శీర్షిక చూసి కాసింత కన్‌ఫ్యూస్డ్ ఫేస్ పెట్టేసి మనోడేంటీ రాజకీయాల్లోకి గానీ ఎళ్తన్నాడంటావా ఈ మధ్య బజారయ్య, రిచ్చాబండి అని టపాలు వ్రాస్తున్నాడు....అని మీలో మీరే కొస్చెనింగ్ సేసుకుంటున్నారా...? ఏం భయపడకండి నేను రాజకీయాల్లోకి అస్సలు వెళ్ళబోడం లేదు... ఇది ఆ బాపతు టపా కానే కాదు !! మీరు నిర్భయం గా చదవచ్చు... సరే ఇక విషయం లోకి వస్తే... మీరు ఏప్పుడైనా సినిమా హాలు దగ్గర్లో ఉన్న ఇంట్లో ఉండటం జరిగిందా ? అంటే ఈ మధ్య కాదు కానీ కనీసం ఓ పదేళ్ళ కి ముందు. నాకు పిడుగురాళ్ళ లో ఉన్నప్పుడు ఆ అదృష్టం పట్టింది, నేను 7, 8 తరగతులు అక్కడే చదువు కున్నాను లెండి. మా నాన్న గారు అప్పటికీ చాలా ఆలోచించి హాలు పక్కనే ఉంటే రోజుకి నాలుగు ఆటలు స్టీరియో ఫోనిక్ సౌండ్ లో వినాల్సొస్తుంది అని కొంచెం దూరమైతే ఏ సమస్యా ఉండదని గంగామహల్ సినిమ హాలు ఎదురు సందు లో కొంచెం దూరం గానే అంటే ఓ పది ఇళ్ళు లోపలకే ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు.
కొత్త ఊరు, కొత్త ఇల్లూ, కొత్త పరిచయాలు, కొత్త ఫ్రెండ్స్ అంతా బావుంది ఇల్లు కూడా బావుండేది L ఆకారం లో ఉండి ఇంటి లోపలే కొంత ఓపెన్ స్పేస్ ఉండి ఆకాశం కనిపిస్తూ ఆరు బయట పడుకున్నట్లు ఉండేది ఇంకా పూర్తి గా కావాలంటే ఎంచక్కగా డాబా మీదకి వెళ్ళచ్చు పడుకోడానికి. లోపలే సూర్య రశ్మి కి కొరత ఉండక పోడం తో సన్నజాజి పొద ఇంకా కొన్ని పూల మొక్కలు కూడా ఉండేవి. ఆహా అంతా అద్భుతం అనుకునే సమయం లో మెల్లగా గమనించాం అసలు విషయం. ఇప్పుడు ధ్వని కాలుష్యం అని చాలా వరకు నగరాల్లో నిషేదించారు కానీ ఓ పదేళ్ళ క్రితం వరకు కూడా ఇ సినిమా హాలు రిక్షాబండ్లు మంచి జోరు మీద ఉండేవి.
మైకు లో పెద్ద వాల్యూం లో పాటలు పెట్టుకుని మధ్య మధ్య లో "నేడే చూడండి... మీ అభిమాన ధియేటర్లో... ఆంధ్రుల అభిమాన నటుడు నట ___ ఫలానా హీరో నటించిన ఫలానా చిత్రం... తప్పక చూడండి..... అని చెవులు ఊదర గొట్టే ఈ బండ్లు మన తెలుగు వారందరికీ చిరపరిచితమే. ఇక వీరు సినిమా గురించి చేసే వర్ణన వింటుంటే ఒకో సారి చూద్దాం అనుకున్న సినిమా కూడా అమ్మో అలా ఉంటుందా అయితే చూడకపోడమే మంచిదేమో అనిపించేలా చేస్తాయ్. నేను నరసరావుపేట్ లో ఉన్నపుడు అమ్మ వాళ్ళకి తెలీకుండా వీటి వెనక పరుగెట్టి పాంప్లెట్ లు సంగ్రహించిన రోజులు కూడా ఉన్నాయనుకోండీ అప్పట్లో అదో తుత్తి అది వేరే విషయం. మాకు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే...
ఈ రిక్షా బండి వాడు పొద్దున్నే హాలు బయట బండి నిలబెట్టి, ప్రస్తుతం ఆడుతున్న సినిమా లో పాటలు హిట్ అయితే ఆ సినిమా పాటలు లేదంటే వేరే ఏవో ఒక హిట్ అయిన పాటలు వేసే వాడు. పిడుగురాళ్ళ చిన్న ఊరు ఎంత నిదానం గా ప్రతి వీధి కి తిరిగినా మొత్తం ఊరంతా తిరగడానికి రిక్షాలో ఒక అరగంట, గంట కన్నా ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి ఊరంతా తిరిగి ప్రచారం అయిపోయాక ఇక మిగిలిన టైం అంతా బండి ని హాలు ముందు నిలబెట్టి వాడి ప్రతాపం ఆ చుట్టు పక్కల ఇళ్ళలో ఉండే మా లాంటి వాళ్ళ మీద చూపించే వాడు. వీడు మరీను ఇందులో బాధ ఏముంది, ఇదేదో బాగానే ఉంది కదా ఉచితం గా రోజు పాటలు వినిపిస్తుంటే ఏంటి వీడి బాధ అని అనుకుంటున్నారా... ఒకే పెద్ద సౌండ్ తో చెవుల్లో ఆపకుండా హోరెత్తే ఆ పాటలు భరించడం మానవ మాత్రుల వల్ల కాదండీ బాబు... మా అదృష్టం బావుండి మంచి పాటలు ఉన్న సినిమా వస్తే గుడ్డిలో మెల్ల లా కాస్త పర్లేదు కానీ చాలా సార్లు ఘోరమైన పాటలతో చావగొట్టే వాడు.
ఒకో సారి ఎప్పుడైనా శలవు రోజులోనో లేకా పండగ రోజుల్లో ఇంట్లో కాస్త పూజ లేట్ అయిందంటే ఇక చూస్కోండి ఇక్కడ మంత్రాలు హారతి గంటలూ... వీటిని డామినేట్ చేస్తూ నేపధ్యం లో నేమో డబ్బింగ్ పాటలు ఇంకా వాటిలో మధ్య మధ్య వచ్చే చిత్ర విచిత్రమైన మూలుగులతో ప్రత్యక్ష నరకం కనపడేది. మేము ఘోరం గా బలి అయిన పాటలలో ప్రేమసాగరం పాటలు ఒకటి కొన్ని పాటలు బానే వుంటాయ్ కానీ ఎంతైనా చాలా రోజులు అవే పాటలు పదే పదే అంత పెద్ద వాల్యూం తో విని భరించడానికి బోలెడు ఓపిక కావాలి. ఈ బాధ భరించ లేక ఆ లొకాలిటీ లో ఉన్న వాళ్ళు అందరూ కలిసి హాలు వాడికి మొర పెట్టుకుని ఈ హింస ప్రతి షో కి ముందు ఒక అరగంట మాత్రమే ఉండేలా ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ టైము లోకూడా కాస్త సౌండ్ తగ్గించి పెట్టడం తో కాస్త విముక్తి పొందాము.
పిడుగురాళ్ళ తో అనుబంధం గా ఉండే ఇంకో జ్ఞాపకం నాటకాలు, 16mm సినిమాలు, కోలాటం. ఆ ఊరి గ్రామ దేవత గంగమ్మ. ఆవిడ గుడి కూడా పెద్దదే ఉండేది ఆవరణ ఇంకా గుడి బయటా చాలా ఖాళీ స్తలం ఉండేది. ఇప్పుడు ఇంకా ఉందో లేదో తెలీదు. గంగమ్మ గుడి జాతర సమయం లో ఇవన్నీ చూసాను. కోలాటం చాలా బావుండేది అంత మంది మధ్యన చక్కని rhythm and coordination చూడముచ్చటగా ఉండేది. ఇంకా ఇక్కడే నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటి సారి నాటకం చూసాను అంటే బాగా చిన్నపుడు మా నాన్న గారు ఒకసారి వేస్తుంటే నేను కూడా వెళ్ళాను కానీ గుర్తు లేదు. పిడుగురాళ్ళలో చూసిన నాటకం పేరు గుర్తు లేదు కానీ తెరలు, సన్నివేశాన్ని పట్టి క్షణం లో మారే background తెర, ఆ తెర వెనక నటీ నటులు వాళ్ళ మేకప్ గొడవ ఇదంతా ఇంకా జ్ఞాపకం ఉంది.
ఇక పోతే 16mm సినిమా, గుడిగంటలు అనే పాత సినిమా చూసాను. నేనైతే సినిమా కంటే ఎక్కువ ప్రొజెక్టర్నే ఆసక్తి గా చూసిన జ్ఞాపకం. ఒక చిన్న లెన్స్ దగ్గర కేంద్రీకృతమై బయల్దేరిన కాంతి పుంజం వందల కాంతి రేఖలు గా విడివడి క్రమ క్రమం గా విస్త రిస్తూ తెర అంతా పరచుకోడం. ఇంకా ప్రొజెక్టర్ కీ తెర కి మధ్య ఉన్న దుమ్ము మీద పడే కాంతి లో సీన్ ని పట్టి వెలుగు నీడలు మార్పులు చెందుతూ ఉంటే చూడటానికి అద్భుతం గా వుండేది. ఇంకా ప్రొజెక్టర్ కి అభిముఖం గా నిలబడి లెన్స్ లోకి చూడటం కూడా భలే ఉండేది. అంటే వెలుతురు వల్ల ఎక్కువ సేపు అలా చూడ లేం కానీ నేను అప్పుడప్పుడు ఎదురు గా వెళ్ళి చూడటానికి ప్రయత్నం చేసేవాడ్ని. తెర వెనక వైపుకి వెళ్ళి అటునుండి చూస్తుంటే కూడా భలే ఉండేది. మొదట గా చూసినప్పుడు పెద్ద గా తేడాలేదు రా అనుకున్నాం కానీ నిశితం గా పరికించి చూసాక కుడి ఏడమైతే పొరపాటు లేదోయ్ అని పాడుకున్నాం.
ఈ రోజుకి అవీ కబుర్లు మళ్ళీ మరికొన్ని కబుర్లతో త్వరలో కలుద్దాం,
అంత వరకు శలవ్,
--వేణు.
కుహు కుహూ.. కూసే..
-
డబ్బు డబ్బు డబ్బు చిత్రంలోని ఒక మధురమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట
ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
ఎంబెడెడ్ వీడి...
3 సంవత్సరాల క్రితం
వేణు గారు,
రిప్లయితొలగించండిమా తాతయ్య వాళ్ళకి సినిమా హాల్ ఉండేది మా ఊర్లో. ఇక చూడండి మేం ఊరెళ్ళినప్పుడల్లా ఫ్రీ గా సినిమాలు తెగ చూసేవాళ్ళం. వాల్ పోస్టర్స్ తేచ్చుకొని పుస్తకాలకి అట్టలు వేసుకొని తెగ మురిసిపోయేవాళ్ళం. అవన్నీ గుర్తుకు తెప్పించారు thanx.
వేణూ,
రిప్లయితొలగించండిగుర్తుందా, NRTలో భాను కాన్వెంట్ అని ఒక ప్రైవేట్ స్కూలుండేది. ఆ స్కూలు వాళ్ళకు కూడ ఒక రిక్షా తిరుగుతుండేది ప్రకటనల్తో. ఆ మైకు వాడు 'భాను భాను భాను భాను ...భానూ..కాన్వెంట్" అని అరిచేవాడు.ఇప్పటికీ గుర్తొస్తుంటుంది అతడి గొంతు. ఎలక్షన్స్ టైములో కూడా ఇప్పుడు కూడా మనవైపు రిక్షాల్లో(ఇప్పుడు కొత్తగా ఆటోల్లో) కాన్వాసింగ్ చేస్తారు.
గంగమ్మ గుడి నుంచి బస్టాండ్ దాకా షామియానా వేసే పద్ధతి ఇంకా ఉంది పిడుగురాళ్లలో. మేము USA నించి వచ్చాక నా ఫ్రెండ్ పిడుగురాళ్లలో ఉంటే వెళ్ళాము చూడ్డానికి. అప్పుడు గంగా మహల్లో నల్లుల్ని చంపుకుంటూ జీన్స్ సినిమా చూశాము. 16mm సిమాలు రివర్స్ లో అటునుంచి చూస్తేనే మజా! మేమైతే వాటికి ముందుగానే కుర్చీలు, చాపలు పట్టుకెళ్ళి పోయేవాళ్లం ఇంట్లోవాళ్ళు ఎంత తిట్టినా! 16 mm సినిమాల గురించి ఒక సారి Dr.Ram$ కూడా రాశారు తన బ్లాగులో.
హ హ కల గారు మా తాత గారి సొంతూరు స్వర్ణ, ప్రకాశం జిల్లా, అక్కడో పేరు కి ఓ దియేటర్ ఉండేది చుట్టూ తడికెలు, స్పీకర్ బాక్సులు, 16 mm, అందులో నేను చూసిన సినిమా మిసమ్మ... ఓ రెండేళ్ళ తరువాత ఆ ఊరికి వెళితే ఆ దియేటర్ తీసేశామన్నారు. మళ్ళీ మీటపా చూడగానేనాకు గుర్తొచ్చింది, హ హ
రిప్లయితొలగించండిసినిమా బండి వెనుక పరిగెత్తి, పాంప్లేట్లు తెచ్చుకోవడమ్...ఓహ్..నమో వెంకటేశా అన్న పాట (సినిమా మొదలవగానే)...
రిప్లయితొలగించండిమధురమైన ఙ్ఞాపకాల తుట్టి కదిపావు వేణూ...
naenukoodaa :-) సినిమా కంటే ఎక్కువ ప్రొజెక్టర్నే ఆసక్తి గా చూసిన జ్ఞాపకం. ఒక చిన్న లెన్స్ దగ్గర కేంద్రీకృతమై బయల్దేరిన కాంతి పుంజం వందల కాంతి రేఖలు గా విడివడి క్రమ క్రమం గా విస్త రిస్తూ తెర అంతా పరచుకోడం. ఇంకా ప్రొజెక్టర్ కీ తెర కి మధ్య ఉన్న దుమ్ము మీద పడే కాంతి లో సీన్ ని పట్టి వెలుగు నీడలు మార్పులు చెందుతూ ఉంటే చూడటానికి అద్భుతం గా వుండేది.
రిప్లయితొలగించండివేణూ గారూ, మేము చిన్నప్పుడు సెలవలకి మా నానమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఈ బండి వెనక పరిగెత్తి బ్రతిమాలి బ్రతిమాలి పోస్టర్లు తెచ్చుకునేవాళ్ళం.. స్కూల్ కెళ్ళి వీటిని ఎంత గొప్పగా ఫ్రెండ్స్ కి చూపించుకునేవాళ్ళం..
రిప్లయితొలగించండిపిడుగురాళ్ళలో మీ ఇంటి వర్ణన వింటుంటే భలే ఉందండి! అలా కోర్ట్ యార్డ్ ఉన్న పెంకుటిళ్ళు భలే ఉంటాయి కదా!
@కల గారు నెనర్లు
రిప్లయితొలగించండిహ హ సినిమా హాలే మనదయితే ఇంక అడ్డేముంది భలే...
@సుజాత గారు నెనర్లు
బాబోయ్ నేను మర్చిపోయానండీ... మీరు చెప్పగానే జ్ఞాపకం వచ్చాడు...భాను అనే పదాన్ని దీర్ఘాలు తీసి లాగి పీకి అరచి గోల పెట్టేవాడు. భలే గుర్తు చేసారు. ఓ ఇంకా ఆటోల్లో నడుస్తుందా నేను వెళ్ళినప్పుడు అంత గా గమనించ లేదు ఈ సారి ఒక రౌండ్ వేయాలి అటు...
అవునా ఆ షామియానాలు ఇంకా అలానే కొనసాగిస్తున్నారా... ఓ గంగామహల్లో సినిమా కూడా చూసారనమాట గుడ్. మేము కుదురుగా ఓ చోట కూర్చునే వాళ్ళం కాదు లెండి 16mm సినిమా లో అందుకే మేం సరంజామ పట్టుకు వెళ్ళేవాళ్ళం కాదు. రాం గారి టపా చదవ లేదు చూస్తాను.
@ అశ్విన్ గారు నెనర్లు
మళ్ళీ ఓ సారి మిస్సమ్మ ని గుర్తుచేసుకున్నారనమాట.
@రవి గారు నెనర్లు
మరి ఆ జ్ఞాపకాలలో విహరించి వచ్చారా...
@ నేను aka గారు నెనర్లు
:-) మీరు కూడా నా లానే అనమాట.
@ నిషిగంధ గారు నెనర్లు
అప్పట్లో ఈ పాంప్లెట్లు, పుస్తకాల్లో దాచుకునే నెమలి ఈకలు, అట్టలపై అంటించుకునే నేమ్ స్టిక్కర్స్ ఇలాంటివే కదండీ అసలు సిసలు అపురూపమైన ఆస్తులు.
అలాంటి ఇంటి లో ఉండాలి అంటే నాకు చాలా ఇష్టం అండీ రిటైర్ అయ్యాక ఒక మోస్తరు పల్లెటూరిలో అలాంటి ఇల్లు, చుట్టూ ఓ చిన్ని తోట తో ఓ పర్ణశాల లాంటి చోట గడపాలి అని ఎప్పటినుండో ఓ కోరిక:-)
వేణు.. టపాలు బాగున్నాయి.. బాగా రాస్తున్నావ్.. ఏమిటీ ఆ పాత్ మధురాల(పాటలు) తో కూడా ఒక అనుబంధము వుందా?? అరిపిస్తున్నావ్ గురు.. ఎంజాయ్.. యి మైకు ల మీద ఒక అమెరికా జోక్ చెప్పేదా??
రిప్లయితొలగించండిఇక్కడ అమెరికా లో ఇంటి పేరు తో పిలవడము అలవాటు కదా..! ఐతే అమెరికా నుండి, శ్రీ. పంచె సుబ్బారావు గారు అని ఒక మోతుబరి సినిమా వ్యాపారమ్ చేద్దామ్ అని ఆంధ్ర వెళ్ళారు.. వెళ్ళి ఒక సినిమా హాలు అద్దెకు తీసుకొని మన 16mm రేంజ్ లో సినిమాలు జోరుగానే వేస్తున్నారు.. ఒకసారి "చలి చీమలు" అనే సినిమా వేస్తున్నారు.. ఐతే కాన్వాస్ కి వచ్హిన రిక్షా వాడు మైకు లో అరవడము మొదలు పెట్టాడు.. నేడే చూడండి.."సుబ్బారావు పంచె లో చలి చీమలు". ఆలసించిన ఆశాభంగము.. గొప్ప గొప్ప మలుపుల తో, గొప్ప గొప్ప యాక్షన్ సన్నివేశాలతో, భారి సెట్టింగుల తో,ఆ ఆ నేడే చూడండి "సుబ్బారావు పంచె లో చలి చీమలు.".
@ Dr.Ram$ గారు బోలెడు నెనర్లండీ...
రిప్లయితొలగించండిమీప్రోత్సాహం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అసలు నేను లేట్ 90'స్ దగ్గర ఆగిపోయాను అంటారు నా నేస్తాలు, ఆ లోపు వచ్చిన పాటలు మాత్రమే మళ్ళీ మళ్ళీ వింటాను. కొత్త పాటలు వింటాను కానీ వాటి ఆయుః ప్రమాణం చాలా తక్కువ, ఆపాతమధురాలలా శాశ్వతం గా నిలిచేవి ఒకటో అరో అంతే కదా...
:-) జోక్ బావుంది.
వేణు , మీ కబుర్లు భలే వున్నాయి. మధురమైన జ్ఞాపకాలను గుర్తు తెప్పిస్తున్నాయి :)
రిప్లయితొలగించండిThanks Niranjan.
రిప్లయితొలగించండిఅంటే మీరారోజుల వారా? నా టైము కి ఆ భాగ్యం కలుగలేదు. పోన్లే, సినిమాల్లో నైనా చూశాను.
రిప్లయితొలగించండిమేమూ చిన్నప్పుడు 16mm సినిమాలని మా అమ్మమ్మగారి ఊళ్ళో చూశాం. ఒకసారి ప్రొజెక్టర్ ని పరిశీలించి సినిమా వాడి సహనాన్ని పరిశీలించాం కూడా.
"శీర్షిక చూసి కాసింత కన్‌ఫ్యూస్డ్ ఫేస్ పెట్టేసి మనోడేంటీ రాజకీయాల్లోకి గానీ ఎళ్తన్నాడంటావా ఈ మధ్య బజారయ్య, రిచ్చాబండి అని టపాలు వ్రాస్తున్నాడు....అని మీలో మీరే కొస్చెనింగ్ సేసుకుంటున్నారా...? ఏం భయపడకండి నేను రాజకీయాల్లోకి అస్సలు వెళ్ళబోడం లేదు... ఇది ఆ బాపతు టపా కానే కాదు !! మీరు నిర్భయం గా చదవచ్చు... " introduction adirindi.
http://annisangathulu.blogspot.com/2008/08/blog-post.html లో నేను చిన్నప్పుడు చేసిన ప్రయోగం చూసి నాకు పొగరు ఉన్నట్టో కాదో డిసైడ్ చేయండి.
:-)
భానూ కాన్వెంట్ అంటే ఆ సాయి బాబా బొమ్మ వేసి, LIC office రోడ్డులో ఉండేదేనా? దాని మీద మేము వెరైటీ జోకులు వేసుకునే వాళ్లము. అది ఇప్పుడు లేదనుకుంటా.
రిప్లయితొలగించండిగీతాచార్య గారు నెనర్లు,
రిప్లయితొలగించండిభాను కాన్వెంట్ ఎక్కడో నాకు సరిగ్గా గుర్తు లేదండీ... ఇంకెవరన్నా గుర్తు పడతారేమో చూద్దాం. మీ బ్లాగు చూసాను బావుంది అక్కడే కామెంటాను.
బాసు!!!గంగమ్మ గుడి, దాని ముందు ద్వారకా లాడ్గ్, వెంకటేశ్వరమహల్, వెనక గంగా మహల్, అటు పక్కన విజయలక్ష్మి పిక్చర్ పాలస్...దాని ముందు శ్రి మన్నెం పుల్లారెడ్డి ప్రాధమికోన్నత పాఠశాల...భలేవాడివి బాసు..భలే గుర్తు చేశవ్... నేను పిడుగురాళ్ళలో 13 సంవత్సరాలు ఉన్నా..emotional అయ్యాను బ్రదర్..ఇంకేమి రాయలేకపోతున్న...ఎఱ్ఱవాగు, తండా బడి...ఉఫ్...మాజీవితాలు పిడుగురాళ్ళతోటి, పల్నాడు తోటి ఎంతలా ముడివేసుకున్నాయంటే...
రిప్లయితొలగించండిగీతాచార్య,
రిప్లయితొలగించండిఅవును, భలే గుర్తు పట్టారు. LIC ఆఫీసు రోడ్ లో ఉండే స్కూలే భానూ కాన్వెంట్! ఇప్పుడు లేదనుకుంటాను, అంతగా తెలియదు. మీకు ఆ సాయి బాబా బొమ్మ కూడా గుర్తుండడం విశేషమే! దాని పక్కనే శాఖా గ్రంథాలయం ఉండేది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅ య్యా! (Rajni Style) నాకు బాగానే గుర్తు. థాంక్ యూ.
రిప్లయితొలగించండిభాస్కర్ రామరాజు గారు నెనర్లు, నా టపా మీ జ్ఞాపకాలని కదల్చినందుకు సంతోషం.
రిప్లయితొలగించండి