శ్రీ బాపూ రమణ గార్లు ఆప్యాయంగా సీతారాముడు అని పిలుచుకునే బి.వి.ఎస్.రామారావు గారు దదాపు పుష్కరకాలం గోదారొడ్డున వివిధ ప్రాంతాలలో ఇంజనీరుగా వివిధ హోదాలలో పనిచేశారు. అలా తాను అతి దగ్గరగా గమనించిన జీవన విధానం నుండి విన్నవి కన్నవి ఊహించినవి కొన్ని సంఘటనలను కథలను అన్నిటినీ కలగలిపి ఈ గోదారి కథలు రాశానని చెప్తారు. తను పుష్కరాల రేవులో పుల్లట్లు కథ చెప్పబోతూ ఓ మాటంటారు... “ప్రవాహంలో తరంగాల్లా ఎన్నో జీవితాలు కాలప్రవాహంలో సాగిపోతుంటాయి. తరంగానికి దిగువ మనకి కనపడని మరొక తరంగం ఉంటుంది, ఆ తరంగ శక్తే మనం చూస్తున్న తరంగాన్ని నడిపిస్తుంది. అలాగే మనమెరిగిన వ్యక్తుల జీవితాల వెనుక మనమెరుగని ఎన్నో బాధలూ కథలూ దాగి ఉంటాయి. ఆ సాగే కథలకు పారే గోదారే సాక్షి” అని. ఆ బాధలకు రామారావ్ గారు అక్షర రూపమివ్వడం మనం చాలా కథల్లో గమనించవచ్చు. అసలు వ్యధలేనిదే కథేలేదని ఎవరో పెద్దాయన అన్నట్లుగా ఇందులోని కొన్ని కథలలో కష్టాలు కన్నీళ్ళూ ఎక్కువగా కనిపిస్తాయి, తరచి చూస్తే అవి మనకెదురుపడే కొన్ని జీవితాలలోని కఠిన వాస్తవాలేనని గమనించవచ్చు.
అలాంటి యధార్ధజీవిత చిత్రణ చేసిన కథలలోనుండి రెండు కథలను తీస్కుని కొన్ని మార్పులు చేర్పులు చేసి తీసిన సినిమానే “గుండెల్లో గోదారి”. ఈ సినిమా చూడాలంటే చాలా ధైర్యం కావాలి నొప్పిని భరించగలిగే శక్తి కావాలి (అది సినిమా చూడడం వలన కలిగే నొప్పా సినిమాలో ఉన్న నొప్పా అని చిలిపి ప్రశ్నలేయడాలు ఇక్కడ లేవు :-)). సినిమా అంటే కేవలం వినోదసాధనం మాత్రమే నిజజీవితంలో ఉన్న కష్టాలు చాలుకదా ఇక్కడ కూడా ఎందుకు అనుకుంటే ఈ సినిమాకి దూరంగా ఉండడం మంచిది. మరీ ముఖ్యంగా ఇది స్ట్రిక్ట్ గా పెద్దల సినిమా (A Certificate). రెండు పాటలలో తప్ప మరీ శ్రుతిమించిన సన్నివేశాలు లేకపోయినా మెయిన్ థీం వివాహేతర సంబంధాల గురించి కనుక ఇలాంటి సినిమాకి పద్దెనిమిదేళ్ళలోపు పిల్లలని తీసుకువెళ్ళవద్దని నా సలహా.
ఇక కథ విషయానికి వస్తే గోదారి కథలలోని “గుండెల్లో గోదారి” కథనే మెయిన్ థీంగా ఎన్నుకున్నారు, దానిలోని వాడి(రచయిత ఈకథలో వీరికి పేర్లు పెట్టలేదు అదీ వాడు అనే అంటారు) ఫ్లాష్ బాక్ ని కొంచెం సినిమాటిక్ గా మార్చుకున్నారు. దాని ఫ్లాష్బాక్ గా “పుష్కరాల రేవులో పుల్లట్లు” కథలోని పుల్లమ్మ ఫ్లాష్బాక్ ని కాస్త మార్చి వాడుకున్నారు. పుస్తకం చదవని వారికోసం కథా వివరాలు..
1986 లో ఎగువ గోదారి ప్రాంతాలలో విస్తారంగా కురిసిన వర్షాల వలన గోదారికి అధికమొత్తంలో వరదనీరు వస్తుంటుంది, సరిగ్గా ఇదే సమయానికి ఈ విషయం తెలియని బంగారప్పేట లో మల్లి(ఆది) చిత్ర(మంచు లక్ష్మి)ల పెళ్ళి జరుగుతుంటుంది. ఆ పెళ్ళిలో తాళికట్టే సమయానికి నావలు అద్దెకిచ్చే సాంబశివయ్య గారి కూతురు సరళ(తాప్సి) వచ్చి పెళ్ళికొడుక్కి బంగారపు ఉంగరం చదివిస్తుంది. “అబ్బో అంతదూరం నుంచొచ్చి ఇంత ఖరీదైన బహుమతి చదివిచ్చిందంటే యవ్వారం ఎంత దూరం వెళ్ళుంటదో..” అని ఊళ్ళో వాళ్ళ గుసగుసలు విన్న చిత్ర మనసులో అనుమానం నాటుకుంటుంది. అంతలో రాజమండ్రిలో చిత్ర పని చేసే కంపెనీ యజమాని దొరబాబు(రవిబాబు) వచ్చి చిత్రకి బంగారు గొలుసు చదివిస్తాడు. అది చూసి దొందూ దొందే అని చులకనగా మాట్లాడుకుంటున్న ఊరివాళ్ల మాటలు విని మల్లి మనసులో కూడా అనుమానం మొదలవుతుంది. అలా సందేహాలతోనే పెళ్ళి జరుగుతుంది.
అదే సమయానికి పోలీసులు కోడెం తూము దగ్గర గోదారికి గండి పడిందని ఏ క్షణమైనా బంగారప్పేట మునిగిపోవచ్చని చెప్పి అందరినీ గట్టు మీదకి ఎక్కేయమంటారు. ఊరంతా వెంటనే గట్టువేపు పరిగెట్టినా మల్లి, చిత్ర మాత్రం జనం మాట్లాడుకున్న మాటల గురించి తమ పెళ్ళి ఇలా రసాభసా అవడం గురించి ఎవరి ఆలోచనల్లో వాళ్లుంటారు, మంటపం చుట్టూ చేరిన వరదనీరు చింది మొహం మీదపడ్డంతో తేరుకున్న ఇద్దరూ కష్టపడి ఒక గడ్డిమేటు మీదకి చేరతారు, అది చుక్కాని లేని నావలా గోదారి వరద నీటిలో పడి కొట్టుకుపోతుంటుంది. ఎలాగూ చావబోతున్నాము కదా అని కట్టుకున్నవాళ్ళకి నిజం చెప్పి చావాలని నిశ్చయించుకుని ఒకరికొకరు తమ గతం గురించి చెప్పుకుంటారు, ఆ గతం ఏమిటి దొరబాబు, సరళ వాళ్ళ జీవితాల్లోకి ఎందుకు వచ్చారు, ఆ గిఫ్ట్స్ ఎందుకు ఇచ్చారు, అసలు వాళ్లని వరద గోదారి తనలో కలిపేసుకుందా లేకా ఒడ్డుకు చేర్చిందా లాంటి వివరాలు తెలుసు కోవాలంటే గుండెల్లో గోదారి సినిమా చూడాలి.
సినిమాకి ఒక బలం కాస్టింగ్, పాత్రలే తప్ప నటీనటులు ఎక్కడా కనిపించరు. మల్లి పాత్రలో ’ఆది పినిశెట్టి’ ఒదిగిపోయాడు తన తీరైన ఫిజిక్ తో, మంచితనం మూర్తీభవించిన అమాయకపు జాలరి యువకుడిగా చక్కని పల్లె యాసతో అలరిస్తాడు. సూరి పాత్రలో సందీప్ ని చూస్తే రొటీన్ లవ్ స్టోరీ లో చేసిన హీరో ఇతనేనా అనిపిస్తుంది కోడిపందాలపై అమితమైన ప్రేమను పెంచుకున్న పల్లెటూరి యువకుడు మాత్రమే కనిపించాడు, ఇతని డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. లంగా ఓణీలు, రంగు రంగుల బొట్టు బిళ్ళలు, కళ్ళకు కాటుక, ఓ సారి ఇంత పెద్ద ముద్దబంతిపువ్వు ఇంకోసారి అంత గుప్పెడు కనకాంబరాలు జడలో తురిమి కాస్త పెద్దింటి పల్లెపడుచులా తాప్సీ చక్కగా ఆకట్టుకుంటుంది, తను ఈ సినిమాలో వేసిన పాత్ర మరెవరూ చేయలేరేమో అనిపించేట్లు చేసింది.

మంచు లక్ష్మి కాస్త మిస్ ఫిట్ ఈ సినిమాకి. అప్పటికీ నటన విషయంలో డైలాగ్ డెలివరీ విషయంలో చాలా కష్టపడింది కానీ ఆకష్టం తెరమీద కనిపిస్తూ మనల్ని ఇబ్బంది పెడుతుంది. కొన్ని సీన్స్ లో బాగానే అనిపించినా కొన్ని షాట్స్ లో మాత్రం హీరోలిద్దరిపక్కనా చాలా పెద్దదానిలా కనిపించింది అయితే దర్శకుడు కుమార్ చిన్నప్పటి మంచులక్ష్మి, సూరి పాత్రలు ఎన్నుకోవడంలో కూడా అమ్మాయిని అబ్బాయికన్నా కొంచెం వయసులో పెద్దగా ఉండేట్లు ఎన్నుకోవడం ద్వారా కంటిన్యుటీ దెబ్బతినకుండా చూస్కోడం నాకు నచ్చింది. తాప్సీ పాత్రనుద్దేశించి రివ్యూవర్స్ అందరూ ఎనభైలలో అమ్మాయిలందరూ ఇంత ఫాస్టా అని అన్నారు.. అయి ఉండకపోవచ్చు ఏ కోటికొక్క అమ్మాయో అలా ఉండి ఉండచ్చు అలాంటి సరళ కథే ఈ సినిమాలో చూపించారు అని సర్దుకుపోవాలి. ఆమాటకొస్తే తనకి పూర్తి వ్యతిరేకంగా మరో హీరోయిన్ చిత్ర పాత్ర ఉంటుంది కనుక అప్పట్లో అమ్మాయిలందరూ చిత్రలాగే ఉండి ఉంటారని కూడా అనుకోవచ్చు కదా కానీ “విమర్శకుల” కంటికి చిత్ర కనిపించదు. మల్లి కుటుంబానికి దూరపు బంధువుగా చిత్ర పక్కింటిలో ఉండే మనిషిగా పెద్ది పాత్రలో అన్నపూర్ణమ్మ గారు నటించారు తన పాత్ర బాగుంది కూతురు కాపురం గురించి చెప్పిన డైలాగులు బాగున్నాయ్. జీవా, రవిబాబు, తర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ పట్టాభి కూడా చక్కగా నటించారు.
సినిమాకి పని చేసిన టెక్నికల్ టీం అంతా మంచి ఔట్ పుట్ ఇచ్చారు. ఎనభైలలో వాతావరణాన్ని కాస్ట్యూంస్ తో సహా చాలా జాగ్రత్తగా చిత్రీకరించడంలో ఆర్ట్ ఽ కాస్ట్యూంస్ ఇద్దరిని మెచ్చుకోవాలి వారినుండి అలాంటి ఔట్ పుట్ రాబట్టిన దర్శకుని ప్రతిభని కూడా మెచ్చుకోవాలి. సినిమాలకు సాధారణంగా వాడే ప్లాస్టరాఫ్ పారిస్ కాకుండా పల్లె సెట్ అంతా సహజంగా ప్రకృతిలో కలిసిపోయే మెటీరియల్ తో ఎకో ఫ్రెండ్లీగా నిర్మించడం నాకు బాగా నచ్చింది. అంత వరద బీభత్సంలోనూ హాస్య చతురతని వీడకుండా జోకులేస్కోడం పశువులని కూడా ప్రేమతో కాపాడే ప్రయత్నం చేయడం లాంటి పల్లెప్రజల స్వచ్చతని కాప్చర్ చేసే సన్నివేశాలతో దర్శకుడు స్క్రిప్ట్ చక్కగా రాసుకున్నారు. ఫళని సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది వరద భీభత్సాన్ని నైట్ ఎఫెక్ట్ లో బాగా కాప్చర్ చేశారు, స్పెషల్ ఎఫెక్ట్స్ బాగున్నాయ్. కానీ సినిమా నేపధ్యం వలననేమో పచ్చదనంతో నిండిన గోదారి జిల్లాల అందాలు కాస్త తక్కువే కనిపించాయి అనిపించింది.

సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ఇళయరాజా గారి సంగీతం. సంధర్భానుసారంగా చేసిన పాటలు ఎనభైలలో వచ్చిన సంగీతాన్ని గుర్తు చేస్తూ సినిమా నేపధ్యానికి తగినట్లుగా చక్కగా అమిరాయి. “గుండెల్లోగోదారీ పొంగి పొరలుతోందీ” పాట హీరో ఇంట్రడక్షన్ సాంగ్ గా జాలర్ల గురించిన నేపధ్యంతో హాయిగా సాగుతుంది. “నను నీతో నిను నాతో” పాట మంచి మెలొడీ చిత్రీకరణ కూడా బాగుంది. “ఎక్కడుంది ఎక్కడుంది నాకోడి” కోడి పందాల గురించి వాటిని చంటిపిల్లల్లా ఎలా సాకుతారో చెప్తూ సరదాగా సాగిపోయింది. “జిల్లుమంది జిల్లుమంది వయసు” ఎనభైలలో వచ్చిన కొన్ని పాటలను గుర్తు చేస్తాయి సరళ కారెక్టరైజేషన్ ని పట్టి చూపించేట్లు అనంత శ్రీరాం బాగా రాశారీ పాట. ఐటం సాంగ్స్ లో “వెచ్చాని వయసుందిరా” పాత ట్యూనే కనుక మాంచి బీట్ తో ఆకట్టుకుంటుంది. ఇక నేపధ్య సంగీతంలో “బంతీ చామంతీ”, “ఏలేలమ్మా ఏలేలమ్మ హోయ్.. అందాలొలికే సుందరి రాతిరి కలలోకొచ్చేనూ”, “ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లాకిల్లా పడ్డాదమ్మో” లాంటి పాటలని ఇళయరాజా చక్కగా ఉపయోగించారు. లేట్ ఎయిటీస్ లో టీనేజ్ చూసిన వాళ్ళకి ఈ సినిమా ఒక మాంచి నాస్టాల్జిక్ ఫీల్ ఇస్తుందనడంలో ఏ సందేహం అక్కర్లేదు.
ద్వితీయార్ధంలో వచ్చే చిత్ర ఫ్లాష్బాక్ ఎనభైలలో ముత్యాల సుబ్బయ్య, క్రాంతికుమార్ సినిమాలలో మహిళలు అనుభవించే సినిమా కష్టాలను మనముందుంచి కొంచెం ఇబ్బందిపెట్టచ్చు కానీ కథ అదే కనుక యాక్సెప్ట్ చేసేయచ్చు. సినిమా నిడివి రెండుగంటలు మాత్రమే కనుక ఈ సన్నివేశాలు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టవు. సాధారణంగా చెప్పాలనుకున్న కథనుండి డీవియేట్ అవకుండా ఒక కన్విక్షన్ తో తెరకెక్కించిన చిత్రాలు తెలుగులో రావడం చాలా అరుదు ఆ విషయంలో దర్శకుడు కుమార్ నాగేంద్రన్ ని నిర్మాత మంచు లక్ష్మినీ తప్పక అభినందించి తీరాల్సిందే. నిర్మాణంలో ఎన్ని కష్టాలెదురైనా తననుకున్నట్లు నిర్మించడంలో మంచు లక్ష్మి విజయవంతమయ్యారు. మీరు వైవిధ్యమైన తెలుగు సినిమాలను కోరుకుంటూ సహజత్వాన్నీ, టఫ్ అండ్ పెయిన్ ఫుల్ స్టోరీస్ నీ భరించగలిగే శక్తి ఉంటే కనుక ఒక్కసారైనా చూడాల్సిన సినిమా గుండెల్లో గోదారి.

మీ రివ్యూ బాగుంది
రిప్లయితొలగించండిథాంక్స్ లక్ష్మీ నరేష్ గారు.
తొలగించండిఈ సినిమా మా స్టేట్ కి స్ప్రింగ్ బ్రేక్ టైం లో వచ్చింది.
రిప్లయితొలగించండిచూదామని చాలా మంది ఫ్రెండ్స్ అన్నా,నిజం చెప్పలంటే మంచు లక్ష్మి గురించి జంకాను. ఆది మంచి నటుడు.తాప్సి తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పకపోతే ఫర్వాలేదు కాని, తను తెలుగు మాట్లాడితే హింసే! ఇవన్ని అలోచించి స్కిప్ కొట్టాను.కాని మీ రివ్యు చదివాక మిస్స్ అయ్యానే అనిపించింది.
మీ రివ్యుస్ చాలా బాగుంటాయి వేణు గారు.
థాంక్స్ జలతారు వెన్నెల గారు, ఈ సినిమా కథ గురించి ముందే తెలుసుకుని ఏం ఆశించాలో ఒక అంచనాతో చూస్తే సాధారణ ప్రేక్షకుడిని ఈ సినిమా నిరాశ పరచదండీ. పర్లేదులెండి ఇపుడు డివిడి వచ్చాక చూసేయండి.
తొలగించండిబాగుందండీ రివ్యూ. ఓసారైనా ఈ సినిమాని చూడాలి అనిపించేలా రాశారు.
రిప్లయితొలగించండిథాంక్స్ శిశిర గారు, ఈ పరిచయం రాయడం వెనుక నా ఉద్దేశ్యం అదే :-)
తొలగించండిఈ సినిమా గురించి పాజిటివ్ ఇంత డిటైల్డ్ రివ్యూ ఇదేనేమో. మీరు గమనించిన అంశాలు బావున్నాయి . మంచు లక్ష్మి నిజంగానే టాలెంట్ , కష్టపడే తత్వం ఉన్న అమ్మాయి అని నా నమ్మకం. కానీ తనకు బ్రేక్ కొంచెం లేట్ గా వచ్చినట్లు ఉంది దాంతో కొంచెం నిలదొక్కుకోవటానికి కష్టం అవుతుంది అనుకుంటా !
రిప్లయితొలగించండిఇంతకీ ఆది అంటే సాయికిరణ్ వాళ్ళ అబ్బాయా వేణు గారు ?
థాంక్స్ శ్రావ్యా,
తొలగించండిమంచులక్ష్మి ఆటిట్యూడ్ గురించి మీరు చెప్పింది నిజమే మెచ్చుకుని తీరాల్సిందే. తను కెరీర్ ఆలశ్యంగా మొదలెట్టింది దానివలన ఇంకా ఎక్కువ తడబడుతుందనిపిస్తుంది. మరికాస్త జాగ్రత్తగా ప్రయత్నాలు చేయాలి.
ఇతను "ఆది పినిశెట్టి" రవిరాజా పినిశెట్టిగారి అబ్బాయి తమిళ్ లో ప్రూవెన్ నటుడు వైశాలి సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చేసినతను. సాయికుమార్ గారి అబ్బాయి "ఆది" కాదు.
చూసినా చూడకున్నా...రివ్యూలు చదువుతాం...సినిమాల మాటేమిటో కానీ...రివ్యూలు మాత్రం టెర్రర్ పుట్టిస్తున్నాయ్..మంచి రివ్యూ ఇచ్చారు....
రిప్లయితొలగించండిఒకసారి ఈ టెర్రరిస్ట్ ల రివ్యూల గురించి ఇదుగో ..మనోహర్ చిమ్మని...గారి అక్షర రూపం...లింక్ చూడండి...
http://nagnachitram.blogspot.in/2013/03/blog-post_23.html
(నా అభిప్రాయం కూడా ఇంతే)
ధన్యవాదాలు kvsv గారు. మనోహర్ గారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవించలేనండీ, టిక్కెట్ కొని సినిమా చూసే ప్రతి ఒక్కరికి తమకి సినిమా ఎలా అనిపించిందో చెప్పే హక్కు ఉంది అని నా ఉద్దేశ్యం వారు ఫిల్మ్ మేకర్స్ అయి ఉండాల్సిన అవసరంలేదు. నిజానికి ఫిల్మ్ మేకర్ అయితేనే తనైతే ఎలా తీసేవాడో ఆలోచించి బయస్డ్ గా రాస్తారేమో సమీక్షలు అనిపిస్తుంటుంది నాకు. కాకపోతే తను చెప్పినట్లు అలా పబ్లిక్ ప్లాట్ ఫాం లో ఒక పత్రికకి రాసేప్పుడు ఆ పత్రికలకి పబ్లిక్ కొంత వాల్యూ ఇస్తారు కనుక కాస్తయినా అవగాహనతో జాగ్రత్తగా రాస్తే బాగుంటుంది.
తొలగించండిబాగుంది. చాలా బాగా వ్రాశారు. నేను దాదాపు ఐదారు రివ్యూలు చదివాను ఈ సినిమాపై. వాటి కన్నా భిన్నంగా అనిపించింది మీ రివ్యూ. దానికి కారణం మీరు ఈ కథలను ముందే చదివి వుండడం వల్ల బాగా కనెక్ట్ అయ్యారనిపిస్తుంది.
రిప్లయితొలగించండిఇక్కడ మనం గుర్తించాల్సింది ఒక్కటే. సినిమా బాగా ఆకట్టుకోనేలాగా తీశారా లేదా అన్నది దర్శకుడి మీద ఆధారపడి వుంటుంది. కనుక నిర్మాతగా మూస సినిమా కాక కొత్తగా ప్రయతించాలన్న మంచు లక్ష్మి చిత్తశుద్దిని శంకించాల్సిన పనిలేదని నా అభిప్రాయం.
ఈ రివ్యూ కనక మంచు లక్ష్మి చదివితే మీకు ప్రత్యెక ధన్యవాదాలు తెలుపడం గ్యారంటీ..:)
థాంక్సండీ.. నిజమేనండీ కథలు చదివిఉండడం అవి నాకు నచ్చినవైఉండడం ఒక కారణం అయి ఉండచ్చు నేను ఇంతగా కనెక్ట్ అవడానికి, అలాగే ఎనభైల నేపధ్యం కూడా :-)
తొలగించండినిజమేనండీ మంచులక్ష్మి చిత్తశుద్దిని శంకించాల్సిన పనిలేదు పైగా నిర్మాతగా కథని దర్శకుడిని నమ్ము పూర్తిగా ఏం చెప్పాలనుకున్నారో అదే చెప్పనిచ్చారు కమర్షియల్ ఎలిమెంట్స్ పేరిట దారితప్పకుండా.
Positive review Venu...good to know that :)
రిప్లయితొలగించండిyour observations are interesting as usual !
థాంక్స్ సౌమ్యా.
తొలగించండిreview chaalaa baagaa rasarandi
రిప్లయితొలగించండిథాంక్సండీ..
తొలగించండిఈ సినిమా మీద ఇంత పాజిటివ్ రివ్యూ ని ఇదే చూడటం.
రిప్లయితొలగించండిసినిమా చూడాలని అనిపించేట్టు ఉంది. చూస్తా ;)
థాంక్స్ రాజ్.. ఫస్టాఫ్ ఈజీగా పాసైపోద్ది రాజ్.. సెకండాఫ్ లో కథలోని పుల్లమ్మ పెయిన్ గుర్తుతెచ్చుకుని దానికి ప్రిపేర్ అయితే అది కూడా లాగేసేయచ్చు. చూసేసి ఎలా ఉందో చెప్పు :)
తొలగించండిVery nice review. We must encourage good cinema. Im looking forward to watch Lakshmi in Kadali also. Looks like Im going to fall flat for this 'manchi ammaayi' of Sowmyaji.
రిప్లయితొలగించండిథాంక్స్ సుజాత గారు,
తొలగించండికడలి లో మంచు లక్ష్మి పాత్ర చాలా చిన్నదండీ.. షూట్ చేసినదాంట్లో చాలా మేరకు కత్తెరకి బలైందని విన్నాను.
హహహ సౌమ్య గారి మంచి అమ్మాయి ని చేసేశారా :-) ఈ సినిమా విషయంలో నిర్మాణంలోనూ పాత్రపోషణలోనూ తను పడిన కష్టాన్ని మాత్రం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే.
Good review.....All Actors performance is super.....very rare to hear that "movie carried good and equal feel of book/Novel"!. so director is talented!!
రిప్లయితొలగించండిథాంక్స్ నరసింహ గారు, అవునండీ నాక్కూడా అదే అనిపించింది దర్శకుడు ప్రతిభగలవాడు, కమర్షియల్ విలువలు గురించి మరీ డీవియేట్ అవకుండా మంచి చిత్రాలు ఎన్నుకుంటే మంచి పేరు తెచ్చుకోగలడు.
తొలగించండికొన్ని నెలల తరువాత నేను చదివిన మొదటి రివ్యూ ఇది :) అనుకున్న దానికి భిన్నంగా ఉంది, బాగుంది :))
రిప్లయితొలగించండిఇప్పుడైతే సినిమా చూడలేను కానీ, ఖచ్చితంగా చూడాలి అనిపించేలా రాశారు.
థాంక్స్ అప్పూ, హహహ ఇది కొంచెం ఏడుపు సినిమా కదా ఇపుడే చూడద్దులే :-))
తొలగించండి