సాథారణంగా ఎలాంటి తెలుగు సినిమాఐనా ఆడియో రిలీజ్ ఐన వెంటనే సాధ్యమైనంత త్వరగా వినడం నాకు అలవాటు కనీసం ఒక్క పాట ఐనా బాగుండకపోతుందా అని ఒక ఆశ అనమాట. కాని ఒకోసారి కొన్ని ఆల్బంలు అనుకోని కారణాల వల్ల వెంటనే వినడానికి కుదరదు. అదేంటో నాకు అలా కుదరనపుడల్లా ఆ ఆడియో ఖచ్చితంగా హిట్ ఐ తర్వాత విన్నపుడు ఎలా మిస్ అయ్యాను ఇన్ని రోజులు అనిపిస్తుంది. అలా నేను మిస్ అయి ఆలస్యంగా విన్న ఆడియో ఆరెంజ్. ఆ మధ్య చాలా బిజీగా ఉండి అసలు ఈ సినిమా ఆడియో రిలీజ్ అయినది కూడా తెలుసుకోలేకపోయాను. కాస్త తీరిక దొరికాక చూస్తే పాటలన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో నాకు ఒక ఆల్బంలో అన్ని పాటలు బేషరతుగా నచ్చినది ఈ సినిమాకేనేమో. హెరీస్ జయరాజ్ పాటలు ఇదివరకు కూడా కొన్ని ఆల్బంలలో చాలా సార్లు విన్నా అన్ని పాటలు బాగుండటం అరుదే. అదీకాక ఇప్పటి వరకూ విన్నవి అన్నీ తమిళ డబ్బింగ్ సినిమాలవే అవడంతో కాస్త నిరాశగా ఉండేది. మొదటి సారి ఈ ఆల్బం మాత్రం చాలా సంతోష పెట్టింది. పాటలన్నీ మంచి హుషారుగా స్టైలిష్ గా నవతరపు పోకడలు పోతున్నా మెలోడిలు కూడా ఉండటంతో ఆల్బం ఒక షడ్రసోపేత విందులా వినిపిస్తుంది.
ఊల ఊలాలా/ సిడ్నీ నగరం : ఓ నగరం ఇన్ని రోజులు తన ప్రియురాలిని తనకి కనబడకుండా దాచి ఉంచి నేరం చేసిందని, ఐనా చివరికి తన తప్పు తాను తెలుసుకుని సిగ్గుపడుతూ ఈ రోజు నిన్ను నాకు చూపించింది ఇక ఆలస్యం చేయకుండా ప్రేమించేయమంటూ సాగే ఈ పాట కాన్సెప్ట్ నాకు భలే నచ్చేసింది. సురేంద్ర కృష్ణ/కేదారనాద్ పరిమి రచించిన ఈపాట కారుణ్య స్వరంలో స్టడీ బీట్ తో మెలొడీనా లేక బీట్ సాంగా అని కేటగరైజ్ చేయడానికి ఆలోచించేలా చేస్తుంది. మధ్య మధ్య వచ్చే ఇంగ్లీష్ బిట్స్ కాస్త అడ్డంపడతాయి కానీ అవికూడా ట్రెండీగా ఉన్నాయ్.
చిలిపిగ చూస్తావ్ అలా: ఇది మరో మంచి మెలోడీ, ప్రారంభంలో వచ్చే మ్యూజిక్ బిట్ చాలా హాయిగా మొదలై మన చేయి పట్టుకుని పాటలోకి నడిపించుకు వెళ్తుంది. వనమాలి రచనలోని పదాలు కార్తీక్ స్వరంలో హేరీస్ ఆధ్వర్యంలో హొయలు పోయాయి. మధ్యలో వచ్చే "కొంచెం మధురము" బిట్ పాట విన్న వెంటనే మనసులో నిలిచిపోయి మనల్ని హమ్ చేసేలా చేస్తుంది. కథానాయకుడు ప్రేమ అనుకున్నది ప్రేమకాదని తేలాక నిజమైన ప్రేమను వెదికే ప్రయత్నంలో ప్రేమనే నిందిస్తూ ఈపాట కాన్సెప్ట్ సాగుతుంది.
నేను నువ్వంటూ : వనమాలి రచనలో నరేష్ అయ్యర్ స్వరంతో సాగే ఈ పాట మంచి మెలోడిగా మనసులో నిలిచిపోతుంది. తన ప్రేమని నిజాయితీనీ పొగుడుకుంటూ వాటిలోని ఘాడత మూలంగా తనని ప్రేమించకుండా ఉండటం నీ వల్లకాదు అని కథానాయికకి చెప్తూ సాగుతుంది ఈపాట. పాటంతా స్మూత్ గా చాలా హాయిగా సాగిపోతుంది. ఈ పాట గురించి నే చెప్పడం కన్నా మీరు విని ఆస్వాదించడం బెటర్.
హలో రమ్మంటె : రామజోగయ్య శాస్త్రి రచనతో విజయ్ ప్రకాష్ పాడినది ఈ పాట. మంచి డ్యాన్స్ కు స్కోప్ ఉన్న పాట అనిపించింది. నువ్వు రమ్మంటే వచ్చిన ప్రేమ కాదు నువ్వు పొమ్మంటే పోడానికి అంటూ తన ప్రేమ గొప్పతనాన్ని చెప్తూ ఆ ప్రేమను ఒప్పుకొమ్మని అడిగే కాన్సెప్ట్ తో సాగుతుంది ఈ పాట. చరణానికి ముందు ర్యాప్ తర్వాత వచ్చే ఓ.ఓ అన్న ఆలాపన నాకు బాగా నచ్చింది.
ఓ రేంజి లవ్ ఇది: పాట ముందు మొదలయ్యే డ్రం బీట్ పాట ఎలా సాగనుందో హింట్ ఇస్తూ ఒక మూడ్ క్రియేట్ చేస్తుంది. వనమాలి రచన లొ బెన్నీ పాడాడీపాటను. పల్లవిలో హిందీ ఇంగ్లీష్ తెలుగు కలిసిన సంకరభాష వాడినా స్టైల్ లో అది కొట్టుకుపోయింది. ఇది కూడా తన ప్రేమ గొప్పతనాన్ని తెలుపుతూ ఆ ప్రేమను పొందాలంటే డేరింగ్ కావాలను చెప్తూ మోసగాళ్ళ దగ్గర ప్రేమ కోసం ఎదురు చూడకు నిజాయితీ ఐన ప్రేమను గుర్తించమని తన ప్రియురాలిని అడుగుతూ సాగుతుంది. మంచి హుషారైన పాట.
రూబా రూబా: ప్రేమలో తన పరిస్థితి గురించి వివరిస్తూ సాగే ఈపాట వనమాలి సాహిత్యంతో సింపుల్ గా "ఎంత సేపు కలిసున్నా ఆశే తీరదే ", "నీతో ఉంటె సంతోషం కాదా నిత్యం నా సొంతం" లాంటి వాడుక మాటల లైన్స్ తో అలరిస్తుంది, అక్కడక్కడా హిందీ లైన్స్ ఉన్నా స్వరంలో కలిసిపోయి పెద్దగా ప్లోకు అడ్డం పడవు.
కుహు కుహూ.. కూసే..
-
డబ్బు డబ్బు డబ్బు చిత్రంలోని ఒక మధురమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట
ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
ఎంబెడెడ్ వీడి...
3 సంవత్సరాల క్రితం
నాకు 'నేను నువ్వంటూ' పాట తెగ నచ్చేసింది :-)
రిప్లయితొలగించండివేణు గారు!ఆరెంజ్ పాటలు చాల బాగున్నాయని నేను ఒక పోస్ట్ కూడా పెట్టానండీ!చూసారా మీరు నా బ్లాగ్ రెగ్యులర్ గా చూడకపోవడం వలన ఎంత నష్టం జరిగిందో :P ఊరికె సరదాకి అన్నాలేండీ.నాకు ఈ ఆరెంజ్ పాటలు నచ్చాయి.అచ్చం మీలాగే నాకు హారిస్ తెలుగులో చేసిన అన్ని పాటల్లొకి ఇవి చాల బాగున్నాయి అనిపించింది :)
రిప్లయితొలగించండినిషి నెనర్లు, నేనూ ప్రతీసారీ ఈ ఆల్బం వినడం మొదలుపెట్టేది ఈపాటతోనే :)
రిప్లయితొలగించండిఇందుగారు నెనర్లు, అయ్యో మీ బ్లాగ్ రెగ్యులర్ గా చూస్తానండీ కాకపోతే నేను బిజీగా ఉన్న టైంలో ఈ పోస్ట్ దాని వెంటనే మరోటి వేసినట్లున్నారు అందుకే ఇది మిస్ అయ్యాను.
ఆరెంజ్ పాటలు చాల బాగున్నాయండి "చిలిపిగ చూస్తావ్ అలా" అన్న సాంగ్ అయితే నాకు చాలా నచ్చింది
రిప్లయితొలగించండిహ్మ్మ్... నాకు కూడా బాగా నచ్చాయి వేణు గారూ.. ముఖ్యం గా సిడ్నీ నగరం, రూబ రూబ (అంటే ఏమిటో నాకు తెలీదు.. హీరోయిన్ పేరు అని టాక్) రచ్చ.. రచ్చ :)
రిప్లయితొలగించండిశివరంజని గారు నెనర్లు. అవునండి చిలిపిగ చూస్తావ్ అలా చాలా బాగుంది.
రిప్లయితొలగించండివేణూరాం గారు నెనర్లు, రూబ రూబ అనేది హీరోయిన్ పేరై ఉండదేమో ఏదో రైమింగ్ కోసం ఉపయోగించిన పదాలు అనుకుంటున్నాను అంతే.