అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

మంగళవారం, నవంబర్ 19, 2013

నమస్తే తెలంగాణ పేపర్ లో నేను

నేను కొన్నాళ్ళ క్రితం నవంబర్ చలి గురించి రాసుకున్న "చలి-పులి" అనే ఒక బ్లాగ్ ఆర్టికల్ "నమస్తే తెలంగాణ పేపర్" లోని 'వింటర్ గిలి' కాలమ్ లో మొన్న పద్దెనిమిది నవంబర్ సోమవారం (18-11-2013) నాడు ప్రచురిచతమైంది, ఈ సంధర్బంగా సెలెక్ట్ చేసిన ఆ పేపర్ ఎడిటోరియల్ కీ, అలాగే ఈ విషయాన్ని తన e-మెయిల్ ద్వారా తెలియపరచిన మధు గారికీ బ్లాగ్ముఖతా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 

ప్రచురించబడిన చలి-పులి ఆర్టికల్ పూర్తి వర్షన్ నా బ్లాగ్ లో ఇక్కడ చదవచ్చు. 
నమస్తే తెలంగాణా పేపర్ వెబ్ వర్షన్ లోని ఆర్టికల్ ఇక్కడ, e-పేపర్ లోని వర్షన్ ఇక్కడ నొక్కి చదవచ్చు. 
 


శనివారం, నవంబర్ 02, 2013

నల్లజర్ల రోడ్ గురించి నేను

తిలక్ గారి "నల్లజర్లరోడ్" కథ గురించి నా పరిచయ వ్యాసం "వెంటాడి వేటాడే వెన్నెల దారి" ని e-సాహిత్య పత్రిక "వాకిలి" నవంబర్ నెల సంచికలో ఇక్కడ చదవండి. ఈ పత్రిక లింక్ లో పూర్తి కథ కూడా చదవచ్చు కనుక ఈ చక్కని కథను చదవనివారెవరైనా ఉంటే తప్పక చదవండి డోంట్ మిస్ ఇట్. 

ఈ పోస్ట్ కేవలం నా బ్లాగ్ విజిటర్స్ కు సమాచారాన్ని అందించడం కొరకు మాత్రమే. దయచేసి మీ స్పందనలను కామెంట్స్ రూపంలో పత్రిక పేజ్ లోనే రాయవలసినదిగా మనవి. 

నా వ్యాసాన్ని ప్రచురించిన వాకిలి సంపాదక వర్గానికి ధన్యవాదాలు. ఈ వ్యాసం రాసేలా నన్ను ప్రోత్సహించి చక్కని శీర్షికను సూచించిన సుజాత గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.