"A picture is worth a thousand words", ఏదైనా ఒక విషయాన్ని వేయి మాటల్లో కన్నా ఒక్క చిత్రంతో హృదయానికి హత్తుకునేలా చెప్పవచ్చు అన్నది జగమెరిగిన సామెత. అలాంటి చిత్రాల(scenes) సమాహారమైన చలనచిత్రానికి కొన్ని శక్తివంతమైన మాటలతో కూడిన నేపథ్యసంగీతం తోడైతే చెప్పవలసిన విషయం మరింత సూటిగా ప్రేక్షకునికి చేరుతుంది కదా, అదే మర్యాద రామన్న సినిమా. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు ప్రతి ఫ్రేమ్ లోనూ రాజమౌళీ అతని టెక్నికల్ టీం, వాళ్లలో కూడా ముఖ్యంగా కీరవాణి కనిపించారు. అలా అని సునీల్ యాక్షన్ ని తీసివేయడం నా ఉద్దేశ్యం కాదు, అతని సాధారణమైన మ్యానరిజమ్స్ నుండి బయటికి వచ్చి వైవిధ్యమైన నటన కనబరిచాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటివరకు తను నేర్చుకున్న నటన మర్చిపోయి ఫ్రెష్ గా రాజమౌళి స్కూల్ లో మళ్ళీ నేర్చుకున్నాడా అని అనిపించింది.
అరెరెరె అరెరెరె ఎంతటి ఘనమయ్యా..
ప్రాణాలిచ్చే మమతల్లో.. ప్రాణం తీసే పంతాల్లో..
నేలను చిందిన నెత్తురు చుక్కల లెక్కలు తేలని ఇతిహాసాలు...
అరెరెరె అరెరెరె అరెరెరె అరెరెరె ఎంతటి ఘనమయ్యా..
అనే పాటను టైటిల్స్ కు నేపథ్య సంగీతంగా వాడి మొదటినుండే సినిమా కథేమిటో టూకీగా చెప్తూ ప్రారంభించిన కీరవాణి, సినిమా అంతా సన్నివేశానికి తగిన మూడ్ ని ఎలివేట్ చేసే సంగీతంతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా అనే కాదు రాజమౌళి సినిమాలన్నిటికీ కీరవాణి ప్రత్యేకమైన నేపధ్య సంగీతాన్ని అందిస్తారు, రాజమౌళి ఇచ్చే ఫ్రీడం వలనో ఆయన మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానమో లేదంటే ఇద్దరూ ఒకేలా ఆలోచించడం వలనో, కారణం వాళ్ళిద్దరికే తెలియాలి. సాథారణంగా కీరవాణి నేపధ్య సంగీతానికి వాయిద్యాలకన్నా గళానికి(వాయిస్/కోరస్ కి) ఎక్కువ ప్రాథాన్యతని ఇస్తారు కానీ మిగిలిన సినిమాలకన్నా ఈ సినిమాకు బిట్ సాంగ్స్ మరియూ స్వరాలను(వాయిస్/కోరస్) నేపధ్యసంగీతంగా చాలా అద్భుతంగా మరింత ఎఫెక్టివ్ గా ఉపయోగించుకున్నారు. అసలు సినిమాకు అంత ఫీల్ రావడానికి బాగా దోహదపడింది కీరవాణి నేపధ్య సంగీతమే.ప్రాణాలిచ్చే మమతల్లో.. ప్రాణం తీసే పంతాల్లో..
నేలను చిందిన నెత్తురు చుక్కల లెక్కలు తేలని ఇతిహాసాలు...
అరెరెరె అరెరెరె అరెరెరె అరెరెరె ఎంతటి ఘనమయ్యా..
ఈ సినిమా పాటలు విన్నపుడు రెండు పాటలు తప్ప అంత పెద్దగా ఆకట్టుకోకున్నా సినిమా చూసినపుడు సంధర్బోచితంగా ఉన్న ప్లేస్మెంట్ మరియూ రాజమౌళి చిత్రీకరణ తోడై దదాపు అన్ని పాటలు బాగున్నాయ్ అనిపించాయ్. "అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది", "తెలుగమ్మాయి" మంచి మెలోడీని అందిస్తే "రాయె రాయె" మాస్ ఫీల్ ను, "ఉద్యోగం ఊడిపోయింది" సరదాగానూ "పరుగులు తీయ్" స్ఫూర్తిదాయకంగాను ఉన్నాయి. ఈ పరుగులు తీయ్ పాటలోనూ చేజ్ లో నేపధ్యానికి వాడిని "హరోం హర హర హర హర" కూడా చాలా మంచి ఫీల్ ఇచ్చింది. ఇక సినిమా అంతా అక్కడక్కడ నేపధ్యానికి వాడిన చైతన్య ప్రసాద్ రాసిన ఈ పాట సినిమా ఫీల్ ను ఎలివేట్ చేయడానికి ఎంతగా ఉపయోగపడిందో ఈ చిన్న క్లిప్ లో మీరే చూడండి.
ఎన్నేండ్లకు పెదపండగ వచ్చే వాకిండ్లకు మావాకులు గుచ్చే
అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయ...
అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయ...
ఆఆఆఆ ఆ ఆ ఆఅ...
కోట్లిస్తది కోడిని కోసిస్తే మేళ్ళిస్తది మేకను బలి ఇస్తే
పోలమ్మకు పొట్టేలును ఏస్తే హోయ...
అమ్మోరికి అవ్వాలని మేత ఏనాడో రాసేసిన రాత
ఎలుగుందా రేతిరి గడిసాక హోయ...
చుట్టూతా కసి కత్తుల కోటా ఏదారి కనిపించని చోటా
కునుకుండదు కంటికి ఏపూటా హోయ...
ఇంకా ఇదే కాక "చెట్టులెక్క గలవా" పాటకు పేరడీగా మధ్యలొ వచ్చే ఈ చిన్న బిట్ సాంగ్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. మొత్తం మీద ఈ సినిమా విజయంలో సింహ బాగం కీరవాణికే సొంతం అనడం లో ఏమాత్రం సందేహం అక్కర్లేదు అనిపిస్తుంది.
లెక్క జెప్పగలవా నీ ఆయువు లెక్కజెప్పగలవా
బిక్కు బిక్కు మని తెల్లవారి పని చక్కబెట్టగలవా.. అందాకా ఉగ్గబట్టగలవా..
లెక్కబెట్టగలవా ఆ చుక్కలు లెక్కబెట్టగలవా..
చావుదప్పి నువు బతికి బైటపడి బట్టగట్ట గలవా.. అందాకా ఉగ్గబట్టగలవా..
ఇక ఈ సినిమా లో హాస్యం విషయానికి వస్తే సైకిలు కి మాటలు నేర్పిన రవితేజ తన వంతు వినోదాన్ని అందించారు. ఎక్కడా వెకిలి హాస్యం, చొక్కాలు చింపు కోవడం, అల్లరి చేయడం లాంటివి లేకుండా కేవలం హీరో భయం లోనుండి అమాయకత్వం నుండి చక్కని హాస్యాన్ని సృష్టించారు. సినిమా ట్రైలర్స్ లోనే రాజమౌళి ఇతర సినిమాల హీరోలను చూపించి చివరిలో సునిల్ వచ్చి "నేను అలాంటోడిని కాదండి" అని అంటూ ప్రేక్షకుల అంచనాలను సరిగా సెట్ చేశారు. అలానే హీరో ఇంట్రడక్షన్ సీన్ ఇంచుమించు పోకిరిని తలిపించినా సునీల్ మొహంలో హీరోయిజం కన్నా భయవిహ్వలుడైనట్లు ముఖకవళికలు చూపించి ఒక కంటిన్యుటీ మెయింటెయిన్ చేశారు. కథా రచయిత కాంచి ఓ చిన్న పాత్రలో నవ్వులను పంచారు. రావు రమేష్ ఒక్క సీన్ కే పరిమితమైనా సినిమాకు చాలా ముఖ్యమైన సీన్ లో చాలా చక్కగా నటించి ఆకట్టుకున్నారు. బ్రహ్మాజీ పాత్ర కూడా బాగుంది. అవసరానికి మించకుండా సినిమా నిడివి రెండుగంటలు మాత్రమే ఉంచడం కూడా చెప్పుకోవలసిన విషయం, సినిమా ఎక్కడా బోరు కొట్టకపోవడానికి ఇది కూడా ఒక కారణం. మొత్తం మీద మీరు ఇంకా ఈ సినిమా చూడనట్లైతే వీలైనంత త్వరగా కుటుంబ సమేతంగా వెళ్ళి చూసేయండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
ఇక ఈ సినిమా లో హాస్యం విషయానికి వస్తే సైకిలు కి మాటలు నేర్పిన రవితేజ తన వంతు వినోదాన్ని అందించారు. ఎక్కడా వెకిలి హాస్యం, చొక్కాలు చింపు కోవడం, అల్లరి చేయడం లాంటివి లేకుండా కేవలం హీరో భయం లోనుండి అమాయకత్వం నుండి చక్కని హాస్యాన్ని సృష్టించారు. సినిమా ట్రైలర్స్ లోనే రాజమౌళి ఇతర సినిమాల హీరోలను చూపించి చివరిలో సునిల్ వచ్చి "నేను అలాంటోడిని కాదండి" అని అంటూ ప్రేక్షకుల అంచనాలను సరిగా సెట్ చేశారు. అలానే హీరో ఇంట్రడక్షన్ సీన్ ఇంచుమించు పోకిరిని తలిపించినా సునీల్ మొహంలో హీరోయిజం కన్నా భయవిహ్వలుడైనట్లు ముఖకవళికలు చూపించి ఒక కంటిన్యుటీ మెయింటెయిన్ చేశారు. కథా రచయిత కాంచి ఓ చిన్న పాత్రలో నవ్వులను పంచారు. రావు రమేష్ ఒక్క సీన్ కే పరిమితమైనా సినిమాకు చాలా ముఖ్యమైన సీన్ లో చాలా చక్కగా నటించి ఆకట్టుకున్నారు. బ్రహ్మాజీ పాత్ర కూడా బాగుంది. అవసరానికి మించకుండా సినిమా నిడివి రెండుగంటలు మాత్రమే ఉంచడం కూడా చెప్పుకోవలసిన విషయం, సినిమా ఎక్కడా బోరు కొట్టకపోవడానికి ఇది కూడా ఒక కారణం. మొత్తం మీద మీరు ఇంకా ఈ సినిమా చూడనట్లైతే వీలైనంత త్వరగా కుటుంబ సమేతంగా వెళ్ళి చూసేయండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
అవునండీ, సినిమా మొత్తం హాయిగా చూసేశాము! మా పాపాయికి బాగా నచ్చింది.ఇందాక న్యూసులో చూశాను ఆ డొక్కు సైకిల్ (రవి తేజ డబ్బింగ్ భలే ఉంది కదా)ని లక్షా యాభై వేలకు వేలంలో ఎవరో కొన్నారట. (మా అమ్మాయి మనమే కొనుక్కుందామని గోల చేసింది కాసేపు) అమ్మాయి కిటికీ పక్కన కూచుంది..పాట, తెలుగమ్మాయి పాట మా ఇంట్లో రోజూ సాయంత్రం నాలుగు తరవాత మారు మోగుతున్నాయి.
రిప్లయితొలగించండిసలోని భలే హుషారుగా, చక్కని హావ భావాలు ప్రదర్శించింది!
ఈ సినిమా అనే కాదు రాజమౌళి సినిమాలన్నిటికీ కీరవాణి ప్రత్యేకమైన నేపధ్య సంగీతాన్ని అందిస్తారు, రాజమౌళి ఇచ్చే ఫ్రీడం వలనో ఆయన మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానమో లేదంటే ఇద్దరూ ఒకేలా ఆలోచించడం వలనో, కారణం వాళ్ళిద్దరికే తెలియాలి. అవునండి మీ అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను.
రిప్లయితొలగించండినాకు ,ఎన్నేండ్లకు పెదపండగ వచ్చే వాకిట్లకు మావాకులు గుచ్చే ..పాట చాలా నచ్చింది కానీఆపాటసినిమాలోనే కానీ పాటలతో రిలీజ్ చేయలేదనుకుంటా ఆపాట లేదు .మీ వలన ఈ పాట మళ్లి విన్నాను .థాంక్స్ .
సినిమా గురించి నెట్లో చదవటమే కానీ, చూడలేదు, ఇప్పుడప్పుడే చూసే ఛాన్స్ (మేమున్న చోట దొరకదు) రాదు. కానీ మీరు చెప్పినవి వింటుంటే కాస్త ఆసక్తికరంగానే ఉంది.
రిప్లయితొలగించండిఐనా రాజమౌళి సినిమా చూడాలనుకునే బదులు అది డిపెండైన హాలీవుడ్ సినిమాలు చూస్తే సరిపోతుందనిపిస్తుంది నాకు. నాకు నచ్చినవి సై, కొంత వరకు ఛత్రపతి. మగధీరలో రసెల్ క్రోవ్, మెల్ గిబ్సన్, లెన్ డికాప్రియో... పాపం వాళ్ళలో ఎవరినన్నా పెట్టి ఉంటే ఒరిజినల్ ఆ౨క్షన్ చూసిన భాగ్యమన్నా దక్కి ఉండేది. వెరీ పూర్ ఇమిటేషన్ బై రామ్ చరణ్. ఆఖరికి పాట కూడా చిరంజీవిది పట్టుకొచ్చుకున్నారు.
BTW పాత బాగుంది
రిప్లయితొలగించండివిందు భోజనం తింటున్నామని సంతొషించ బోతే
రిప్లయితొలగించండిపక్కింటి అయన వచ్చి మా ఇంట్లో వంటలు పట్టుకొచ్చి
పెడుతున్నారెంటి?అన్న భావం కలుగు తుంది
యి సినిమా అవర్ హాస్పిటాలిటి కి స్వేచ్చాను వాదం
అని తెలిసి నప్పుడు .
ప్చ్..నేనింగా చూడలేదు...తప్పకుండా చూడాలనిపిస్తుంది మీ పోస్టు చదువుతుంటే...
రిప్లయితొలగించండిసుజాత గారు నెనర్లు,
రిప్లయితొలగించండినిజమే సలోని నటన గురించి చెప్పడం మర్చిపోయాను.
రాధిక(నాని ) గారు నెనర్లు. ఆ పాటతోనే కీరవాణి సినిమాకు మంచి ఫీల్ ఇచ్చాడండి.
సృజన గారు నెనర్లు,
మీరు సినిమా చూడటానికి ఎదురు చూడక తప్పదనమాట. ఒరిజినల్ హాలీవుడ్ వర్షన్ అయినా తెలుగులో తీసుకు వచ్చే ఫీల్ వేరేగా ఉంటుందండీ. ప్రత్యేకించి కొన్ని షాట్స్ కోసమైనా ఒకసారి చూడవచ్చు.
రవిగారు నెనర్లు,
హ హ స్వేఛ్చానువాదాల మీద సెటైర్ బాగుంది కానీ ఇక్కడ కేవలం భోజనం లోని రిసీపీ మాత్రమే కాపీ కొట్టారు కానీ దానికి తగిన మన ఇంటి మసాలాలు కూడా యాడ్ చేయడం వల్ల ఒక్కసారైనా చూడాలి అనిపిస్తుందండీ.
అదీ కాక అవర్ హాస్పిటాలిటీ గురించి హాలీవుడ్ సినిమాలతో పరిచయమున్న ఏ కొద్దిమందికో తప్ప తెలిసే అవకాశం లేదు కనుక ఈ ప్రయత్నం సబబే కాకపోతే కనీసం మూలకథ అందించినది ’వర’ అని కాక ఫలానా సినిమా అని చెప్తే హుందాగా ఉండేది.
శేఖర్ గారు నెనర్లు, తప్పకుండా చూడండి.
పధ్య గీతం చాలా బాగుందండీ.. నేను ఆ పాట గురించి రాయలేదన్న కొరతని మీ టపా తీర్చేసింది. కేవలం కీరవాణి సంగీతం మాత్రమె కాదండీ.. రాజమౌళి సినిమాలకి ఒక ఫిక్సెడ్ టీం పనిచేస్తుంది గమనించారా.. (నేను చూసిన రాజమౌళి రెండో సినిమా మర్యాద రామన్న, మొదటిది 'సై' అది కూడా ఒకానొక తప్పనిసరి పరిస్థితిలో.. బట్, క్రెడిట్స్ గమనిస్తూ ఉంటాను). అన్నట్టు మీ బ్లాగ్ కొత్త లుక్ బాగుందండీ.. కొంచం గ్యాప్ తర్వాత ఇవాళే చూశాను..
రిప్లయితొలగించండివేణు గారు, నాకైతే ఈ సినిమా భలే నచ్చింది. ముఖ్యంగా పాటలు. మీరు చాలా చక్కగా వివరించి చెప్పారు, రాజమౌళి మరియు కీరవాణి కలిసి ఏం చెప్ప దల్చుకున్నారో..:) అసలు ఏ పాత్రని కూడా తక్కువ చేసేది లేకుండా.. అందరూ చాలా చక్కగా చేశారు. నాకైతే అన్నీ perfectగా ఉన్నట్లు అనిపించింది..
రిప్లయితొలగించండిbAguMdi.
రిప్లయితొలగించండి"అతని సాధారణమైన మ్యానరిజమ్స్ నుండి బయటికి వచ్చి వైవిధ్యమైన నటన కనబరిచాడు."
కరెక్షన్ - సునిల్లో ఆ ప్రతిభ ఎప్పుడూ ఉందనే నేననుకుంటాను. కాకపోతే దర్శకులు అతనికి సాధారణంగా ఇచ్చే పిచ్చి కామెడీ చెత్త పాత్రల్లో అది కనబడదు, కానీ ఇంతకు ముందు సినిమాల్లో కూడ అక్కడక్కడా ఒక ఫ్లాష్‌లాగా కనిపించింది.
రాజమౌళి సినిమాల్లో కీరవాణి సంగీతం ఒక ప్రత్యేకతని సంతరించుకుంటుంది. ఇది నిజం.
కొత్త టెంప్లెట్టు
రిప్లయితొలగించండికొత్త పోస్టూ
ట్విట్టరు
కొత్త సిలుమా
అబ్బబ్బబ్బా
అద్దిరింది
మురళి గారు నెనర్లు hmm interesting ఇతని సినిమాలు అన్నీ చూడలేదనమాట. నిజమే సాధారణంగా టెక్నికల్ టీం అంతా ఎప్పుడూ ఒకరే ఉంటారు. టెంప్లేట్ నచ్చినందుకు ధన్యవాదాలు :-)
రిప్లయితొలగించండిఅపర్ణ గారు నెనర్లు, నిజమే మీరన్నట్లు అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనిపిస్తుంది :)
కొత్తపాళీ గారు నెనర్లు, నిజమే అయి ఉండచ్చండీ కానీ ఈ తరహా నటనని ఉపయోగించుకున్న వారు బహు తక్కువ. అందాల రాముడు లో కూడా ఛాలా చోట్ల సాధారణంగానే ఉంటుంది.
భాస్కర్ రామరాజు గారు నెనర్లు :) మీ కామెంట్ కూడా అదిరింది.
నాకు తెగ నచ్చిన పాట. అమ్మోరికి ఆకలి గుర్తొచ్చే హోయా. ఎంత నచ్చిందంటే అదొక్క పాటను ఐ ట్యూన్స్ లో కొన్నాను.
రిప్లయితొలగించండినాకు బాగా నచ్చిన విషయం ఎవరితోనయినా హాయిగా చూడగల చిత్రం. అసభ్యమైన డైలాగ్ లు , హాస్యం కూడా లేవు. కాకపోతే ఈ సినిమా కథ ఒక ఆంగ్ల చిత్రానికి మక్కీ కి మక్కీ అని తెలిసి కొంత బాధేసింది.
http://en.wikipedia.org/wiki/Our_Hospitality
"వాకిట్లకు మావాకులు " - వాకిళ్ళకు మావాకులు కరెష్టేమో.
మీరంతా ఇంత చక్కగా రివ్యూలు రాస్తే చదవటం తప్ప ఇంకా సినిమా చూసే అవకాశం రాలేదు :( త్వరలోనే చూడాలండీ :)
రిప్లయితొలగించండివాసు గారు నెనర్లు,
రిప్లయితొలగించండినాకు కూడా చాలా నచ్చిన పాటండీ అది, కానీ నాకు ఐట్యూన్స్ లో దొరకలేదు బహుశా వెతకడం తెలియలేదేమో... నాకు ఈ సినిమా చూశాకే అవర్ హాస్పిటాలిటీ గురించి తెలిసింది, ఆసక్తి కొద్దీ నేను ఆమూకీ సినిమా కూడా చూశాను, అమెరికాలో 1820 లో ఫ్యాక్షన్ గొడవలుండేవంటూ 1920 లో తీసిన సినిమా ఫ్యాక్షన్ సీన్ల ప్రారంభంతో మొదలు హీరో పాత సైకిల్ పై లగేజ్ ట్రాన్స్ పోర్ట్ చేయడం హీరోయిన్ ట్రయిన్ మిస్ అవబోతూ ఎక్కడం అంతా మక్కీకీ మక్కీ చూసి కాస్త దిగులేసింది. కానీ సినిమాని విజయవంతంగానే కస్టమైజ్ చేశారు లెండి.
పాట సవరణ చెప్పినందుకు నెనర్లు. అది "వాకిండ్లకు" అండీ సీమ మాండలికం అనుకుంటా.. టపా లో సరిచేశాను.
పరిమళం గారు నెనర్లు, కుటుంబసమేతంగా ఇబ్బందులు పడకుండా చూసి ఆనందంగా బయటకు రాగల సినిమా అండీ నో డౌట్ చూసేయండి మరి.
నాక్కూడ నచ్చింది ఈ సినిమా వేణు. పెద్ద ఎక్స్పెపెక్టేషన్ లేకుండా వెళ్ళేమేమో ఇంకా బాగుండి. మా అబ్బాయి కి నాకు నచ్చిన అతి కొద్ది నాన్ నాగార్జున, నాన్ పవన్ కల్యాణ్ (వాళ్ళ ఇద్దరివి ఎలా వున్నా మేము ఇద్దరం బాగుంది లే బాగుంది లే అని అనేసుకుంటాము) సినిమాలలో ఇది ఒకటి. కీరవాణి గారి మ్యూజిక్ కూడా బాగుంది. ఆ పాట లింక్ బాగా ఇచ్చారు. సీడీ లో కూడా లేదు ఇది.
రిప్లయితొలగించండిభావన గారు నెనర్లు, నిజమేనండీ ఈ మధ్య సినిమాలకి అంచనాలని అదుపులో ఉంచుకుని వెళ్ళడం చాలా ముఖ్యమైపోయింది.
రిప్లయితొలగించండిబాగా వ్రాసారు శ్రీకాంత్ గారు
రిప్లయితొలగించండిఇంతకీ మీ DVD కలెక్షన్ లలో ఈ సినిమా కూడా చేరబోతుందా :)
హరేకృష్ణ గారు నెనర్లు. ఆహా నిస్సందేహంగా ఈ సినిమా కూడా చేరబోతుంది.
రిప్లయితొలగించండిబాగుంటుంది సినిమా. డ్యాన్స్ మొవెమెంట్స్ సూపర్
రిప్లయితొలగించండిడ్యాన్స్ మొవ్మెంట్స్ చాలా చోట్ల చిరంజివి ని చూసినట్టు అనిపించింది. బహుసా శరీర ఆకృతి వల్లెమో ;)
శేషేంద్ర సాయి గారు నెనర్లు, నాకు తెలిసినంతవరకూ సునిల్ చిరంజీవి డ్యాన్స్ లు చూస్తూ పెరిగాడంటారండీ, అతను సినిమాల్లోకి రావడానికి కారణమే చిరంజీవి అని అతనే చెప్తాడు అదీకాక మీరు చెప్పినట్లు శరీరాకృతి కూడా కాస్త కలవడం వల్ల చిరు స్టెప్స్ కంపోజ్ చేసి ఉంటారు నృత్య దర్శకులు.
రిప్లయితొలగించండి