“సీతతో అదంత వీజీ కాదు” అంటూ నచ్చిన అమ్మాయిని ఎలా లవ్లో పడేయాలా అని ప్రయత్నాలు చేస్తూ పక్కవాళ్ళ సలహాలు విని భంగపడే అమాయకపు దొరబాబు గా, చివరికి తన మామ దుర్భుద్ది తెలిసి అతనికి గడ్డిపెట్టే పాత్రలో తన మొదటి సినిమా “శ్రీకనకమాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్” తోనే నన్ను ఆకట్టుకున్నారు. తర్వాత “చెట్టుకిందప్లీడర్” లో రాజేంద్రప్రసాద్ గుక్కతిప్పుకోకుండా తనకారు గొప్పతనం గురించి పేజీలు పేజీలు డైలాగులు చెప్తుంటే వాటన్నిటికీ సమాథానంగా “పాత సామాన్లు కొంటాం” అని ఒకే ఒక్క డైలాగ్ తో నన్ను కుదురుగా కుర్చీలో కూర్చోనివ్వకుండా నవ్వించి నా మనసులో కామెడీ ఆర్టీస్ట్ గా చెరగని ముద్ర వేసుకున్నారు. అంతలోనే “శివ” సినిమా లో నానాజీ గా ఓ వైవిధ్యమైన గెటప్ మరియూ డైలాగ్ డెలివరీతో “అఛ్చా!! భరణి కామెడీ ఆర్టిస్ట్ మాత్రమేగాదు మంచి నటుడు” అని మనందరిచేతా శబాష్ అనిపించుకున్నాడు.
ఇక అక్కడనుండి... వంటింట్లో అన్నం, పిల్లల చేతిలో ఐస్క్రీం లాంటివి దొంగిలిస్తూ తన పెళ్ళి జైల్లో జరగాలని కలలుకనే “చిలిపిదొంగ” గా అల్లరి చేసినా, “నాకో బుల్లి చెల్లి.. నేడే గల్లీలో దానికి పెళ్ళి.. ఇది జరగాలి మళ్ళీ మళ్ళీ” అంటూ తోటరాముడుగా లొల్లి చేసినా, “వారెవా ఏమి ఫేసు” అంటూ మాణిక్యంగా ఖాన్ దాదాని మాటల్తో మాయచేసినా, లాయర్ సాబ్ గా గాయంలో మాచిరాజుకి చట్టానికి దొరక్కుండా దందాచేసే సలహాలిచ్చినా, ఇంద్రన్న నమ్మిన బంటు వాల్మీకి గా యావన్మందినీ మెప్పించినా, భార్యని అమితంగా ప్రేమిస్తూ ఏనాటికైనా అసెంబ్లీ లో కొరమీనంత మైకట్టుకొని “అద్దెచ్చా” అనాలనుందంటూ చేపలకృష్ణగా అదరగొట్టినా చూస్తున్న మనం నటుణ్ణి మర్చిపోయి ఆయా పాత్రల్లో మాత్రమే లీనమయ్యేలా చేయడం తనికెళ్ల భరణి గారి గొప్పతనమే. కమర్షియల్ సినిమాల్లో పాత్రలేకాకుండా తిలదానం, గ్రహణం లాంటి చిత్రాలలో సైతం మంచి పాత్రల్లో మనని రంజింప చేశారు. ఇలా తలుచుకుంటుంటే ఈ జాబితాకు అంతే ఉండదు, ఆయన చేసిన పాత్రలన్నీ కళ్ళముందు సజీవంగా కదులుతున్నాయి.
నటుడికన్నా ముందు ఒక మంచి రచయిత అయిన భరణి నటుడిగా బిజీ అయ్యాక మాట మాట్లాడితే కలం మడిచి జేబులో పెట్టేశానని అంటుంటారు కానీ ఆ కలానికి సాగటమే తప్ప ఆగటం తెలీదు. తెలిస్తే తెలంగాణా యాసలో ఇంత చక్కటి శివస్తుతిని పలికించగలిగేదా. మొన్న తనకి జరిగిన వెండి పండుగ సభలో చదివి వినిపించిన “శబ్బాసు రా శంకరా” నాకు చాలా నచ్చేసి మళ్ళీ మళ్ళీ వినడానికి mp3 గా మార్చుకుని మీతో కూడా పంచుకుందామని ఇదిగో ఇక్కడ ఇస్తున్నాను చిత్తగించండి. దీన్ని పైరసీ అనచ్చేమో నాకు తెలీదు కానీ నన్నడిగితే మాత్రం అభిమానమనే అంటాను. క్రింద ప్లేయర్ లోడ్ అయ్యాక ప్లేబటన్ నొక్కి భరణి గారు తన స్వరంతో వినిపించిన ఈ శివస్తుతి వినవచ్చు, ఆడియో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ నొక్కండి.
శంకర అంటెనే నాకు
శెక్కెర లెక్కనె ఉంటదయ్య
శివునాఙ్ఞైతది చీమనైత
శబ్బాసురా శంకరా
శెక్కెర లెక్కనె ఉంటదయ్య
శివునాఙ్ఞైతది చీమనైత
శబ్బాసురా శంకరా
“శివునాఙ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటూ” శంకరునికి పరమ విధేయత కల్గిన ప్రాణిగా మనకి పరిచయమైన చీమతో తనని తాను పోల్చుకుంటూ అలానే ఈశ్వరునితో పోలిస్తే తను చీమంత అల్పుణ్నని ఒద్దికగా చెప్తూనే చక్కెర వైపు చీమ ఆకర్షింప బడినట్లు నీవైపు నేనాకర్షింపబడతాను అదికూడా నీ ఆఙ్ఞమేరకే అని చెప్పడం ఎంత బాగుంది.
***
గణపతి దేవుడు నీకు బిడ్డ
ఖబరస్థానేమో నీ అడ్డ
నీతత్వాల్ బాడత కాళ్ళమీద బడ్డా
శబ్బాసురా శంకరా
***
ఆధాచంద్రమ నెత్తిమీద
నీలో ఆధానేమో అమ్మాయే
పూరా ఙ్ఞానివి నీకు సాటెవరురా
శబ్బాసురా శంకరా
***
పెండ్లామా పెద్దమ్మతల్లి
గంగెంట ఏందీ లొల్లి
మూడుకండ్లుంటెనె రెండు ఇండ్లాయెరా
శబ్బాసురా శంకరా
***
పెద్దోన్కెమో సిద్ధి బుద్ధి
చిన్నోన్కి దేవమ్మ శ్రీవల్లి
నీ ఖాన్దాన్ మొత్తం ఇద్దరే ఇద్దరా
శబ్బాసురా శంకరా
***
బైటికి బండబూతివి
అర్ధంగాని లోలోతివి
కరిగే రాతివి పరంజ్యోతివి
శబ్బాసురా శంకరా
***
“నాకా రావయ ఓనమాలు
బిల్ కుల్ రాదు చందస్సు
నువ్వే యతివి గణాలు సుట్టుముట్టూ
శబ్బాసురా శంకరా”
గణపతి దేవుడు నీకు బిడ్డ
ఖబరస్థానేమో నీ అడ్డ
నీతత్వాల్ బాడత కాళ్ళమీద బడ్డా
శబ్బాసురా శంకరా
***
ఆధాచంద్రమ నెత్తిమీద
నీలో ఆధానేమో అమ్మాయే
పూరా ఙ్ఞానివి నీకు సాటెవరురా
శబ్బాసురా శంకరా
***
పెండ్లామా పెద్దమ్మతల్లి
గంగెంట ఏందీ లొల్లి
మూడుకండ్లుంటెనె రెండు ఇండ్లాయెరా
శబ్బాసురా శంకరా
***
పెద్దోన్కెమో సిద్ధి బుద్ధి
చిన్నోన్కి దేవమ్మ శ్రీవల్లి
నీ ఖాన్దాన్ మొత్తం ఇద్దరే ఇద్దరా
శబ్బాసురా శంకరా
***
బైటికి బండబూతివి
అర్ధంగాని లోలోతివి
కరిగే రాతివి పరంజ్యోతివి
శబ్బాసురా శంకరా
***
“నాకా రావయ ఓనమాలు
బిల్ కుల్ రాదు చందస్సు
నువ్వే యతివి గణాలు సుట్టుముట్టూ
శబ్బాసురా శంకరా”
ఛందస్సులోని యతిని గణాలను తీసుకుని ఈశ్వరునిలోని యతికి ఆతని ప్రమధ గణాలకు ఇంత చక్కగా లంకేసి సర్వం ఈశ్వరమయమని తనచే పలికించేది వాడే అని ఎంత అందంగా చెప్పాడు.
***
కన్ను దెరిస్తె నువ్వే
కన్నులు మూస్తెభి నువ్వే
మా కండ్లల కారు చీకటుల కారణమేందిరా..
శబ్బాసురా శంకరా
బిడ్డా ఇది పాపిష్టిలోకము
దీన్ని నేనే జూడ మీకెందుకు
అనిమాకన్నులు మూసిపెట్టినవు లే
శబ్బాసురా శంకరా
కన్ను దెరిస్తె నువ్వే
కన్నులు మూస్తెభి నువ్వే
మా కండ్లల కారు చీకటుల కారణమేందిరా..
శబ్బాసురా శంకరా
బిడ్డా ఇది పాపిష్టిలోకము
దీన్ని నేనే జూడ మీకెందుకు
అనిమాకన్నులు మూసిపెట్టినవు లే
శబ్బాసురా శంకరా
కళ్ళు మూసినా తెరిచినా కారుచీకట్లే ఏమీ కనపడదంటూ కళ్ళలో నీళ్ళుకారడానికి బదులు చీకట్లు కారు తున్నాయి అని అంటూ ఒక్క పదానికి ఎన్ని భావాలు.
***
కారటుదీస్తది సిల్క
పనులైతై పైసలిమ్మంటదీ
ఇది కాకింటది కావు కావంటది
శబ్బాసురా శంకరా
కారటుదీస్తది సిల్క
పనులైతై పైసలిమ్మంటదీ
ఇది కాకింటది కావు కావంటది
శబ్బాసురా శంకరా
హ హ జాతకం కార్డు తీసిన చిలక నీ పనులవుతాయి పైసలివ్వవోయ్ అని అడిగితే పైన ఎగురుతున్న కాకి ఇది విని తన కావ్ కావ్ అనే అరుపులతో ఆపనులు కావుకావు నమ్మద్దని చెప్తున్నదని భరణి చమత్కారం :-) శెబ్బాస్ అనిపించుకోక ఏముంది.
***
క్వాయిష్ ఒక్కటె నాకు ఎప్పటికీ
కైలాసమెటు బోవుడో
కాశీబోవుడు కాలిపోవుడూ
శబ్బాసురా శంకరా
క్వాయిష్ ఒక్కటె నాకు ఎప్పటికీ
కైలాసమెటు బోవుడో
కాశీబోవుడు కాలిపోవుడూ
శబ్బాసురా శంకరా
******
భరణి వెండి పండుగ వీడియో ఇక్కడ చూడవచ్చు. తన ప్రసంగం 11ని:25సె కు మొదలౌతుంది. తనికెళ్ళ భరణి గారి ప్రసంగం చివరలో 26ని:32సె. దగ్గర తెలుగు భాషకు మాత్రమే ప్రత్యేకమైన సాహితీ ప్రక్రియ పద్యం అని చెపుతూ, శ్రీకృష్ణదేవరాయలు గారు అల్లసాని పెద్దనని కవిత్వం లక్షణాలు ఎలా ఉండాలి అని అడిగితే పెద్దన గారు ఆశువుగా చెప్పిన “పూతమెరంగులన్” పద్యమును భరణిగారు చదివిన తీరు పండితులను పామరులను సమానంగా ఆకట్టుకుంటుంది అంటే అతిశయోక్తి కాదేమో.
ఇటీవలే వెండి పండుగ జరుపుకున్న మా తనికెళ్ళ భరణి నిండు నూరేళ్ళూ మరెన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ మరిన్ని మంచి రచనలు చేయాలనీ, ఆ శక్తినీ, ఆసక్తినీ, ఆయుష్షునీ ఆకళామతల్లి తన ముద్దుబిడ్డకు ఆశీస్సులుగా అందజేయాలని మనసారా కోరుకుంటూ శలవు.
చివరి దాకా చదివించారు. చదువుతున్నాకొద్దీ పక్కా నిజం అనిపించింది. తనికెళ్ళ భరణి అంటే ఎందుకబ్బా నాకంతిష్టం అనుకునే దాన్ని ఇన్నాళ్ళు. ఇప్పుడర్ధమయింది.
రిప్లయితొలగించండిమా టివిలో ఈ కార్యక్రమం చూసేటప్పుడు నాక్కూడా భలే నచ్చిందండీ ఈ శివస్తుతి.బే ఏరియాలో తనికెళ్ళ భరణిగారితో "సాహితీ పంచామృతం" కార్యక్రమం సిలికానాంధ్ర వారు డిసెంబర్,5 న జరుపుతున్నారు.
రిప్లయితొలగించండిఎదో పనిమీద బయటకి వెళ్తూ రవీంద్ర భారతి దగ్గర తనికెళ్ళ భరణి వెండి తెర వెండి పండగ అని చూసి అయ్యో చూడలేకపోతున్నా అనుకున్నా మీ పోస్ట్ చదివి నిజంగానే చాలా ఆనందం వేసింది. భరణి గారు మనమద్య ఉన్న మనిషిలా నటిస్తారు నాకు ఆయన నటన ఇష్టం. శివస్తుతి బగుంది.
రిప్లయితొలగించండిఅద్భుతంగా రాశారు వేణు గారు :)
రిప్లయితొలగించండిగిదెందిర దేముడ, పరీక్షల టైంల గిసొంటి కథలు సూపిస్తున్నవ్...పాటాలు సదవాల్నా కథలు సదవల్న సమజైతల్లె.
రిప్లయితొలగించండిమంచిగ సదువుకునె టైమల బ్లొగ్ పెట్టలని ఆలోచన తెప్పించినవ్...గిప్పుదు గిసొంటి కథలు సదివినంక నేనేంది బ్లొగేంది అని పరెషాన్ అయితున్న....జెర దారి సూపియ్యి
శ్రీకాంత్ గారు నేను బాగా ఇష్టపడే సహజనటుల్లో తనికెళ్ళ మొదటి వారు .
రిప్లయితొలగించండితెలంగాణా మాండలికం లో కే సి ఆర్ కూడా మాట్లాడలేని విధం గా మస్తు మాట్లడతార్
ఇంక శివస్తుతి ఆ మాండలికం లో రాసారని వినడమే గాని అయన గొంతు తో వినడం ఇదే ప్రధమం .
ఇంక కొంత వునట్టు గా వుంది ?చెంబుడు నీళ్ళు పోస్తేనే ఖుష్ రెండు ఆకులేస్తేనే బస్ అనికూడా రాసారనుకుంటా
మొన్ననే వారి మరదలు నా దగ్గరే పని చేస్తున్నారని తెలిసి ఆయనకే లీవు ఇస్తునట్టు గా భావించి అడిగిన వెంటనే ఇచ్చేసా.
లీవు నుంచి వచ్చాక ఆయనతో లంచ్ అడగాలి ఈ సారి .
జయగారు నెనర్లు, తనికెళ్ళ భరణి గారిని ఇష్టపడని వారు బహుఅరుదుగా ఉంటారేమోనండి, నాకైతే ఇప్పటివరకు కనిపించలేదు.
రిప్లయితొలగించండిమెహెక్ గారు నెనర్లు, బే ఏరియా “సాహితీ పంచామృతం” వివరాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.
రమణి గారు నెనర్లు, >>”భరణి గారు మనమద్య ఉన్న మనిషిలా నటిస్తారు”<< ఒక్క ముక్కలో భలే చెప్పారండీ నిజ్జంగా నిజం. అందుకే ఆయనకు ఇంతమంది అభిమానులు.
సృజన గారు నెనర్లు.
ఎన్నెల గారు నెనర్లు, మీకామెంట్ బాగుంది. నా ఉచిత సలహ (అసలు ఉచిత కాదు ఇది Free Advise అనమాట) ఏంటంటే, ఈ బ్లాగులు సోషల్ నెట్వర్క్ లు అన్నీ సెకండరీ అండీ పరీక్షలు చదువు కెరీర్ మొదటి స్థానం తీసుకుంటాయ్ కనుక మీరు పరీక్షలన్నీ బాగా రాసి అప్పుడు బ్లాగ్ వైపు దృష్టిసారించండి.
రవిగారు నెనర్లు, అవునండీ ఇంకా చాలా ఉండి ఉండవచ్చు ఇంకా ఇవి అచ్చుకు నోచుకున్నాయోలేదో కూడా నాకు తెలీదు, మచ్చుకి కొన్ని వారు మొన్న వెండి పండుగలో చదివారు అవి మాత్రమే ఇక్కడ ఇచ్చాను. మీరు చెప్పిన లైన్ కూడా బాగుంది.
స్నేహానికి తను చాలా విలువ ఇస్తారని చెప్పుకుంటారండి, ఆవిషయంలో ఆయన మనసో పుష్పక విమానం ఎందరెక్కినా మరొకరికి చోటుంటుంది అని అంటారు. తప్పకుండా లంచ్ కి ప్లాన్ చేయండి, గుడ్ లక్.
Really I liked this video very much.
రిప్లయితొలగించండిEspecially the last Alla Sani pedda gari pdayam is amazing.
Thanks for nice post and sharing the great video with us.
today I have downloaded this video.
ఆరోజు 'మా' టి.వీ. లో కార్యక్రమం పూర్తిగా చూడలేదే అన్న లోటు తీర్చేశారు. అన్నిటిలోకీ నాకు భరణి గారిలో నచ్చేదేమిటంటే, ఆయన తెలుగులోనే సంతకం చేయడం.మీ వ్యాసం బ్రహ్మాండంగా ఉంది...
రిప్లయితొలగించండిశుభకార్యానికి కుంకుమ భరిణ
రిప్లయితొలగించండిసినిమారంగానికి తనికెళ్ళ భరణి
ఉండాలిరా శంకరా..!
మాటల్లో చేతల్లో గొప్ప సంస్కారం, స్వచ్ఛత ఉట్టిపడే మంచి మనిషి భరణిగారు. వారిగురించి మంచి టపా వేసినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండినిజంగా చెప్పాలంటే నాకంత గొప్పగా అనిపించలేదు. మరి ఇక్కడ ఎందుకు మెచ్చుకుంటున్నారో తెలియదు. తెలంగాణా భాష అని తిక్కతిక్కగా రాయాల్సిన అవసరమేమిటో!
రిప్లయితొలగించండిలక్ష్మణ్ గారు నెనర్లు, నేను శివస్తుతిలోపడి పద్యం మాట మరిచాను, గుర్తుచేసినందుకు నెనర్లు.
రిప్లయితొలగించండిఫణిబాబు గారు నెనర్లు, ఓహో ఈ తెలుగు లోమాత్రమే సంతకం చేయడం అనేది నేను గమనించలేదండి తెలిపినందుకు ధన్యవాదాలు.
అక్షరమోహనం గారు నెనర్లు, భలే చెప్పారు.
భైరవభట్ల కామేశ్వరరావు గారు నెనర్లు.
అఙ్ఞాత గారు, జీహ్వకోరుచి అని అందుకే అన్నారు, కానీ యాసని పక్కన పెట్టినా భావం బాగుంది కదా. ఏదేమైనా మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు నెనర్లు.
ఓ వీడియో పెట్టారా.. చాలా బాగుంది శ్రీకాంత్
రిప్లయితొలగించండిచక్కగా విశ్లేషించారు వేణూ శ్రీకాంత్ గారు.
రిప్లయితొలగించండిసహజ నటుడు అంటే కోట,భరణి ఇలా ఉంటారేమో! సినిమాల్లో కేవలం పాత్ర మాత్రమే కనిపిస్తుంది. నాకైతే 'మనీ' లో తను చేసిన మాణిక్యం పాత్ర చాలా ఇష్టం.
వేణు గారు. తనికెళ్ళ భరణి గారి గురించి విశేషాలు పంచుకున్నందుకు నెనర్లు.. ఎ పాత్రలోనైనా లీనమయి ఒదిగిపోయి నటించే భరణి గారి శివ సినిమా పాత్ర నానాజీ పాత్ర ఇన్నేళ్ళయిన ఇప్పటికి కాళ్ళ ముందు కనపడుతుంది. ఇంకా ఇటువంటి పాత్రలు ఎన్నో హాస్యం, విలనీయం, తండ్రి ఇంకా ఎ పాత్ర అయిన సరే అతనికి అతనే సాటి అనవచ్చు అనుకుంటా. అతని గొంతులో శివ స్తుతి బాగుంది.
రిప్లయితొలగించండినేస్తం నెనర్లు.
రిప్లయితొలగించండిహరేకృష్ణ నెనర్లు, మాణిక్యం పాత్ర ఎక్సెలెంట్ :)
భానుగారు నెనర్లు, బాగా చెప్పారు.
సూపరు...నేను ఎంతో ప్రీతిగా చూసాను ఆ ప్రోగ్రాం ని. భరణి గారి లాంటి రచయిత పెన్ను మడిచి జేబులో పెట్టేయడం మాత్రం నాకెంతమాత్రమూ నచ్చలేదు. ఆవిషయంలో కోటా, భరణి కి చెప్పిన మాటలు నాకు బాగా నచ్చాయి.
రిప్లయితొలగించండిమీరు రికార్డ్ పెట్టడంతో మరోసారీ చూస్తున్నా, చాలా సంతోషంగా ఉంది. Thank u so much!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినాకు అన్నిటికన్నా చాలా నచ్చి, మనసులోపలకి చొచ్చుకున్న ముక్కలు ఇవి:
రిప్లయితొలగించండికన్ను దెరిస్తె నువ్వే
కన్నులు మూస్తెభి నువ్వే
మా కండ్లల కారు చీకటుల కారణమేందిరా..
శబ్బాసురా శంకరా
బిడ్డా ఇది పాపిష్టిలోకము
దీన్ని నేనే జూడ మీకెందుకు
అనిమాకన్నులు మూసిపెట్టినవు లే
శబ్బాసురా శంకరా
కారటుదీస్తది సిల్క
పనులైతై పైసలిమ్మంటదీ
ఇది కాకింటది కావు కావంటది
శబ్బాసురా శంకరా
వేణూ శ్రీకాంత్ గారూ.. నాకు మీ పోస్ట్ ఎంత నచ్చిందో చెప్పలేను. తనికెళ్ల భరణి గారంటే నాకు చాలా గౌరవం. చాలా మంచి పోస్ట్ రాసారు. Wonderful..:)
రిప్లయితొలగించండిచాలా బాగుందండి... ఆ ప్రోగ్రాము, మీ వ్యాసం రెండు.
రిప్లయితొలగించండిభరణిగారు వ్రాసిన పరికిణి కవిత ఎవరైనా పోస్టు చేస్తారా.. ప్లీజ్.
సౌమ్య నెనర్లు, హ్మ్ నిజమేనండి కానీ భరణి గారి ప్రసంగంలో పరుచూరిబ్రదర్స్ లా కమర్షియల్ కాలేక తనని తాను నటనకు పరిమితం చేసుకున్నాను అని ఆయనే అన్నారు. చూద్దాం నటనలో కాస్త ఖాళీ దొరికాక మళ్ళీ ఏమైనా తరచుగా రాస్తారేమో.
రిప్లయితొలగించండిఅపర్ణ గారు నెనర్లు. >>”తనికెళ్ల భరణి గారంటే నాకు చాలా గౌరవం”<< ఈ వాక్యం చాలా నచ్చిందండి.
కొండముది సాయికిరణ్ కుమార్ గారు నెనర్లు, పరికిణీ గురించి తృష్ణ గారి బ్లాగ్ లో ఇక్కడ చూడచ్చండి http://trishnaventa.blogspot.com/2010/10/blog-post_19.html
నేనీ కార్యక్రమం మిస్సయ్యానండి. ఇందాకనే ఒకరు ఫోన్లో చెప్పారు చాలా బాగుందని. టపా బాగుందండి. నేను ఆయన రాసిన "నాలోన శివిడు కలడు" కేసెట్లో పాతలు నాకు భలే ఇష్టమండి. లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండితనికెళ్ళ భరణి అభిమానుల్లో నేనూ ఒకడిని. ఎంతో కొంత వైవిధ్యం చూపే హాస్య నటుడు. డైలాగు చెప్పడంలోనూ, హావభావాలలోనూ అప్పుడప్పుడు రేలంగిని గుర్తుకు తెస్తాడు అని అనిపిస్తుంది నాకు.
రిప్లయితొలగించండిభరణి రచనలు నేను ఆట్టే చదవలేదు.నటుడి కన్నా మంచి రచయిత అంటారు చాలామంది. ఈ శివస్తుతి చూసిన తర్వాత బహుశా నిజమేమో ననిపిస్తోంది.
మీ టపా చాలా బాగుంది.
very nice post..
రిప్లయితొలగించండితృష్ణ గారు నెనర్లు. ఈ వీడియో యుట్యూబ్ లో చూస్తే రిలేటెడ్ వీడియోస్ లో మొదటి రెండు భాగాలు కూడా చూడచ్చండి. ఎంజాయ్ మరి.
రిప్లయితొలగించండిబులుసు సుబ్రహ్మణ్యం గారు నెనర్లు. రేలంగి లా అనిపించడం కొత్త కోణం :) ఈ సారి గమనించి చూస్తానండి.
మురళి గారు నెనర్లు.
వేణూ గారూ..భరణి గారి గురించి చాలా బాగా రాశారు..ఎలాంటి పాత్రలో ఐనా ఇట్టే ఇమిడిపోతారాయన..అయినా ఆయన గురించి చక్కగా వర్ణించి చెప్పటానికి మా మురళి ఉన్నాడు..వేణూ గారున్నారు,ఇంకా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు...ఆయన మీద నాకు మొదట్నుంచీ నాకు ఒక విధమైన అభిమానం...అది మా గురువుగారికి కొడుకు వరసవ్వటం మూలానో లేక మంచి రచయిత అనో,ఇదమిత్థం అని చెప్పలేను...గత సంవత్సరం పుస్తకాల పండగలో మా స్టాలుకి చాలా మంది విఐపిలు వచ్చినా,నాకు ఆసక్తిలేక ఎవ్వర్నీ పరిచయం చేసుకోలేదు....మా వాళ్ళు మాటాడుతుంటే నేను బైటకెళ్ళిపోయేవాణ్ణి..కాని, భరణి గారు వచ్చినప్పుడు నాకు బైటకి అడుగులు కదల్లేదు..ఆయన నిరాడంబరత,అందరితో ఆయన మెసిలినతీరు ఆయన మీద నాకున్న అభిమానాన్ని, ఒక గౌరవభావంగా మార్చాయి...పిలిచిమరీ అందర్నీ పక్కన నించుండబెట్టుకుని ఫొటోలు దిగారు...ఇక ఆయన్ని పరిచయం చేసుకోకుండా ఉండలేకపోయా..వెనకే వెళ్ళి గురువుగారి పేరు చెప్పి పరిచయం చేసుకున్నా..చాలా బాగా మాటాడారు..నాకు గురువుగారివి కొన్ని పుస్తకాలు దొరకట్లేదు అంటే,"మా ఇంటికొచ్చెయ్,నేనిస్తా" అని ఆయన చెప్పిన తీరు....తర్వాత బైట కూర్చుని అందరికీ మిక్చ్రర్,టీ ఇప్పించి ఒక గంట పైగా,రకరకాల విషయాలు చెప్పారు..సగానికి పైగా గురువు గారివే..."కౌటిల్యుడూ" అని ఆయన పిలిచిన పిలుపు ఇప్పటికీ మర్చిపోలేను..సతీష్ గారు నన్ను చూపించి"ఈ అబ్బాయి వేయిపడగలు చదువుతానన్నవారందరికీ కొని మరీ ఇస్తాడండీ" అని చెప్పినప్పుడు,"మరి నాకో కౌటిల్యుడూ" అని గారంగా అడిగిన ఆయన కలుపుగోలుతనం నాకు ఎంతో బాగా అనిపించింది..."ఇతను వేయిపడగల్లో 'అరుంధతి'లాంటి అమ్మాయి దొరికితె తప్ప పెళ్ళి చేసుకోనని కూర్చున్నాడండీ" అని సతీష్ చెప్పినప్పుడు,"నువ్వు ధర్మారావులా ఉంటే,అరుంధతి తప్పకుండా వస్తుంది"అని చెప్పినప్పుడు నాకు తెలియజెప్పి,ఆశీర్వదించినట్టనిపించింది...ఇంకా ఇలా బోల్డు విషయాలు....తర్వాత జనవరి ఒకటి సాయంత్రం,సతీష్ ఫోన్ చేసి నీతో ఒక స్పెషల్ వ్యక్తి మాటాడతారట అంటుంటే వెనకనుంచి "ఎవరూ,కౌటిల్యుడా" అన్న గొంతు వినగానే నిజమేనా అని నేను ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే,"డాక్టర్ గారూ!న్యూ ఇయర్ మా ఇంట్లో చేసుకుందాం వచ్చెయ్యండి" అన్నమాటతో ఆయన అభిమానంగా మాటాడుతుంటే,ఆరోజే గుంటూరొచ్చిన నా దురదృష్టాన్ని ఎంత తిట్టుకున్నానో...ఆ మాటే చెప్తే ఆయన"పర్లెదులే కౌటిల్యుడూ! నేను విజయవాడ తరచుగా వస్తుంటా!మనం కలుద్దాం" అనగానే(నన్ను కలువు అన్లేదండీ) ఆయన నిరాడంబరత నాకు ఆయన మీదున్న గౌరవాన్ని రెట్టింపు చేసింది..తర్వాత ఆయన "నాలోనశివుడు కలడు", "ఆటకదరా శివా" ఆల్బమ్స్ విన్నాక ఆయన తత్త్వపులోతులు అర్థమయ్యాయి..ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో...
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశబ్బాస్, అబ్బాస్, వొ ఇచ్చు, వొత్తాచు, పరేషాను, లొల్లి ఏమిటా పదాలు?! అది నైజాము తెలంగాణ గల్లీ భాష అవుతుంది కాని, తెలంగాణ అచ్చ తెలుగు కాదు. తెలంగాణా వాళ్ళని దెప్పటమా లేదా తెరాస వాళ్ళను మెప్పించే ప్రయత్నమా?! ఎంత హైద్రాబాద్లో సెటిలవుదామనుకున్నా ఇలా తెలుగు భాషను ఖూనీ చేయాల్సిన అవసరం లేదనుకుంటా, ఈ విశాఖపట్నం నటుడికి. ఇది రాజకీయం లా వుంది, భక్తి కాదు. ఓ మంచి నటుడే కాని కొంచెం అరవ ఆక్షన్ కూడా చేస్తాడు.
రిప్లయితొలగించండిపోతే ఓ డౌటు: శివునికి గంగ భార్యనా?!! గిరిజా పరిణయం విన్నాము, శంకరునితో గంగా పరిణయం ఎప్పుడూ వినలేదు. మరి శంతనుడితో 8మంది పిల్లల్ని కన్న గంగ ఎవరు? ఈ కవుల పైత్యానికి అడ్డు అయిపూ లేకుండా పోతోంది. ఏదో శ్రీనాధుడు వ్యంగంగా అన్నాడని, అర్ధనారీశ్వరునికి అక్రమ సంభంధం అంటకట్టడం అంత బాగోలేదు.
Thank you Venu gaaru.
రిప్లయితొలగించండిమంచి పోస్టు వేణూగారు...భరణిగారిని ఏఒక్క రంగానికో పరిమితం చేసి చూడలనుకోవడం అవివేకమేమో... he's a genuine genius in film industry...
రిప్లయితొలగించండి@snkr గారుః ఇన్ని రోజులు తెలంగాణా యాస, తెలంగాణ మాండలికం అనివిన్నా...కొత్తగా తెలంగాణ అచ్చ తెలుగు ఏంటి గురువుగారు. నిజాములు రాకముందుకూడా ఇక్కడ 'తెలంగాణా తెలుగు' అని ఉండేదా ? సెటైరో మరేదో అనుకునేరు...జస్ట్ information కోసం అడుగుతున్నా.. :)
తెలంగాణ వున్నప్పుడు భాష కూడా తప్పకుండా వుంటుంది. ఆ తెలుగు అచ్చ (స్వచ్చ?)అయ్యే వుంటుంది, పోతే ప్రతి 100కిమీ దూరానికి మాండలికమో, యాసో మరేంటో మారుతూనే వుంటుంది కదా. ఏదో information కోసం ఇస్తున్నా.. :)
రిప్లయితొలగించండిఅవివేకమంటే .. భరణి బ్రాండు మీకు బాగా నచ్చేసినట్టుంది ఏంచేస్తాం? ఇదే బ్రాండ్ మీద కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, కెమరా, స్టంట్లు, డాన్సులు ఏమైనా వున్నాయా? :P :)
కౌటిల్య మీ సుధీర్ఘమైన కామెంట్ కు నెనర్లు. మీ కామెంట్ ఆయనపై అభిమానాన్ని గౌరవాన్ని పదింతలు చేసేదిగా ఉంది. నిజంగా భరణి గారితో అంత మధురమైన అనుభూతులు పంచుకున్న మీరు ధన్యులు. మరి ఈ న్యూఇయర్ వాళ్ళ ఇంట్లో గడిపే ఆలోచనలేమన్నా ఉన్నాయా :) అన్నట్లు మీ వేయిపడగలు కాన్సెప్ట్ బాగుందండోయ్ మీ అరుంధతి అతి త్వరలో మీకు దక్కాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను :-)
రిప్లయితొలగించండిశంకర్ గారు నెనర్లు, శబ్బాస్, పరేషాన్, లొల్లి ఇవన్నీ హైదరాబాద్ లో వినబడే మాటలే కదా నా వరంగల్ ప్రాంత నేస్తాలు కూడా ఇదేరీతిగా మాట్లడటం విన్నాను ఇది తెలంగాణా యాస కాదా ? మీరే మరో కామెంట్ లో అన్నట్లు ప్రతి వంద కిలోమీటర్లకు యాస మారతుంది కదా.. మీరు అంటున్న తెలంగాణ యాస మరి హైదరాబాద్ కు దూరంగా ఉన్న ప్రాంతాల్లొ వేరేగా ఉందేమో.
గంగ గురించి మంచి ప్రశ్నే లేవనెత్తారు ఆ తత్వం చూడగానే నాకు అదే అనుమానం వచ్చింది కాకపోతే ఇష్టదైవమైన భోళాశంకరునితో పరాచికాలాడటం కవులకు కొత్తకాదుగా అని సరిపెట్టుకున్నాను.
అఙ్ఞాత గారు నెనర్లు, నిజమే భరణిగారిని రచనకో నటనకో ఏ ఒక్క విభాగానికో పరిమితం చేయలేము.
అర్రె, చాలా లేటుగా చుస్తున్నా ఈ టపా!
రిప్లయితొలగించండిమీరంతా కుళ్ళుకునే సంగతి! ఈ కార్యక్రమానికి నేను వెళ్ళాను, రవీంద్ర భారతిలో!
ఈ తెలుగు స్టాల్ కి వచ్చి ఇంట్లో మనిషిలా మాట్లాడిన విషయం ఇప్పటికీ మేమంతా చెప్పుకుంటాం! కదూ కౌటిల్యా!
"నా మొహం నేనెవరికి తెలుస్తాను ఇంటర్నెట్లో" అని అనగానే నేను "పరికిణీ"అని గూగుల్ లో వెదగ్గానే వందల పేజీలు భరణి పేరుమీదుగా రాగానే ఎంతో ఆశ్చర్యపోయారు. "ఇదేదో పట్టించుకోవలసిన విషయంలాగే ఉందిరోయ్" అని వెంట వచ్చిన చుట్టాలబ్బాయితో అన్నారు.
వెళుతూ వెళ్తూ లేఖినిలో "మీ ఈతెలుగు బ్లాగు బ్లాగు" అని రాశారు!
అంతే కాదు పోయిన డిసెంబర్ 31 న రాత్రి 11-30 కి ఫోన్ చేసి "అమ్మా హాపీ న్యూ యియర్ తల్లీ" అని చెప్పడం ఇప్పటికీ భలేగా అనిపిస్తుంది.
He is a gifted artist!
వేణుగారు...మీ టపా కొద్దిగా ఆలస్యంగా చదివి కామెంటుతున్నా.నాకు భరణి గారంటే ఇష్టం.ముఖ్యంగా తోటరాముడు అస్సలు ఎవరు మర్చిపోలేని కారెక్టర్. చాలా వైవిధ్య పత్రలు ధరంచిన ఆయన గొప్ప రచయిత కూడా.నేను ఆయన వ్రాసిన కొన్ని కథలు విపుల,చతుర లో చదివేదాన్ని.చలం గారు వ్రాసిన ఒక కథకి ఆయన అర్ధం చెబుతు వ్రాసిన వ్యాసం నాకు చాలా చాల నచ్చింది. మీ టపా కూడా చాల బాగుంది. :)
రిప్లయితొలగించండిsnkr గారు,
రిప్లయితొలగించండినిన్ననే ఉషశ్రీ సమాధానాల్లో చదివాను. శివుడి భార్య గంగ అనేది కవుల ఊహే గానీ సత్యం కాదట. శంతనుడి తో బిడ్డల్ని కన్న గంగే గంగ! శివుడి నెత్తి న బంధిచబడింది కాబట్టి (నెత్తినెక్కే హక్కు భార్యలదే అని నానుడి కాబట్టి అనుకుంటా) ఆయన్ని భార్యగా కవులు భావించి ఉంటారేమో!
ఇకపోతే కేవలం హైద్రాబాదుకు పరిమితమైన ఆంధ్రా వాళ్ళకు ఇక్కడి తెలుగే అలవాటవుతుంది కానీ అసలు సిసలు తెలంగాణా యాస ఎలా పట్టుబడుతుంది చెప్పండి?
చాలా బాగా రాశారు వేణు.
రిప్లయితొలగించండిసుజాత గారు నెనర్లు, ఆహ మీరు లైవ్ చూశారా.. నిజంగానే నేను కుళ్ళుకుంటున్నాను.. లైవ్ చూడలేకపోయినందుకు అప్పటి పుస్తకాల పండగలో పాలుపంచుకోలేకపోయినందుకు. ఒక్కమాటలో బాగాచెప్పారు Yes he is a gifted artist.
రిప్లయితొలగించండిఇందుగారు నెనర్లు, ఆయన ఏ క్యారెక్టర్ వేసినా మరిచిపోలేనిదేనండీ... ఒక సత్యంసినిమాలో యువరచయితల టాలెంట్ ను స్వార్ధానికి ఉపయోగించుకునే రచయితగా వేసినా... మరో గోదావరి లాంచీలో అందరినీ కలుపుకు పోయే అమాయకపు కెప్టెన్ గా వేసినా ఆ పాత్రలే అలా గుర్తుండిపోతాయ్ అంతే...
కొత్తపాళీ గారు నెనర్లు.
వీడియోలింకు పంచుకున్నందుకు నెనర్లు. అన్ని భాగాలు చూసేశా.
రిప్లయితొలగించండిజేబి గారు నెనర్లు.
రిప్లయితొలగించండిఅద్భుతంగా రాశారు వేణు గారు.. ఈ ప్రోగ్రాం నేను కూడా చూసాను మా టివి లో
రిప్లయితొలగించండిశివరంజని గారు నెనర్లు.
రిప్లయితొలగించండిబ్లాగ్ ప్రవేశ మహోస్త్సవము :
రిప్లయితొలగించండిHi friends,
Please visit my blog which is just started.
Thanks for your time
ennela
venu gaaru,
రిప్లయితొలగించండిnaa koththa tapaalo mee ee post and mee peru paddayi... nachchindemo cheputara
warm regards
ennela
ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు నెనర్లు ఎన్నెల గారు. టపాలు చూశాను బాగున్నాయి.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికవులది పైత్యం అని తిట్టడం, తెరాస వాళ్ళను మూర్ఖులు అన్నాను, మరి అది అభ్యంతరకరంగా లేదా? అలాగే చివరిపేరా కూడా, అందులో అంత నిజం లేదనిపిస్తోంది. అది కూడా తొలగించేసేయండి, చప్పగా, బాగా వుంటుంది. :P
రిప్లయితొలగించండినేనే మొత్తం కామెంట్ తీసేసేవాడిని, కాని ఇప్పుడది మీ పేరు మీద వుంది.
వేణుగారు, వికీ లీక్స్ అసాంజ్ ను అమెరికా ఏం చేయాలంటారు? జైల్లో పెట్టి కుళ్ళపొడవాలంటారా? :)
Snkr గారు
రిప్లయితొలగించండిDone as you requested :-) You can edit it and post again with your name if you want.
No comments on Wiki Leaks :-)
నా కామెంట్ సేవ్ చేసుకోలేదు. ఐనా కామెంట్ పెట్టాలనే మూడ్ పోయింది. మరోసారెపుడైనా సెన్సార్ వారితో బాగా రెండుమూడు మార్లు నమిలించి, పిప్పి కామెంట్ పెడతాలేండి. :))
రిప్లయితొలగించండిథాంక్సులు
మిమ్మల్ని డిజప్పాయింట్ చేసినందుకు సారీ. నా బ్లాగ్ లో భాషవిషయమై కాంప్రమైజ్ కాలేను. మా ఇంటిల్లిపాదే కాక నేను నా తల్లిదండ్రులతో సమానంగా గౌరవించే పెద్దలు చాలామంది నా బ్లాగ్ చూస్తారు. వారికి అసౌకర్యం కలిగించే ఏ పనీ నేను చేయలేను. నాకు నచ్చని విషయమేదైనా ఎదురైనపుడు దాన్ని పదే పదే పది సార్లు కోట్ చేస్తూ నిరసన తెలుపకుండా సాధ్యమైనంతవరకూ పక్కకు తప్పుకుని వెళ్ళడం నా వైఖరి. అందుకే మీరు చెప్పిన విషయాలు ఇక్కడ ఉండాల్సిన అవసరంలేదు అనిపించి తొలగించాను.
రిప్లయితొలగించండిVery wonderfully written
రిప్లయితొలగించండిThank you 6' Solfier
రిప్లయితొలగించండిహమ్మయ్య . మీకు బోలెడు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమూడు రోజుల నించీ అల్లసాని పెద్దన గారి పద్య మాలిక కోసం వెతుకుతున్నా. తెలుగు లో గూగుల్ లో వెతికితే మొత్తానికి దొరికింది.
చాలా చాలా థాంక్స్.
నేను మొదటి రెండు భాగాలు చూసి నచ్చలేదు. భరణి గారి మీద కొంచం గౌరవం తగ్గింది. ఈయన డబ్బులిచ్చి సన్మానం చేయించుకున్నట్టు ఉందని.
మీ పుణ్యమా అని మూడవ భాగం చూసి కొంచం తృప్తి కలిగింది. ఆయన ఉద్దేశ్యం ఏంటో తెలిసి.
థాంక్స్
వాసు
వాసు గారు నెనర్లు, నేను మొదటి రెండు భాగాలు చూడలేదండీ.. ఓ నేస్తం చెప్పడం వల్ల ఈ పార్ట్ చూశాను. వెంటనే పోస్ట్ చేశాను.. మీకు నచ్చినందుకు ఉపయోగపడినందుకు సంతోషం.
రిప్లయితొలగించండిThis book is now available on Kinige http://kinige.com/kbrowse.php?via=author&id=36
రిప్లయితొలగించండిThanks for the update కిరణ్ గారు.
రిప్లయితొలగించండిభరణి, మంచి రచయితే ఐనా నటుడిగా ఇంకా మేటి అని నా అభిప్రాయం.
రిప్లయితొలగించండి-Murali
కాదనలేని సత్యం మురళి గారు..
రిప్లయితొలగించండి