడు మాత్రం సినిమా స్పెషల్స్, ఇంటర్వ్యూలు బాగా చూసేవాణ్ణి.

  ఇప్పుడైతే అప్పుడప్పుడు అమృతం చూస్తున్నా. 'మా టివీ' లో వచ్చే యువ ఒకసారి ట్రై చేసాకాని నవ్వు రాలేదు.

  రిప్లయితొలగించండి
 8. @రవి గారు
  మీ వ్యాఖ్యకు నెనర్లు.

  @నిషిగంధ గారు
  మీకు నచ్చిన పాట ఇవ్వగలిగినందుకు నాకు చాలా సంతోషం గా ఉందండీ. మీరు అన్నది నిజం ఆడవాళ్ళు సీరియల్స్ కి అతుక్కుపోడం ఋతురాగాల నుండే మొదలయ్యింది.

  @వేణు గారు
  చాలా థాంక్స్, ఆనందోబ్రహ్మ, పోపులపెట్టె భలే గుర్తు చేసారు. ఆదివారం ఉదయం వచ్చేది రంగోలి కదా నిజమే నేను చిత్రమాల అని తప్పు చెప్పాను.

  రిప్లయితొలగించండి
 9. చాలా సంతోషమండి, వెంటనే విన్నాను.ఆ మధ్య జెమినీ టి వీ వారు మధ్యాహ్నాలు తిరిగి ప్రసారం చేసారు కానీ ఎక్కువగా వినలేకపోయాను. ఈ లింకు ఇక మోగిపోతుంది నా చెవుల్లో.

  రిప్లయితొలగించండి
 10. :) ఈ లింక్ నుండి mp3 డౌన్ లోడ్ చేసుకోవచ్చు చూడండి. క్వాలిటీ అంతే ఉంటుంది కాకపోతే, ఎందుకంటే ఇదే పాటను రికార్డ్ చేసాను.

  http://rapidshare.com/files/230799608/Vaasanta_Sameeram_laa.mp3.html

  రిప్లయితొలగించండి
 11. Venu gaaru, Just to say thanks yet once again. I have downloaded the .mp3 and been listening since then and this is my n-th time. I sure will listen an umpteen times ;)

  రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.