సాథారణంగా ఒక్క రోజులోనో ఒక్క పూటలోనో నడిచే సంఘటనలతో తీసిన సినిమాలు కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మీద పాటల మీద ఆధారపడుతూ ఉంటాయి. అలాంటి అవకాశం కూడా లేకుండా కేవలం రెండు చోట్ల ఒక రాత్రిపూట జరిగే సంఘటనల ఆధారంగా రెండున్నరగంటల పాటు కూర్చోపెట్ట గలగడం అంటే మాములు విషయం కాదు. ఆ ఫీట్ ని సునాయసంగా సాధించింది ’ఖైదీ’ టీమ్.
బిజోయ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. అతను ఓ రాత్రి చిత్తూరు కేంద్రంగా నడుస్తున్న ఒక అతి పెద్ద డ్రగ్ ముఠా తాలూకు డ్రగ్స్ ని పట్టుకుంటాడు. దాదాపు తొమ్మిదివందల కిలోల బరువున్న ఆ కొకెయిన్ ధర తొమ్మిది వందల కోట్లు. తెల్లవారే వరకూ హయ్యర్ అఫీషియల్స్ కి సమాచారం అందించి కోర్ట్ కి సబ్మిట్ చేయలేరు కనుక కమిషనర్ ఆఫీస్ లో భద్ర పరుస్తాడు.
బిజోయ్ తో సహా ఆ ఆపరేషన్ లో ముఖ్య పాత్ర వహించిన ఐదుగురు పోలీసాఫీసర్లు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఐజీ ఇస్తున్న విందుకు హాజరవుతారు. అక్కడ డ్రగ్స్ ముఠాకు హెల్ప్ చేస్తున్న ఓ పోలీస్ ఆల్కహాల్ లో మత్తుమందు కలిపి అందరు స్పృహ తప్పి పడిపోయేలా చేస్తాడు. ఆ ప్రమాదకరమైన మత్తుమందు వల్ల సకాలంలో సరైన ట్రీట్మెంట్ అందకపోతే ఆ ఆఫీసర్స్ అందరూ చనిపోయే ప్రమాదం ఉంది.
డ్రగ్స్ ముఠాలో ఉన్న ఇన్ఫార్మర్ ద్వారా బిజోయ్ కీ ఈ ఐదుగురు పోలీసులని చంపడానికి ఒక గ్యాంగ్, కమిషనర్ ఆఫీస్ లో ఉన్న కొకెయిన్ దోచుకెళ్ళడానికి ఒక గ్యాంగ్ బయల్దేరారని తెలుస్తుంది. సహాయం కోసం కమీషనర్ ఆఫీస్ ని అలర్ట్ చేయడానికి ప్రయత్నించిన అతనికి తాగి గొడవ చేస్తున్న కేస్ లో స్టేషన్ కి తీస్కొచ్చిన నలుగురు స్టూడెంట్స్ వాళ్ళకోసం వచ్చిన ఒక అమ్మాయి. బదిలీ పై వచ్చి ఇంకా ఛార్జ్ తీస్కోని ఒక కానిస్టేబుల్ నెపోలియన్ మాత్రమే ఆ కమీషనర్ ఆఫీస్ లో ఉన్నారని తెలుస్తుంది. ఇపుడు అక్కడున్న తొమ్మిదివందల కేజీల కొకెయిన్ ని, జైలు లో ఉన్న ఖైదీలని ఈ ఐదుగురే కాపాడాలి.
అడవిలో గెస్ట్ హౌస్ కి కేటరింగ్ సామానుతో వచ్చిన లారీలో పోలీసాఫీసర్స్ ని ఎక్కించి వాళ్ళని ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పటల్ కి చేర్చడానికి తప్పనిసరి పరిస్థితులలో అక్కడే ఉన్న ఓ ఖైదీ (కార్తీ) సహాయం కోరుతాడు బిజోయ్. అతని పేరు ఢిల్లీ, ఓ హత్య కేసులో పదేళ్ళగా జైలు శిక్ష అనుభవించి ఆ రోజే రిలీజై అనాథాశ్రమంలో పెరుగుతున్న తన కూతురు అమృతను మొదటిసారి చూడడానికి వెళ్తూ ఉంటే, దారిలో అతని గడ్డం వాలకం చూసి అనుమానించిన ఓ పోలీసాఫీసర్ మళ్ళీ అరెస్ట్ చేసి ఎంక్వైరీకి తీస్కెళుతూ ఆ పార్టీ జరుగుతున్న దగ్గర ఆగుతాడు.
పదేళ్ళగా అనాథాశ్రమంలో పెరుగుతున్న అమృతకి తనను చూడడం కోసం పొద్దున్నే ఎవరో వస్తున్నారని తెలుస్తుంది కానీ ఎవరో తెలీదు. కమీషనర్ ఆఫీస్ లో ఉన్న ఐదుగురూ డ్రగ్స్ ని కాపాడగలిగారా, ఢిల్లీ ఆ పోలీసాఫీసర్స్ కి సహాయం చేశాడా, చేస్తే ఎంతవరకూ సాయం చేయగలిగాడు. నరరూప రాక్షసుల్లాంటి డ్రగ్స్ ముఠా చేతిలో పోలీసులు, స్టూడెంట్స్ హతం కాకుండా తప్పించుకో గలిగారా, అమృత తన తండ్రిని కలుసుకుందా లేదా అనేవి తెలియాలంటే మీరు ఖైదీ సినిమా చూడాలి.
సినిమా మొత్తం ఒక్క రాత్రి జరిగిన సంఘటనల ఆధారంగా అల్లిన కథ. చిత్రీకరణ మొత్తం రాత్రే జరుగుతుంది. ఇలాంటి చిత్రానికి స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రఫీ కీలకంగా నిలుస్తాయి. సినిమా చాలా వరకూ చీకట్లో షూట్ చేసినా ఎక్కడా మనకి ఆసక్తి సడలకుండా కట్టిపడేశాడు. సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ స్ట్రీట్ లైట్స్ ని హెడ్ లైట్స్ ని మంటలని వాడుకున్న తీరు, లైటింగ్ స్కీమ్ చాలా బావుంది తన వర్క్ ఆకట్టుకుంటుంది.
ఇలాంటి థీమ్ ఎన్నుకున్నందుకు దాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా హీరోయిన్, పాటలు, కామెడీలాంటివి కూడా యాడ్ చేయకుండా కథను మాత్రమే నమ్మి దాన్ని తెరకెక్కించినందుకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ని అభినందించి తీరాలి. అలాగే శామ్ సి.ఎస్. నేపథ్య సంగీతం కూడా చాలా సన్నివేశాలని ఎలివేట్ చేస్తుంది. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. అడవిలో కొన్ని స్టంట్స్ రస్టిక్ గా తీసిన తీరు బావుంది.
కార్తీ తప్పించి ఇందులో ఇతర నటీనటులు ఎవ్వరూ నాకు తెలియరు కానీ సినిమా మొదలైన కొంత సేపటికే పాత్రలతో ఐడెంటిఫై చేసేసి కథను ఫాలో ఐపోతాము. కానిస్టేబుల్ నెపోలియన్ గా చేసిన నటుడు గుర్తుండిపోతాడు. ఇక కార్తీ ఢిల్లీ పాత్రలో ఒదిగిపోయాడు, పోలీసుల చేతిలో నానా చిత్రహింసలు అనుభవించి వాళ్ళనే కాపాడాలా వద్దా అసలు బిజోయ్ ని నమ్మచ్చా లేదా అనే మీమాంసలో ఉండే ఖైదీగా, కూతుర్ని మొదటిసారి చూడాలనీ తనకేమైనా పర్లేదు ఆ అమ్మాయి భవిష్యత్ బావుండాలనీ తపించే నాన్నగా, ఇచ్చిన మాట మీద నిలబడి ఒప్పుకున్న పని మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయాలని పోరాడే యోధుడిగా అన్ని షేడ్స్ ని అద్భుతంగా అభినయించాడు. తన గతం చెప్పే సన్నివేశంలో క్లోజప్ లో పలికించిన హావభావాలూ ఆ సన్నివేశం అలా గుర్తుండిపోతాయి.
యాక్షన్ సన్నివేశాలు కొంచెం ఎక్కువున్నా కథకవసరం కనుక ఎక్కడా విసుగు అనిపించకుండా ఇన్వాల్వ్ అయి చూస్తాము. అవి కూడా మరీ కత్తివిడిచి సాము చేయలేదు రియలిస్టిక్ గా తీశాడు. కాకపోతే గాట్లింగ్ గన్స్ సైతం స్మగుల్ చేసేంత పెద్ద డ్రగ్ మాఫియా కనీసం పిస్టల్ కూడా వాడకుండా కత్తులతో దాడులు చేయడం కాస్త ఆశ్చర్యమనిపిస్తుంది. ఐతే రిస్క్ తక్కువని చిత్తూరు లాంటి ఊరును ఎన్నుకుని ఆపరేట్ చేస్తున్నారు కనుక అంతగా అవసరపడవని వాడటం లేదని సరిపెట్టుకోవచ్చు.
సరికొత్త పూర్తి తెలుగు ఓటీటీ ప్లాట్ఫాం ’ఆహా’ లో మొన్న పదిహేనో తారీఖున విడుదలైన "ఖైదీ" సినిమా వైవిధ్యమైన సినిమాలు యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు మిస్సవకుండా చూడవలసిన సినిమా. టీవీలో వచ్చినపుడైనా మిస్సవకండి. ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు.

గుడ్ మూవీ..నైస్ ఆర్టికల్..
రిప్లయితొలగించండిథాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారూ..
తొలగించండినేను మళ్ళీ చూసేశా మొన్న.
రిప్లయితొలగించండికార్తీ తప్ప ఒక్క టెక్నీషియన్, ఒక్క ఆక్టర్ కూడా తెలీదు మనకి.
ఏ.ఆర్ రహమాన్ పాటల్ని వాడుకున్న విధానాన్ని మరిచిపోయారే.. అ డ్డె..డ్డే :)
నేను థియేటర్ లో మిస్సయ్యా రాజ్.. మొన్నే చూడడం మొదటి సారి.. అర్రే మంచి సినిమా మిస్సయ్యాను అనుకున్నాను. ఎస్ ఏ.ఆర్.రహమాన్ సాంగ్స్ విషయం రాయడం మర్చిపోయా :-) థాంక్స్ ఫర్ ద కామెంట్...
తొలగించండితెలుగు వర్షను దొరక్క దీన్ని కూడా తమిళ వెర్షనే చూసాను :( భాష అస్సలు రాక పోయినా చివరిదాకా ఆసక్తిగా చూడగలిగానంటే సినిమా చాలా బాగా ఉన్నట్లే కదా.:).ఆ పోలీస్ ఇన్ ఫార్మర్ ని చివరిదాకా పట్టుకోలేక పోవడం, రెండు కత్తిపోట్లు తిని కూడా కార్తీ వెంటనే కోలుకొని ఫైట్స్ చేయగలగడం లాంటి చిన్న చిన్న పంటికింద రాళ్లు ( సినిమాటిక్ లిబర్టీస్.. తప్పదు) తప్ప చాలా మంచి ఎంగేజింగ్ మూవీ.
రిప్లయితొలగించండిఅంతేకదండీ నచ్చినట్లే :-) అవునండీ కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీస్కున్నారు. రెండువైపులా ఉన్న ఇన్ఫార్మర్స్ లో ఎవరు దొరికినా కథ ముందుకు సాగదు కనుక ఓకేనండీ. అలాగే తండ్రి కూతుళ్ళ ఎమోషన్ థ్రెడ్ కి కనెక్ట్ అవడంతో నాలోని మాస్ ప్రేక్షకుడు కత్తిపోట్లని పూర్తిగా మర్చిపోయాడు :-) బహుశా అందుకేనేమో క్లైమాక్స్ లో ఇంకో ఫైట్ పెట్టకుండా అలా ముగించాడు దర్శకుడు. థాంక్స్ ఫర్ ద కామెంట్ ఉమాశంకర్ గారు.
తొలగించండి