బుధవారం, జూన్ 04, 2008

కలిసి వుంటే కలదు సుఖము

నేను చిన్నపుడు నరసరావుపేట్ లో ఉండే వాళ్ళం అని చెప్పాను కదా. అమ్మ ట్రైన్ లొ వర్క్ కోసం గుంటూరు వెళ్ళి వచ్చేది, రోజూ రెండు గంటల పైనే జర్నీ పాపం వెళ్ళి రావడానికి. సో లంచ్ కి బాక్స్ తీసుకు వెళ్ళి వచ్చేప్పుడు స్టేషన్ లో నాకు మెలొడీ ఇంకా రక రకాల చాక్లేట్లు తెచ్చేది. అవి ఎంజాయ్ చేసి ఊరికే ఉండకుండా సాయంత్రం అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత ఆ బాక్స్ తీసుకుని కమల్‌హాసన్ లాగా స్టైల్ కొడుతూ "కలిసి వుంటే కలదు సుఖము" అని మరోచరిత్ర సినిమా లో పాట పాడుతూ బాక్సు మీద దరువు వేస్తూ డాన్సు వెస్తుంటె అమ్మా నాన్న అందరూ చూసి తెగ నవ్వుకునే వాళ్ళు (ఈ పాటలో కమల్ కూడా అలానే సరిత లంచ్ బాక్సు మీద దరువు వేస్తూ పాడాతాడు లెండి). మనకి చిన్నప్పుడు ఇలాంటి కోతి వేషాలు కూడ అలవాటనమాట యంటీఆర్ స్టెప్ లూ, ఏయన్నార్ స్టెప్ లూ కాపీ కొట్టడానికి ప్రయత్నించే వాడిని :-)

సరే కేవలం సినిమా పాటల పేర్లని వుపయోగించి ఆత్రేయ గారు వ్రాసిన ఈ సరదా అయిన పాట వింటుంటే ఓ చిరు నవ్వు బోలెడంత హుషారు వచ్చేస్తాయి ఇప్పటికీ. అలాంటి "కలిసి వుంటే కలదు సుఖమూ" పాట సాహిత్యం ఇక్కడ మనందరి కోసం... మరోచరిత్ర

<p><a href="undefined?e">undefined</a></p>

చిత్రం : మరోచరిత్ర
గానం : బాలూ, రమోలా
సాహిత్యం : ఆత్రేయ
సంగీతం : యం. యస్. విశ్వనాథన్

కలిసి వుంటే కలదు సుఖము.. కలసి వచ్చిన అదృష్టము
శభాష్ ... అహా.. హ... హ...
కలిసి వుంటే...కలిసి వుంటే కలదు సుఖమూ
కలిసి వుంటే కలదు సుఖమూ
కలిసి వచ్చిన అదృష్టము ఇది కలిసి వచ్చిన అదృష్టము
కన్నె మనసులూ.. మూగ మనసులూ ఆ..
అ..కన్నె మనసులూ.. మూగ మనసులూ
తేనె మనసులూ.. మంచి మనసులూ

||కలసి||

మొనగాళ్ళకు మొనగాడూ దసరా బుల్లోడు
ప్రేమనగర్ సోగ్గాడూ పూల రంగడు
మొనగాళ్ళకు మొనగాడూ దసరా బుల్లోడు
ప్రేమనగర్ సోగ్గాడూ పూల రంగడు
పక్కింటి అమ్మాయీ గడుసమ్మాయి... ఆ ఛీ! ఏం కాదు
పక్కింటి అమ్మాయీ గడుసమ్మాయి
అమెరిక అమ్మాయీ రోజులు మారాయి
ఆఆ డాండ..డాడ్డా..డడ..డాండ..డాడ్డా..డడ..

||కలసి||

మంచి వాడు మామకు తగ్గ అల్లుడు.. ఓ అలాగా..
చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు...హ హ అయ్యొ పిచ్చి వాడు
ఏయ్.. మంచి వాడు మామకు తగ్గ అల్లుడూ..
చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు...
ఈడు జోడు తోడూ నీడా నాడు నేడూ ||2||
ప్రేమించి చూడు పెళ్ళి చేసి చూడు... హమ్మ బాబొయ్
డాండ..డాడ్డా..డడ..డాండ..డాడ్డా..డడ..

||కలసి||

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.