అనగనగనగా ఓ నెల్లూరు.. ఆ ఊర్లో కూరగాయల మార్కెట్ లో ఓ డిటెక్టివ్ ఏజెన్సీ "FBI". అదేంది అది అమెరికాలో కదా ఉండేది ? అంటారా.. వాళ్ళే వీళ్ళ ఏజెన్సీని చూసి పెట్టుకున్నారుట సార్ మీకు తెలీక పోతే ఆత్రేయని అడగండి వివరంగా చెప్తాడు. అంతెందుకు ఓ రెండేళ్ళ తర్వాత అమెరికా వెళ్ళి FBI అంటే "FBI నా అది నెల్లూర్లోగదా ఉండేది" అని అడుగుతారుట తెలుసా..
అయినా కూరగాయల మార్కెట్ లో డిటెక్టివ్ ఏజెన్సీ ఏంటీ ? అంటారా అసలిలాంటి ఏజెన్సీలు ఇలాగే ఇలాంటి షాపుల్లోనే పెట్టాలిట.. మీకు తెలుసా.. ఇలా పెట్టడమే కాదు ఏదైనా కేస్ పనిమీద బైటకెళ్ళేప్పుడు షట్టర్ క్లోజ్ చేయకుండా లైట్స్ తీసేయకుండా ఎక్కడివక్కడ వదిలేసి.. ఆ వచ్చింది ఎలాంటి కేస్ అయినా సరే కొంపలు అంటుకుపోతున్నట్లు పరిగెట్టాలిట..
ఇంకో విషయమండోయ్ ఎంత అర్జెంట్ కేస్ అయినా కూడా కార్ లో ఉన్నపుడు డిస్కస్ చేయకూడదు డ్రైవింగ్ లో ఓన్లీ పొద్దున్న తిన్న పులిబొంగరాల గురించో రాత్రి చూసిన సినిమాల గురించో మాట్లాడుకోవాలిట. కార్ దిగాక అప్పుడు మళ్ళీ ఈ టాపిక్స్ నుండి జంప్ చేసి కేస్ గురించి మాట్లాడుకోవాలిట.
ఇంకా అసలు డిటెక్టివ్ అంటే ఎలా ఉండాలో తెలుసా ఓ హ్యాటు, షెర్లాక్ హోమ్స్ కోటు, వీటన్నిటికన్నా ముఖ్యంగా చేతిలో స్టార్ బక్స్ కాఫీ కప్పు. నెల్లూర్ లో స్టార్ బక్స్ ఏందీ అంటారా.. FBI ఉండగా లేంది స్టార్ బక్స్ కప్ ఉండదా ఏందీ మీరు మరీనూ..
అన్నట్లు వీటితో పాటు మనం ఇంటెలిజెంట్ గా కేస్ గురించి అనాలిసిస్ గట్రా చెప్పినపుడు ప్రతి చిన్న విషయానికి బాస్ మీరు జీనియస్ బాస్ అని మెరిసే కళ్ళతో మెచ్చుకునే ఒక సూపర్ క్యూట్ లేడీ అసిస్టెంట్ ఖచ్చితంగా ఉండాలి. అసలిన్నెందుకండీ ఓసారి మీరు మా "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" గారిని కలిస్తే ఇలాంటి విషయాలు మీకు బోలెడు చెప్తాడు.
ఏంటయ్యా నీ గోల ఇదంతా చూస్తే ఏదో కామెడీ పీస్ లా ఉన్నాడే మీ డిటెక్టివ్ అని అనుకుంటున్నారా.. నేనూ మొదట్లో అలాగే అనుకున్నానండీ కానీ మా డిటెక్టివ్ గారు బిల్డప్ విషయంలో కాస్త కామెడీగా కనిపించినా అపరాధ పరిశోధనలో మాత్రం నిజంగానే టూ ఇంటెలిజెంట్ అండీ.
మరి అలాంటి డిటెక్టివ్ గారి కాలికి అనుకోకుండా ఓ చిన్న తీగె తగిలిందండీ అపరాధ పరిశోధనలో అరవీర భయంకరులైన డిటెక్టివ్ గారు కదండీ ఆ తీగె ఏంటా అని చూసేంతలో అదే ఉరితాడై మెడకి బిగుసుకున్నంత పనైంది పాపం. ఐనాకానీ ఎలాగోలా దాన్నుండి తప్పించుకుని ఎలా ఆ తీగె లాగి డొంకంతా కదిలించేశారో నేనిక్కడ చెప్పడం కంటే మీరు "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" సినిమా చూసి తెలుసుకుంటే చాలా బావుంటుంది.
సినిమా రిలీజై చాలా రోజులవుతుంది కదా అంటారా.. నాకూ ఇపుడే కుదిరిందండీ చూడడం ఏం పర్లేదు మీరు ఇంకా చూసుండకపోతే వెంటనే అమెజాన్ ప్రైమ్ లో చూసేయండి. లేదా తొందర్లో టీవీలో వచ్చినపుడైనా మిస్సవ్వద్దు. ఈలోగా ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ చూడండి ఇది చూసి మీకు నవ్వు రాక పోయినా, సినిమాలో డీల్ చేసిన కేస్ విషయమై ఆసక్తి కలగక పోయినా సినిమా చూడక్కర్లేదు..
కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీస్కున్నా కానీ బిగి సడలని కథనం అండ్ సస్పెన్స్ ఎలిమెంట్ మిమ్మల్ని వాటిని గురించి ఆలోచించనివ్వదు. ఇక నవీన్ పొలిశెట్టి నటన, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ వెరీ ఇంప్రెస్సివ్ తెలుగు తెరకు మరో ప్రామిసింగ్ నటుడు దొరికాడని సంబరపడచ్చు. బుక్స్ అమ్మే సీన్లో డైలాగ్ డెలివరి హిలేరియస్లీ అమేజింగ్. తనకి సరి జోడు "శృతి శర్మ". ఏజెంట్ కి అసిస్టెంట్ గా తన అమాయకమైన క్యూట్ ఫేస్ తో చాలా ఆకట్టుకుంటుంది.
సినిమాలో కథ, స్వరూప్ దర్శకత్వం, స్వరూప్ అండ్ నవీన్ కలిసి అందించిన కథనంతో పాటు చెప్పుకోవలసిన మరో ముఖ్యమైన విషయం "మార్క్ కె రాబిన్" నేపథ్య సంగీతం. సినిమా థీమ్ కు సరిగ్గా సరిపోయేలా ఎక్కడా మనని ప్రత్యేకించి నోటీస్ చేయనివ్వకుండా సన్నివేశాలని మాత్రం ఎలివేట్ చేస్తూ చాలా చక్కని మ్యూజిక్ అందించాడతను. అలాగే సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ కూడా బావుంది.
మళ్ళీ రావా లాంటి మంచి సినిమాని అందించిన స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ అందించిన మరో మంచి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఈమధ్య వస్తున్న సినిమాలు చూస్తుంటే తెలుగు సినిమాకి మంచి రోజులొచ్చాయి అనిపిస్తుంది. రొటీన్ ప్రేమ కథలు యాక్షన్ మాస్ మసాలాలు మొహం మొత్తి వైవిధ్యమైన సినిమాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు మిస్సవకుండా చూడవలసిన సినిమా "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ".
ఈ మధ్య కాలం లో వచ్చిన మూవీస్ లో..ఇదీ, బ్రోచేవారెవరురా చాలా బావున్నాయి..నైస్ ఆర్టికల్ వేణూజి..
రిప్లయితొలగించండిఅవును శాంతి గారు ఆ సినిమా నాక్కూడా నచ్చింది.. దాని గురించి కూడా రాయాలి వీలు చూస్కుని.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ అండీ..
తొలగించండి2 సార్లు :)
రిప్లయితొలగించండిహహహ ఒక్క ముక్కలో సూపర్ రివ్యూ రాసేశావ్ గా రాజ్ :-) థాంక్స్ ఫర్ ద కామెంట్..
తొలగించండిచాలా రోజుల తరవాత దర్శనం. మీతో రాయించేడు కాబట్టి, తప్పక చూస్తాను.
రిప్లయితొలగించండిమంచి సినిమా అండీ తప్పక చూడండి.. థాంక్స్ ఫర్ ద కామెంట్ సుజాత గారు..
తొలగించండి
రిప్లయితొలగించండిమంచి సినిమా యిదండీ
కొంచెము కామెడి జతన్ పకోడి జిలేబీల్
పంచెడు హీరోయిన్నూ
మించారు డిటెక్షను తధిమితకట మ్యూజిక్ :)
జిలేబి
బావుంది జిలేబి గారు :-)
తొలగించండిబాగుంది
రిప్లయితొలగించండిథాంక్స్ రేఖా జితేంద్ర గారు..
తొలగించండిSaaho gurinchi em review rasaro chuddamani vasthe ee movie review kanipinchindi..ventane chusesa...nice movie and nice review too.
రిప్లయితొలగించండిథాంక్స్ ప్రియ గారూ.. సాహో ఒక యాక్షన్ థ్రిల్లర్ అండీ.. ఆ జెనర్ ఇష్టమైతే తెలుగు సినిమాలో హాలీఉడ్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ విజువల్స్ కోసం ఒక సారి చూడవచ్చు. కాకపోతే ఇట్ నీడ్స్ యువర్ అటెన్షన్ అండ్ పేషన్స్ చివరి వరకూ డాట్స్ కనెక్ట్ చేస్కోడానికి వెయిట్ చేయాలి.
తొలగించండి