అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

బుధవారం, సెప్టెంబర్ 20, 2017

బిగ్ బాస్...

బిగ్ బాస్ అనే రియాలిటీ షో తెలుగులోనా.. అసలా షో ఫార్మాట్ చుట్టూ ఉండే కాంట్రవర్సీలు, ఆ కంటెంట్ మన తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తాయి... అసలదే కంటెంట్ ని యాజ్ టీజ్ గా తెలుగులో చూపించగలరా.. తారక్ ఏమాత్రం హోస్ట్ చేయగలరో.. సెలెబ్స్ ఎవరు వస్తారో ఇలా పలు అనుమానాల మధ్య షో స్టార్ట్ అయింది.. నిజం చెప్పాలంటే సెలెబ్రిటీస్ లిస్ట్ చూశాక వీళ్ళని ఎన్టీఆర్ గారు హోస్ట్ చేయడమేంటి ఏమొచ్చింది ఈ బిగ్ బాస్ టీమ్ కి ఈ సెలెక్షన్ ఎంటి అని షోమీద ఇంట్రస్ట్ పూర్తిగా తగ్గిపోయింది. 

మొదటి వీకెండ్ ఇంట్రడక్షన్ అయ్యాక రెండవ వీకెండ్ తారక్ షో చూశాక  కేవలం తన యాంకరింగ్ కోసం చూడచ్చేమో అనిపించింది ఆ తర్వాత వీకెండ్ నుండి ప్రతి వీకెండ్ కేవలం తారక్ కోసమే చూడడం మొదలు పెట్టాను. వాట్ ఏన్ ఎంటర్ టైనర్ హీ ఈజ్.. మెల్లగా మా ఇంట్లో కూడా అందరూ ఈ షోకి అడిక్ట్ అయి నాకు వీక్ డేస్ చూడడం కుదరకపోయినా ఎవరో ఒకరికి ఫోన్ చేసినపుడు హైలైట్స్ వింటూ వచ్చాను. 

రాను రాను ఈ ఫైనల్ వీక్ కి వచ్చేసరికి ఇపుడు ఆ ఫైనలిస్ట్స్ అందరినీ తెలుగు కుటుంబాలు తమ ఇంట్లో ఒక్కరిగా ట్రీట్ చేస్తూ అచ్చం తారక్ చెప్పినట్లే వాళ్ళ ఇంటితో పాటు బిగ్ బాస్ ఇంటిపై ఒక కన్ను వేసి ఉంచుతూ తమ కంటెస్టంట్ ని సేవ్ చేస్కోవాలని వాళ్ళని గెలిపించాలని వాళ్ళు పడే తాపత్రయం వారం వారం పెరుగుతున్న వోట్ల సంఖ్యను చూస్తేనే అర్ధమవుతుంది. 

మొదటలో టిపికల్ టీవీ సోప్స్ తరహాలో ఏడుపులు మొత్తుకోళ్ళతో మొదలైనా కానీ రాను రాను ఎంటర్టైన్మెంట్ కి విలువిచ్చే టాస్కులతో (రిక్షా, స్కూల్), కంటెస్టంట్స్ లోని టాలెంట్ ని చూపే పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడంలో బిగ్ బాస్ టీమ్ ప్రయత్నాలని మెచ్చుకోకుండా ఉండలేం. మొత్తం షోని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మాట్ ని కాస్త మార్చేసి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కస్టమైజ్ చేసినందుకు వారిని అభినందించి తీరాలి. 

ఇదంతా ఒక ఎత్తైతే తారక్ హోస్టింగ్ ఒక్కటీ ఒకఎత్తు ఎక్కడా ఒక్క నిముషం కూడా బోర్/విసుగు అనే పదాలకి ఆస్కారమివ్వకుండా తను ఎంటర్టైన్ చేసే తీరు అభినందనీయం. తన చలాకీతనం, సమయస్ఫూర్తి, కలుపుగోలు తనం, కంటెస్టెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యే తీరు వారితో ఫ్రెండ్లీగా ఉంటూనే వాళ్ళని నొప్పించకుండా వారిలో లోటుపాట్లను సున్నితంగా ఎత్తి చూపించిన తీరు అమోఘం.  

ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సమ్మోహనాస్త్రంతో ప్రేక్షకులను కట్టిపడేశాడంతే. మిగిలిన సెలబ్స్ సంగతేమో కానీ ఈ షో వల్ల తారక్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఇంట్లోని మనిషయ్యాడు తనకు ఖచ్చితంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిఉంటుందని నా ఉద్దేశ్యం. మొదట్లో ఏమో అనుకున్నాను కానీ తనని హోస్ట్ గా సెలెక్ట్ చేయడమే బిగ్ బాస్ టీమ్ తొలి విజయం అని మొదటి రెండు మూడు వారాల్లోనే ఆర్ధమై పోయింది. 

ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే నా పర్సనల్ ఫేవరెట్స్ హరితేజ అండ్ నవదీప్. ఎంటర్టైన్మెంట్ విషయంలో వీరిద్దరూ ఫస్ట్ మార్క్ కొట్టేస్తే శివబాలాజి అండ్ ఆదర్శ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు తమని తాము మౌల్డ్ చేసుకుంటూ అన్ని ఎమోషన్స్ ని సమపాళ్ళలో పండించారని అనిపిస్తుంది. తన నాగింగ్ తో కంటెస్టెంట్స్ కి ప్రేక్షకులకి కూడా టీజింగ్ టార్గెట్ గా మారిన అర్చనని ఆఖరికి బిగ్ బాస్ కూడా టీజ్ చేసిన ఎపిసోడ్స్ హిలేరియస్ కాదనగలరా ఎవరైనా. 

ఈ షో ఫైనలిస్టుల గురించి బిగ్ బాస్ హౌస్ లో వారి జర్నీ గురించి నిన్నటి ఎపిసోడ్ ఒక సమ్మరీ ఇస్తుంది ఆ ఎపిసోడ్ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ చూసి మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ వేసి తనని గెలిపించుకోండి. ఇలాగే రాబోయే బిగ్ బాస్ సీజన్లు ఎన్టీఆర్ హోస్టింగ్ తో మరింతగా అలరిస్తాయని అనుకుంటున్నాను. బిగ్ బాస్ లో ఎన్టీఆర్ అమేజింగ్ జర్నీ గురించిన వీడియో ఇక్కడ చూడవచ్చు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.