“అమ్మా నేను హాస్టల్ కు వెళ్ళక తప్పదా !! ఇక్కడే ఉండి బాగా చదువుకుంటానమ్మా.. ఇంటర్మీడియేట్ కే హాస్టల్ ఏమిటీ? హాస్టల్ లో నేను ఉండలేనమ్మా.. పంపించద్దు..” కళ్ళ నిండుగా నీళ్ళు ఎపుడు దూకుదామా అని రడీగా ఉన్నాయ్ వాటిని బలవంతాన ఆపుకుంటూ బిక్కమొహం వేసుకుని అమ్మని బతిమిలాడుతున్నాను..
“ఇక్కడ ఉండి చదవవని కాదురా.. అక్కడ ప్రత్యేక శ్రద్ద తీసుకుని చదివిస్తారు నీ ఫ్యూచర్ కే మంచిది. ఈ రెండేళ్ళు కష్టపడి చదివావనుకో స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది అప్పుడు ఇంక నీ ఇష్టం.. అయినా నీకు చెప్తున్నాం కానీ మేం మాత్రం ఉండగలమా.. ప్రతి ఆదివారం వస్తావు కదా. మధ్యలో ఒక రోజు పక్కింట్ అంకుల్ వాళ్ళ ఫోన్ కి ఫోన్ చేయి ఇంకా తరుచుగా ఉత్తరాలు కూడా రాస్తుండు. అక్కడ నీకు బోలెడంత మంది కొత్త ఫ్రెండ్స్ కలుస్తారు.. తర్వాత మమ్మల్ని మర్చిపోతావ్ లే.. ఆ స్నేహాలతో జాగ్రత్తగా ఉండమ్మా.. ఎవర్ని పడితే వాళ్లని నమ్మకూడదు...” అమ్మ ఆపకుండా ఏదో చెబుతూనే ఉంది.. నేను మాటలు వినడం మానేసి అమ్మనే చూస్తూ ఉండిపోయాను. రేపటి నుండి ఇలా ఎపుడు పడితే అపుడు అమ్మ కనపడదు కదా వారం అంతా ఎదురు చూడాలి. అమ్మని వదిలి దూరంగా వెళ్ళడం అదే మొదటి సారి.
హాస్టల్ కు వెళ్ళిన తర్వాత ప్రతి ఆదివారం ఇంటికి వెళ్తూనే ఉన్నా మధ్యలో ఏ చిన్న సమస్య వచ్చినా ఆఖరికి ఏదైనా పీడకల వచ్చినా అమ్మకి ఫోన్ చేసేవాడ్ని. సెల్ ఫోన్లు ఇంకా పరిచయమవని ఆరోజుల్లో ఇప్పుడున్నంత విరివిగా ఫోన్లు ఉండేవి కాదు ఒక ల్యాండ్ లైన్ కనెక్షన్ కోసం కొన్ని నెలలపాటు ఎదురు చూడవలసి వచ్చేది. హాస్టల్లో కొన్ని నిర్ణీత సమయాల్లోనే మాట్లాడుకోవడానికి అనుమతినిస్తారు కనుక ఆ సమయంలో క్యూలు ఎక్కువగా ఉండేవి అందులోనే నిలబడి కాళ్ళునొప్పులు పుట్టేవరకూ ఎదురు చూసి మాట్లాడే నాలుగు మాటలు కూడా ఎంత మధురంగా ఉండేవో. ఎప్పుడైనా నాన్న వాళ్ళే అడ్మిన్ ఆఫీసుకు కాల్ చేస్తే ఆఫీస్ నుండి అరిచిన అరుపు విని ఎగిరిగంతేసి పొడవైన కారిడార్ లో కిందపడిపోతామేమో అన్నంత వేగంగా పరిగెట్టుకుంటూ వెళ్ళి మాట్లాడటం ఇప్పటికీ గుర్తుంది...
“ఒరే నువ్వు విజయవాడ లో ఉన్నప్పటిలా కాదు ఇపుడు చాలా దూరంలో ఉంటున్నావ్ కదా.. అదీకాక యూనివర్సిటీ హాస్టల్ పెద్దగా పరిమితులు ఉండవు రాత్రి తొమ్మిది తర్వాత రేట్ తక్కువ కాబట్టి కాస్త ఎక్కువ మాట్లాడుకోవచ్చు. కనీసం రెండు మూడు రోజులకి ఒక సారి కాల్ చేయాలి సరేనా...” ఇంజనీరింగ్ కు వైజాగ్ పంపేముందు అమ్మ ఎన్ని సార్లు చెప్పిందో ఈ మాట. “అలాగే అమ్మా హాస్టల్ దగ్గరలో ఫోన్ బూత్ ఉంటే రోజూ చేస్తాను సరేనా...” అని చెప్పిన ప్రతిసారి నే జవాబిచ్చాను.
మొదటి ఏడాదంతా ఇంచు మించూ రోజూ ఏదో టైంలో ఇంటికి కాల్ చేసి కాసేపు మాట్లాడిన నేను ఆ ఏడు చివరికి వచ్చేసరికి “అమ్మా హాస్టల్ నుండి ఫోన్ బూత్ చాలా దూరమమ్మా రాత్రుళ్ళు 9 తర్వాత చీకట్లో ఇంతదూరం నడిచొచ్చి మాట్లాడి మళ్ళీ ఇంటికి వెళ్ళడం కష్టంగా ఉంది అందుకే నాలుగురోజులకో వారానికో ఒక సారి చేస్తున్నా అంటే అర్ధం చేసుకోవేంటి..” అని అంటూనే.. కుదిరిన ప్రతిసారి అమ్మతో గంటకి తక్కువకాకుండా ఫోన్లో మాట్లాడిన రోజులు ఎన్నో... అప్పట్లో రాత్రుళ్ళు ఒకరిద్దరు నా తర్వాత మాట్లాడడానికి వరుసలొ ఎదురు చూస్తుంటే వాళ్ళని ముందు చేసుకోమ్మని చెప్పేసి నేను చివరన ఫోన్ చేసే వాడ్ని ఆఖరున ఉండేది నేనైతే ఏ అవాంతరాలు లేకుండా అమ్మతో కావాలిసినంత సేపు మాట్లాడుకోవచ్చని నిద్రని కూడా త్యాగం చేసే వాడ్ని.
కాలేజ్ కబుర్లు, ఫ్రెండ్స్ గురించీ, లెక్చరర్స్ గురించీ నేను చెప్తుంటే చెల్లాయి తమ్ముళ్ళ అల్లర్లు, ఇంటి విషయాలు, బంధువుల విషయాలు అమ్మచెప్తుంటే మామాటల మధ్య నిముషాలు క్షణాల్లా దొర్లేవి. నాన్న తమ్ముడు చెల్లాయిలతో అందరితోనూ కలిపి పావుగంట మాట్లాడితే మేమిద్దరమే ఒక ముప్పావుగంట మాట్లాడుకునే వాళ్ళం. SSLC(10th తోసమానం) మించి చదువుకోకపోయినా అమ్మకి ఎన్ని విషయాలు తెలుసో ఎన్ని తెలివితేటలో నరసరావుపేటలోనే కూర్చుని వైజాగ్ గురించి అక్కడి మనుషుల ప్రవర్తనలగురించి తూర్పు యాస గురించి ఇంకా ఎవరితో ఎలా మసులుకోవాలి లాంటి విషయాలు బోలెడన్ని చెప్పేది. మా ఇద్దరి కబుర్లు వినే నేస్తం ఒకడు “మీ ఇద్దరికీ ఫోన్ ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు రా, దీన్ని కనిపెట్టింది విషయాన్ని సాధ్యమైనంత క్లుప్తంగా చేరవేయడానికి అంతే కానీ ఇలా ఆ.. ఇంకేంటి అంటూ పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకున్నట్లు మాట్లాడుకోడానికి కాదు..” అంటూ ఏడిపించేవాడు.
అమ్మతో మాటలంటే ఇంకో విషయం గుర్తొచ్చింది.. సాధారణంగా ఎవరితోనూ గొడవపడని నేను అప్పట్లో కాస్తైనా కోపంగా మాట్లాడేది ఒక్క అమ్మతోనే.. మాకు ముఖ్యంగా ఒక్క విషయంలో చాలా పెద్ద గొడవయ్యేది. ఇంటర్ లో తక్కువే కానీ ఇంజనీరింగ్ లో సెలవలకు వచ్చిన ప్రతిసారీ మీ స్నేహితులకోసం కూడా తీసుకువెళ్ళు అని చెప్పి పిండివంటలు పచ్చళ్ళు బోలెడు ప్యాక్ చేసేది అమ్మ. నాకేమో అవన్నీ మోసుకుని బస్సుల్లో వెళ్ళడం ఒక కష్టమయితే అసలు కాలేజికి వెళుతూ నే ఒక్కడ్నే అన్నేసి తినుబండారాలు తీసుకుని వెళ్ళడం పెద్ద నామోషీగా ఫీల్ అయ్యేవాడ్ని. మిగతావాళ్లెవరూ అన్ని తెచ్చుకునేవారు కాదు మరి అందుకే నాకలా అనిపించేది..
అలా చేసిపెట్టేవాళ్ళు ఉండటం నా అదృష్టమని అప్పట్లో తెలుసుకోలేకపోయాను కొన్నిసార్లు అంతే ఉన్నపుడు విలువ తెలీదు తెలిసేప్పటికి ఏమీ ఉండదు. ఇలాంటిదే ఇంకోటి ఇంట్లోఉన్నపుడు అమ్మ “మధ్యాహ్నం మూడవుతుంది భోజనానికి లేమ్మా” అని చెప్తుంటే “ఏంటీనస నాకు ఆకలేస్తే తినాలని తెలీదా” అని అనిపించేది అదే ఒంటరిగా ఉన్నపుడు ఒకోరోజు “ఏంటో జన్మ ఉన్నావా తిన్నావా అని అడిగేవాళ్ళు కూడా లేరు” అని అనిపిస్తుంటుంది. మళ్ళీ డివియేట్ అవుతున్నాను.. అలా మోసుకెళ్ళడం మనకి నామోషీ కనుక అమ్మ చేయించిన వాటిలో సగం తీసుకు వెళ్తా అని నేనూ తను చెప్పినవన్నీ తీసుకువెళ్ళాలని తనూ పట్టుపట్టి కూర్చునేవాళ్ళం. అదేంటో కానీ ఎప్పుడూ అమ్మే గెలిచేదిలెండి ఎప్పుడైనా నేను కాస్త గట్టిగా కోప్పడితే తను నామాట వినేది కాని అలా అమ్మమీద కోప్పడి వెళ్ళినపుడు నాకు మళ్ళీ ఇంటికి వచ్చేవరకూ హాస్టల్ లో ఏవో ఒక ఇబ్బందులు వచ్చేవి అస్సలు బాగుండేది కాదు అదో సెంటిమెంట్.
సరే ఇక ఇంజనీరింగ్ నాలుగో ఏటికి వచ్చేసరికి మళ్ళీ రెండ్రోజులకి ఒక సారి ఫోన్ చేయడం ఒకోసారి ప్రతిరోజూ మాట్లాడటం చేసేవాడ్ని. ఎంతగా అంటే హాస్టల్ దగ్గరలోని ఫోన్ బూత్ ల వాళ్ళు మా దగ్గరకి రమ్మంటే మా దగ్గరికి రమ్మంటూ అచ్చంగా ఈనాటి క్రెడిట్ కార్డ్ వాళ్ళలా అప్పులు సైతం ఇవ్వడానికి వెనుకాడేవారు కాదు. అదేంటో అమ్మతో మాట్లాడినపుడు మేం మాట్లాడుకునేవి సాధారణమైన విషయాలే అయినా కాల్ అయ్యాక ఏదో తెలియని శక్తి ఆవహించేది బోలెడంత ధైర్యంగా కొండంత కాన్ఫిడెన్స్ తో రొమ్మువిరుచుకుని చీకటి వెలుతురు అనే ఆలోచన లేకుండా ఎంత రాత్రయినా నిర్బయంగా తుప్పల్లో పడి నడుచుకుంటూ రూంకి వెళ్ళేవాడ్ని. ఆ శక్తి దదాపు ఒక రోజంతా అలానే ఉండేది. అందుకే పరీక్షల టైంలో అసలే చివరినిముషంలో ముక్కున పట్టడానికి సమయం చాలకపోయినా సరే ప్రతిరోజూ కాసేపయినా అమ్మతో మాట్లాడటం మాత్రం మిస్ అయ్యేవాడ్ని కాదు. ఒక్క ఇంజనీరింగ్ పరీక్షలనేనా జీవితంలో ఎలాంటి పరీక్షలనైనా అమ్మతో ఒక సారి చర్చించి సమస్యపై తన ఇన్ సైట్ తీసుకుని ముందుకు సాగేవాడ్ని.
ఉద్యోగార్ధినై హైదరాబాద్ లో ఉన్నా.. ఉద్యోగనిమిత్తం చెన్నై లో ఉన్నా, బెంగళూరు, అమెరికా ఇలా ఒకటేమిటి ఎక్కడైనా ఎప్పుడైనా అమ్మతో మాట్లాడటం ఓ చక్కని అనుభూతి, కొండంత బలం. అమెరికా వెళ్ళాక చాన్నాళ్ళకి ఒక సారి నేను “అమ్మా ఇంజనీరింగ్ లో ఉన్నపుడు నువ్వు చెప్పినమాటలు గుర్తున్నాయా.. ఇప్పుడంటే చిన్నపిల్లాడివి ఒక్కడివి ఎలా ఉన్నావో అన్న బెంగ కాబట్టి రోజూ చేయమంటున్నాను కానీ.. పెద్దై ఉద్యోగం చేస్తుంటే రోజూ కాల్ చేయాల్సిన పనేమి ఉంటుంది అప్పుడు అఖ్ఖర్లేదు... అన్నావ్ కాని మనం ఇప్పటికి కూడా ఆ డైలీ ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నాం కదా..” అంటే అమ్మ తేలిగ్గా అందంగా ఒక నవ్వు నవ్వేసేది.
రెండేళ్ళ క్రితం సరిగ్గా ఈ రోజున (జనవరి 22-2009) ఆ మాటల ఙ్ఞాపకాలను మాత్రమే నాకు మిగిల్చి మమ్మల్ని ఒంటరివాళ్ళను చేసి వెళ్ళిపోయిన అమ్మని తలుచుకోని క్షణం లేకపోయినా.. గడిచిన ఏడాదికన్నా ఈ ఏడాది.. ఈ నిముషం తను నాతో పాటుంటే ఈ సమస్యని తను ఇంకా బాగా డీల్ చేసి ఉండేది, ఈ క్షణం అమ్మ సలహా తీసుకుంటే బాగుండు, ఇప్పుడు అమ్మతో మాట్లాడగలిగితే బాగుండు అని అనిపించిన సంఘటనలు కోకొల్లలు. అలా అనిపించినపుడల్లా ఒంటరిగా దిగులు పడుతూ ఉలుకూ పలుకూ లేని నా సెల్ ఫోన్ వైపు ఆశగా చూసుకుంటూ “దేవుడూ ఒక్కసారి అమ్మతో మాట్లాడాలని ఉంది ఆలోకానికి కనెక్షన్ ఇవ్వవూ...” అని ఎన్ని సార్లు బ్రతిమిలాడానో ఆ దేవుడ్ని :-( కానీ “నాకూ అమ్మప్రేమ కావాలి” అంటూ రెండేళ్ళక్రితమే బలవంతంగా మా అమ్మని తన దగ్గరకు తీసుకువెళ్ళిన జాలీ దయా లేని ఆ దేవుడు నామాట వింటాడా.. విన్నా పట్టించుకుంటాడా...
కుహు కుహూ.. కూసే..
-
డబ్బు డబ్బు డబ్బు చిత్రంలోని ఒక మధురమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట
ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
ఎంబెడెడ్ వీడి...
3 సంవత్సరాల క్రితం
మీరు చెబుతుంటే నా ఇంటర్ లైఫ్ అంతా కళ్ళ ముందు కదలాడింది :) నా ఇంటర్ లో స్టార్ట్ చేశా మా అమ్మ కి రెగ్యులర్ గా call చేయడం ..ఇప్పటికి అదే కంటిన్యూ చేస్తున్నా :)) అమ్మ చెప్పే మాటల్లో వున్న దైర్యం అనుబవించిన వాళ్ళకే తెలుస్తుంది :)
రిప్లయితొలగించండికానీ పోస్ట్ చివరకు వచ్చేప్పటికి మనసంతా బారం గా ఐపోయింది :(( తొందరగా ఆ బాధ నుండి బయట పడాలని కోరుకుంటున్నాను :)
మీ హాస్టల్ రోజుళ్ళో అమ్మతో అనుబంధాన్ని చదువుతుంటే "అయ్యో, ఇలాంటి హాస్టల్ అనుభవం నాకు లేదే" అనుకున్నా. చివరి పంక్తి చదివినప్పుడు చాలా బాధేసింది!!!
రిప్లయితొలగించండిఆనంతానికి నిర్వచనం తల్లి ప్రేమ. ఈ లోకం లో అన్నిటికంటే స్వఛ్ఛమైనది ఏమిటి అంటే అది తల్లి ప్రేమ. మీకు నా సహానుభూతి. ఇంతకంటే నేను ఏమి చెప్పగలను. మీరు త్వరగా ఈ బాధ నుండి బయటపడాలని కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండిచివరికి కళ్ళు చెమర్చాయి. మీ అమ్మ గారి అత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్న. మీ పొస్త్ చదువుతుంతె మా అబ్బయి కళ్ళ ముందు మెదిలాడు . వాడు వాళ్ళ అమ్మకు ఫొన్లొ మాత్లాదుతుంతాదు. నెను రొజూ ఎంపని దిస్త్రుబ్ అవుతాదు వాదు రొజూ ఒక్క సారన్న మాట్లాడకుండా ఉండలెనంటా తల్లితొ, మీ పొస్త్ చదివాక వాది ఆరాటం అర్థమయ్యింది థాంక్స్ వేణు
రిప్లయితొలగించండిNo Comments.. Sorry Venu..:(
రిప్లయితొలగించండిఅన్ని మధుర జ్ఞాపకాలు ఉండడం కూడా అదృష్టమే.
రిప్లయితొలగించండిఅలాంటి మధురానుభూతులని మన పిల్లలకి కూడా పంచడమే మనం చెయ్యగలిగింది.
moving, కదిలించింది మీ ఈ article. ఏం రాయాలో తెలియకుండా ఆగిపోయాను. 67 ఏళ్ళు వచ్చిన నేను కూడా అనుకుంటాను అప్పుడప్పుడు అమ్మ ఏంచెప్పేదా అని.
రిప్లయితొలగించండిLife moves on young man. Live up to her expectations.
చాలా బాగా రాసారండి. మా బాబు గుర్తొచ్చాడు.తనూ అంతే రొజూ కాల్ చేస్తాడు.ఆన్ లైన్ కూర్చుంటే కనీసం గంటసేపు ఇట్టే గడిచిపోతుంది.
రిప్లయితొలగించండిమీ అమ్మగారు లేరని తెలిసి బాధ కలిగింది.సారీ.
వేణు గారు ఏడుపొస్తుంది నాకు మీరు భాదపడకండి......... మేమందరం ఉన్నాం మీకు .........అమ్మలా ,ఓ చెల్లిలా అనుకోండి మమ్మల్నే
రిప్లయితొలగించండిఅమ్మలేని లోటు ఎవరూ తీర్చలేరు. ఆ లోటుని ఏదీ కూడా భర్తీ చేయలేదు. మీ అమ్మగారు స్వర్గస్థులయ్యారని మీరు అప్పుడు రాసిన టపా, అలాగే మీరు నిరుడు రాసిన టపా ఇప్పటికీ నా కళ్ళముందున్నాయండి. మీరు అమ్మని ఎంతగా మిస్సవుతున్నారో తెలుస్తూంది. కాని తప్పదు కదా. జీవితం ఆ జ్ఞాపకాలతో నడిచిపోవాలంతే.
రిప్లయితొలగించండిమీ అమ్మగారు పోయినప్పుడు మీరు రాసిన టపా నాకు గుర్తుంది. మీ అనుబంధం శరీరం తో తీరేది కాదు. తలపుల్లో మీ ముచ్చట్లు కలకాలం గుర్తుంటాయి, మీకు నీడగా నడిపిస్తాయి. మీరు తొందరగా వివాహం చేసుకుంటె మీకో తోడుదొరికినందుకు, అమ్మగారు చాలా సంతోషిస్తారని మీ కనిపించాలి మరి.మీ పిల్లల్లో మీ అమ్మగారిని చూసుకుంటూ ఎన్ని ముచ్చట్లైనా చెప్పుకోవచ్చు కదా.
రిప్లయితొలగించండిఅమ్మ చెప్పే మాటల్లో వున్న దైర్యం అనుబవించిన వాళ్ళకే తెలుస్తుంది ...this is 200% true.nenu koodaa meelaage
రిప్లయితొలగించండి'amma ani pilichinaa aalakinchavelamma'
anukuni baadha padutuntaanu...
నా కొడుకుని 7th class లోనే హాస్టల్ లో వెయ్యాల్సివచ్చింది తప్పలేదు. 10th అయ్యాకా ఇంటర్ మాత్రం నా దగ్గరే వుంచుకోవాలనిపిస్తుంది. ఆ వయసులో వాడు నాతో షేర్ చేసుకోవాల్సిన విషయాలు ఎన్నుంటాయోకదా !
రిప్లయితొలగించండివేణూ గారు మీ అమ్మగారు అదృష్టవంతులు . ఎప్పటికీ వారిపట్ల మీ ప్రేమ అలానే వుండాలి . ఆవిడ ఎక్కడున్నా
రాయగలిగేంత భాష నాదగ్గర లేదండీ..
రిప్లయితొలగించండిచాలారోజుల తర్వాత కళ్ళు తడిశాయి...
ప్రతి వాక్యం ఫీల్ అయ్యాను మీ స్థానంలో నిలబడి.టైపు చేయడానికి కూడా లెటర్స్ తడిమి వెదికేంతగా.తల్లయిన చెల్లయిన శాశ్వతదూరం ఎవరు పూడ్చలేనిది.సారి.
రిప్లయితొలగించండిమీ టపా చదువుతూ ఏదో హాస్టల్ కబుర్లు లే అనుకున్నాను ..కాని ఆఖరి పేరా చదివితే కానీ తెలియలేదు నాకు మీరెంతఅమ్మని మిస్సైన బాధలో ఉన్నారోఅని..
రిప్లయితొలగించండితొందరగా అబాధనుండిబయట పడతారని ఆశిస్తున్నాను.
విరిబోణిగారు, అవినేని భాస్కర్, భాస్కర్, భాను గారు, అప్పు, బోనగిరి గారు, సుబ్రహ్మణ్యంగారు, లతగారు, శివరంజనీ, శిశిరగారు, జయగారు, ఎన్నెలగారు, లలితగారు, మురళిగారు, చిన్నిగారు, రాధిక(నాని)గారు వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలండీ... ఈ రెండేళ్ళలోనూ నేను తెలుసుకున్నది ఒక్కటేనండి ఈబాధనుండి బయటపడటమనేది జరుగని పని. ఏంచేసినా ఏమైనా ఆలోటు ఎప్పటికీ తీరనిది.
రిప్లయితొలగించండిమీరు వ్రాసిన ప్రతి అక్షరంతో ఏకీభవిస్తున్నా.. నిజమే, అమ్మతో మాట్లాడితే చాలు ఎలాంటి బాధల్లో ఉన్నా దాన్ని జయించగలమనే శక్తి వస్తుంది.. వారి జ్ఞాపకాలు మరచిపోవడం అనేది జరగని పని.. కాకపోతే కాలం గడిచేకొద్దీ మనసులోనే దాచుకోగలగడం అలవాటవుతుంది..
రిప్లయితొలగించండిమీ అమ్మగారి గురించి మీరు మొదట రాసినది,క్రిందటేడు రాసినది రెండూ గుర్తుకొచ్చాయండీ...భౌతికంగా ఆవిడ మీకు దూరమైనా మీ అమ్మగారి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయండీ...
రిప్లయితొలగించండిమేధగారు, తృష్ణ గారు నెనర్లు.
రిప్లయితొలగించండివేణు గారూ
రిప్లయితొలగించండిమీ బ్లాగ్ నాకు పరిచయమవటమే మీ అమ్మగారు పోయిన టపాతో అవటం యదృచ్చికం. మీ అమ్మగారు మీ ఆలోచనల్లో , జ్ఞాపకాల్లో ఎప్పుడూ సజీవంగానే ఉంటారు. జ్ఞాపకాలకి అనుబంధాలకి మరణం ఎక్కడండీ. మీకు అన్నివేళలా మీ మనోధైర్యం, అన్నీ ఆవిడ ఆశీస్సులే. అవి మీతోనే ఎప్పుడూ ఉంటాయి. మీరు ఆ బాధ నుండి తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను
పద్మవల్లి
పద్మవల్లి గారు నెనర్లు..
రిప్లయితొలగించండిhmm nenu vijayawada lo hostel lO unnappati jnaapakaalu gurthu vacchaayanDi.
రిప్లయితొలగించండిeemadya endukO nEnu ilaanti feelings ki atheethudini ani naaku nEnu oka world lo brathukutunna.
kaani last few points chaduvuthunTE artham ayyindi nEnu alaa anukuntunnanu tappa adi vaasthavam kaadu ani.
వినయ్ భాస్కర్ గారు.. ఆలస్యంగా జవాబిస్తున్నందుకు మన్నించండి.. మీవ్యాఖ్యకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసున్నితమైన భావాలకు స్పందించే మనసంటూ ఉన్నాక దానిని మనం అణచి ఉంచామని అనుకునేది మన భ్రమ మాత్రమేనండీ.. దాని పని అది చేసుకునిపోతూ ఉంటుంది..
“దేవుడూ ఒక్కసారి అమ్మతో మాట్లాడాలని ఉంది ఆలోకానికి కనెక్షన్ ఇవ్వవూ...”
రిప్లయితొలగించండివేణు గారు నేను ఫస్ట్ సెల్ తీసుకున్నప్పుడు ఇష్టమయిన వారికీ కాల్ చేస్తాం కదా అలా ఏదో నో కి కాల్ చేసి వాడు రాంగ్ నో అని చెప్తున్నా అమ్మమ్మ అంటూ మా అమ్మమ్మకి కబుర్లు చెప్పేసాను. మీ పోస్ట్ చుస్తే అది గుర్తుకు వచ్చింది.ఎం చెప్పాలో అర్ధం కావడం లేదు. nenu devudini ayite matram idi chadivi meku connection ichestanu.
శైలబాల గారు నెనర్లు..
రిప్లయితొలగించండిమా అమ్మగారు నన్ను వదిలి దేవుడి దగ్గరకు వెళ్లి పదిహేనేళ్ళు అయింది. ఇప్పటికీ అమ్మ ఉంటే ఈ సందర్భంలో ఇలా చేసేది. అలా చేసేది అనుకుంటాను. జ్ఞాపకాలలో కూడా స్ఫూర్తి నిచ్చేది బహుశా ప్రపంచంలో అమ్మ ఒక్కత్తేనేమో. ఈ కామెంట్ రాస్తున్నప్పుడు ఏంటో కళ్ళలో నీళ్ళు ఆపుకుందామన్నా ఆగట్లేదు.
రిప్లయితొలగించండిశంకర్ గారు నెనర్లు.
రిప్లయితొలగించండిఎన్నేళ్ళైనా అమ్మ సలహాలను గుర్తుతెచ్చుకుంటూనే ముందుకు సాగుతామండీ..>> జ్ఞాపకాలలో కూడా స్ఫూర్తి నిచ్చేది బహుశా ప్రపంచంలో అమ్మ ఒక్కత్తేనేమో.<< అవును నిజం చాలా బాగా చెప్పారు.
వేణూ, ఈ పోస్ట్ నేను చూడలేదు ఇన్నాళ్ళూ....కళ్ళు చెమర్చాయి. నేను హాస్టల్ లో అమ్మ కోసం బెంగపడ్డ రోజులు గుర్తొచ్చాయి. అమ్మ పక్కన ఉన్నప్పుడు ఆవిడ విలువ మనకి తెలీదు. మనం ఇంటికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు కొట్టొచ్చినట్టు కనబడుతుంది.
రిప్లయితొలగించండిబాధపడకండి...మీ అమ్మగారు స్వర్గంలో విశ్రాంతి తీసుకుంటూ మిమ్మల్ని ఓ కంట గమనిస్తూనే ఉంటారు.
వేణూ ,
రిప్లయితొలగించండిఈ పోస్ట్ ఇంతకు ముందూ చదివాను . కాని కామెంట్ ఏమి వ్రాయాలో తెలీక వ్రాయలేదు . ఈ రోజు మురళి గారి పోస్ట్ ద్వారా మళ్ళీ చదివాను . మళ్ళి అదే మనసు పట్టుకుపోయిన భావన .
అమెరికా లో వున్న నా కొడుకు గుర్తొచ్చి వెంటనే కాల్ చేసాను .
ఆ.సౌమ్య, మాల గారు.. వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండిKallu chammagillayanadi.....thalli thandrulu icche dhairyam veyyi yengula balam.....
రిప్లయితొలగించండిఅఙ్ఞాత గారు నెనర్లు..
రిప్లయితొలగించండివెయ్యి ఏనుగుల బలం .. నిజమండి..
ఈ రొజు నెమలి కన్ను బ్లొగ్ లొ చూసి మీ బ్లాగ్ ను
రిప్లయితొలగించండిచూసి ఇన్ని రొజులు నా మనసు అద్దాన్ని యెలా మిస్
అయ్యానా అనిపిస్తుంది.యెదురు చూస్తూ మీ కలమ్ నుండి అనుబూతులను యెరుకొవటానికి.
ధన్యవాదాలు శశిగారు..
రిప్లయితొలగించండిఈ పోస్ట్ ఇదే చదవటం. చాలా టచింగ్ గా రాసారు. మనసు భారమైపోయింది. మీరన్నట్టు .. ఈరోజుకీ చిన్న రోజూ వారీ సమస్య నుంచీ, పెద్ద ఆఫీసు గొడవల దాకా ఏ గొడవ లో ఉన్నా..ఒక్క కాల్ అమ్మకి చేస్తే బోల్డు శక్తి వస్తుంది నాకు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు కృష్ణప్రియ గారు. అమ్మ మాటలో ఉన్న బలం అటువంటిదండి.
రిప్లయితొలగించండిఈ టపా చూశాక నాకు మా అమ్మమ్మ గురించి రాయాలని చాలా కోరిక గా ఉంది. ఒక స్త్రీ గా, తల్లి గా, వదిన గా, అమ్మమ్మ, నాయనమ్మగా, తాతమ్మ గా ఆవిడ జీవితం నాకు చాలా స్ఫూర్తిదాయకం. ఆవిడ 90+. ఆవిడ కోసం టపా రాసి ఆవిడ కి చూపించాలని...
రిప్లయితొలగించండితప్పకుండా రాయండి కృష్ణప్రియగారు. తను చాలా సంతోషిస్తారు.. వారి తరం నుండి మనం నేర్చుకోవలసినది కూడా చాలా ఉంది. ఒక టపాలో సరిపోవడంలేదంటే అవసరమనిపిస్తే సిరీస్ కూడా రాయండి. నేను ఎదురు చూస్తుంటాను.
రిప్లయితొలగించండిఒక్కోసారి మన ఆత్మ మననే వీడిపోయినట్లు, మన గొంతుకతో వేరెవరో గానం చేస్తున్నత్లు అనిపిస్తుంది. విశ్వమతా వ్యాపించిన ఒక భావన ఏదో మనం ట్యూన్ అయిన ఫ్ర్రిక్వెన్సీ లో పలుకుతున్నత్లు అనిపిస్తుంది. మీ టపా చదువుతూ ఉంటే నాకు అలాంటి భవనేదో కలిగింది. నేను హాస్టల్ లో ఉన్నప్పుడే కాదు మా కసిన్స్ ని వాళ్ళ పేరెంట్స్ హాస్టల్లో వదిలి వస్తున్నప్పుడు కూడా ఇలాంటి ఫీలింగే నన్ను చుట్టేసింది. రెక్కలువిప్పుకుని బయట ప్రపంచంలోకి వెళుతున్న వేల అమ్మ తో గడిపిన రోజులు మనకున్న ఒకే ఒక ఆలంబన. అమ్మ తో ఉండే అనుభందం ప్రాత్యేకమైనది. హాస్తల్ జీవితాలకి అది ఎంత అపురూపమో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మీ చివరి పేరా నన్ను కదిలించింది, అమ్మతో ఒక సారి మాట్లడగలితే బాగుండు నాన్నా అని నేను మా నాన్నగారితొ అన్ననొకసారి ఆయన నన్ను ఒక పిచ్చివాడిలాగనో, ఎదగని మనసున్న వాడిలనొ చుశారు. అప్పటికి మా అమ్మ గారు చనిపోయి 5 ఏళ్ళు అయింది మరి. కానీ ఇప్పుడు మీ తపా చూసింతరువాత నాకు అనిపించింది, నాకు వచ్చిన ఆలోచన ఒంటరిదేమీ కాదు అని, సమస్య అల్లా నా లాంటి గతం మా నాన్నగారికి లేదు. ఆయనకి తెలీదు హాస్తల్ జీవితపు ఒంతరితనం, ఆ ఒంతరితనంలో అయినా వెన్నంటి ఉండే అమ్మ సాన్నిహిత్యం గురించి.....చాలా రోజుల తరువాత ఒక టచింగ్ పోస్ట్ చదివాను. తాంక్ యు సో మచ్.
రిప్లయితొలగించండిశరత్ గారు నెల తర్వాత జవాబిస్తున్నందుకు మన్నించండి. నా పోస్ట్ మిమ్మల్ని అంతగా కదిలించినందుకు ఏమని బదులివ్వాలో అర్ధంకావడంలేదు... ఇంత వివరమైన వ్యాఖ్య రాసినందుకు ధన్యవాధాలు.
రిప్లయితొలగించండివేణు గారు... మీరు వ్రాసిన ప్రతి అక్షరం హృదిని కదిలించింది. ఈ సృష్టిలో ఉన్న అనంతమైన ప్రేమ "అమ్మ" చాలా కదిలి కదిలి పోయేలా.. మీ పోస్ట్..
రిప్లయితొలగించండి“దేవుడూ ఒక్కసారి అమ్మతో మాట్లాడాలని ఉంది ఆలోకానికి కనెక్షన్ ఇవ్వవూ...”
ప్చ్.. విషాదం కూడా ఓ.. జీవన రాగమే..కదా!
ఎవరు ఎంత ప్రేమ చూపించినా అమ్మ సాటి రారు. అమ్మని వదిలి వెళ్ళేటప్పుడు కళ్లంపట వచ్చే నీరు ఆపుకోలేక గొంతులో ఏదో నొప్పిగా వస్తూ ఉంటే, ప్రయాణం పోస్ట్ పోన్ అయితే ఎంత బాగుణ్ణో అనుకునే రోజులు గుర్తుకు వచ్చాయి. చివర్లో మాత్రం ఇంక కంటి నీరు ఆగలెదండి. మీ అమ్మగారు శరీరకంగా మీ దగ్గర లేకపోయినా, ఆవిడ ప్రేమా ఆశీస్సులు ఎప్పటికీ మీతోటి ఉంటాయి.
రిప్లయితొలగించండిధన్యవాదాలు వనజ గారు, నిజమేనండీ విషాదమూ జీవనరాగమే.
రిప్లయితొలగించండిఅజ్ఞాత గారు ధన్యవాదాలు, అవునండీ ఒకోసారి వదిలి ఊరికి వెళ్ళడానికి కూడా బాధపడతాం.
really touching! nice write-up!!
రిప్లయితొలగించండి