ఆదివారం, ఫిబ్రవరి 10, 2013

క్రైస్తవ 'కడలి'

కొత్తగా పరిచయమవుతున్న హీరో హీరోయిన్ లూ.. అరవింద్ స్వామీ, అర్జున్ లాంటి నటీనటులతో రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీతో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ’కడలి’ సినిమా మీద నాకు బోలెడు అంచనాలున్నాయ్. అసలు ఈ అన్ని కారణాలకన్నా నాకు సముద్రమంటే ఉన్న చచ్చేంత ఇష్టం ముఖ్య కారణం అని చెప్పచ్చేమో. సముద్రాన్ని అపుడపుడు చూపిస్తేనే మణిరత్నం గారు పిచ్చెక్కిస్తారు, ఇక అదే థీంతో అంటే ఎంత బాగా తీసి ఉంటారో సముద్రాన్ని పోలుస్తూ ఎంత మంచి కథ రాసుకుని ఉంటారో అని గంపెడాశతో ఎదురు చూసాను. విడుదలైన దగ్గర నుండి రివ్యూలు చూస్తూ కాస్త నిరాశపడుతూ ఉన్నా కూడా ఇక ఆగలేక మొన్న ధైర్యం చేసి చూడ్డానికి వెళ్ళాను.


ఒక పది నిముషాలు ముందే వెళ్ళానేమో మొత్తం అన్ని తరగతులు కలిపి హాల్లో ఆరుగురమున్నాం. నాకు ఎడమ కన్ను అదరడం మొదలెట్టింది, “ఒరేయ్ వేణుగా నీకీరోజు మూడిందిరా” అనుకున్నా. సీట్ చూపించే అతన్ని ఏంటి బాసు సినిమా టాకేంటి అని అడిగా. అతను నా వైపు జాలిగా చూసి ఈ పదినిముషాల ఆనందాన్ని మాత్రం ఎందుకు చెడగొట్టాలి అనుకున్నాడేమో “కాసేపు చూడండి మీకే అర్ధమవుద్దిగా” అన్నాడు. “ఎలాగూ అర్ధమవుతుందిలే పబ్లిక్ టాకేంటో తెల్సుకుందామని” అని అడిగా. “చాలాఘోరంగా ఉందన్నా మొదటి అరగంట చూసి లేచెళ్ళిపోతున్నారు జనాలు” అని చెప్పాడు. ఇంత ఘోరమైన టాక్ విని ఏ అంచనాల్ లేకుండా సినిమా చూడ్డానికి సిద్దపడుతున్నామంటే సినిమా ఏ కొంచెం బాగున్నా ఎంజాయ్ చేసేయచ్చులే అని ధైర్యం చెప్పుకుని కూర్చున్నా. టైమ్ గడిచే కొద్ది మెల్లగా మరికొందరు ప్రేక్షకులు వచ్చారు, “హమ్మయ్య సినిమాకి నేనొక్కడినే కాదు నాతో పాటు మరికొందరు కూడా బలౌతున్నారు” అని నాలోని సగటు తెలుగోడి ఆత్మ శాంతించింది. 

సినిమా మొదలైంది. ఓపెనింగ్ షాటే శిలువ మీద.
“ఆహా బైబిల్ నేపధ్యం కదా మణి ఏదైనా అనుకుంటే ఏమాత్రం డీవియేట్ కాకుండా నూటికి నూరుపాళ్ళు అనుకున్నది తెరకెక్కించడంలో సిద్దహస్తుడు హట్సాఫ్” అనుకున్నాను.
బంగారు ఉయ్యాలలో పుట్టి పెరిగి ఆస్థిపాస్తులన్నీ వదులుకుని దేవుడి సన్నిధిలో సేవచేయడానికి వచ్చిన ఒక హీరో సామ్(అరవింద్ స్వామి). తిండి తిప్పలు లేక ఆకలి గురించేతప్ప నీతి నియమాల గురించి ఆలోచించే అవకాశంలేని ఒక విలన్ బెర్గ్ మన్స్(అర్జున్) తిండికోసం ఫాదర్ గా పనిచెయడానికి వస్తాడు.
“అర్రే విలన్ గా ఆర్జున్ భలే సూటయ్యాడే తను ఏ పాత్ర వేసినా భలే సులువుగా పరకాయప్రవేశం చేసేస్తాడు”.
“ఆ మరి చేయడేంటీ అవతల ఉన్నది ఎవరు మణిరత్నం కదా అలా పరకాయప్రవేశం చేయించేస్తాడు మరి”.       
బెర్గ్మన్స్ చేసిన ఒక తప్పుని దాచిపెట్టమని తను సామ్ ని ఎంత ప్రాధేయపడినా వినకుండా సామ్ కాలేజ్ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో కాలేజ్ వదిలేసి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. దానితో సామ్ పై కక్షకట్టి అతన్ని పాపంలో ముంచి ముంచి చంపుతానని ఎప్పటికైనా పగ తీర్చుకుంటానని ప్రతిజ్ఞచేసి వెళ్తాడు బెర్గ్మన్స్.

కట్ చేస్తే కడలి ఒడ్డున జాలరి బస్తీలో దిక్కూ మొక్కు లేక ఉంచుకున్న దానికి పుట్టినోడని అందరితో ఛీత్కరించుకోబడి తినడానికి సరైన తిండిలేక పడవల్లో పడుకుంటూ దొరికింది తింటూ ధుర్బరమైన బాల్యాన్ని గడుపుతుంటాడు థామస్. అతని పదేళ్ళ వయసపుడు ఆ జాలరి బస్తీలో ఉన్న చర్చ్ కి ఫాదర్ గా వచ్చిన సామ్ ఆ పిల్లావాడిని దేవుడి బిడ్డగా స్వీకరించి పెంచి పెద్దచేస్తాడు. యుక్తవయసుకు వచ్చిన థామస్(గౌతం కార్తీక్) ఒక సంధర్బంలో ప్రియ(తులసి) ని చూసి ప్రేమలో పడతాడు. ప్రియ ఒక నర్స్ హాస్పటల్ కి చెందిన మదర్ సంరక్షణలో పెరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో ఒక ఆపదలో చిక్కుకుని బుల్లెట్ గాయంతో తన కంటపడిన బెర్గ్మన్స్ ని సాం కాపాడతాడు. ప్రియ ఎవరు తనుకూడా థామస్ లా అనాథా ? సాం పై బెర్గ్మన్స్ పెంచుకున్న పగ తీర్చుకోగలిగాడా ? థామస్ తను ప్రేమించిన ప్రియను దక్కించుకున్నాడా అనే ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలంటే మీరు “కడలి” చూడాలి.

ఈ సినిమా ప్లాన్ చేశాక మణిరత్నం తమిళనాడు తీర ప్రాంతాల లోని జాలరి బస్తీల్లో కొన్నాళ్ళు నివాసమున్నారని విన్నాను. చూసిన ఎవరికైనా అదే అభిప్రాయమొచ్చేస్తుంది. అక్కడి జీవనవిధానాన్ని భాషతో సహా యథాతధంగా దించేశారు. అయితే అది మనకి పూర్తిగా కొత్తగా ఉంటుంది అంత హార్డ్ రియాలిటీని భరించగలగడం కష్టం. పోనీ కథ ఏమైనా ఆసక్తిగా ఉంటే విజువల్స్ కంటికి ఇంపుగాలేకపోఇనా కాస్త ప్రయత్నించచ్చు కానీ కథ కూడా పెద్దగా ఆకట్టుకోదు. ప్రేమ సన్నివేశాలని ఆసక్తికరంగా తీసే మణిరత్నం ఇందులో వాటి చిత్రీకరణలో కూడా నిరాశపరిచారు. అర్జున్ అరవింద్ స్వామి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు మాత్రం బాగున్నయ్.

నటీనటులలో అర్జున్ ఫస్ట్ మార్క్ కొట్టేశాడు, అరవింద్ ని అలా చూడ్డం కొంచెం కష్టంగా అనిపించినా కూడా కరుణ నిండిన కళ్ళతో ఎపుడూ నవ్వుతూ చేసిన తన నటన వంక పెట్టలేకుండా ఉంది. గౌతం కార్తీక్ తులసి ఉన్నంతలో బాగానే చేశారు. మంచులక్ష్మి అంతచిన్న పాత్ర ఎందుకు ఒప్పుకుందో నాకు అర్ధంకాలేదు కేవలం మణిరత్నం పేరుచూసి ఒప్పుకున్నట్లుంది తనేకాకుండా ఇంకెవరు చేసినా ఒకటేలాగా ఉండేది, నన్నడిగితే అసలా పాత్ర అవసరం కూడా లేదనిపించింది, బహుశా సినిమా నిడివి తగ్గించడానికి తన పాత్రని కుదించి ఉంటే చెప్పలేం.

సినిమాటోగ్రఫీ బాగుంది సాధారణంగా హాలీఉడ్ సినిమాల్లో పెద్ద పెద్ద టాంకులు నిర్మించి చిత్రీకరించే సన్నివేశాలనే నీలం తుఫాన్ సమయంలో చిత్రీకరించామని చెప్పారు. క్లైమాక్స్ లో చిత్రీకరణ నిజమైన పరిస్థితులలో చేసినదైతే కనుక ఖచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే. సంగీతం అక్కడక్కడ మెరిపించింది, బహుశా గాస్పెల్ సంగీతాన్ని బేస్ చేస్కుని చేయడం వలననేమో సినిమాకి బాగానే సూట్ అయినట్లనిపించినా నేపధ్య సంగీతానికి నేను అంతగా కనెక్ట్ అవలేకపోయాను. సూపర్ హిట్ అయిన గుంజుకున్నా పాటని నేపధ్యగీతంలాగా చిత్రీకరించారు అంతగా ఆకట్టుకోలేదు. మిగిలిన పాటల్లో ఏలేజల్లే ఒకటి సముద్రం అందాలని బాగా పట్టిచూపించింది. యాడికే పాట చిత్రీకరణ చూసినపుడు మనోడు ఇంకా దిల్ సే/దొంగ దొంగ రోజుల్లోనుండి బయట పడలేదా అనిపిస్తుంది, ఈపాటలో హీరోయిన కాస్ట్యూంస్ వల్లో ఏమో కానీ చాలా లావుగా ఎబ్బెట్టుగా కనిపించింది.

మొత్తంమీద కడలి బైబిల్ నేపధ్యంలో సహజత్వానికి దగ్గరగా చిత్రీకరించిన చిత్రం, కానీ అంత సహజత్వాన్ని తట్టుకోడం చాలా కష్టం. మంచికి చెడుకి మధ్య సంఘర్షణ చూపించాలని ప్రయత్నించినా కథని హత్తుకునేలా చెప్పడంలో మణిరత్నం ఫెయిలయ్యారనిపించింది. కడలిని అర్ధంచేస్కోవడం ఎలా అనే పుస్తకమేదైనా వేసి టిక్కెట్ తో పాటు పంచిపెడితే బాగుండేదేమో. నేను చిత్రానికి అసలు కనెక్ట్ కాలేకపోవడానికి బొత్తిగా పరిచయం లేని బైబిల్ నేపధ్యంకూడా ఒక కారణం కావచ్చు తెలుగు సంభాషణలు పాటల సాహిత్యం కూడా అవే ఛాయలని ప్రతిబింబించాయి. సినిమా అయ్యాక కడలికి ఒక స్తోత్రం మణిరత్నానికి రెండు స్తోత్రాలు అని అనుకుంటూ బయటకి రావడం గమనించాను, మావాడొకడు ఇందులో బాగా ఫేమస్ అయిన పాటకి ఇలా పేరడీ కట్టేశాడు :-) 

గుంజుకున్నాం నిన్ను హాల్లోకి..
గుంజుకున్నాం నిన్నే హాల్లోకే..
ఇక ఎన్నాళ్ళకీ ఈడేరునో నీ బతుకే..

వాయించేస్తాం.. నిన్ను ఎడా పెడా.. 
తాళలేనంటూ నువ్వే పారిపోయేలా..
కొత్త మణి సిన్మా.. చూడడం నీ ఖర్మా..

49 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. థాంక్స్ రాజ్ :-) నువ్ కూడా మళ్ళీ ఏ మొగుడు లాంటి సినిమాకో బుక్ అవ్వకపోవూ నేనూ ఇదే అనకపోనూ :-))

      తొలగించండి
  2. >>హమ్మయ్య సినిమాకి నేనొక్కడినే కాదు నాతో పాటు...

    >>జవాబు తెలుసుకోవాలంటే మీరు “కడలి” చూడాలి

    ఇదేంటిదీ... వేణూగారిలో కూడా తీవ్రవాద కొణాలు కనిపిస్తున్నాయి. ఇది ’నాతో నేను’ బ్లాగేనా !!

    బుక్కైపోయాను అని చెప్పినదాంట్లో కూడా ఫొటోగ్రఫి బాగుంది, ఫలానా యాస్పెక్ట్ బాగుందని చెప్పే మంచోల్లు మీరొక్కరేనండీ మీరొక్కరే :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ నాగార్జునా.. హహహ బహుశా సినిమా ఎఫెక్ట్ ఏమో కానీ ఇది అదే బ్లాగ్ సందేహం వలదు :-))

      తొలగించండి
  3. అర్జున్ విలన్ అని ముందే తెలుసు కాబట్టి రెడీ గానే ఉన్నాం. మొదట్లో కథ కొంచెం కంఫ్యూజ్ గానే ఉంది. అరవిందస్వామి ఏవిటోగా అయిపోయాడు. తులసి కొంచెం జెనీలియా లా ఉంది. లక్ష్మి పాత్ర నిజంగానే అనవసరం. నాకు నచ్చింది ఒకటి ఉంది. అదే...సముద్రం మీద తీసిన కొన్ని ద్రుశ్యాలు.స్తోత్రం మీకు:)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును జయ గారు నాక్కూడా సముద్రం మీద తీసిన దృశ్యాలు నచ్చాయి ఏలేజల్లే పాటలోనివి ముఖ్యంగా. థాంక్స్ ఫర్ ద కామెంట్.

      తొలగించండి
    2. అన్నట్లు అరవింద్ మొన్న విశ్వరూపం కాంట్రవర్సీ టైంలో కమల్ దగ్గరకు వచ్చినపుడు గడ్డంలేకుండా బాగున్నాడండీ. ఈ సినిమాలో గెటప్పే కొంచెం దెబ్బతిన్నట్లుంది.

      తొలగించండి
  4. మంచులక్ష్మి మీద ఒక పాటకూడా చిత్రీకరించారంట. మొత్తం కత్తెరకి బలయిపోయాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంచులక్ష్మి మీద పాట అనేది రూమర్ అని నా అనుమానం మురళీ. ఆడియోలో ఉన్న పాటలన్నీ సినిమాలో ఉన్నాయ్ కత్తెరకి బలయ్యే అవకాశమ్ లేదు. గుంజుకున్నా నే కొంత పార్ట్ తనమీద తీశారని రూమర్.
      కాకపోతే ట్రైలర్ లో అరవింద్ అర్జున్ ల మధ్య ఉన్న కొన్ని సీన్స్ లేవు సో వాటితోపాటు తన పోర్షన్ చాలానే కత్తెరకి బలై ఉంటుంది అనుకున్నాను. థాంక్స్ ఫర్ ద కామెంట్.

      తొలగించండి
  5. హ హ సినిమా ఏమో గానీ మీ బాధ చూస్తే నవ్వొస్తుంది :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహ థాంక్స్ శ్రావ్య :-)) చాలా అంచనాలతో ఉన్నానండీ అందుకే ఇంత బాధ :)

      తొలగించండి
  6. మీ రెవ్యూలను చదువుతుంటే నేను సినిమాలు చూడటం మానేసి మంచి పని చేసాను అనుకుంటున్నాను :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమేనండీ సినిమా గురించి పూర్తిగా తెలుసుకుని బాగుందన్న నమ్మకం వచ్చాకే చూడడం ఉత్తమం. ధన్యవాదాలు మాల గారు.

      తొలగించండి
  7. వీలు చూసుకుని చూడాలి అనుకున్నాను..

    అనవసరమంటారా..?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేనైతే వద్దనే చెప్తానండి.
      బైబిల్ నేపధ్యాన్నీ, హార్డ్ రియాలిటీస్ ని, ఆ పెయిన్ ని భరించగలను అనుకుంటే సినిమాటోగ్రఫీ కోసం అన్నిటికన్నా ముఖ్యంగా నేననుకున్నట్లు "మణిరత్నం సిన్మా నాలాంటి అభిమానులు చూడకపోతే ఎలా" అని అనుకుంటే చూడచ్చు.

      తొలగించండి
  8. కడలిని అర్ధంచేస్కోవడం ఎలా అనే పుస్తకమేదైనా వేసి టిక్కెట్ తో పాటు పంచిపెడితే బాగుండేదేమో :)ఇది బాగుందండి.

    సీడీ తెచ్చేరు మణిరత్నం సినిమా కదా అని ఆత్రంగా చుస్తే , అసలే కెమేరా ప్రింట్ ,ఆ డైలాగులు అర్ధమవలేదు,పోనీ ఎలాగో చూద్దామంటే ,కథ ,పాటలూ ఏవీ చూడాలీ అనిపించేలా లేక సగంలోనే అపేసా ... ఆడియో రిలీజ్ చూస్తేనే పాటలు అంత నచ్చలేదు.ఈ సినిమా కూడా విలన్ టైపులో ఉండేలా ఉంది అనుకున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహ సగంలో ఆపేసి మంచిపని చేశారు రాధిక గారు :-)) వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  9. నాకు ఇతని సినిమాలు మామూలుగానే నచ్చవు. మబ్బులో తీయడం, పొగమంచులో తీడం, వర్షంలో ఫైట్లు, హీరోవిన్ మహాచిలిపిగా ప్రవర్తించడం, మరీ సహజత్వానికి దగ్గరగా ఉండే డవిలాగులు - విసుగెత్తి పోయాం. ఇప్పుడు అతని మోనోటొనీ ని అతనే బద్దలు కొట్టడానికి కిరస్తానీ సంతను తెచ్చినట్టున్నాడు. మంచి పని చేశారు. దరిద్రం సినిమానుండి తప్పించుకున్నాం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహజత్వం ఊహా ప్రపంచం ఏది ఎంచుకున్నా డీవియేట్ అవకుండా తీయడంలో సిద్దహస్తుడండీ, రిలేషన్ షిప్స్ గురించి కూడా చాలాబాగా తీస్తారు. నాకు తన సినిమాలు చాలానే నచ్చుతాయి మొదటిసారి బొత్తిగా కనెక్ట్ అవలేకపోవడం జరిగింది. వ్యాఖ్యకు ధన్యవాదాలు.

      తొలగించండి
  10. రిప్లయిలు
    1. ఇప్పటికే పదిరోజులు ఆలశ్యం చేశాను జ్యోతిర్మయి గారు :-)) ధన్యవాదాలు.

      తొలగించండి
  11. హ హ అయితే నేను తప్పించుకున్నా అన్నమాట :)

    రిప్లయితొలగించండి
  12. " కడలిని అర్ధంచేస్కోవడం ఎలా అనే పుస్తకమేదైనా వేసి టిక్కెట్ తో పాటు పంచిపెడితే బాగుండేదేమో. "

    కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

    రిప్లయితొలగించండి
  13. హహహ సూపర్ వేణూ గారు :)
    ముఖ్యంగా ఆ పేరడీ కెవ్వు కేక
    అరవింద్ స్వామి 300 లో గెరార్డ్ బట్లర్ కి గ్లాడియేటర్ లో రసెల్ క్రోవ్ ని గ్రాఫిక్స్ లో కలిపినట్టు ఉన్నాడు.
    కడలి తీరాలకు వెళ్ళిపోయినసినిమా అన్నమాట మణిరత్నం కి మంచిరోజులోస్తాయిని ఆశిద్దాం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహహ అరవింద్ స్వామి గురించి భలే పోల్చావ్ హరే :-)) మరే మరే మణిని కూడా మంచిరోజులొస్తాయని ఆశించే డైరెక్టర్ల లిస్ట్ లో చేర్చేశా నేను కూడా :-))

      తొలగించండి
  14. మణిరత్నం సినిమాలు ఇంకా థియేటర్‌కి వెళ్ళి మరీ చూస్తున్నారా? భలేవారండి మీరు.మీ అంతటి ఆశావహులు మరొకరుండరేమో. కడలి అనగానే నాకు కృష్ణవంశీ సముద్రం గుర్తొచ్చింది.రెండూ రెండు ఆణిముత్యాలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహహ శ్రీకాంత్ గారు :-)) నేను కృష్ణవంశీ సినిమాలే థియేటర్లో చూస్తానండీ :-))
      అన్నట్లు సముద్రం నాకు నచ్చిందండీ అక్కడక్కడా విసిగించినా తనికెళ్ళ, ప్రకాష్ రాజ్, శ్రీహరి, శివాజీ వీళ్ళ కారెక్టరైజేషన్ ప్లస్ నటనకోసం మిస్ అవకుండా చూడాల్సిన సినిమా అది.

      తొలగించండి
    2. నాకూ సముద్రం గుర్తొచ్చింది .. ప్రతీ ఎమోషన్ ని సముద్రం తో పోలుస్తూ ఉంటాడు కదా ..అందుకో ..
      మొత్తం సినిమా చూడడం కుదరలేదు కానీ చూసినంతవరకూ నచ్చింది .. మంచి కాస్టింగ్ , అద్బుతమయిన నటన

      కడలి పాటలు డబ్బింగ్ సరిగా చెయ్యలేదని వినలేదు ..హాయిగా అనంత శ్రీరాం చేత రాయినచాల్సింది .. ఏ మాయ చేశావే కి చక్కగా రాశాడు .

      తొలగించండి
    3. అవును వాసు గారు సముద్రం చూడాల్సిన సినిమా. హ్మ్... పాటలేకాదండీ సంభాషణలు కూడా అంతే ఉన్నాయ్ అదేమంటే నేటివిటీ సహజత్వం అని అంటున్నారు :)

      తొలగించండి
  15. ఇదిగో మీరు ఏవన్నా అనుకొండి కానీ, మనం మంచమ్మాయ్ అభిమానులుగా ఆవిడ నిర్ణయాల్ని తప్పుపట్టకూడదండీ! ;)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహ నిజమేనండోయ్ నేను మర్చేపోయాను :-))
      సినిమా వల్ల నష్టపోయామని డిస్ట్రిబ్యూటర్స్ మణిరత్నం ఇంటి దగ్గర ధర్నా చేస్తున్నారట. అఖిలబ్లాగర్స్ మంచమ్మాయ్ ఫాన్స్ అసోశియేషన్ తరఫున మనం కూడా "తన సీన్స్ అన్ని కట్ చేసేసి మా మంచమ్మాయ్ కి అన్నాయం చేశారు" అని ధర్నా చేసేద్దామా. :-)))
      BTW Thanks for the comment :) good to see you after a long time.

      తొలగించండి
    2. అసలుకి మంచమ్మాయికి స్క్రీన్ స్పేస్ తగ్గినందుకే సినిమా అలా ఉందని (నేను చూడలేదు లెండి. అందరూ చెప్పుకోగా వినడమే)... ఒక థియరీ నడుస్తోంది అభిమానుల మధ్య. మంచమ్మాయిని తొక్కేయడానికి మణిరత్నం చేసిన కాన్స్పిరసీ వికటించి సినిమా ఫట్టుమన్నదట. దానితో మణి మంచమ్మాయిని హీరోయిన్ గా పెట్టి ఇంకో సినిమా తీసి ప్రాయశ్చిత్తం చేసుకుందాం అనుకుంటే, "పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు అనుకుని నిన్ను క్షమించగలను కానీ, గోల్డెన్ ఆపర్చునిటీ నీ తలుపు ఒకసారే తడుతుంది. మళ్ళీ మళ్ళీ నీ తలుపు తట్టడానికి నేను అప్పులవాడిని కాను" అని ఛీ కొట్టిందట మంచమ్మాయి. ఇదంతా నా పగటికల్లో వచ్చిన కథ అనమాట ;)

      తొలగించండి
    3. హహహహ బాబోయ్ మీ పగటికల సూపరుందండీ :-) మీరు ఎంతైనా వీరాభిమాని మరి. అన్నట్లు "గుండెల్లో గోదారి" ఫాలో అవుతున్నారా త్వరలో రాబోతుంది మన మంచమ్మాయ్ సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న సినిమా, గోదారి యాసతో అదరగొట్టేస్తుంది :-) గెటప్ ఫోటోలు ఇక్కడ : http://goo.gl/YnLW1
      ట్రైలర్ ఇక్కడ చూడండి : http://www.youtube.com/watch?v=raYxgbLF69c

      తొలగించండి
    4. Thanks for the links. మీరు గోదారి యాస అంటున్నారుగా! ఇప్పుడా ట్రైలర్ లో క్షణంలో సగం సేపు ఆ యాస విని తరించాక, నాకు ఆ సినిమాని "మంచమ్మాయ్ వాకిట్లో మల్లెపూల చెట్టు" అని నామకరణం చేయాలని అడుగుతూ ధర్నా చేయాలనుంది. :-)

      తొలగించండి
  16. హహహ మీరు మామూలు మనిషి కాదు బాబోయ్... అంత నచ్చని సినిమా గురించి కూడా ఎంత మోడరేట్ గా రాసారండీ. :))

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహహ థాంక్స్ సౌమ్యా :-) అంటే మణిరత్నం మీదున్న అభిమానం కొద్దీ అలా బోల్డంత పాజిటివ్ గా చూడ్డానికి ప్రయత్నించా అనమాట :-)

      తొలగించండి
  17. నేను చూసానండీ మణిరత్నం మీద నమ్మ్మకంతో ఎవరు ఎన్నన్నా సరే అని నాతో పాటూ మరో మూగ్గురిని ఆదివారం అర్ధరాత్రి(సెకండ్ షో)'కడలి'కీ బలి చేశా ..వా వా ..:'(

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హ్మ్.. అవునా ధాత్రి గారు మరే ఆ అభిమానమే నన్నుకూడా బలితీస్కుందండీ.. తన పాత సినిమాల డివిడిలు చూసి ఊరట పొందడమే :-)) థాంక్స్ ఫర్ ద కామెంట్.

      తొలగించండి
  18. వామ్మో.. ఇంకా నయం. రేపు సాయంత్రం ఆఫీస్ అయ్యాక "కడల్" కి వెళదామని కొలీగ్స్ అంటే ఒప్పేసుకున్నాను. అర్జెంటుగా ఫోన్ చేసి రానని చెప్పేసి, ఆ టికెట్ డబ్బులతో ఫ్రూట్స్ కొనుక్కుని మీ పేరు చెప్పుకుని తినేస్తాను వేణూ గారు. ఇంతకూ మిర్చి చూశారా మీరు? బాగుంటే వెళదామని...

    రిప్లయితొలగించండి
  19. హహహ థాంక్స్ ప్రియ గారు :-) నా రెకమెండేషన్ అడిగితే ఫస్ట్ విశ్వరూపం అని చెప్తానండీ, మాంచి హాలీఉడ్ సినిమా చూసిన ఫీల్ వస్తుంది, టిపికల్ ప్రేమ/ఫాక్షన్/మైండ్ లెస్ కథలు కాకుండా ఒక డిఫరెంట్ సినిమా, మంచి సినిమా చూసిన అనుభూతి వస్తుంది ప్రొవైడెడ్ వార్ మూవీస్ తరహా సినిమాలు మీకు విసుగు అనిపించకపోతే.
    ఇక మిర్చి అంటారా కథ పరంగా కొత్తదనం ఏమీలేదు రొటీన్ ఫాక్షన్ కథ ఇంచుమించు ఏ సన్నివేశం చూసినా పాతసినిమా ఏదోఒకటి గుర్తుచేస్తూనే ఉంటుంది ఐతే ప్రభాస్ కోసం ఒకసారి ఖచ్చితంగా చూడదగిన సినిమా తన పెర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ తను చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కి మాంచి బిలీవబిలిటీ వచ్చింది. సో టైంపాస్ ఎంటర్ టైనర్ చాలనుకుంటే మిర్చి చూసేయండి :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఓహ్.. చాలా థాంక్స్ వేణూ గారూ :)
      మీరు ఫస్ట్ రికమెండ్ చేసిన విశ్వరూపానికే టికెట్ బుక్ చేసేసాను..

      తొలగించండి
    2. గ్రేట్ ప్రియ గారు, మరీ ఎక్కువ అంచనాలు లేకుండా చూడండి. ఎంజాయ్ కమల్స్ పెర్ఫార్మెన్స్. అలాగే ప్రేమికులరోజు నాడు ఇలాంటి టెర్రరిస్టుల సినిమా రెకమెండ్ చేశాడేంటి ఈ మనిషి అని మాత్రం నన్ను తిట్టుకోకండి :-))

      తొలగించండి
  20. ఈ సినిమాలో కొన్ని పాటలు చాలా చాలా నచ్చేసాయి. మీ రివ్యూ చదివాక సినిమాకి దూరంగా ఉంటె పాటల మీద ఇష్టం చెదిరిపోకుండా ఉంటుందేమో అనిపిస్తుంది.. :)
    ఈ కామెంట్ రాస్తుంటే ఎందుకో పులి సినిమా పాటలు గుర్తొచ్చాయి.. ఆ సినిమా చూడలేదు కానీ అందులో నాకు చాలా నచ్చే 'నమ్మకమీయరా ప్రభూ.' పాట వీడియో ఒక రెండు నిమిషాలు చూసినందుకు ఎంత చింతించానో చెప్పలేను. :(

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిస్సందేహంగా మధురా.. వీడియోలకు సినిమాకి దూరంగా ఉండి పాటలను మాత్రం ఎంజాయ్ చేయండి :-)
      హహహ కొమరం పులి గురించి ఎందుకు గుర్తుచేస్తారులెండి, మీరు ఎంత చింతించి ఉంటారో అర్ధంచేస్కోగలను :ఫ్ ధాంక్స్ ఫర్ ద కామెంట్ :-)

      తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.