శివరాత్రి అనగానే అందరికీ ఆ పరమశివుడు, ఉపవాస జాగారాలు గుర్తు రావడం సహజమే కానీ మా నర్సరావుపేట వాళ్ళకి మాత్రం శివరాత్రి అనగానే ముందు కోటప్ప కొండ తిరణాళ్ళే గుర్తొస్తుంది. దక్షయజ్ఞం తర్వాత పన్నెండేళ్ళ బాలుడిగా దక్షిణామూర్తి అవతారంలో త్రికూటాచలమైన మా కోటప్ప కొండపై వెలిశారట ఆ పరమశివుడు.
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా.. కన్నెపిల్ల కనిపిస్తే నాకోసం పడిఛస్తే నూటొక్క టెంకాయ కొడతానని మొక్కుకున్నా అని దాసరి గారు పాట రాసేశారు కానీ మా కోటయ్య బ్రహ్మచారి దేవుడు. అందుకే ఈ కొండమీద కానీ గుడిలో కానీ పెళ్ళిళ్ళు చేయరట. ఇక్కడి గుడి ముందు ద్వజస్తంభం కూడా ఉండదు. ఇంకా గుళ్ళలో ప్రసాదాలంటే లడ్డూలే గుర్తొస్తాయి కదా మా కోటప్పకొండ ప్రత్యేక ప్రసాదం నేతి అరిశలు. సాధారణంగా సంక్రాంతి రోజుల్లో తప్ప మిగిలిన టైంలో అంతగా వండుకోని ఈ నేతి అరిశలని గుళ్ళో ప్రసాదంగా భక్తులకు పంచి పెట్టడం నాకు తెలిసి ఇంకెక్కడా లేదు మా కోటప్పకొండలో తప్ప.

కాకులు దూరని కారడవిని గురించి కథల్లో విని ఉంటారు కదా మా కోటప్ప కొండ కాకులు వాలని కొండ. గొల్లభామ శాపం వలన ఆ చుట్టుపక్కలెక్కడా ఒక్క కాకికూడా కనిపించదు. అలాగే తిరునాళ్ళ అయ్యాక కొండ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి రద్దీ వలన పేరుకున్న చెత్త అంతా కొట్టుకు పోయి కొండ శుభ్రపడడం కూడా ఓ వింతట. ఇలాంటి వింతలూ వాటి వెనుక స్థలపురాణం, ఇంకా బోలెడు విశేషాలు, ఫోటోలతో సహా మా నరసరావుపేట్రియాట్స్ బ్లాగ్ లో ఒకప్పుడు సుజాత గారు రాసిన టపాలో ఇక్కడ చదవి మీరూ తిరణాళకి వెళ్ళొచ్చిన అనుభూతి చెందచ్చు. అలాగే మా కోటప్పకొండ గురించి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన డాక్యుమెంటరీ వీడియో ఇక్కడ చూడవచ్చు.
త్రికోటేశ్వరుడని కూడా పిలుచుకునే మా కోటయ్యంటే మాకు అమితమైన భక్తి. ఆ భక్తి తో పాటు తిరనాళ్ళంటే కూడా బోల్డంత అనురక్తి. ఐతే నేను కొండమీదకి వెళ్ళి స్వామిని దర్శించుకున్నది నాకు గుర్తుండీ రెండు మూడు సార్లకన్నా ఎక్కువ లేదు. మేం నర్సరావుపేటలో ఉన్న నా చిన్నతనంలో పండగంటే నా ఎదురు చూపులూ, నా పండగ అంతా ఊర్లో జరిగే హడావిడి గురించే ఉండేది.

శివరాత్రి వెళ్ళాక శివశివా అనుకుంటూ చలి కూడా పారిపోతుందని మా అమ్మ చెప్పేది. కానీ ఒక్కోసారి పండగ పది రోజులుందనగానే చలి పారిపోయేది. ఇక అప్పుడపుడే మొదలయ్యే ఎండాకాలం ఉక్కపోతలో ఈత లేదా తాటాకు తో చేసిన విసనకర్రలతోనో మడతేసిన న్యూస్ పేపర్లతోనో విసురుకుంటూ అబ్బా ఈ సారి తిరనాళ్ళలో ఓ కొత్త విసనకర్ర కొనాల్రా ఇది బాగా పాతపడిపోయింది అని గుర్తు చేస్కుంటున్నామంటే తిరనాళ్ళ హడావిడి మొదలై పోయినట్లే.
విసనకర్రలకి తిరనాళ్ళకి ఏంటీ సంబంధం అంటారా. ఒకటి తిరనాళ్ళ టైమ్ లో పండగరోజు ఆ రాత్రి కోటప్ప కొండ దగ్గర ఉండే విశాలమైన మైదానంలో పెట్టని కొట్టూ దొరకని వస్తువూ ఉండేది కాదు. పండగ మర్నాడు వాటిలో చాలా కొట్లు తీస్కొచ్చి నర్సరావుపేటలో పెట్టేవారు. మార్కెట్ ఏరియా, చిత్రాలయ దగ్గర మొదలుపెట్టి కోటప్పకొండ రోడ్ లో చాలా దూరం రోడ్డు పక్కన ఈ తాత్కాలిక షాపులు వెలిసేవి. పండగకి రెండు మూడు నెలల ముందునుండే మాకు ఏం కావాలని అడిగినా "తిరణాలలో కొనుక్కుందాంలేరా" అనేసి వాయిదా వేసేసేది అమ్మ.
ఇక అసలు విసనకర్రలు ఎందుకు గుర్తొచ్చాయంటే శివరాత్రికి రెండు రోజుల ముందు నుండే ప్రభలు కొండ దగ్గరకి బయల్దేరేవి అవి ఊరుదాటేప్పుడు తిరిగి వచ్చేటప్పుడూ వాటికోసమని ఆ దారి కవర్ అయ్యే ఏరియాల్లో అన్నిట్లోనూ పగలంతా కరెంట్ తీసేసేవారు. దాంతో శివరాత్రి అంటే తిరణాల సంబరాలతో పాటు నాకు కరెంట్ కష్టాలు కూడా గుర్తొచ్చేవనమాట. ఇపుడు బహుశా ఊరు చుట్టూ రహదారి మార్గం హైటెన్షన్ వైర్లని తప్పించుకువెళ్ళే మార్గం ఏర్పాటు చేస్కుని ఉండి ఉంటారేమో కానీ ఓ ముప్పై ఏళ్ళ క్రితం మాత్రం ఇంతే ఉండేది.

మా కోటప్పకొండ తిరణాళ్ళలో ముఖ్యమైన అట్రాక్షన్ ప్రభలు. టూ డైమెన్షనల్ గుడి గోపురాన్ని గుర్తు చేస్తూ డెబై ఎనభై అడుగుల ఎత్తులో ఆకాశాన్నంటుతున్నట్లుగా దీర్ఘ చతురస్రాకారంలో ఒక వెడల్పాటి వెదురు పట్టా. దాని పైన త్రికోణపు శిఖరం ఉండి రకరకాల అలంకరణలతో తీర్చి దిద్దేదానినే ప్రభ అని అంటారు. దానికి పైనుండీ నిలువెల్లా తాళ్ళు కట్టి నేలమీదనుండే ముందుకు వెనక్కు లాగడానికి వీలుగా అరేంజ్మెంట్ చేసిన దానిని సైజ్ బట్టి ఎడ్లబండి మీదో ట్రాక్టర్ మీదో నిలబెట్టి కొండకి తరలిస్తారు. వీటిలో అరచేతిలో ఇమిడి పోయే పిల్లల ప్రభలనుండి వంద అడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ బల్బులతో అలంకరణలతో మెరిసిపోయే భారీ ప్రభల వరకూ ఉంటాయి.
నా చిన్నతనంలో వీటిని చూడ్డానికి మా నాన్న గారి చేయి పట్టుకుని చిత్రాలయ దగ్గరకి వెళ్ళడం ఎప్పటికీ మర్చిపోలేను. అక్కడ ఆ జనం హడావిడిలో వందలమంది ఉన్నా క్రమశిక్షణతో ఏ తొక్కిసలాట లేకుండా ప్రభలను జాగ్రత్తగా తీస్కెళ్ళేవాళ్ళు. గులామ్ లు చల్లుకుంటూ డప్పులు కొట్టుకుంటూ డాన్సులు వేసుకుంటూ వీటిని తీస్కెళ్ళే జనాన్ని ఆ కోలాహలాన్ని చూడ్డానికి నాకు రెండు కళ్ళూ సరిపోయేవి కాదు. ఇక కొండదగ్గరైతే చుట్టూ విశాలమైన మైదానంలో ఇసకేస్తే రాలనట్లుగా ఎటు చూసినా జనం, వాళ్ళమధ్యలో అక్కడక్కడా నుంచుని పైకి ఠీవిగా చూసే వందల కొద్ది ప్రభలను ఒకే చోట చూడడం ఓ అద్భుతం అంతే.
ఇలా ముందు రోజు సాయంత్రం ప్రభలను చూడ్డానికి వెళ్ళడం ప్రతి పండగకీ ఉంటుంది. ఒక సంవత్సరం మాత్రం నాన్నగారితో కలిసి కోటప్ప కొండ తిరణాలకి వెళ్ళడం ఒక మరిచి పోలేని అనుభవం. మామూలుగా ఉండే బస్ స్టాండ్ కి కొంచెం దూరం గా ఒక పెద్ద గ్రౌండ్ లో ప్రత్యేకం గా కర్రలతో కట్టిన క్యూలు, జనాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులూ వాలంటీర్లు ఏర్పాటు చేసి గుడి దగ్గరకి వెళ్ళే బస్సులకోసం ప్రత్యేకంగా ఓ మినీ బస్టాండ్ కట్టేసేవారు ఆ కొద్ది రోజులు. ఇక అక్కడ వాలంటీర్లు పోలీసులు చేసే హడావిడి ఆ ఎఱ్ఱ బస్సులు అవన్నీ ఓ అద్భుతమే అప్పట్లో.

ఇప్పుడంటే కోడెల శివప్రసాద్ గారి పుణ్యమా అని ఘాట్ రోడ్ ఉంది కానీ అప్పట్లో మెట్ల మార్గమొక్కటే ఉండేది. ఇక రాత్రిపూటే కొండ దిగువకు బస్సులో చేరుకుని నాన్నతో కలిసి ఆపసోపాలు పడుతూ మెల్లగా కొండ ఎక్కడం. మధ్య మధ్యలొ గొల్లభామ గుడి గురించి ఆ స్థలపురాణాల గురించి నాన్న గారి మాటల్లో వినడం భలే ఉండేది. దర్శనమయ్యాక ఎపుడో రెండు మూడింటపుడు మళ్ళీ కొండదిగి కింద ఉన్న హడావిడి అంతా కాసేపు కలియ తిరిగుతూ చూసేసే వాళ్ళం.
మొత్తం మీద రాత్రంతా నిద్రమేలుకుని అక్కడక్కడే తిరిగేసి తెల్ల వారు ఝామున విపరీతమైన నిద్ర మత్తుతో జోగుతూ తిరుగు బస్ లో ప్రయాణం మొదలు పెట్టేవాళ్ళం. తెల్లగా తెల్లారాక పొద్దున్న పూజ అయ్యే వరకూ నిద్ర పోకూడదురా అని అంటూ నాన్నగారు నన్ను నిద్ర పోనివ్వకుండా బస్సు వెళ్తుంటే ఆ చుట్టు పక్కల తగిలే ఊర్లను చూపిస్తూ వాటి గురించి, అక్కడ వాళ్ళ అలవాట్ల గురించి, కొండ గురించి, తిరణాల గురించి, బస్ గురించి, కండక్టరు గురించీ, డ్రైవరు అదే పనిగా ఉపయోగించే గేర్ రాడ్ గురించీ ఒకటేమిటి సమస్తం కబుర్లు చెప్తూ నన్ను ప్రశ్నలు వేస్తూ మెలకువతో ఉంచేవారు.
ఇంటికి వచ్చాక సాయంత్రం కొనాల్సిన బొమ్మల గురించి ప్రాణాలికలు వేసుకుంటూ, అంతక్రితం ఏడాది స్కూల్ లో ఫ్రెండ్స్ దగ్గర చూసినవి, నిన్న రాత్రి కొండ దగ్గిర చూసినవి బోలెడన్ని బొమ్మలు గుర్తు చేసుకుంటూ వాటిలో ఏఏ బొమ్మలు ఖచ్చితంగా కొనాలో మనసులోనే టిక్ పెట్టేసుకుంటూ స్నాన పానాదులు ముగించేసి, "సాయంత్రం బోలెడన్ని మంచి బొమ్మలు ఒక్క కొట్లోనే అదీ మేం రిక్షా దిగిన దగ్గరలోనే దొరికేలా చూడు స్వామి" అని భక్తిగా ఈశ్వరుడికి దండం పెట్టేసుకుని బజ్జుంటే మళ్ళీ మధ్యాహ్నం భోజనానికే అమ్మ నిద్ర లేపేది.

అలా వేసుకున్న ప్రణాళికలన్నీ గల్లంతవుతూ తీరా అక్కడికి వెళ్ళాక ఆ మోడల్స్ మారిపోవడమో వేరే కొత్త కొత్త బొమ్మలు వచ్చేయడమో జరిగేది. ఇంక అన్ని కొట్ల మధ్య అన్ని బొమ్మల లోంచి ఓ నాలుగైదు బొమ్మలు కొనుక్కోవాలంటే ఏం కొంటాం చెప్పండి. అందుకే నాకు అర్ధం కాక ఒకోసారి ఆ బాధ్యత నాన్నారికే అప్పచెప్పి తను కొనిచ్చిన బొమ్మలే కొనుక్కునే వాడ్ని. ఆ బొమ్మలన్నీ అంతగా గుర్తులేవు కానీ వాటితో పాటు ప్రతీ తిరణాలలోనూ ఓ బుల్లి మౌతార్గాన్, మరో బుల్లి పిల్లంగ్రోవి మాత్రం ఖచ్చితంగా కొనుక్కునే వాడ్ని.
ఇక బొమ్మలు కొన్నాక అమ్మ కోసం గాజులు, బొట్టుబిళ్ళలు, ఇంట్లోకి పసుపు, కుంకుమ లాంటివి తప్పకుండా కొనేవాళ్ళం వాటి సెలక్షన్ అంతా నాన్నదే అనుకోండి. ఆ తర్వాత మన ప్రయారిటీ తిండిమీదుండేది తిరణాలలో దొరికే తిండ్లంటే ఖచ్చితంగా బూందీ, పూసమిఠాయి(కరకజ్జం), పంచదార బెండ్లు, పంచదార చిలకలు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ముఖ్యంగా బెండ్లు తిరణాలలో తప్ప మాములు స్వీట్ షాప్స్ లో ఇంకెక్కడా దొరకవు. ఇవయ్యాక తిరణాళ్ళ షాపింగ్ లో మరిచిపోకుండా ఇంటికి తిరిగి వచ్చేముందు ముఖ్యంగా కొనాల్సింది చెఱకు గెడలు.
అసలు చెఱకు తో నా ప్రణయం ఈనాటిది కాదు మొదటి సారి కోటప్ప కొండ తిరునాళ్ళలోనే మొదలైంది. ఆరోజు నుండీ ఈ రోజు వరకు ఆ ప్రేమ దిన దిన ప్రవర్ధమానమౌతున్నదే కానీ కొంచెం కూడా తగ్గలేదు. కోటప్పకొండ తిరణాళ్ళకు అప్పట్లో ఎక్కడ నుండి తెప్పించే వారో కానీ చెఱకు గెడలు భలే రుచిగా ఉండేవి. సాక్షాత్తు ఉయ్యూరు చక్కెర ఫాక్టరీకి వెళ్ళి తిన్నా కూడా ఆ రుచి మాత్రం నాకు ఇంకెక్కడా దొరకలేదు.

ఇంటికి వచ్చాక కొన్న బొమ్మలని అన్నిటిని అమ్మకి ఎలా ఆడుకోవాలో డిమాన్స్ట్రేట్ చేసి చూపించేసి ఆ తర్వాత చెఱకు పిప్పి వేయడానికి ఓ న్యూస్ పేపర్ పరుచుకుని దాని ఎదురుగా మఠం వేసుకుని కూర్చుని ఓ చెరుకు గెడ ముక్క చేతికందుకునే వాడ్ని. ఆ చెఱకు ముక్క ఒక చివర కచక్ మని కొరికి సర్ర్‍ర్‍ర్ర్ మంటూ చప్పుడొచ్చేలా ఒకేసారి 3-4 కణుపులు మీదుగా ఊడొచ్చేలా చెక్కును లాగేసి. ఆ క్రమంలో దానికి ఎక్కడైనా ఎక్కువ కండ పట్టిందేమో చూసుకుని ఒక వేళ పడితే దాన్ని కూడా నమిలేసి, రసం పీల్చేసే వాడిని.
![]() |
పంచదార బెండ్లు ఇలాగే ఉండేవి. |
ఎప్పటి నుంచో మీ blog చదువుతున్నా మొదటి సారి comment పెడుతున్నానండి. చెఱుకు తినటం మీద మీరు చేసిన వర్ణన నా బద్దకాన్ని వదిలించి ఈ comment రాసేలా చేసింది. చిన్నప్పుడు తప్పిపొతావు అని చెప్పి కోటప్పకొండ తిరణాల్లకి ఎప్పుడూ తీసుకెల్లేవారు కాదు నన్ను. అసలే ఒక సారి అంతకంటే చిన్న తిరణాల్లయిన బొప్పూడి తిరణాల్లలోనే తప్పి పొయాను.
రిప్లయితొలగించండిమీరు, నెమలి కన్ను గారు ఎవరిని నొప్పించకుండా ఎంతో హుందాగా రాసే blog posts, పెట్టే comments మీ ఇద్దరినీ ప్రత్యేకం గా ఉంచుతాయండి.
పైన రమేషె గారి వ్యాఖ్యలో రెండో పేరాతో పూర్తిగా ఏకీభవిస్తాను.
తొలగించండివేణూశ్రీకాంత్ గారు,
తొలగించండిమీ ఈ టపా, మీరు లింక్ ఇచ్చిన సుజాత గారి టపా (సుజాత గారు బొత్తిగా నల్లపూసైపోయారు బ్లాగుల్లో) చదివాను. కోటప్పకొండ తిరణాల గురించిన వర్ణన చాలా ఆసక్తికరంగా చేశారు మీరిద్దరూ కూడా. ప్రక్క జిల్లానే అయినా ఈ తిరణాల నేనెప్పుడూ చూడలేదు.
కోటయ్య / కోటేశ్వర రావు / కోటేశ్వర స్వామి పేర్ల origin ఏమై ఉంటుందా అనుకునే వాడిని ...ఎక్కడైనా ఆ పేరు విన్నప్పుడు. ఇప్పుడు తెలిసింది 🙂.
ఒక సందేహం ... ఆ ప్రభలు వచ్చేది కొండ కింద ఆ మైదానం వరకే గదా? కొండ మీదకెక్కలేవు గదా? అంతే కదా మరి, కామన్ సెన్స్ అంటారా? ఏం లేదు, పైకెక్కించే ఏర్పాట్లు కూడా చేశారా అనే కుతూహలం కొద్దీ అడుగుతున్నాను లెండి ... రోడ్డు పడిందన్నారుగా.
మీ టపాలో నేనెప్పుడూ విననిది ఒకటి తగిలింది. అదే మీరన్న “పంచదార బెండ్లు”. అంటే ఏమిటండీ? చూడడానికి ఎలా కనిపిస్తాయి. వీలయితే ఒక ఫొటో పెట్టగలరా?
థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ కామెంట్ అండ్ కాంప్లిమెంట్ రమేష్ గారు... నిజమేనండీ చిన్నప్పుడు తిరణాళ్ళకి వెళ్ళాలంటే తప్పిపోతామనే భయం చాలా ఉండేది మా ఇంట్లో కూడా.
తొలగించండిథాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ కామెంట్ నరసింహా రావు గారు.
రిప్లయితొలగించండిఆ ప్రభలు వచ్చేది మైదానం వరకేనండీ కొండ పైకి ఇపుడు రోడ్ వేసినా పైకి తీస్కెళ్ళరు. అలాగే ఎలక్ట్రిక్ ప్రభలు ఒక పక్క మాములువి ఒక పక్క ఇంకా ఒకో ఏరియా ప్రభలు ఒకోచోట ఇలా ఆర్గనైజ్డ్ గా వేటి స్థలం వాటికి ముందే కేటాయించి అరేంజ్ చేస్తారు.
పంచదార బెండ్లు పల్నాటికి ప్రత్యేకం అనుకుంటానండీ నేను వాటిని చూసే పాతికేళ్ళ పైనే అవుతుంది ఫోటో కూడా దొరకలేదు. కాస్త అలాంటి పోలికలున్న ఫోటో ఒకటి పోస్ట్ లో అప్డేట్ చేశాను. తెల్లగా స్వీట్ సిగరెట్స్ అంటారు చూశారా అలాంటి టేస్ట్ ఉంటుంది అరడుగు పొడవుగా వేలంత వెడల్పుతో మధ్యలో అక్కడక్కడ కాస్త వంపులతో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే షిర్డీ సాయిబాబా ప్రసాదంలో పంచదార ఉండలు ఉంటాయి కదండీ కాస్త అలాంటి రుచే అటూ ఇటూ.
మీరన్నట్లు ఆ "పంచదార బెండ్లు" పల్నాటిసీమకే ప్రత్యేకమయిన మధురం అన్నమాట (శ్రీనాధుడు తిన్నాడో లేదో ? jk 😉). నాకు పరిచయమున్న కృష్ణా, గోదావరీ జిల్లాల ప్రాంతాల్లొ చూసిన గుర్తు నాకయితే లేదు (I could be wrong).
రిప్లయితొలగించండిఫొటో పెట్టినందుకు థాంక్స్, వేణుశ్రీకాంత్ గారూ.
హహహహ శ్రీనాధులవారు ఖచ్చితంగా వీటిని తిని ఉండరండీ లేదంటే వాటిని తలుచుకునుంటే సరిపోయేది, గంగ కోసం శివయ్యని ఆక్షేపించాల్సిన అవసరం పడేదికాదాయనకి :-)
తొలగించండి😁👌
తొలగించండిచిన్నప్పుడు మాకు తిరుణాళ్లు అంటే బొప్పూడి,కోటప్పకొండ ఈ రెండే. బాగా చిన్నప్పుడు ఒక్కసారి మాత్రం సింగరకొండ తిరుణాళ్లకు ఎడ్ల బండి కట్టుకొని మరీ వెళ్లాం.
రిప్లయితొలగించండిరవాణా సౌకర్యమున్నా బొప్పూడి తిరుణాళ్లకు మాత్రం మావూరినుంచి పొలాలకడ్డంబడి నడుచుకుంటూ వెళ్లే వాళ్లం గుంపులు గుంపులుగా.
కోటప్పకొండ మాత్రం కాస్త దూరం కాబట్టి (ఆ కిక్కిరిసిన ప్రవేటు) బస్సుల్లో వెళ్లక తప్పదు.నా చిన్నప్పటికీ ఇప్పటికీ సౌకర్యాలపరంగా చాలామారినా, దర్శించుకున్న ప్రతిసారీ ఆ అనుభూతిలో ఏమార్పూ లేదు.
ఒక మూడేళ్ళక్రితం తప్పనిసరై మహా శివరాత్రినాడే మావూరినుంచి హైదరాబాదు బస్సులో వెళ్లాల్సొచ్చింది. బస్సు నరసరావుపేట చేరటానికిముందు అనుకోకుండా అలా కిటికీలోంచి ఎడమవైపు బయటికిచూస్తే ఆ చిమ్మచీకట్లో దూరంగా అప్పటికే కోటప్పకొండ చేరిన ప్రభల తాలూకు తెల్లటి వెలుగు ఆకాశంలో. ఆది కనుమరుగయ్యేదాకా అలా చూస్తూ"చేదుకో కోటయ్యా" అంటూ మనసులోనే ప్రణామాలర్పించుకున్నాను.
నిజానికి మొదట్లో శివయ్య వెలసిన గుడి ఆ పక్కనే ఉన్నమరొక కొండపై ఉందట. అక్కడికి భక్తులు వెళ్లే సౌకర్యం ఉందోలేదో నాకు తెలీదు .
మీ జ్ఞాపకాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు ఉమాశంకర్ గారూ.. నిజమేనండీ దర్శించుకున్న ప్రతిసారీ అనుభూతిలో మార్పు ఉండదు బహుశా అదే స్థల మహత్యం ఏమో. మీరు చెప్పిన ప్రభల తెల్లటి వెలుగు కనుల ముందు కనిపించేస్తుంది.
తొలగించండిఅవునండీ కొండ మొత్తం ఎత్తు ఎనిమిది వందల అడుగులైతే ఇప్పుడున్న గుడి ఆరొందల అడుగులవద్దే ఉంటుంది. నాకు గుర్తున్నంతవరకూ పాత ఆలయానికి కూడా మార్గం ఉంది కాకపోతే నేను చూసినప్పుడు చాలా కష్టమైన దారి, వాలు కూడా తక్కువుండి నిటారుగా ఎక్కాలి వెళ్ళడం కష్టం అని చెప్పేవారు. ఇప్పుడెలా ఉందో మరి నాకు కూడా తెలీదు.
నా సందేహాలన్నింటికీ, నేను అడక్కముందే సమాధానాలు ఇచ్చేశారండీ మీరు, నేను ఆలస్యంగా రావడం వల్ల :)
రిప్లయితొలగించండిమా వైపు రికార్డింగ్ డేన్స్ ల గురించి మాట్లాడుకునేప్పుడు 'కోటప్పకొండ తిరునాళ్ళు' ప్రస్తావనకు వచ్చేది. ఈ పోస్టు రోజుల్లో మీరు బాలుడు కదా, అందుకని తెలిసుండదు అప్పటి మీకు :)
జగ్గయ్య వ్యాఖ్యానంతో వచ్చిన శివ భక్తిగీతాల ఎల్ఫీ/కేసెట్ లో 'కోటప్పకొండ పోవాలా' అనే పాట చాలా సార్లు విన్నాను, అలా పరిచయం నాకా కోవెల.
ఎప్పటిలాగే, భలే బాగున్నాయి మీ జ్ఞాపకాలు..
హహహ పోన్లెండి ముందే జవాబులు దొరికితే సంతోషమేగా :-) అవునండీ ఈ పోస్ట్ రోజుల్లో ఐతే ప్రభల మీద డాన్సుల గురించి విన్నాను కానీ ఫోకస్ అంతా పైన రాసిన వాటి మీదే ఎక్కువ ఉండేది. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ మురళి గారు..
తొలగించండిఒకే ఒక్క సారి ఈ ఆలయాన్ని చూశానండి..త్రిమూర్తులకి ప్రతిరూపమైన త్రికూట ఈశ్వరుణ్ణి దర్శించుకోవడం నిజం గా ఓ అద్భుతమైన అనుభూతే..ముఖ్యం గా మేము వెళ్ళినపుడు భస్మం తో స్వామి వారిని అభిషేకించారు..ఆ దృశ్యమూ..అక్కడి పవర్ ఫుల్ వైబ్రేషన్స్..యెప్పటికీ మరిచిపోలేము..మీ చిన్న నాటి ఙాపకాలను ఇంత అందం గా పంచుకున్నందుకు థాంక్యూ..
రిప్లయితొలగించండిమీ కామెంట్ ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నానండీ ఇన్ని రోజులూ పండగ శలవులో బిజీగా ఉన్నట్లున్నారు.. నిజమేనండీ అక్కడి వైబ్రేషన్స్ మరిచిపోలేము. స్వామివారికి విభూతితో అభిషేకం చూడడం చాలా బావుంటుందండీ అదృష్టవంతులు మీరు. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారూ.
తొలగించండి"Panchadara bendlu" are also seen in kurnool and bordering districts of mehaboobnagar.These are seen only during Thirunallu times. Along with panchadara chilakalu. Taste is so yummy kind of taste like sweet " balapam". They kind of look like chalk piece or a fat balapam
రిప్లయితొలగించండిథాంక్స్ ఫర్ ద కామెంట్ సురభి గారు.. చాక్ పీస్ పోలిక బావుందండీ.. సమయానికి నాకు గుర్తురాలేదు బలపం పొడవు చాక్ పీస్ లావు అంటే కరెక్ట్ పోలిక. బహుశా ఇవి తిరుణాళ్ళ స్పెషల్ అయుండచ్చేమోనండీ. మీకు తెలిసిన వివరాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.
తొలగించండిVenu garu, I am a regular reader of your writings but never commented. But for this one I could not resist. Though I never have been to any thirunallu( those days girls were not allowed to these things in our family and now I am miles away) I kind of cherish same memories from childhood days. Specially eating sugar cane, bendlu and those colorful bangles( my grandfather use to bring all these for all ladies in the home). In our village thiranallu use to happen during sankranthi time.
రిప్లయితొలగించండిVery nice write up. Thank you for sharing your memories with us
పంట చేతికి వచ్చే కాలం కాబట్టి చాలా తిరణాళ్ళు జనవరి ఫిబ్రవరిలోనే ఉంటాయేమోనండీ. మీ జ్ఞాపకాలను ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు సురభి గారు. వన్స్ ఎగైన్ థ్యాంక్స్ ఫర్ ద కామెంట్.
తొలగించండి