సోమవారం, డిసెంబర్ 06, 2010

నెనర్లు.. ధన్యవాదాలు.. త్యాంకులు..

ఈరోజు (డిశంబర్ ఆరు) నా పుట్టిన రోజు సంధర్బంగా బ్లాగులలో టపాల ద్వారా, కామెంట్ల ద్వారా, బజ్ లోనూ, లేఖలలోనూ నాకు శుభాకాంక్షలు తెలియజేసిన మిత్రులందరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సంధర్బంగా గతంలో గుర్తుచేసుకున్న నా పుట్టినరోజు ఙ్ఞాపకాలు ఇక్కడ చూడవచ్చు.

 
నాకు ఇష్టమైన "పుదీనా జంతికలు" చేసిపెట్టిన సృజనగారికి, తనెవరో నేను పేరుచెప్పను మీరే కనిపెట్టండి అంటూ నాకు అభావకుడు అని పేరు తగిలించి దేశమంతా బ్లాక్ డే జరుపుకునే ఈరోజున మా నరసరావుపేట రాష్ట్రానికి మాత్రం శ్వేతదినంగా ప్రకటించి తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్పిన "గీతాచార్యగారికి", తన బ్లాగ్ లో నాకు ఇష్టమైన కృష్ణుని బొమ్మతోపాటు చక్కని మెసేజ్ మరియూ బజ్ లో ఓ అల్లరి మల్లిక్ కార్టూన్ తో మరిచిపోలేని విషెస్ అందించిన "మంచుగారికీ", వైవిధ్యమైన తనశైలిలో ఇంటిల్లిపాదితో కలిసి  శుభాకాంక్షలు చెబుతూనే పెద్దన్నయ్యలా నాకు కర్తవ్యబోధ చేసిన "భాస్కర రామరాజు గారికి" ప్రత్యేకమైన ధన్యవాదాలు. You all made my day and Thanks a lot for making me feel so special on this day.


ఇంత మంచి కుటుంబాన్నీ, స్నేహితులను నాకు ఇచ్చినందుకు, ఇంతటి ప్రేమాభిమానాలు నా సొంతం చేసినందుకు ఆ దేవుడికి, ఈబ్లాగులోకానికీ, మీ అందరి మంచి మనసులకు మరోసారి ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను. 

ఈ సంధర్బంగా సంకలినులలో టపాలు లేదా కామెంట్స్ వలన ఎవరికైనా అసౌకర్యం కలిగిఉంటే మన్నించగలరు. 

17 కామెంట్‌లు:

 1. వేణు శ్రీకాంత్ ,
  జన్మదిన శుభాకాంక్షలు .

  రిప్లయితొలగించండి
 2. వేణు శ్రీకాంత్ గారికి ,
  జన్మదిన శుభాకాంక్షలు
  పద్మవల్లి

  రిప్లయితొలగించండి
 3. పుట్టిన రోజు సందర్భంగా ఓ చిన్న పద్యసుమం. శుభాకాంక్షలతోబాటు. స్వీకరించండి.

  కం||
  కమ్మని మాటలమూటల
  ఝుమ్మను తుమ్మెద తలపులఁ జతురోక్తులతో
  మమ్ముల మురిపించెదవుగ!
  కొమ్మిదె పద్యకుసుమమ్ముఁ గూర్మినిఁ వేణూ!

  రిప్లయితొలగించండి
 4. ఓహ్! వేణుగారు..నాకు తెలీదండీ ఇవాళ మీ బర్త్ డే అని. మీకు జన్మదిన శుభాకాంక్షలు...మీరు ఇలాగే ఎప్పుడూ చిరునవ్వుతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా :)

  రిప్లయితొలగించండి
 5. వేణూ శ్రీకాంత్ గారు మీకు యాపీ యాపీ బర్త్ డే.పొద్దుటినుంచి అన్ని చోట్లా మీకు విషెష్ చెప్పిచెప్పీ అలిసి పోయాను. ఇలా అన్ని బ్లాగుల్లో చెప్పించుకోటమేనా, మాకు ఏమైనా ఇంత స్వీట్ ముక్కైనా ఇచ్చేదుందాలేదా. ఇది మహేష్ బాబు డైలాగ్ అన్నమాట...ఓ డబ్బాలు డబ్బాలు ఉప్మా తినేయటమే గాని నాకేమన్న పెట్టేదుందాలేదా అని అడుగుతాడె...ఆ స్టైల్ లో చదువుకో ప్రార్ధన.... .

  రిప్లయితొలగించండి
 6. జన్మదిన శుభాకాంక్షలు వేణూ శ్రీకాంత్ గారు.

  రిప్లయితొలగించండి
 7. Oh, you are born on the day Mahaanati Savithri was born. K V Mahadevan was also born today.

  So,
  Congratulations and Happy Birthday.


  My name is madhuri.

  రిప్లయితొలగించండి
 8. మాలా కుమార్ గారు, దుర్గేశ్వర గారు, పద్మవల్లి గారు, ఇందుగారు, శిశిర గారు నెనర్లు.

  రవి గారు నెనర్లు, పద్యం చాలా బాగుందండి, చాలా సంతోషించాను మీ పద్యం చూసి మా వాళ్ళందరికీ చూపించి చాలా సంబరపడిపోయాను.

  జయగారు నెనర్లు హ హ మీ డైలాగ్ బాగుందండి నేను అదే స్టైల్లో చదువుకున్నాను. ప్రతిచోట విషెస్ అందచేసిన మీ అందరిని చూసి చాలా సంతోషించానండి. స్వీటు బాకీ పద్దురాసుకోండి :-) తీర్చుకునే అవకాశం వస్తుందనే ఆశిస్తాను. లేదంటే దగ్గర్లోని స్వీట్ షాప్ లో నచ్చినవి కొనుక్కుని బిల్ నాకు పంపించినా సరె :-)

  మాధురిగారు నెనర్లు నాకూ ఈ సంవత్సరమే శిరాకదంబం రావుగారి పుణ్యమా అని తెలిసిందండి మహదేవన్ గారు సావిత్రిగారు కూడా డిశంబర్ 6 నే పుట్టారు అని.

  రిప్లయితొలగించండి
 9. చా...లా... ఆలస్యంగా, శుభాకాంక్షలండీ..

  రిప్లయితొలగించండి
 10. చా....లా.... ఆలస్యంగా, శుభాకాంక్షలండీ..

  మహదేవన్ గారు, సావిత్రిగారు,మీరు డిశంబర్ 6 నే పుట్టారు అని ఇప్పుడే తెలుసుకున్నాను.

  రిప్లయితొలగించండి
 11. ఇంత ఇంపార్టెంట్ పోస్ట్ ఎలా మిస్సయ్యాను ... సారీ సార్ ...లేట్ గా చెబుతున్నాను wishes ...... మీరు ఇలాగే ఎప్పుడూ smiley గా happy happy గా ఉండాలని :) మీ birth day సంధర్బం గా మీరు కోరుకునే మంచి గిఫ్ట్ మీకు ఇవ్వాలని దేవుడుని నేను కోరుకుంటున్నా

  రిప్లయితొలగించండి
 12. మురళి గారు, ఊకదంపుడు గారు నెనర్లు చాలా ఆలశ్యమేమి అవలేదండి :)

  శివరంజని గారు నెనర్లు, సారి అంత అవసరంలేదండి, మీ విషెస్ బాగున్నాయ్.

  రిప్లయితొలగించండి
 13. లేటుగాచెప్పినా లేటెస్టుగా చెబుతున్నాననుకోండి... ఎమీ అనుకోకండి...జన్మదిన శుభాకాంక్షలండి

  రిప్లయితొలగించండి
 14. వేణు గారు, చాలా ఆలస్యంగా మీ టపా చూస్తున్నాను...వెరీ సారి అండీ...
  చాలా..చాలా ...ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలండీ...

  రిప్లయితొలగించండి
 15. స్నిగ్దగారు నెనర్లు. సారీ ఎందుకండి, అయినా మీరు వచ్చే పుట్టిన రోజుకు చాలా ఎర్లీగా విషెస్ చెప్పేశారు అందుకు ధన్యవాదాలు :-D

  రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.