గురువారం, ఆగస్టు 12, 2010

లీడర్ మాటీవి లో (ఈ ఆదివారం ఆగస్ట్ 15)

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ’లీడర్’ సినిమా ఈ ఆగస్ట్ పదిహేనో తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ’మా టీవి’ లో ప్రదర్శిస్తున్నారుట, సరైన సమయం ఇంకా తెలియదు బహుశా మద్యాహ్నం ప్రదర్శిస్తుండవచ్చు. సమయం తెలిసాక ఈ పోస్ట్ మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఈ సినిమా మీరు ఇంకా చూడనట్లైతే ఈ అవకాశాన్ని మిస్ కాకుండా తప్పని సరిగా చూడండి.

ప్రదర్శన సమయం : మధ్యాహ్నం ఒంటిగంట (1:00 PM on 15th Aug)

ఈ సినిమా పై ఇదివరకు నేను రాసిన పోస్ట్ ఇక్కడ చదవవచ్చు.



17 కామెంట్‌లు:

  1. హాయ్..వేణు, ఎలా ఉన్నారు?..దీన్ని బ్లాగుల్లోకి మీ పునరాగమనంగా భావించవచ్చా?
    వెల్ కం బ్యాక్..నేను అస్సలు మిస్ కాను లీడర్ సినిమాని...

    రిప్లయితొలగించండి
  2. నేను బాగున్నాను శేఖర్ మీ ఆత్మీయమైన పలకరింపుకు నెనర్లు :-) ఇంచుమించు అంతే అనుకోవచ్చు :-) థ్యాంక్యూ..

    రిప్లయితొలగించండి
  3. బ్లాగింగుకి పునఃస్వాగతం వేణుగారు. happy to see you again

    రిప్లయితొలగించండి
  4. వేణు గారు వెల్ కం బ్యాక్ ! Happy to see you again

    రిప్లయితొలగించండి
  5. welcome back sir!ఊరికే వస్తే లాభం లేదు సార్, కొత్త కొత్త కబుర్లు బోలెడు తేవాలి మరి!

    రిప్లయితొలగించండి
  6. మీరు మీరేనా!! కూడలి లో మీ బ్లాగ్ చూసి, ఇదేంటి ఇంకెవరైన ఇలాంటి పేరుతో బ్లాగు ఓపెన్ చేశారేమో అనుకున్నా.. :)

    Welcome back sir jee...!
    లీడర్ సినిమా మాత్రం నాకు అసలు నచ్చలేదు..

    రిప్లయితొలగించండి
  7. వేణు, happy to see you back!

    ఇంక కుమ్మేయండి.

    రిప్లయితొలగించండి
  8. నాగార్జున, శ్రావ్య గారు, హరేకృష్ణ గారు, ఆ.సౌమ్య గారు నెనర్లు.

    సుజాత గారు నెనర్లు, ఏంటండోయ్ ’సార్’ అని ఈ కొత్త పిలుపు:-) మనం మనం పేట్రియాట్స్ ఇలా సార్ మేడమ్ అనేసుకుంటే ఎలా :-)

    మేధ గారు నెనర్లు, నేను నేనే :) కాస్త ఫ్రీటైం దొరికింది, నాలుగు కబుర్లు అందరితో పంచుకోవాలని మళ్ళీ మొదలు పెట్టాను.

    రిప్లయితొలగించండి
  9. రండి రండి రండి దయ చేయండి తమరి రాక మాకెంతోసంతోషం సుమండి.. నేను లీడర్ చూడనండి..మొదటి హీరోయిన్ అలా వచ్చి,రాని తెలుగులో ముద్దు ముద్దు గా పలుకుతుంటే కష్టపడి ఇంటెర్వెల్ లోపల అలవాటు చేసుకున్నానా..ఉన్నట్లుండి ఆ అమ్మాయికి అన్యాయం చేసేసి ఇంకో అమ్మాయిని ప్రేమించేస్తాడు రాణా ..నాకేం నచ్చలేదంతే :)

    రిప్లయితొలగించండి
  10. Welcome back Venu.
    :)

    ఏంటో నా పేరు నేను పిలిస్తుంటే అదోలా ఉంది.
    :D

    నేను రెగ్యులర్ గా వెతుక్కును చూసే బ్లాగుల్లో మీదొకటి. అలాంటిది మీది Open to invited readers only అని చూసే సరికి బాధేసింది. కారణాలు అంతగా తెలీదు కానీ, బ్లాగుల్లో అర్ధవంతమైనా పోస్టులు వ్రాసే అతి కొద్దిమందిలో మీరు కూడా మానెయ్యటం బాలేదు. ఏదేతైనేమి మళ్ళీ వచ్చారు. ఇంకెప్పుడూ అలా అలిగి వెళ్ళిపోమాకండి.
    :)

    ఇక లీడర్ విషయానికొస్తే నాక్కూడా ఈ సినిమా బాగా నచ్చింది. క్లైమాక్స్ కాస్త హడావిడిగా ముగించేసినట్లు అనిపించినా, సినిమాలో ఉండే ఒక రకమైన ' రా నెస్ ' వల్ల, ఫ్రెష్ గా, మిగతా పొలిటికల్ సినిమాలంత గందగోళం గా, అరుపులు, హింస లేకుండా మంచిగా అనిపించింది. సినిమాలో లోపాలు చాలా ఉన్నప్పటికీ, ఒక అధ్బుతమైన సినిమా చూసిన ఫీలింగ్ కలగనప్పటికీ, ఒక మంచి అర్ధవంతమైన సినిమాగా తనదైన ముద్ర వేసారు కమ్ముల.

    @ నేస్తం ! కమ్ముల రొమాటిక్ సీన్స్ తీయటం లో కాస్త వీక్ అనుకుంటా ! డ్రమెటిక్ గా ఉండవు. ప్రేమ విషయం లో ఆ మూడు పాత్రలు అయోమయంగానే ఉంటాయి, సరిగ్గా ఎస్టాబ్లిష్ చెయ్యలేదు కూడా..

    రిప్లయితొలగించండి
  11. నేస్తం నెనర్లు :-) ఊహు ఈ సినిమాలో రొమాన్స్ గురించి వెతకకూడదండీ :) వేణు గారు చెప్పినట్లు ఒక మంచి అర్ధవంతమైన సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది చివర్లో.. కొన్ని సీన్స్ కోసమైనా ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. అదీ ఇలా టీవీ లో టెలికాస్ట్ చేసినపుడు అసలు మిస్ అవకూడదని నా ఉద్దేశ్యం.

    Venu గారు నేను ఎవరిమీదా అలిగి వెళ్ళలేదండీ. కొన్ని పరిస్థితుల ప్రభావం అంతే... మళ్ళీ అటువంటి అవసరం రాదనే అనుకుంటున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే శేఖర్ ఈ సినిమా లో రొమాన్స్ మీద దృష్టి పెట్టలేదు అనిపిస్తుంది అంతేనండి, నాకూ ఈ సినిమా చాలా నచ్చింది.

    తృష్ణ గారు నెనర్లు.

    రిప్లయితొలగించండి
  12. మొత్తానికీ వచ్చేశారన్నమాట. హాయిగా ఇంటి భోజనం తిన్నట్టు ఉంటుంది మీ బ్లాగు.

    లీడర్ సినిమా ఐతే నాకంత నచ్చలేదు. ఏదో ఎచ్చుల కోసం చేసినటనిపించింది

    రిప్లయితొలగించండి
  13. వేణు (ఇద్దరు వేణు గార్లును) శేఖర్కి రొమాంటిక్ సీన్లు తీయడం రాకపోవడం ఏంటండి బాబు..గోదావరి,ఆనంద్ చూడండి.. కోపం,ప్రేమ ,మొండితనం అన్ని కూడా రోమంటిక్ టచ్ ఇచ్చి తీయగలిగేది శేఖరే ..
    నాకసలు రాజకీయాలు,కొట్టుకోవడాలు ,రక్తపాతం అస్సలు నచ్చవు ..అలాంటిది లీడర్ సినిమా చివరివరకూ అర్ధ్రాత్రి రెండుగంటలకు మొదలుపెట్టి మరీ చూసాను మొన్న ..బాగానే ఉంది కాని ఏదో లోపించింది..అసలు సినిమాలో ముఖ్య మైన పోయింటే హీరోయిన్ ని ట్రాప్ చేసి ముఖ్యమంత్రిగా నిలదొక్కుకోవడం ..ఏంటో కొన్ని సీన్లు తేల్చేసాడు... బహుసా నిద్ర మత్తులో నచ్చలేదేమో ..పోనీ 15 న మళ్ళీ చూసేసి విషయం తేల్చుకుంటా :)

    రిప్లయితొలగించండి
  14. maa tv vallu chala rojulaki karunincharandi....eppudu Atadu,pokiri,chiruta,stalin lane marchi marchi vesi champesadu monnatidaka.....

    రిప్లయితొలగించండి
  15. సృజన గారు thanks for the compliment. హ హ నాకు నచ్చిన సినిమాని తిడితే తిట్టారు కానీ ’ఎచ్చులకోసం’ అన్న పదం విని చాలా రోజులవుతుందండి :-)

    నేస్తం అలా అన్నారు బాగుంది, ఎందుకు నచ్చలేదో మళ్ళీ ఓ సారి చూసి తేల్చుకోండి :-) హీరోయిన్ ని ట్రాప్ చేసి పదవి నిలబెట్టుకోవడానికి ప్రయత్నించినా మనస్ఫూర్తిగా చేయలేకపోయాడు అందుకే రొమాన్స్ పండలేదేమో ఇక్కడ శేఖర్ చెప్పాలనుకున్న పాయింట్ వేరే.

    కళాపిపాసి గారు నెనర్లు, పాపం వాడికి కొత్త సినిమా రైట్స్ దొరకక పోతే ఏం చేస్తాడు లెండి మాటీవీ వాడు.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.