నాకు నచ్చిన సినిమాలంటూ ఈ బ్లాగ్ లో రాస్తుంటాను కానీ ఒకోసారి మరీ నచ్చిన సినిమాల గురించి అసలు పోస్ట్ రాసే సాహసం చేయను. ఎందుకంటే కొన్ని సినిమాలను చూసి ఆస్వాదించగలమే కానీ విశ్లేషించలేం. అలాంటి వాటిలో “భాగ్ మిల్కా భాగ్” కూడా ఒకటి.
అయితే నేనీరోజు వరకూ వాయిదా వేసినట్లు సినిమా నిడివి గురించి భయపడి చూడకుండా ఎవరైనా మిగిలిపోయి ఒక మంచి సినిమాను మిస్ అవుతారేమోనని ఈ పోస్ట్ రాస్తున్నాను. మూడు గంటల తొమ్మిది నిముషాల ఈ సినిమా ఈ తరం ప్రేక్షకులకు ఖచ్చితంగా సాగదీసినట్లు అనిపించవచ్చు. సినిమాలో ఒక అరగంట సులువుగా ట్రిమ్ చేయగల సన్నివేశాలున్నట్లు నాకు కూడా అనిపించింది.
కానీ మనం బయోపిక్ చూస్తున్నాం అనే విషయం గుర్తుంచుకోండి, జీవితంలో జరిగే అన్ని సంఘటనలు ఆసక్తికరంగా ఉండవు కానీ జరుగుతాయి. ఓ అరగంట పాటు బోర్ భరించడానికి సిద్దమైతే రెండున్నరగంటల అద్భుతాన్ని వీక్షించే అవకాశం మీదవుతుంది.
సినిమాలో ఫరాన్ అక్తర్ ఎక్కడా నాకు కనిపించలేదు కేవలం మిల్కాసింగ్ మాత్రమే కనిపించాడు. ఈ సినిమా కోసం తనని తాను మలచుకున్న తీరు తన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది, తన కోసం ఈ సినిమా చూసేయచ్చు. చిన్నప్పటి మిల్కాగా చేసిన మాస్టర్ జప్ తేజ్ సింగ్ కూడా గుర్తుండి పోతాడు. మిల్కా సింగ్ ని చిన్నప్పటి నుండి అమ్మలా చూసుకునే అక్కగా దివ్యాదత్తా చాలా బాగా చేసింది. సోనం కపూర్ ఈజ్ క్యూట్.
ఈ సినిమాలో మనసుని తాకే సన్నివేశాలున్నాయ్, సున్నితమైన ప్రేమ ఉంది, చక్కని హాస్యం ఉంది. అద్భుతమైన నేపధ్య సంగీతం ఉంది, అది సినిమాటోగ్రఫీతో కలిసి ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందంటే సినిమా చూస్తూ అథ్లెట్స్ తో పాటు మనమూ పరిగెడతాం, మిల్కా ఎమోషన్స్ ని మన ఎమోషన్స్ గా ఓన్ చేసుకుంటాం. సినిమా అంతా చిన్న చిన్న ఫ్లాష్బాక్ ఎపిసోడ్స్ తో ప్రసూన్ జోషీ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది.
ఒక మనిషి తన పరిమితులను ఎంతవరకూ స్ట్రెచ్ చేయగలడు, తనతో తాను యుద్దంచేసి అన్నిరకాల భయాలను బలహీనతలను జయించి తనని తాను విజేతగా ఎలా నిలుపుకున్నాడు అనేది తెలుసుకోడానికి ఈ సినిమా చూడండి. ఇది ఓ రచయిత ఊహల్లోంచి పుట్టిన పాత్రకాదు నిజజీవితంలోనుండి పుట్టిన పాత్ర.
ఈ సినిమా గురించి సమీక్షలు విశ్లేషణలు చదివింది చాలు, జూలై పన్నెండో తారీఖున విడుదలైన ఈ సినిమా మీరు ఇంకా చూసి ఉండకపోతే వెంటనే ఈ క్రింది ట్రైలర్ చూడండి అది ఏమాత్రం మిమ్మల్ని ఇంప్రెస్ చేసినా వెంటనే మీరీ సినిమా చూడండి నిరుత్సాహ పరచదు, ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతిని మిగులుస్తుంది.
ఈ సినిమా Rottentomatoes రేటింగ్ : 83% ఫ్రెష్
ఈ సినిమా IMDB రేటింగ్ :

నిజ జీవితం లోంచి పుట్టిన పాత్రలు బాగా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి!అందులోనూ మిల్కాసింగ్ జీవనాధారిత చిత్రం మీరన్నట్లు మరికొంత ఎడిట్ చేసి ఉంటే మరింత క్రిస్ప్ గా తయారై ఎక్కువమందిని అలరించేదేమో!
రిప్లయితొలగించండిథాంక్స్ సూర్యప్రకాష్ గారు, నిజమేనండి లెంత్ తగ్గితే మరింతమంది అభిమానించేవారు.
తొలగించండిజీవితంలో జరిగే అన్ని సంఘటనలు ఆసక్తికరంగా ఉండవు కానీ జరుగుతాయి.
రిప్లయితొలగించండిబాగా చెప్పారు వేణూ గారూ.
థాంక్స్ శిశిర గారు.
తొలగించండి