జ్యోతిగారు బ్లాగ్ వన భొజనాలకు ఆహ్వానాన్నందించారు బాగానే ఉంది కానీ మన వంతుగా మనం ఏం తీసుకు వెళ్దాం అని కాస్సేపాలోచించానా అంతలో మనల్ని పదో తరగతి నుండి ఇలాంటి వన భోజనాలు లేదా పాట్ లక్ లలో ఆదుకుంటున్న సరంజామా గుర్తొచ్చింది. అవును కదా మరి అందరూ వంటలే చేసుకొస్తే ప్లేట్లు, కట్లెరీ ఎవరు తెస్తారు అని వెంటనే అవి పట్టుకొద్దాం అని నిర్ణయించేసుకున్నా :-D మాములుగా ఇదివరకు అలవాటైన ప్లాస్టిక్ సామాగ్రి పట్టుకొద్దామంటే ఈ మధ్య పర్యావరణం పై మక్కువ పెరిగింది అదీకాక కాస్తంత గ్రాండ్ గా కూడా ఉంటుందని మన బ్లాగర్లందరి కోసం వెండి కంచాలు, బంగారు పూతపూసిన కట్లెరీ తీసుకువచ్చాను అందుకోండి. అహా మాకు మ్యాచింగ్ మ్యాచింగ్ కావాలి అంటారా అలాగే వెండి కట్లెరీ కూడా ఆ చివర్న ఉన్నాయ్ చూడండి. |
వెండి కంచాలు |
బంగరు పూత పూసిన కట్లెరి |
వెండి కట్లెరీ |
రాత్రి ఇక్కడి వరకే టైప్ చేసి ఉదయాన్నే పోస్ట్ చేసేద్దాం అనుకున్నా కానీ ఉదయాన్నే కాస్త తొందరగా పదింటికి లేచి ఆత్మారాముడ్ని శాంతింప చేద్దామని ఆలోచిస్తుంటే అవును ఇదెందుకు బ్లాగ్ లో పెట్టేయకూడదూ అనిపించింది. ఆలోచనొస్తే ఊరుకుంటామా, మరి నేను చేసిన ఈ స్టీందోశ కూడ రుచి చూసి వెళ్ళండి. అంటే మరి హోటల్లో చేసే స్టీందోశ ఎలా చేస్తారో నాకు తెలీదు మరి దీన్ని స్టీందోశ అనచ్చోలేదో కూడా నాకు తెలీదు. నేను చేసుకునే ఈ దోశ ప్రత్యేకత ఏంటంటే అస్సలు నూనె వాడకపోవడం ఇంకా పెనం పైన మూత పెట్టి ఆవిరితో కూడా ఉడికించడం. అందుకే దీన్ని నేను స్టీందోశ అని పిలుచుకుంటాను, ఎప్పుడైనా ప్రత్యేకమైన అకేషన్ కు నెయ్యివేసి పలచగా కరకరలాడేలా చేసిన దోశలు తిన్నా, సాధారణంగా నాకు ఇలా స్టీం చేసుకునే దోశలంటేనే ఇష్టం, కాస్త పలచగా పోసి ఎక్కువ కాలిస్తే ఇవికూడా కరకరలాడుతాయండోయ్.
నేనైతే మా ఇంటిదగ్గరలోని బేకరీలోనో కిరాణా కొట్టులోనో దొరికే రెడీమేడ్ దోశపిండి కొనుక్కొని వచ్చి చేస్తాను. ఓపిక ఉన్నవాళ్ళు ఒక వంతు మినప్పప్పుకు ఒకటింపావు వంతు బియ్యం ఓ ఐదుగంటలు నాన పెట్టి మిక్సీలో రుబ్బుకుని మెత్తని దోశ పిండి తయారు చేసుకోవచ్చు. వంటలో కార్బోహైడ్రేట్స్ తగ్గించాలనుకునే వాళ్ళు మినప్పప్పు ఎక్కువ వేసి బియ్యం తగ్గించుకోవచ్చు కాకుంటే దోశలు కాస్త గట్టిగా వస్తాయి అవి మెత్తబడాలంటే మిక్సీలోవేసేముందు కాసిన్ని మెంతులు కలుపుకోవచ్చు కాకుంటే రుచి కొద్దిగా మారుతుంది. ఇక బియ్యం ఎక్కువేసిన ఈ పిండి ముందు రోజు రాత్రే రడీ చేసుకుని ఒక ఐదారు గంటలు పులవనిచ్చి ఉదయాన్నే దోశలు వేసుకుంటే పుల్లట్లు బ్రహ్మాండంగా వస్తాయి కానీ ఐదుగంటలైన వెంటనే ఫ్రిజ్ లో పెట్టటం మరిచి ఎక్కువ పులిస్తే రుచి పాడైపోతుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. నేను కొనుక్కొచ్చిన పిండికి కాసిని నీళ్ళు కాస్తంత ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకుంటాను, ఎప్పుడైనా పిండి మరీ తాజాగా ఉండి అస్సలు పులవలేదు అనిపిస్తే కాస్త పెరుగు కానీ మజ్జిగ కానీ కలుపుతుంటాను.
మనం నూనె కూడా వాడట్లేదు కనుక నాన్ స్టిక్ దోశల పెనం ఉపయోగిస్తే దోశలు పెనానికి అంటుకోకుండా చక్కగా వస్తాయి . ఇక మొదటి దోశ ఎప్పుడూ సరిగా రాదు అంటూ ఉంటారు చాలామంది కానీ గ్యాస్ మంటను మీడియం కన్నా కాస్త తక్కువలో ఫోటోలో చూపినట్లుగా పెట్టి ఓపికగా పెనం సరైన ఉష్ణోగ్రతకు చేరుకునే వరకూ ఎదురు చూస్తే మొదటి దోశ ఐనా పెనంకు అంటుకు పోకుండా చక్కగా వస్తుంది. ఈ సరైన ఉష్ణోగ్రత తెలుసుకోడానికి నేను పెనం పై ఇంచుమించు మూడు అంగుళాల దూరంలో అఱచేయి బోర్లించి చేతికి వేడి తగిలేదీ లేనిదీ చూస్తాను. అలా పెనం వేడెక్కాక ఒక గరిటెతో దోశపిండిని పెనం మధ్యలో వేసి గరిటె అడుగుభాగంతో పిండిపై నెమ్మదిగా నొక్కుతూ పిండిని గుండ్రంగా పెనం అంతా పరచుకునేలా తిప్పాలి. ఆ వెంటనే పెనం పైన దోశను పూర్తిగా కవర్ చేయగల మూతను బోర్లించాలి, ఈ మూత గాజుదైతే దోశ స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి సులువుగా ఉంటుంది. ఈ మూత వలన అవిరికి దోశ పైన కూడ చక్కగా ఉడికినది గమనించి మూత తీసి అట్లకాడతో అంచు వెంబడి మెల్లగా దోశను పెనం నుండి వేరు చేసి ఆపై పూర్తిగా తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు దోశను తిరగేయాల్సిన అవసరం ఉండదు. అలా కాదూ రెండు వైపులా ఎక్కువగా కాలిన క్రిస్పీదోశ నాకిష్టం అంటే తిరగేసి రెండోవైపు కూడా కాల్చవచ్చు.
దోశకూ దోశకు మధ్య నూనె/నెయ్యి లో ముంచిన గుడ్డతో కానీ అవి వద్దనుకుంటే తడి గుడ్డతో కానీ సగం కోసిన ఉల్లిపాయతోకానీ పెనం అంతా ఒకసారి రుద్దితే ఉష్ణోగ్రత కాస్త తగ్గి పెనం అంతా సమంగా విస్తరించడం వలన దోశ చక్కగా వస్తుంది. ఇక దోశ పైన పలుచగా గుంటూరు సంబారు కారం చల్లుకోవడమో (మన దగ్గర స్టాకులేదు అందుకే ఫోటోబులో అది మిస్సింగ్) లేదా అసలు పిండిలోనే ఉప్పుతో పాటు కాస్తంత కారం కూడా కలిపేయడమో చేశారంటే ఈ దోశలను చట్నీకూడా అవసరం లేకుండా లాగించేయచ్చు. పై ఫోటోలోనిది ఒక్క చుక్క ఆయిల్ కూడా ఉపయోగించకుండా వేసిన దోశ. That is హెల్తీ దోశ making for dummies :-)
hmm...nice dosa.
రిప్లయితొలగించండివెండి కంచాలు, కట్లెరీ చాలా బాగున్నాయి. :)దోశ కూడా బాగుంది.
రిప్లయితొలగించండిఈ దోశ చిరంజీవికి ఇష్టమైన వంటకం అండీ (అవును.. మన ప్రజారాజ్యం చిరంజీవే).. ఆమధ్య ఎక్కడో చదివిన జ్ఞాపకం.. మా ఇంట్లో పెనాన్ని తడి చేయడానికి ఆనపకాయ ముచికి వాడతారు.. ఎలాగూ కాయ కొని తేగానే ముచికి కోసేస్తారు కదా, కాయ ముదిరిపోకుండా ఉంటుందని.. దాన్నిలా ఉపయోగిస్తారన్న మాట.. బాగుందండీ దోశ.. కట్లేరీ కూడా :-)
రిప్లయితొలగించండిchala baga chepparu dosha gurinchi
రిప్లయితొలగించండిఅబ్బ ఎంత వివరంగా చెప్పారండి, దోశ చేయటం. ఇంక ఎటువంటి అనుమానాలు రావంతే. మీరు తెచ్చిన వెండి పళ్ళాలు అందరికీ సరిపోతాయంటారా!!!!అంతకు డబల్ స్పూన్లు పెట్టానులే అంటారా... ఇప్పుడేగా ఏ డౌట్స్ రావని మళ్ళీ ఈ అడగడమేంటి అంటారా:((((
రిప్లయితొలగించండిచాలా ట్రిక్కులే తెలుసు మీకు! good show
రిప్లయితొలగించండిమీ స్టీం దోశ చాలా బాగుందండి .
రిప్లయితొలగించండివెండి ప్లేట్లూ , కట్లరీ సూపర్ .
మీ స్టీమ్ దోసె వెంటనే తినాలనిపించేలా రుచికరంగా ఉంది. :) వెండి, బంగారు కట్లరీనా? వెళ్ళేప్పుడు మీరు తిరిగి ఇంటికి తీస్కెళ్ళేది ఉందా లేకపోతే మాకు తలా ఒకటి ఇచ్చేస్తారా? ;)
రిప్లయితొలగించండిసునీత గారు, శిశిర గారు నెనర్లు
రిప్లయితొలగించండిమురళి గారు నెనర్లు, ఆనపకాయ్ ఐడియా బాగుందండి అదే ప్రయత్నిస్తాను. చిరంజీవికి నచ్చిన స్టీందోశ గురించి నేకూడా చదివానండి.
స్వప్న గారు నెనర్లు.
జయ గారు నెనర్లు, హ హ అంటే మీకు శాంపిల్ గా ఒక సెట్ ప్లేట్లు మాత్రం చూపించానండీ వచ్చిన అందరికీ సరిపడేలా లోడ్ దించేపూచీనాదీ.
కొత్తపాళీ గారు నెనర్లు. వంటను ఆపస్సమయంలో ఆదుకునేవి ఈ ట్రిక్కులే కదండి మరీ అందుకే జాగ్రత్తగా ఫాలో అవుతుంట.
మాలా కుమార్ గారు నెనర్లు.
మధుర గారు నెనర్లు, దాన్దేం మహాద్భాగ్యం అలానే సావెనీర్ గా తలా ఒకటి ఇచ్చేద్దాం :-)
ఆహా ఏమి చెప్పారండీ.
రిప్లయితొలగించండిఈ రోజు నా breakfast, lunch (అరగంట తేడాలో) MTR దోశలే with priya lemon pickle :-)
వావ్... ఇదే కదా చట్నీస్ లొ చిరంజీవి దొస అని అమ్మేవాడు.
రిప్లయితొలగించండియువరానర్: దోశని పైన్ చూపించిన వెండికంచంలో కాకుండ స్టీలుప్లేటులో వడ్డించుటను నేను ఖండిస్తున్నా!!!
రిప్లయితొలగించండి>>>గుండ్రంగా పెనం అంతా పరచుకునేలా
ఇది చాలా ముఖ్యం - లేనిచో 'గైడు డౌనుడౌను ' అని ఇచటనూ నినాదాలు వచ్చును :-P
వేణు గారు...బాగున్నాయి మీ కట్లరీ...అలాగే స్టీందోశ కూడా! మీరు దోశ గురించి చెబుతుంటే నాకు మధురవాణిగారి పోస్ట్ గుర్తుకొచ్చిందీ!
రిప్లయితొలగించండిఇష్టమైన వంటకం అండీ.... దోశ కూడా బాగుంది.
రిప్లయితొలగించండిదీన్నే తమిళులు, మళయాళీలు ఆప్పం అంటారు. దానికి ఆప్పం పెనం అని వేరే ఉంటుంది, దాన్లో చేస్తారు. మన చట్నీస్ వాడేమో అట్లపెనం మీద చేసేసి చిరంజీవి దోశ అని మనకి ఇచ్చేస్తాడు.
రిప్లయితొలగించండిమొత్తానికి మీ కట్లరీ అవిడియా బావుంది :)
naakkodaa madhuraa intabbaayi dosa gurtu vachchindi...hmm nenu ayite penaaniki ullipaaya mukka raastaa antukokundaa..
రిప్లయితొలగించండిsorry tenglish lo raasaa comment:(
ఇందు నా బ్లాగ్ లో మీకు వేణు గారికి బలే ఐడియా లో వస్తాయండి అంటే ఏమో అనుకొన్న గాని . బలే ఉందండి మీ కట్లేరి అలాగే మీ దోస కూడా. అదిరిపోయింది :))
రిప్లయితొలగించండివామ్మో....వార్నాయనో...వేణూ గారో..మీరు సూపరుగా...అరిపించారు దోశ టెక్నిక్కులు...భలే చూడముచ్చటగా ఉన్నాయ్ లే, మీ దోశలు...
రిప్లయితొలగించండిమన "సంబారు"కారాన్ని మర్చిపోకుండా రాసినందుకు మంగిడీలు..
paper dosa
రిప్లయితొలగించండిspring dosa
spinach dosa
set dosa
cheese onion dosa
veg dosa
banana dosa
spring roll dosa
pizza dosa,rava,onion,masala,banana dosa
చిన్నప్పటి నుండి తిన్న దోసలన్నీ అలా గుర్తోచ్చేసాయ్
ఇంత వివరంగా చెప్పాక లాభం లేదు..ఈ వారం ట్రై చెయ్యాల్సిందే!
బద్రి గారు నెనర్లు. దోశలు ఎంజాయ్ చేశారా మరి.
రిప్లయితొలగించండిమంచు గారు నెనర్లు, చట్నీస్ లో చిరంజీవి స్టీందోశ గురించి విన్నాను కానీ తినలేదు కాబట్టి ఇది అదోకాదో చెప్పలేను. ఈ సారీ హైదరాబాద్ వెళ్ళినపుడు ట్రైచేసి చెప్తాలెండి.
జేబి గారు నెనర్లు, ఏం చేయమంటారండీ మరి వెండికంచాలన్నీ ఈ ఫోటో తీసేటయానికి వనబోజనాలకి తరలి వెళ్ళాయ్ అందుకే స్టీల్ కంచంలో పెట్టి తీయాల్సొచ్చింది :)
ఇందు గారు నెనర్లు, హ హ నాకూ రాసేప్పుడు మధురగారి పోస్ట్ గుర్తొచ్చిందండి.
చెప్పాలంటే గారు నెనర్లు.
సౌమ్య నెనర్లు, కట్లెరీ ఐడియా నచ్చినందుకు సంతోషం :) ఆప్పం లో మినపప్పు వేయరండి, నానబెట్టిన బియ్యం+కొబ్బరి+అన్నం+కొబ్బరినీళ్ళతో చేస్తారు మనం దోశ మధ్య పలచగా ఉండి చివర్లు కాస్త మందంగా ఉంటే ఆప్పం మధ్య భాగా దళసరిగా ఉండి అంచులకు వెళ్ళె కొద్దీ పలచన అవుతుంది. చట్నీస్ వాడు ఆప్పమే ఇస్తున్నాడేమో ఈ సారి హైదరాబాద్ వెళ్ళినపుడు ట్రై చేయాలి
నేస్తం నెనర్లు, నాకూ ఉల్లిపాయ ముక్కే అలవాటండి.
భానుగారు నెనర్లు :) హ హ మీ కిళ్ళీ ఐడియా ముందు నా కట్లెరీ ఏపాటిదండీ :-)
కౌటిల్య నెనర్లు, మరే దోశలోకారాన్ని ఎలా మర్చిపోతాం :-)
హరే కృష్ణ గారు నెనర్లు, హ హ నేను వివరంగా దోశ గురించి చెప్పడమేమో కాని మీరు దోశల్లో రకాలు భలే లిస్ట్ చేశారుగా ;)
రిప్లయితొలగించండిఅయ్యో ఆప్పం గురించి మీరు నాకు చెబుతున్నారేంటండీ, మా ఇంట్లో వారానికి రెండుసార్లయినా ఆప్పం వేసుకుంటాం :). ఆప్పం చెయ్యడంలో నాది అందెవేసిన చేయి. దానిలో అన్నం వెయ్యరండీ. ఇడ్లీ బియ్యం+మామూలు బియ్యం+కొబ్బరి నీళ్ళు+కొబ్బరి ముక్కలు+కాస్త పంచదార+కాస్త అట్లపిండి...అంతే :)
రిప్లయితొలగించండిఅయ్యో ఆప్పం గురించి మీరు నాకు చెబుతున్నారేంటండీ, మా ఇంట్లో వారానికి రెండుసార్లయినా ఆప్పం వేసుకుంటాం :). ఆప్పం చెయ్యడంలో నాది అందెవేసిన చేయి. దానిలో అన్నం వెయ్యరండీ. ఇడ్లీ బియ్యం+మామూలు బియ్యం+కొబ్బరి నీళ్ళు+కొబ్బరి ముక్కలు+కాస్త పంచదార+కాస్త అట్లపిండి...అంతే :)
రిప్లయితొలగించండిహ హ సరిపోయింది... నాకేంతెలుసు ఆ విషయం :-) అసలు తమిళ/మళయాళీ ఆప్పం విజయనగరం వరకూ వెళ్తుందని ఎలా అనుకుంటా చెప్పండి అందుకే మీకు రెసిపీ చెప్పడానికి ట్రై చేశా :-P
రిప్లయితొలగించండిఅయినా అన్ని తెలిసీ స్టీందోశని ఆప్పం అంటే ఎలా సౌమ్య :-) మీ రెసీపీని బాంది కానీ కాస్త ఆంధ్రైజ్ చేసినట్లున్నారు. మరి నా మళయాళీ రూంమేట్ ఆప్పంలో ఉడికించిన బియ్యంకూడా వేస్తారు అని చెప్పాడు పంచదార మర్చిపోయాను కానీ అట్టుపిండి వేయడు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహి హి హి...ఇది తమిళ ఆప్పం లెండి, తమిళ ఫ్రెండులు నేర్పించినది. మళయాళీ ఆప్పానికి, తమిళ ఆప్పానికి కాస్త తేడా ఉండొచ్చు. మళయాళీలు అట్లపిండి బదులు అన్నం వేస్తారేమో మరి. :)
రిప్లయితొలగించండిదోసెలు వేసుకుని నేను వచ్చేటప్పడికి తినేసారా ? ఆ కంచాలు(పేపర్ ఫ్లేట్స్ కాదు కదా) వెండి కంచాలేనా వేణు గారు ????
రిప్లయితొలగించండిదోసెలు ఎలాగు పెట్టలేదు...అవి వెండి కంచాల అయితే మాత్రం ఇలాగే పడేయండీ
అంతే అయిండచ్చు సౌమ్య :-)
రిప్లయితొలగించండిశివరంజని గారు మీకు ఇలాంటి డౌట్ వచ్చిందేంటండి :-) అవి వెండి కంచాలే యాంటిక్ మోడల్ అనమాట :-) పుచ్చేసుకోండి ఆలశ్యం చేయకుండ.
బోల్డు ఆలస్యంగా చూస్తున్నానండీ. బాగున్నాయి మీ దోశలు. నాకు తెలిసిన స్టీమ్ దోశ రెసిపీ చెప్పానా? అమ్మా, ఇక్కద కాదు నా రుచి బ్లాగ్లో రాస్తాలెండి.ఓ పోస్ట్ అవుతుంది...:)
రిప్లయితొలగించండితృష్ణ గారు నెనర్లు, అలాగే మీ రెసీపీ కోసం మీ రుచిలో వెయిట్ చేస్తా :)
రిప్లయితొలగించండి