చదువుకోసమైతేనేం ఉద్యోగరీత్యా అయితేనేం ఇంటికి దూరంగా చాలా ఏళ్ళపాటు ఊళ్ళుపట్టుకు తిరిగడంవల్ల దేశంలోని వివిధప్రాంతాల వంటలేకాక విదేశీ వంటకాలను సైతం ఫైవ్ స్టార్ రెస్టారెంట్స్ లో రుచిచూడగలిగే అవకాశం నాకు బాగానే దొరికింది. ఆ రుచులను అప్పటికప్పుడు ఆస్వాదించినా కూడా ఏదోతెలియని లోటు, ఒక అసంతృప్తి అలా మిగిలిపోయేది. ఎప్పుడో అవకాశం దొరికి ఇంటికి వచ్చినపుడు అమ్మచేతి వంట తింటే మాత్రం అంతులేని సంతృప్తి కలిగేది. అమ్మచేతి వంటకు ఆకర్షించే అలంకరణలుండవు, అనవసరపు ఆడంబరాల మసాలా దినుసులు ఉండవు, అమ్మప్రేమాప్యాయతలకు తోడుగా అలవాటైన కమ్మదనం కట్టిపడేస్తుంది. అచ్చంగా “ఓనమాలు” సినిమా చూసినపుడు కూడా నాకు అలాగే అనిపించింది. ఓచక్కని తెలుగు సినిమా చూసిన అనుభూతిని కలిగించింది.
ఈసినిమాలో కావాలని కలిపిన కమర్షియల్ అంశాలు లేకపోయినా చక్కని పల్లెవాతావరణాన్ని ప్రతిభింభిస్తూ నేటి వాస్తవాలను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. చిత్ర కథాంశం కూడా ఇదే, ఎన్నిరుచులు తిన్నా అమ్మచేతి మొదటి ముద్దను మరవద్దనీ ఎంత ఎదిగినా మన మూలాలను గుర్తుంచుకోమని. పల్లెని వదిలి పైపైకి దూసుకు వెళ్ళద్దని చెప్పదు కానీ చెట్టు ఎంత ఎదిగినా వేళ్ళు ఉండేది గాల్లోకాదు నేలలోనే అని గుర్తుంచుకోమంటుంది. మనం ఎంత ఎదిగి ఎన్నిదేశాల అభివృద్దికి తోడ్పడినా మనమూలాలు ఉన్నది మనం పుట్టిపెరిగిన ఊరిలోనే అని మరువకుండా వాళ్ళు మనఊరికి ఏమిచేస్తున్నారు అని ఆలోచించమంటుంది. అమ్మలాంటి మన మాతృభూమిని మర్చిపోకుండా మన సంస్కృతీ వారసత్వాన్ని గుర్తుంచుకుని కనీసం ఏడాదికోసారైనా మనపల్లెకు వచ్చి మనపిల్లలకు ఆ సంపదని అందించాలి పల్లెల ఆనవాలు చెరిగిపోకుండా కాపాడుకోవాలి అని గుర్తుచేస్తుంది.
కథ విషయానికి వస్తే అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కొడుకుదగ్గర నివాసముండే నారాయణరావు మాష్టారు (రాజేంద్రప్రసాద్) తన ఊరు గురించిన జ్ఞాపకాలతో బ్రతుకుతూ చనిపోయేలోపు మళ్ళీ ఒక్కసారి తనఊరు చూసిరావాలని అనుకుంటూ ఉంటారు. అయితే నగర జీవితంలో క్షణం తీరికలేకుండ బ్రతుకుతున్న మాష్టారి కొడుకు ఆయనను ఇవ్వాళా రేపు తీసుకువెళ్తానంటూ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటాడు. ఇలాలాభంలేదని ఒంటరిగా ఇండియా వచ్చేస్తారు నారాయణరావు మాష్టారు. ఎయిర్ పోర్ట్ నుండి తన పల్లెకు వెళ్ళే దారిలో ఊరిగురించి, తన విధ్యార్దుల గురించి, ఊరిప్రజల మధ్యన ఆప్యాయతలను గురించిన అందమైన జ్ఞాపకాలలో ప్రయాణించిన మాష్టారు ఊరు చేరుకునేసరికి అక్కడ పరిస్థితులన్నీ మారిపోయి, అప్పటిమనుషులంతా చెల్లాచెదురై, ఊరు పట్నపు పోకడలకు పూర్తిగా అలవాటుపడలేక పాత పద్దతులను మిగుల్చుకోలేక సతమౌతుండడం చూసి బాధపడతారు. ఎంతో ప్రతిభ ఉన్న తన విధ్యార్ధులు సైతం మారుతున్న విలువలకు తలవంచలేక సరైన ఉపాధిలేక ఇబ్బందులు పడుతుండడం చూసి మనసు విరిగి వారికోసం ఊరుకోసం తనపరిధిలో సాధ్యమైన పరిష్కారం ఏంచేశారనేది ముగింపు.

సినిమాను రాజేంద్రప్రసాద్ తన భుజాలమీద మోశారు. “ఆనలుగురు”, “మీశ్రేయోభిలాషి” సినిమాలలోలా మంచి వ్యక్తిత్వమున్న పాత్రలో ఆధ్యంతం అలరిస్తారు. సున్నితమైన హాస్యంతో నవ్వించినా, బాధతో కన్నీరు పెట్టించినా, విధ్యార్ధులకేకాక ఉరికంతటికీ గురువుగా మార్గదర్శిగా కనపడినా చక్కని నటన కనబరచి ఆకట్టుకుంటారు. కళ్యాణి, చలపతిరావు, గిరిబాబు ఇతరనటీనటీలు తనపరిధిమేరకు తమతమ పాత్రలలో ఒదిగిపోయారు. మీశ్రేయోభిలాషిలో రాజేంద్రప్రసాద్ కి బస్ డ్రైవర్ గా అలరించిన రఘుబాబు ఈ సినిమాలో సైతం రాజేంద్రప్రసాద్ ప్రయాణించే క్యాబ్ డ్రైవర్ “ఎర్రమంజిల్” గా అక్కడక్కడ నవ్వులను చిలకరించారు. మాష్టారి దగ్గర పదవతరగతి చదివే విధ్యార్దులుగా చేసిన బాలనటులు సైతం చక్కగా నటించారు, వీరిమధ్య స్కూల్లో జరిగే కొన్నిసంఘటనలు ఈసినిమా మాటల రచయిత ఖదీర్ బాబు రాసిన దర్గామిట్ట/పోలేరమ్మబండ కథలను గుర్తు చేస్తాయి.
సినిమాటోగ్రాఫర్ హరి అనుమోలు పల్లె అందాలను చక్కని పచ్చదనంతో తెరకెక్కించారు. సినిమా అంతా కూడా కంటికి ఆహ్లాదంగా హాయైన అనుభూతినిచ్చింది. కోటి నేపధ్యసంగీతం సంధర్బోచితంగా ఉంది, పాటలలో పల్లెలో మేలుకొలుపు గురించి సాగే “సూరీడు ఒచ్చిండు సూడయ్యో” హుషారుగా అలరిస్తే, క్లైమాక్స్ లో వచ్చే “పిల్లలూ బాగున్నారా” పాట తన పిల్లలగురించి పడుతున్న పల్లె ఆవేదనను ప్రతిబింబించింది. “అరుదైన సంగతి” భార్యా భర్తలమధ్య అనురాగాన్ని చూపిస్తే “పండుగ అంటే పచ్చదనం పచ్చదనం మా పల్లెధనం” పాట పల్లెల్లోని పండుగ సందడినంతా చూపిస్తుంది. చాలారోజుల తర్వాత ఈసినిమాలోని పాటలన్నీ సీతారామశాస్త్రిగారే రాశారు. ఎడిటింగ్ కానీ కొరియోగ్రఫీకానీ ఇతర విభాగాలేవీ నన్ను ఎక్కడా ఇబ్బందిపెట్టలేదు. ఖదీర్ బాబు ప్రాసకోసం పంచ్ లకోసం ప్రాకులాడకుండా అవసరమైనమేరకు చక్కని సంభాషణలు అందించారు. మాష్టారి పాత్రకు రాసిన కొన్నిమాటలు మనుషులమధ్య ఆప్యాయతల ఆవశ్యకతను, మతసామరస్యాన్ని చూపిస్తే మరికొన్ని మాటలు మారిన ప్రస్తుత విలువలను పరిస్థితులను సూటిగా ఎత్తి చూపిస్తాయి.

సినిమా సగభాగం ఫ్లాష్బాక్ ఎపిసోడ్స్ తో చక్కని గ్రామీణా వాతావరణంలో మనుషులమధ్య ఆప్యాయతలను చూపిస్తూ, రెండవసగం మారిన మనుషులను పరిస్థితులను చూపించే సన్నివేశాలతో రాసుకున్న స్క్రీన్ ప్లే నాకు నచ్చింది. మాష్టారిని ఇండియా తీస్కురాడానికి వీలుదొరకని మాష్టారుగారబ్బాయ్ ఆయన ఒంటరిగా బయల్దేరారని తెలిసాక ఎయిర్ పోర్ట్ లో దిగిన వెంటనే రిసీవ్ చేస్కునేలా కార్ బుక్ చేయడం లాంటి చిన్న చిన్న సన్నివేశాలతో వారు పరిస్థితులకు బంధీలేకానీ వారి బాధ్యతని విస్మరించలేదని చూపిస్తారు. అలాగే కొందరు దంపతులు ఇంటికి వచ్చిన ముఖ్యమైన అతిథులతో సైతం సమయం గడిపే తీరికలేక పనివారికి వదిలేసే నిర్లక్ష్యాన్ని చూపించే సన్నివేశాలు ప్రస్తుతపరిస్థితులకు అద్దంపడతాయి. పరమతసహనం మతసామరస్యం గురించీ, ఈనాటి సెల్ ఫోన్ వాడకం గురించి, మినరల్ వాటర్ వాడకం గురించీ, టీవీ ఛానల్స్ హోరు గురించీ, దారితప్పుతున్న యువత గురించీ, పోస్ట్ మాన్/ఉత్తరాల ప్రస్తుత పరిస్థితి గురించీ, సాటిమనిషిమరణం చూసి కనీస స్పందన కరువైన మనుషుల గురించి చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
రొటీన్ ఫాక్షన్ / ప్రేమ కథా సినిమాలకు భిన్నంగా, నిజాయితీతో ప్రస్తుత పరిస్థితులకు అద్దంపడుతూ, చూసిన ప్రతిఒక్కరినీ ఆలోచింపజేసే ఓ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించిన క్రాంతిమాధవ్ అభినందనీయుడు. తెలుగుదనమున్న మంచి సినిమాలు వైవిధ్యమైన సినిమాలు తెలుగులో రావడంలేదని బాధపడే ప్రతిఒక్కరూ తప్పక చూసి ప్రోత్సహించవలసిన చిత్రం “ఓనమాలు”.
నాకు నచ్చిన కొన్ని మాటలు, చిత్రం చూసే అవకాశమున్నవారు దయచేసి చదవకండి.

“స్కూల్ బస్సులో పడుకున్న పిల్లల్ని ఉద్దేశించి: బళ్ళో ఉపాధ్యాయులు పుస్తకాల మధ్య బాదేస్తారు ఇంట్లో తల్లిదండ్రులు ర్యాంకుల కోసమంటూ ఉతికేస్తారు. ఇంటికీ బస్సుకీ మధ్య ఉండే ఈ గంటే పిల్లలకి రెస్టు, ఇక ఆడుకోడానికి పాడుకోడనికి పిల్లలకి టైమెక్కడుంటుందిసార్, నెమలిపిల్లలు జూలో బతికినట్టే.”
“అసలు మనిషికూడా ఒక పశువేనయ్యా కాకపోతే జ్ఞానం నేర్చుకుని మనిషయ్యాడు, మానవత్వం మర్చిపోయి పశువవుతున్నాడు.”
“కూర్చుని తింటే కొండలైనా కరుగుతయ్యేమో కానీ పెడితే కరగవయ్యా ఆ, పెట్టడం పల్లె సంస్కృతి అదీగాక పెట్టేవాడి చేతిని పరమాత్మ ఎప్పుడూ వదలడంటారు.”
“పొద్దునలేస్తే సవాలక్ష వ్యవహారాల్లో మునిగితేలే మగాళ్ళకి కాస్తంత మురిపెం కావాలి ఎందుకంటే మగాళ్ళుకూడా మీసం వచ్చిన పసిపిల్లలే.”
భార్య: “మొగుడికి పట్టని అందం ఏం అందమండీ?”
భర్త: “భార్య అందాన్ని భర్తప్రత్యేకంగా చూడడు ఆమె అందం అతని మనసులో ఉంటుంది, ఆమె కదిలినా, తిరిగినా, పూలుకోసినా, నీళ్ళుచేదినా, పిల్లాడికి జోలపాడినా ఇలా ప్రతి సంధ్రర్భంలోనూ భార్య భర్తకి అందంగానే కనిపిస్తుంది.”
“మతం అంటేనే మంచి, అది దేవుడి చేతిలో బెత్తం.”
“వాడికి గళ్లచొక్క తీస్కురాకురోయ్ ఆడా చొక్కామీదున్న గడికీ గడికీ మధ్య కూడా తగాదా పెడతాడు.”
“ప్రతి గురువుకీ మూడులక్షణాలుండాలి మంచి కంఠం, మంచి రూపం, మంచి ఆహార్యం.”
“మాష్టారంటే పిల్లలకు సహాయకుడు మాత్రమే, అటువెళ్ళు ఇటువెళ్ళు అని దారిచుపించేవాడు మాత్రమే, నేర్పించేవాళ్ళకన్నా సహాయం చేసే వారే ఉత్తమ ఉపాధ్యాయుడు, నేర్పిస్తే పిల్లలు ఆధారపడిపోడానికి అలవాటుపడతారు, అదేనేర్చుకోడంలో సహాయం చేస్తే స్వతంత్రంగా నిలబడతారు.”
మాష్టారు మరణశయ్యపైనున్న భార్యతో : “రుక్మిణీ నన్ను ఒంటరివాడ్ని చేసి వెళ్ళద్దు, పుస్తకాలు పరీక్షపేపర్లు తప్ప నా అన్నం ఎక్కడుందో నా బట్టలెక్కడున్నాయో తెలియని వాడ్ని నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళకు.”
“పరాయి భాషకి కిరీటం పెట్టడానికి మాతృభాష శిరస్సు ఖండించడం ఎంత పొరపాటు.”
“ఏమోయ్ వాళ్ళింట్లో పదారు రకాల స్వీట్లు మరో పదారు రకాల హాట్లు ఉంటాయ్ మన స్వీట్లు అవసరమా?” "ఎన్నున్నా ఐనవాళ్ళు పెట్టిన స్వీట్ కే తీపెక్కువ, తీపి పంచితే ప్రేమ పెరుగుతుంది.”
“పోయే ముందు కానీ ప్రాణం విలువ తెలియదు.”
“లీగల్ గా చేస్తే స్కీము ఇల్లీగల్ గా చేస్తే స్కాము.”
“అమెరికాలో తాగాలనుకున్నా యజ్ఞం చేసినట్లుగా అందరూ ఇలా కూర్చుని మగ్గులు మగ్గులుగా తాగరు కాలం విలువ కష్టం విలువ తెలిసి పని చేస్తారూ, వీకెండ్లో ఏదో ఒక పెగ్గు పుచ్చుకుంటారు.”
“కుక్కను చంపాలంటే పిచ్చిదని పేరుపెట్టాలి, సాంప్రదాయాన్ని చంపాలంటే ఛాదస్తమని పేరుపెట్టాలి, అంతేకదా? పనైపోయిందికదా అని పాల సీసాను పారేయచ్చు అమ్మని పారేయలేం కదా?”
“నా మిసెస్ మాష్టారూ, తనన్న ప్రతిదానికీ ఓఎస్ అన్నాలి లేదంటే వాయిస్ పెంచుతుంది.”
“పిల్లలు ఏదడిగితే అదివ్వడం కాదమ్మా, వాళ్ళ అవసరాన్ని గుర్తించి ఏది కావాలో అదివ్వాలి.”
“మనిషి ప్రమేయాన్నీ మనిషి ఉపాధినీ అడ్రస్ లేకుండా చేసే టెక్నాలజీని ఒప్పుకోకూడదు.”
“ఈ ఊరంటే నాకు గౌరవం, ఈ ఊరు నేర్పించిన సంస్కారమంటే నాకు గౌరవం, ఊరంటే కొందరు ఉండే సమూహం కాదు, ఊరు ఒక క్వాలిటీ కంట్రోలర్, మన క్యారెక్టర్ కి ఎప్పటికప్పుడు మార్కులేసే ఒక టీచర్, అలాంటి ఊరు ముందు నేను ఫెయిల్ కాలేను.”
“మా తరానికి అడ్వైస్ ఇచ్చే వాళ్ళుకావాలి, వార్నింగ్ ఇచ్చే వాళ్ళు కావాలి అలాంటి ఊరికి మేం వెళ్ళం ఊరు మాదగ్గరికి రాదు ఇట్సె బిగ్ గ్యాప్”
“పాలు ప్యాకెట్లనుంచి వస్తాయని, బియ్యం బస్తాల్లో పండుతాయనీ, కూరగాయలు ఫాక్టరీల్లో తయారవుతాయని నమ్మే హైటెక్ పిల్లలకి మనదేశపు మట్టివాసన గురించి, మన కన్నీటి సువాసన గురించీ తెలియాలంటే అది పల్లెటూళ్ళనుండే నేర్పించాలి.”
రివ్యూ చాలా బాగా రాసావ్ అన్నయ్య .... అమ్మ చేసే వంట అంత కమ్మగా ఉన్న సినిమా గురించి అంతే కమ్మ గా రాసావ్
రిప్లయితొలగించండినువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రస్తుత పరిస్థితులని బాగా దగ్గర గా చూపించినట్టుంది ..నిజమే పళ్ళెటూళ్ళు అటు పల్లె వాతవరం కాకుండా ఇటు పట్టణ వాతావరణం కాకుండా మద్యస్తం గానే ఉన్నాయి
మంచి సినిమా గురించి అద్భుతంగా రాశారండీ..
రిప్లయితొలగించండిఈ సినిమా టీం మొత్తానికీ హ్యాట్సాఫ్...
మంచి ఉద్దేశ్యం తో తీసిన ఈ సినిమా అందరికీ చేరాలి. ఇలాంటి సినిమాలు ఇంకా తీసే ధైర్యం వీరికి మనమే ఇవ్వాలి..
డైలాగ్స్ ఖాదీర్ బాబు గారు కత్తి పెట్టి రాసినట్టున్నారు..
అద్భుతం గా ఉన్నాయ్...
సంభాషణలు అద్భుతంగా ఉన్నాయి వేణూ,సినిమా కూడా నీ సమీక్ష ప్రకారం సూపరన్నమాట.ఈ చెత్త ఫేక్షన్ గొడవలూ,బాదరబందీ లేకుండా ప్రశాంతమా చూడచ్చన్నమాట.సెబాసో తెలుగు సినిమాకి మంచి రోజులొస్తున్నాయన్నమాట.
రిప్లయితొలగించండికాన్సెప్ట్ బాగుంది కానీ ఎగ్సిక్యూషన్ ఫెయిలయిందని నా అభిప్రాయమండి.కథనం చాలా స్లోగా ఉంది. మాస్టారు చెప్పగానే నీళ్ళ వ్యాపారం చేస్తున్న స్టూడెంట్ వ్యాపారం మానేసి, తాగుడు కూడా మానేయటం అంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు.రాజేంద్ర ప్రసాద్ పాత్ర ద్వారా మంచి చెప్పడానికి ప్రయత్నించారు కానీ ఆ నీతిని నాటకీయంగా మనస్సుకు హత్తుకునేలా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యారు. ఒక పాత్ర ద్వారా ఏదో స్పీచ్ ఇస్తున్నట్లు నీతులు చెబితే జనం వినే రోజులు కావివి. ఓవరాల్‌గా చెప్పాలంటే కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ట్రెయిలరే బెటర్ అనిపించింది. ఖదిర్ బాబు గారి సంభాషణలు బావున్నాయి.కోటి నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్రధాన బలం. సామన్యమైన సన్నివేశాలను కూడా తన సంగీతంతో ఎలివేట్‌చేశారు
రిప్లయితొలగించండిసినిమా చూసి ఇన్ని సంభాషణలు గుర్తుపెట్టుకున్నందుకు మీకు హాట్స్ అఫ్ వేణు గారూ. ఈ సమీక్ష మనసుతో వ్రాసినట్లున్నారు, మీ అనుభూతి తెలుస్తోంది. ఈ సినిమా కోసం చాలా ఎదురుచూస్తున్నాం. థాంక్యు.
రిప్లయితొలగించండిఅసలు ఈ సినిమా పేరు కూడా వినలేదు ఇంతకముందు. మీరు వ్రాసిన ఈ టపా చదువుతుంటే తప్పకుండా చూడాలి అనిపించేలా ఉంది. ఆ సంభాషణలు చాలా బాగున్నాయి. ఇంతలా గుర్తుపెట్టుకున్న మీ జ్ఞాపక శక్తి అద్భుతం.
రిప్లయితొలగించండిమంచి రివ్యూ. ఈ సినిమాకి సంభాషణలు మన ఖదీర్ బాబు గారు అందించారు. ఇదే అతని మొదటి సినిమా.
రిప్లయితొలగించండివేణు గారు రివ్యూ బావుంది !
రిప్లయితొలగించండిమీరు ఏకసంథాగ్రాహి మాష్టారు.....రివ్యూ లో ఫీల్ ఉంది.
రిప్లయితొలగించండిథ్యాంక్స్ చెల్లాయ్, అవును వాస్తవాలను కళ్ళకుకట్టడానికి ప్రయత్నంచేశారు.
రిప్లయితొలగించండిరాజ్ నెనర్లు, నిజమే సినిమా ఇంకా బాగా ఆడితే బాగుంటుంది.
“నాసమీక్ష ప్రకారం” కరెక్ట్ పప్పుసారు, ఓవరాల్ సినిమాగా ఎంటర్ టైన్మెంట్ విషయంలో కొన్ని మార్కులు తగ్గినా ఇచ్చిన మెసేజ్ కోసం, బలమైన సన్నివేశాలకోసం మాటలకోసం ప్రతిఒక్కరు ఒక్కసారైనా చూడాల్సిన చిత్రం. వ్యాఖ్యానించినందుకు నెనర్లు.
శ్రీకాంత్ గారు విపులంగా వ్యాఖ్యానించినందుకు నెనర్లు. నిజమేనండీ నెరేషన్ కొంచెం స్లో అయినమాట వాస్తవమే, అలాగే మంచిమాటలు చెప్తే వినే రోజులు కావివి కానీ పూర్తిగా రూపాంతరం చెందని పల్లెలో అందరూ గౌరవించే మాష్టారు చెప్పిన మాటలు అతన్ని ప్రభావితమ్ చేశాయని మనం సర్ధుకుపోవాలని దర్శకుని ఉద్దేశ్యమనుకోడమే.
జ్యోతీర్మయి గారు ధన్యవాదాలండీ, తప్పక చూడండి కానీ ఏ అంచనాలు లేకుండా చూడండి.
రసజ్ఞ గారు నెనర్లు, ఈటపా ఉద్దేశ్యమే అదండీ మంచి సినిమాని ప్రోత్సహించడం.
శ్రీగారు నెనర్లు, తెలుసండీ నేనీసినిమాకోసం ఎదురుచూడడానికి గల కారణాలలో ఆయన ఒకరు.
శ్రావ్య ధన్యవాదాలు.
శేఖర్ ధన్యవాదాలు.
సందేశాత్మక చిత్రాలు తీసేటప్పుడు కధలో పట్టుత్వం, కధాగమనంలో విజ్నతను చూపాలి. దేశానికి పట్టుకొమ్మలు పల్లేసీమలనే విషయం ప్రధానంశం. కాని, కన్నకొడుకును పరాయిదేశంలో కొలువుకు పంపిన నారాయణరావ్ ఆరాటంలో ఆర్భాటం తప్ప వాస్తవంలేదు. ఉత్తమ ఊపాధ్యాయుడు కార్యసాధకుడుగా మారి విద్యార్ధులను తన ఆశయానికి అనుగుణంగా తీర్చి దిద్దాలి. పల్లెను కాని పట్నాన్నికాని అభివృద్ధి చెయ్యడంలో సమిష్టి,సమైక్యత తప్పని సరి. భార్య విగత జీవిగా మారితే పల్లె ప్రగతిని మరచి ఆమెరిక వెళ్ళడం చిన్నగీతను చూపించే తపనలో పెద్ద గీత గీసినట్లుగావుంది. నిజానికి, ఒంటరి జీవనంలో తన వంతు సహకారాన్ని అందించవచ్చు. మానసికానందంతో మనిషి బతకాలి కాని, శారీరక అనుభందంతో కొడుకు దగ్గర చిన్ననాటి జ్నాపకాలను నెమరువేసుకుంటూ, సమాజంలో వచ్చిన పెనుమార్పులతో బేరీజు వేసుకోవడం ఏమంత సమంజసం? మొత్తానికి సినిమా ఊరిదో దారి, ఉలిపికట్టేదో దారి అనే రీతిలో పట్టుతప్పింది.
రిప్లయితొలగించండిశివరామకృష్ణ గారు, the tree గారు ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండి