శుక్రవారం, జనవరి 22, 2010

అపుడే ఏడాదైందా !! ఇంకా ఏడాదేనా !!



సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు 22 జనవరి 2009, మమ్మల్ని అందరిని ఒంటరి వాళ్ళను చేసి అప్పటి వరకూ కొండంత అండగా ఉన్న మా అమ్మ తిరిగి రాని లోకాలకు పయనమయింది. ఈ ఏడాది కాలంలో మేము వేసే ప్రతి అడుగులోనూ తను లేని లోటు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా తన ఆశీస్సులు అనుక్షణం మా వెంట ఉన్నాయన్న నమ్మకం మమ్మల్ని వెన్నుతట్టి ముందుకు నడిపించింది.

గడిచిన ఏడాది గురించి ఓ క్షణం ఆలోచిస్తే "తను మమ్మల్ని వదిలి వెళ్ళి అపుడే ఏడాదైందా నిన్న మొన్ననే మామథ్య తిరిగినట్లు తన  ఙ్ఞాపకాలు సజీవంగా ఉన్నాయే" అనిపిస్తుంది. మరోక్షణం తను లేని లోటు, తన తోడు లేకుండా మేము భారంగా వేసిన అడుగులు, గడిపిన రోజులు గుర్తొస్తే ఇంకా ఒక ఏడాదేనా గడిచింది ఇంకా మరెన్ని రోజులు గడపాలో కదా అని కూడా అనిపిస్తుంది. 

గత వారం రోజులుగా తన ప్రధమ వర్దంతికి ఏర్పాట్లు చేస్తుంటే, ప్రతినిముషం తను ఉంటే ఎటువంటి ఫంక్షన్ కైనా శ్రీకృష్ణుడి సారధ్యంలా హాల్ లో సోఫాలో నిండుగా కదలకుండా కూర్చునే అన్నిపనులు ఎలా ప్లాన్ చేసి నడిపిస్తుంది, తనులేని లోటు ఎంతగా ఉంది అనే ఆలోచనలతో మనసు భారమౌతుంటే, గుండె కరిగి కన్నీటి వరదై ముందుకు ఉరుకుతుంది. సంవత్సరీకం గురించి చెప్పడానికి అమ్మ వాళ్ళ ఆఫీసుకి వెళ్ళిన మా నాన్న గారితో  "మేడమ్ గారు నీతి నిజాయితీలతో ఒక్క పైసా కూడా తీసుకోకుండా నాలుగేళ్ళలో ఎంతోమందికి ఉద్యోగాలిప్పించి అన్నం పెట్టింది సార్, ఆవిడ్ని మేం ఎలా మర్చిపోతాం" అని వాళ్ళంతా ఏక కంఠంతో అనడం వింటుంటే గర్వంతో అదే కన్నీరు ఆనందభాష్పాలుగా మారిపోతుంది.

అమ్మా, నీవెక్కడ ఉన్నా నీ ఆత్మకు సుఖ శాంతులు చేకూరాలనీ,
నీ చల్లని దీవెనలు సదా మా వెన్నంటే ఉండాలనీ కోరుకుంటూ..
నీ ఙ్ఞాపకాలలో, నువు పంచిన ఆత్మీయత లో..
నీ కోసం వెతుకుతూ మేము....

గత ఏడాది నేను అమ్మకు సమర్పించిన అశృనివాళి ఇక్కడ నొక్కి చూడండి.

29 కామెంట్‌లు:

  1. వేణు శ్రీకాంత్ గారు: తల్లి తండ్రులు లేని లోటు ఎవరు ఎన్ని చెప్పినా తీరేది కాదు. మీ అమ్మ గారి ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిద్దాము.

    రిప్లయితొలగించండి
  2. మీ అమ్మగారు మీ జ్ఞాపకాలల్లో ఎప్పుడూ జీవించే ఉంటారు..వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ...

    రిప్లయితొలగించండి
  3. మీ అమ్మ గారి ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటూ...

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. మీ అమ్మగారి దీవెనలు మీ వెంటే ఉంటాయి.. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ...

    రిప్లయితొలగించండి
  6. మీరు పెట్టిన టైటిలే కదిలించేలా ఉంది. ఎవరెన్ని చెప్పినా అమ్మ లేని లోటు తీరేది కాదు.

    మీ బాధను పంచుకోవడం తప్ప ఇంకేమీ చేయలేం!

    రిప్లయితొలగించండి
  7. శ్రీకాంత్ గారు బాధపడకండి
    అమ్మలేని లోటును దేవుడు కూదా పూడ్చలేడు.
    మీ అమ్మగారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను

    రిప్లయితొలగించండి
  8. మీ అమ్మగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ .....

    రిప్లయితొలగించండి
  9. శ్రీకాంత్ గారు, అమ్మ లేని లోటు తీర్చగలిగింది కాదు. అయినా ఆమె జ్ఞాపకాలు కొంతైనా మీకు ఆ లోటును తీర్చాలని ఆశిస్తూ...

    రిప్లయితొలగించండి
  10. వేణూ,అమ్మగారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ..

    రిప్లయితొలగించండి
  11. మీ పాత టపా చదివాను. మీ బాధ ని అర్ధం చేసుకుంటున్నాను. మీ అమ్మగారికి మీరిచ్చిన నివాళి చాలా బాధ కలిగించింది. అమ్మని మించిన దైవం లేదు. అమ్మ లేని లోటు తీర్చలేనిది. Im sorry.

    రిప్లయితొలగించండి
  12. మీ అమ్మ గారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటూ...

    రిప్లయితొలగించండి
  13. మీ అమ్మగారి దీవెనలు మీ వెంటే ఉంటాయి..
    అమ్మ గారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటూ...

    రిప్లయితొలగించండి
  14. అమ్మ సాయంచేసిన వారి మనసుల్లో, మీజ్ఞాపకల్లో ఆమె సజీవంగా ఉంటారు . అమ్మకు నివాళులు !

    రిప్లయితొలగించండి
  15. సుజాత చెప్పినట్లు టైటిల్ చదువుతుంటేనే కళ్ళు మసకబారాయి వేణూ! మనతోనే కాకుండా ఇంట్లో ప్రతివస్తువుతోనూ మమేకమై ఉండే అమ్మ లేని లోటుని వివరించడానికి మనకి తెలిసిన భాష సరిపోదు.. ఆమె ఆత్మకి సంపూర్ణ శాంతి లభించాలని కోరుకుంటూ ఆమె నడిచిన బాటలోనే మీరూ అడుగులు వేయాలని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  16. ఏం చెప్పమంటారండీ.. ఏం చెప్పడానికీ మాటలు రావడం లేదు.. ఎవరూ పూడ్చలేని లోటు ఇది.. ఆ వెలితిని అంగీకరించగలగాలి.. తప్పదు..

    రిప్లయితొలగించండి
  17. ఈ టపా రాస్తున్నప్పుడే మీరెంత వేదన అనుభవించి ఉంటారో నేనర్ధంచేసుకోగలను. ఏం రాయాలో, చెప్పాలో కూడా తెలియటం లేదండి. అమ్మ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  18. వెణు శ్రికాంత్ గారు,
    మీ బాధను ప్రస్తుతం నాకంటె బాగా ఎవరూ అర్ధం చేసుకొలెరు ఎందుకంటె నేను 20 రోజుల క్రితం అమ్మ లాంటి అమ్మమ్మను పోగొట్టుకున్నాను.

    రిప్లయితొలగించండి
  19. జ్ఞాపకాలు ఇలా సజీవంగా వున్నంతకాలం మన అత్మీయులంతా అమరులే. నాదీ మీ పరిస్థితే. అందుకే నేను ఈ లోకంలో వున్నారా, లేరా అని ఆలోచించను. నా వరకు నా మనసులోనే వున్నారు. మీకూ ఈ భావన కలగాలని ఆశిస్తూ..

    రిప్లయితొలగించండి
  20. వేణూ,అమ్మగారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ

    రిప్లయితొలగించండి
  21. మీ అమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను .

    రిప్లయితొలగించండి
  22. మీ అమ్మగారి గురించి క్రితం ఏడు మీరు రాసిన టపా అదివరకూ చదివానండీ...పెద్దలు ఎక్కడున్నా వాళ్ళ దీవెనలు మన వెంట ఎప్పుడూ ఉంటాయండీ...!

    రిప్లయితొలగించండి
  23. వ్యాఖ్యానించి అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. వేణు గారు నేను ఆలస్యంగా చూసినా సరే, నా భావం కూడా తెలియజేయాలని ఉంది. మాతృదేవత ని కోల్పోతే పొందే బాధ పూడ్చలేనిది. ఏనాటికీ మరువలేనిది. ఇది ఓదార్పులతో తీరే బాధ కాదు. కాలామైనా ఈ గాయాన్ని తగ్గించలేదు. జీవితమంతా కన్నతల్లిని తలచుకొంటూ, ఆ దేవత ఆశయ సాధనకి క్రుషి చేస్తే కొంతైనా త్రుప్తి పొందగలము.

    రిప్లయితొలగించండి
  25. వేణుగారూ కేవలం రెండు మాటల ఓదార్పుతో తీరే బాధ కాదండీ ఇది..జనమంతా తీరనిదీ లోటు.

    రిప్లయితొలగించండి
  26. అమ్మ లేని లోటు ఎంత చెప్పినా, ఎంత ఏడ్చినా తీరేది కాదు.. కంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు దూరమైనా ఆ బాధ వర్ణనాతీతం.

    మీ పోస్టు చదువుతుంటే, సంవత్సరం క్రితం అనారోగ్యంతో మాకు దూరమైన నాన్నే కళ్లముందు కదలాడారంటే నమ్మండి..

    రిప్లయితొలగించండి
  27. About such a thing which i still feel most sad when reflected back, is losing my mother,happened a decade back.

    రిప్లయితొలగించండి
  28. ప్రణీత స్వాతి గారు, శోభారాజ్ గారు, చాణుక్యగారు నెనర్లు.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.