బుధవారం, డిసెంబర్ 15, 2010

చిత్రమాలిక లో నేను..

పదేళ్ళ క్రితం నేను అమెరికాలో మొదటిసారి కాలుపెట్టినపుడు ఎదుర్కొన్న ప్రధమ సమస్య భాష. భాష అనేకన్నా యాస అనడం సబబేమో. పదోతరగతి వరకు తెలుగుమీడియంలో చదువుకున్న నాకు నాఇంగ్లీష్ నాలెడ్జే అంతంత మాత్రం, ఇక అమెరికన్ యాక్సెంట్ అర్ధం చేసుకోడానికి నానా కష్టాలు పడి ఒళ్ళు చెవులు సర్వం  రిక్కించి విని ఆ మాటలు మనసులో ప్రాసెస్ చేసుకుని అర్ధంచేసుకోవాల్సి వచ్చేది. ఇక అమెరికన్ల సంగతికొస్తే నేను మాట్లాడటం దేవుడెరుగు కనీసం తలాడించినా అర్ధమయ్యేది కాదు “అవుననా కాదనా దాని అర్ధమేమిటి” అని మళ్ళీ మళ్ళీ అడిగేవాళ్ళు. వీటన్నిటినీ అధిగమించడానికి నేను ఎన్నుకున్న మార్గం టివిలొ వచ్చే అమెరికన్ సినిమాలు.

అక్కడ టివీలో క్లోస్డ్ క్యాప్షన్స్ (సబ్ టైటిల్స్) పెట్టుకుని వచ్చే ప్రతి అడ్డమైన సినిమాలు చూసేవాడిని. మనకి భాష + మ్యానరిజమ్స్ తెలియాలి కనుక సంభాషణలున్న సినిమాలు చూస్తుంటే "ఊరక మాట్లాడుకుంటుంటే ఏం చూస్తావ్ ఒక్క యాక్షన్ సీన్ లేకుండా" అంటూ మా రూంమేట్స్ అసహనానికి గురయ్యేవారు. వాళ్ళగోల భరించలేక రాత్రిళ్ళు జాగారం చేసిన రోజులు ఎన్నో. అలాంటి రోజుల్లో చూసిన సినిమానే 12 Angry Men అసలే థ్రిల్లర్స్ అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉన్ననాకు ఈ సినిమా చాలా చాలా నచ్చేసింది. ఎంతగా అంటే తర్వాత రోజుల్లో దదాపు రెండునెలలకోసారి చూసేటంత. ఈ సినిమా పై నేను రాసిన పరిచయ వ్యాసం చిత్రమాలిక లో చదవండి...

2 కామెంట్‌లు:

  1. హ్మ్! మీకు కూడా సేం ప్రాబ్లమా! ఇక్కడా మొదట్లో నాది అదె పరిస్థితి.చందుకి ఈ యాస బాగ వచ్చు కాబట్టి సరిపోయింది..లెకపోతే ఎన్ని తిప్పలో! వాళ్లు మాట్లడేది నాకు అర్ధం కాదు..నేను మాట్లడేది వాళ్ళకి అర్ధం కాదు :p మీలాగె నేను తెగ చూస్తున్నా ఇంగ్లీషు సినిమాలు...మీ రివ్యు కొద్దిగనే చదివా....మిగితాది ఈ సినిమా చూసి చదువుతా :)

    రిప్లయితొలగించండి
  2. ఇందుగారు నెనర్లు. అవునండి మొదట్లో కాస్త కష్టపడేవాడ్ని టివి రామాయణ్ చూసి హిందీ నేర్చుకున్న అనుభవం ఈ ఐడియా ఇచ్చింది. శుభం మీరూ ఇదే ఫాలో అవుతున్నారా ఇంకేంటి మీరు కూడా ప్రావీణ్యం సంపాదించేస్తారు.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.