“కొన్ని లక్షల ఇళ్ళలో కొన్ని ఇళ్ళను మాత్రమే కొందరు ఇష్టపడతారు, ఎందుకో తెలియదు కానీ షబ్బూ కూడా ఈ ఇంటిని అలాగే ఇష్టపడింది. చాలారోజులుగా ఈ ఇంట్లోనే ఉంటుంది.” అన్న వర్మ వాయిస్ ఓవర్ తో ఓ ఇంటిని క్లోజప్ లో చూపిస్తూ ఈ చిత్రం ప్రారంభమవుతుంది. కట్ చేస్తే ఆ ఇంటిలో ఉంటున్నవాళ్ళు మూడు నెలలు గా అద్దె ఇవ్వకుండా ఫోన్ కు కూడా సమాధానమివ్వకుండా ఏమయ్యారో తెలీదు. ఈ విషయం ఓనర్ ద్వారా విని తలుపులు బద్దలు కొట్టిచూసిన రెంటల్ ఏజెంట్ కు ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో
ఇంటిని తరుణ్(జేడి) కుటుంబానికి అద్దెకు ఇస్తాడు. తరుణ్ కూతురు నిమ్మి(అలయన శర్మ), కొడుకు తమన్, భార్య నమ్రత(మనీషా) ఒక పనిమనిషి లక్ష్మణ్ తో ఆ ఇంట్లో ఉండటానికి వస్తాడు.
అదే సమయంలో శలవలు గడపడానికి తరుణ్ చెల్లెలు పూజ(మధుశాలిని) కూడా వచ్చి వాళ్ళతో ఉంటుంది. ఆ ఇంటికి వచ్చినరోజు నుండీ నిమ్మి షబ్బుతో స్నేహం చేయడం మొదలెడుతుంది. నిమ్మీ కుటుంబ సభ్యులంతా షబ్బూ కేవలం ఒక ఇమాజినరీ ఫ్రెండ్ అనుకుని నిమ్మీని తనపేరెత్తకుండా కట్టడి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ నేపధ్యంలో ప్రతిరోజు రాత్రిపూట ఇంట్లో చిత్ర విచిత్రమైన శబ్దాలు అరుపులు వస్తుంటాయి. ఓ రోజు పనివాడు లక్ష్మణ్ కనిపించకుండా పోతాడు.... లక్ష్మణ్ ఏమయ్యాడు? షబ్బు నిజమా భ్రాంతా ? మిగిలినవారికి ఎందుకు కనపడటంలేదు? ఆ కుటుంబం ఈ సమస్యనుండి బయటపడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే బూచి చూడండి.
నాకు భయపెట్టడం ఇష్టం ఎందుకంటే ప్రేక్షకులకి భయపడడం ఇష్టం కాబట్టి అని చెప్తూ హార్రర్ సినిమాల మీద విపరీతమైన ఫాసినేషన్ పెంచుకున్న వర్మ నుండి వచ్చిన మరో దెయ్యాల సినిమా “బూచి”. ఇందులో తను మొదటి సారిగా డైరెక్ట్ చేసిన త్రీడీ సినిమా. అందరూ అనుకున్నట్లే సినిమాలో త్రీడి ఎఫెక్ట్స్ కొన్ని ఆకట్టుకున్నాయి డెప్త్ ఫీల్ అయ్యేలా తీశాడు అయితే దీనిని సినిమాకి చెప్పాలనుకున్న కథకి సరిపోయేలా ఉపయోగించుకోడంలో ఫెయిల్ అయ్యాడనిపించింది. అయితే మూడుకోట్లతో ఒక త్రీడీ సినిమా తీసేసి దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ప్రాఫిట్ చూస్తాడు కనుక హిట్టే అనుకోవచ్చేమో... ఇక భయపెట్టాడా అని అంటే నన్నైతే కొంచెమే ఒకటిరెండు చోట్ల మాత్రమే భయపెట్టాడు.
సినిమా నిడివి ఎనభై ఐదు నిముషాలు మాత్రమే, సినిమాలో అనవసరమైన పాటలు, కామెడీ ట్రాక్ ఇతరత్రా ఏమీ లేకుండా కేవలం తను చెప్పాలనుకున్న విషయం మాత్రమే చూపిస్తూ రాస్కున్నాడు స్క్రీన్ ప్లే. ఐతే ఇలా రాస్కోడం వలన అస్తమానం ఒక రాత్రి సీన్ ఒక పగటి సీన్ ఇలా పదే పదే రిపీట్ అయి ఒకటి రెండు సార్లు విసుగొస్తుంది ఎహే ఎంతసేపు ఇదే గోలా అని. నేపధ్య సంగీతాన్ని బాగా ఉపయోగించుకున్నాడు గోడగడియారం క్లిక్ క్లిక్ సౌండ్ తోనే కొన్ని సీన్స్ లో భయపెట్టాడు కొన్ని సీన్స్ లో పూర్తి నిశ్శబ్దం వలన కూడా భయపడతాం ఐతే కొన్ని సీన్స్ లో కేవలం సౌండ్ ని మెల్లగా మొదలుపెట్టి ఏదో జరిగిపోతున్నట్లు డబ్బాలో గులకరాళ్ళేసి కొట్టేసి పీక్ కి తీస్కెళ్ళి సడన్ గా సీన్ మార్చేస్తాడు. అంత సౌండ్ ఎఫెక్ట్ చూసి ఏదో జరిగిపోతుందని మనం సిద్దమైతే ఏమీ ఉండదు అలాంటి సీన్స్ లో మొదటిసారి ఏదో జరగబోతుందని భయపడతాం రెండో సారి కొంచెం భయపడతాం మూడో సారికి చిరాకు పడతాం, సినిమాలో ఇలాంటి సీన్స్ ఓ పదిసార్లుండచ్చు.
ఈ సినిమాకి వెళ్ళాలనిపించడానికి ఒకనొక కారణం మనీషా కొయిరాలా కూడా. పోస్టర్సులోనూ ట్రైలర్ లోనూ చూసాక ఏమాత్రం నమ్మకం పెట్టుకోవద్దని మనసు హెచ్చరిస్తున్నా కూడా ఏదో నమ్మకంతో వెళ్ళాను కానీ అస్సలు చూడలేక పోయాను. జేడి కన్నా వయసులో చాలా పెద్దగా కనిపించింది, అభినయం పర్వాలేదు. జేడి చక్రవర్తికి వర్మ సినిమా అనగానే నటన గుర్తొస్తుందో లేక వాళ్ళిద్దరి మధ్యా కమ్యునికేషన్ బాగుంటుందో కానీ బాగా చేశాడనిపించాడు. మధుశాలిని ఏదో కాస్త కష్టపడిందనిపించింది కానీ ఆవిడ పొట్టి నిక్కర్లు దాచలేని కాళ్ళమీద తప్ప కళ్లమీద కెమేరా పెద్దగా ఫోకస్ చేయలేదు కనుక పెద్దగా తేడా తెలీదు. నిమ్మీగా చేసిన చిన్నపాప బాగుంది తన చేష్టలు కళ్ళు ఎక్స్ ప్రెషన్స్ తో బాగానే భయపెట్టింది.
ఈ మధ్య వచ్చిన “అవును” సినిమాలో లాగానే దెయ్యాన్ని చూపించి భయపెట్టడం కన్నా దెయ్యం పేరు చెప్పి భయపెట్టడానికి ప్రాముఖ్యతనిచ్చిన సినిమా బూచి. సాధారణంగా పెద్దవాళ్ళం పిల్లలని బూచి వస్తుందని చెప్పి భయపెట్టడం ఆనవాయితీ.. అదే రివర్స్ లో పిల్లలు పెద్దవాళ్ళని బూచి ఉందని చెప్పి భయపెడితే ఆ బూచి నిజంగా ఉంటే ఎలా ఉంటుందనేది ఈ సినిమా. సౌండ్ ఎఫెక్ట్స్ చిత్ర విచిత్రమైన కెమేరా యాంగిల్స్ ని ఉపయోగించి కొంతవరకూ భయపెట్టడంలో వర్మ విజయం సాధించాడు. అలాగే సినిమాలో ఒకటి రెండు థ్రిల్స్, అక్కడక్కడా త్రీడీ ఎఫెక్ట్స్ కూడా గుర్తుండిపోతాయి. సినిమా అయ్యాక ఒకటి రెండురోజులవరకూ ఇంటిలో అటక మీద ఏముందో అని, రాత్రులు వచ్చే చిన్న చిన్న శబ్దాలకూ, కంటి చివర్లలో లీలగా కనిపించే చిరు కదలికలకూ సైతం ఓ క్షణం భయపడటం ఖాయం. ఐతే సినిమాలో లాజిక్ కు చోటులేదు, అస్తమానం చీకట్లో నడుస్తూ భయపడకపోతే లైటేస్కు చావచ్చుగా లాంటి ప్రశ్నలు మనం అడక్కూడదు. క్లైమాక్స్ చాలా అన్ కన్వెన్షనల్ గా ఉంది ఒక తండ్రి అలాటి నిర్ణయం తీస్కుంటాడా అని ప్రశ్నించేలా చేస్తుంది. కానీ దట్స్ ఆర్ జీ వీ, కాస్త ఆలోచిస్తే ఆ తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పటివరకూ జరిగిన సంఘటనల నేపధ్యంలో తనకి వేరే దారిలేదనిపిస్తుంది.

3D aa..
రిప్లయితొలగించండిChoodakkarledu ani cheppe anta chettagaa ledu.. choodandi ani cheppe anta baagoledu antaaraa??
హహహహ సూక్ష్మం గ్రహించారు వాసు గారు :-) సాధారణంగా నేను "నాకు నచ్చిన సినిమాల" గురించే ఈ బ్లాగ్ లో రాస్తుంటాను అదే టాగ్ తో కానీ ఈ పోస్ట్ కి ఆ టాగ్ పెట్టే ధైర్యం చేయలేకపోయాను ;-)
రిప్లయితొలగించండిఅవునండి RGV's first 3D movie.
"అస్తమానం చీకట్లో నడుస్తూ భయపడకపోతే లైటేస్కు చావచ్చుగా లాంటి ప్రశ్నలు మనం అడక్కూడదు."
రిప్లయితొలగించండిహి హి హి... నేను చాలా దెయ్యం సినిమాలకి ఇలాగే అనుకునేదాన్ని...
మీరు చెప్పిన స్టొరీ లైన్ ప్రకారం... దీనికి RGVదే మరో దెయ్యం సినిమాకి (వాస్తుశాస్త్ర అనుకుంట!) పెద్ద తేడా లేదనిపిస్తుంది...
RGV తీసే ప్రతి దెయ్యం సినిమాలోనూ ఇవే పాత్రలు కామన్... ఒక ఫ్యామిలీ, పని మనిషి!!
3D అన్నది తప్పితే మిగిలినదంతా కామన్ గా అనిపిస్తుంది!!
>>>>>>అస్తమానం చీకట్లో నడుస్తూ భయపడకపోతే లైటేస్కు చావచ్చుగా లాంటి ప్రశ్నలు మనం అడక్కూడదు.
రిప్లయితొలగించండి:)))))
లైట్లేసుకుంటే భయమేసి చావదుగా!!!
ఏమిటిది చీకటి అభిమానులై ఉండి ఇలా చీకటి అభిమానుల మనోభావాలు దేబ్బతీయోచ్చా ? తొక్కలో భయం కాసేపుంటే అదే పోతుంది లేక పొతే మనమే పోతాం , అంతోటి దానికి లైట్ వేసుకోవటం ఏమిటి ? :P
రిప్లయితొలగించండిహహహ చైతన్య గారు థాంక్స్:-) దెయ్యాల సిన్మాలన్నిటికి టిపికల్ గా ఒకే స్కెలిటెన్ ఉంటుంది కదండీ, ఏవో కొన్ని పైపై మార్పులే ఎవరు చేసినా. వాస్తు శాస్త్రకి ఈ సినిమాకి కొంచెం తేడా ఉంది. ఇందులో ముఖ్యంగా దేవుడు, క్షుద్ర పూజలు గట్రా టచ్ చేయలేదు.
రిప్లయితొలగించండినిజమే శిశిర గారు భయమేయదు కదా అందుకే లైటేస్కోకూడదు :-) కానీ అవును లో రవిబాబు పట్టపగలే భయపెట్టాడులెండి. థాంక్స్ ఫర్ ద కామెంట్.
శ్యావ్య బాచెప్పారు థాంక్స్ :-) అంటే దాన్నే ముందరికాళ్ళకు బంధాలెయ్యడం అంటారనమాట మనలాంటి చీకటి అభిమానులని ఇతరులు ఈ ప్రశ్నవేసే ఆవకాశమివ్వకుండా మనమే వేసేస్కోడం :-)
వేణూగారూ,కధచూస్తే మఱ్ఱిచెట్టు కధలాగే అనిపిస్తుంది.ఐనాసరే నేనసలే అవునులో హీరోయిను,అత్తగారు టైపు!భయపడుతూనే హారర్ సినిమాలు చూసేస్తాను:)
రిప్లయితొలగించండిహహహ పరిమళం గారు థ్యాంక్స్.. అలాగే చూసేయండి :)
రిప్లయితొలగించండిజగన్మోహిని (పాతదండీ) సినిమా చూసే జడుసుకున్నదాన్నండీ బాబు.. ఇక ఈయన తీసిన సినిమాలేం చూస్తాను? కాని దెయ్యాల సినిమాలంటే బోల్డంత ఇంటరెస్ట్ ఉంది. "దెయ్యం" చూద్దామని 10 నిముషాలు ఓపిక పట్టి ఘాట్టిగా కళ్ళు మూసుకొని శబ్దాలు మాత్రం వింటూ 2, 3 సెకండ్స్ కళ్ళు తెరిచి చూసినందుకు వారం రోజుల వరకు అమ్మ కొంగు వదల్లేదు! మీ పోస్ట్ చదవాలా వద్దా అనుకుంటూ చదివాను. బాగుందండి.. భయం పడేలా కాకుండా చెప్పినందుకు థాంక్స్ :)
రిప్లయితొలగించండి"అస్తమానం చీకట్లో నడుస్తూ భయపడకపోతే లైటేస్కు చావచ్చుగా" హహ్హహహా.. ఇలాటి ఆలోచనలు రావడం సర్వ సాధారణమే కదండీ :D
హహ థాంక్స్ ప్రియగారు :-) జగన్మోహిని, దెయ్యం సినిమాల్లో కనిపించే దెయ్యానికి ఇందులో కనిపించకుండా భయపెట్టే దెయ్యానికి కొంచెం వ్యత్యాసముందండీ.. కాని భయమైతే చూడకుండా ఉండడమే మంచిదిలెండి. ఈ హార్రర్ సినిమాలు చూడ్డం ఓ బాడ్ హాబిట్. తెలిసీ మీరెందుకు చూస్తున్నారని నన్నడక్కండేం, ఇదోరకమైన వ్యసనం అంతే :-)
రిప్లయితొలగించండిఏవిటోనండి, అన్ని దయ్యం సినిమాలూ ఒకే లాగా ఏడుస్తాయి. RGV గారి ఒక దయ్యం సినిమాకీ ఇంకో దయ్యం సినిమాకీ తేడా చెప్పటం కష్టం గా ఉంది! 3Dలో చూస్తే బానే ఉంటుందేమోలెండి!
రిప్లయితొలగించండిథాంక్స్ బిందు గారు, సాధారణంగా దెయ్యాల సినిమాలన్నీ ఒకే ఫార్మాట్ కదండీ అందులోనూ రాము సినిమాల్లో తేడాలు చెప్పడమ్ మరీ కష్టం :) త్రీడీ ఎఫెక్ట్స్ బాగున్నాయ్ కానీ వాటిని భయపెట్టడానికి ఎక్కువగా ఉపయోగించలేదు.
రిప్లయితొలగించండి