బుధవారం, సెప్టెంబర్ 20, 2017

బిగ్ బాస్...

బిగ్ బాస్ అనే రియాలిటీ షో తెలుగులోనా.. అసలా షో ఫార్మాట్ చుట్టూ ఉండే కాంట్రవర్సీలు, ఆ కంటెంట్ మన తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తాయి... అసలదే కంటెంట్ ని యాజ్ టీజ్ గా తెలుగులో చూపించగలరా.. తారక్ ఏమాత్రం హోస్ట్ చేయగలరో.. సెలెబ్స్ ఎవరు వస్తారో ఇలా పలు అనుమానాల మధ్య షో స్టార్ట్ అయింది.. నిజం చెప్పాలంటే సెలెబ్రిటీస్ లిస్ట్ చూశాక వీళ్ళని ఎన్టీఆర్ గారు హోస్ట్ చేయడమేంటి ఏమొచ్చింది ఈ బిగ్ బాస్ టీమ్ కి ఈ సెలెక్షన్ ఎంటి అని షోమీద ఇంట్రస్ట్ పూర్తిగా తగ్గిపోయింది. 

మొదటి వీకెండ్ ఇంట్రడక్షన్ అయ్యాక రెండవ వీకెండ్ తారక్ షో చూశాక  కేవలం తన యాంకరింగ్ కోసం చూడచ్చేమో అనిపించింది ఆ తర్వాత వీకెండ్ నుండి ప్రతి వీకెండ్ కేవలం తారక్ కోసమే చూడడం మొదలు పెట్టాను. వాట్ ఏన్ ఎంటర్ టైనర్ హీ ఈజ్.. మెల్లగా మా ఇంట్లో కూడా అందరూ ఈ షోకి అడిక్ట్ అయి నాకు వీక్ డేస్ చూడడం కుదరకపోయినా ఎవరో ఒకరికి ఫోన్ చేసినపుడు హైలైట్స్ వింటూ వచ్చాను. 

రాను రాను ఈ ఫైనల్ వీక్ కి వచ్చేసరికి ఇపుడు ఆ ఫైనలిస్ట్స్ అందరినీ తెలుగు కుటుంబాలు తమ ఇంట్లో ఒక్కరిగా ట్రీట్ చేస్తూ అచ్చం తారక్ చెప్పినట్లే వాళ్ళ ఇంటితో పాటు బిగ్ బాస్ ఇంటిపై ఒక కన్ను వేసి ఉంచుతూ తమ కంటెస్టంట్ ని సేవ్ చేస్కోవాలని వాళ్ళని గెలిపించాలని వాళ్ళు పడే తాపత్రయం వారం వారం పెరుగుతున్న వోట్ల సంఖ్యను చూస్తేనే అర్ధమవుతుంది. 

మొదటలో టిపికల్ టీవీ సోప్స్ తరహాలో ఏడుపులు మొత్తుకోళ్ళతో మొదలైనా కానీ రాను రాను ఎంటర్టైన్మెంట్ కి విలువిచ్చే టాస్కులతో (రిక్షా, స్కూల్), కంటెస్టంట్స్ లోని టాలెంట్ ని చూపే పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడంలో బిగ్ బాస్ టీమ్ ప్రయత్నాలని మెచ్చుకోకుండా ఉండలేం. మొత్తం షోని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మాట్ ని కాస్త మార్చేసి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కస్టమైజ్ చేసినందుకు వారిని అభినందించి తీరాలి. 

ఇదంతా ఒక ఎత్తైతే తారక్ హోస్టింగ్ ఒక్కటీ ఒకఎత్తు ఎక్కడా ఒక్క నిముషం కూడా బోర్/విసుగు అనే పదాలకి ఆస్కారమివ్వకుండా తను ఎంటర్టైన్ చేసే తీరు అభినందనీయం. తన చలాకీతనం, సమయస్ఫూర్తి, కలుపుగోలు తనం, కంటెస్టెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యే తీరు వారితో ఫ్రెండ్లీగా ఉంటూనే వాళ్ళని నొప్పించకుండా వారిలో లోటుపాట్లను సున్నితంగా ఎత్తి చూపించిన తీరు అమోఘం.  

ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సమ్మోహనాస్త్రంతో ప్రేక్షకులను కట్టిపడేశాడంతే. మిగిలిన సెలబ్స్ సంగతేమో కానీ ఈ షో వల్ల తారక్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఇంట్లోని మనిషయ్యాడు తనకు ఖచ్చితంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిఉంటుందని నా ఉద్దేశ్యం. మొదట్లో ఏమో అనుకున్నాను కానీ తనని హోస్ట్ గా సెలెక్ట్ చేయడమే బిగ్ బాస్ టీమ్ తొలి విజయం అని మొదటి రెండు మూడు వారాల్లోనే ఆర్ధమై పోయింది. 

ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే నా పర్సనల్ ఫేవరెట్స్ హరితేజ అండ్ నవదీప్. ఎంటర్టైన్మెంట్ విషయంలో వీరిద్దరూ ఫస్ట్ మార్క్ కొట్టేస్తే శివబాలాజి అండ్ ఆదర్శ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు తమని తాము మౌల్డ్ చేసుకుంటూ అన్ని ఎమోషన్స్ ని సమపాళ్ళలో పండించారని అనిపిస్తుంది. తన నాగింగ్ తో కంటెస్టెంట్స్ కి ప్రేక్షకులకి కూడా టీజింగ్ టార్గెట్ గా మారిన అర్చనని ఆఖరికి బిగ్ బాస్ కూడా టీజ్ చేసిన ఎపిసోడ్స్ హిలేరియస్ కాదనగలరా ఎవరైనా. 

ఈ షో ఫైనలిస్టుల గురించి బిగ్ బాస్ హౌస్ లో వారి జర్నీ గురించి నిన్నటి ఎపిసోడ్ ఒక సమ్మరీ ఇస్తుంది ఆ ఎపిసోడ్ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ చూసి మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ వేసి తనని గెలిపించుకోండి. ఇలాగే రాబోయే బిగ్ బాస్ సీజన్లు ఎన్టీఆర్ హోస్టింగ్ తో మరింతగా అలరిస్తాయని అనుకుంటున్నాను. బిగ్ బాస్ లో ఎన్టీఆర్ అమేజింగ్ జర్నీ గురించిన వీడియో ఇక్కడ చూడవచ్చు.

13 కామెంట్‌లు:

  1. బట్ ఫర్ హరితేజ..బిగ్బాస్ ఈజ్ యే వల్గర్ పీపింగ్ టాం షో..ఫ్యూచర్ లో బాలీవుడ్ బిగ్బాస్ స్తాయిలో దీన్ని తెలుగులోనూ చేస్తే..ఊహూ..ఆ ఊహే భయాన్ని కలిగిస్తోంది..జూనియర్ యన్.టి.ఆర్ గారి లవకుశ అద్భుత విజయం సాధించాలని ఆకాంక్ష..వారు మరేదన్న మరింత మంచి ప్రోగ్రాం హోస్ట్ చేస్తే హాయిగా మా పిల్లలతో కలిసి ఇంటిల్లిపాదిమీ చూడాలని ఆశ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు... నేను విన్నదాన్నిబట్టి ఇంటర్నేషనల్ నేషనల్ వర్షన్స్ తో పోలిస్తే మనది బెటరే ఆని నాకనిపించిందండీ. అలాగే నేను చూసిన ఎపిసోడ్స్ లో నాకు హోటల్ టాస్క్ లో తప్ప అంత వల్గారిటీ ఏం కనిపించలేదు.

      లవకుశ హిట్ అవ్వాలనీ అలాగే ఎన్టీఆర్ చలాకీతనం చూశాక ఫ్యామిలీ అండ్ పిల్లలతో కలిసి ఒక షో ఏదైనా చేస్తే పిల్లల్లో పిల్లాడిలా కలిసిపోతారు మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని నేనూ కోరుకుంటున్నానండీ.

      తొలగించండి
  2. Well said శాంతి గారు. కానీ ఇటువంటి విషయాలలో సాధారణంగా మన ఆశలు అడియాసలే అవుతాయి. వాళ్ళ లెక్కలే వాళ్ళకి ముఖ్యం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఫర్ ద కామెంట్ నరసింహారావు గారు... లెక్కలు కూడా బాగా కుదిరే ఫ్యామిలీ షో చేస్తాడని కోరుకుందామండి..

      తొలగించండి
  3. నేను కనీసం ఒక్క ఎపిసోడ్ కూడా చూడని షో అండీ ఇది.. విచిత్రం ఏమిటంటే, మా ఇంటిల్లిపాదీ 'బిగ్ బాస్' కి వీరాభిమానులు!! కాబట్టి, షో వివరాలన్నీ నాకు పరోక్షంగా తెలుసన్నమాట.. హరితేజకి మా ఇంట్లోనుంచి వోటింగ్ బాగా జరుగుతోంది :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఫర్ ద కామెంట్ మురళి గారు.. హరితేజ ఫాలోయింగ్ బావుందండీ.. ఎన్టీఆర్ ఎపిసోడ్స్ వరకైనా చూడచ్చండీ మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నాను. ఇక్కడ పాత ఎపిసోడ్స్ అన్నీ చూడవచ్చు సమయం దొరికితే ప్రయత్నించండి. http://www.hotstar.com/tv/bigg-boss/14714

      తొలగించండి
  4. Nenu two weeks nundi chustunnaa adi kuda maa gold lo mornings ..Tarak kosam maatram weekends chustunnaa ... Hari teja konchem over action taggiste baagundedi ... Archana final ki elaa vacchindo mari ...
    Tarak mantram baagaa pani chesindi e show ki Radhika(nani)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఫర్ ద కామెంట్ రాధిక గారు. నేనూ మొదట్లో వీకెండ్స్ మాత్రమే ఎన్టీఆర్ కోసం చూసేవాడ్నండీ మధ్యలోనుండి కాస్త ఫాలో అవడం మొదలెట్టాను. తారక్ గురించి కరెక్ట్ గా చెప్పారు.

      తొలగించండి
  5. మీకు చెప్పడానికీ.. యే యే షోస్ అసభ్యం గా ఉన్నాయో మార్క్ చేయడానికీ నేను చూసీ..మార్క్ చేసీ..మళ్ళీ వాటినిక్కడ కాపీ పేస్ట్ చేసీ..మరింతమందిని మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ గా చూసేలా చేసీ..యెందుకులెండి వేణూజీ..కౌపీన సంరక్షణార్ధం కధైపోతుందేమో..జస్ట్ జోకింగ్..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహహ మీ కామెంట్ చదివి పెద్దగా పైకే నవ్వేశానండీ.. మీరు చెప్పినదీ పాయింటే లెండి :-)

      తొలగించండి
  6. టీవీ అంటేనే పడనీ నేను ఏదో ఒక సందర్భంలో బిగ్ బాస్ చూడటం జరిగింది ...... అప్పటినుండి వీలున్నప్పుడు చూస్తూ ఆదర్శ్ కి ఫ్యాన్ అయ్యాను .హరితేజ రాను రాను నచ్చేసింది శివ బాలాజీ ఆదర్శ్ హుందాగా ప్రవర్తించారు వున్నంతవరకు మహేష్ గారు డీసెంట్ గానే వున్నారు ఇకపోతే మిగిలిన వారు ....ఆహార్య వ్యవహారాలూ .... చూడాలి అనే ఇచ్ఛ కూడా హుష్ ..;-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఫర్ ద కామెంట్ హిమబిందు గారు.. అవునండీ ఆదర్శ్ పక్కా జంటిల్మేన్ అని పేరు తెచ్చేసుకున్నాడు ఈ షో తో.. కాకపోతే ఎంటర్టైన్ చేసినది కూడా తక్కువే అనిపించింది నాకు.

      తొలగించండి
  7. We panikimalina buchiki pogrom and jabardast pogrom both are disgusting

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.