ఉదయం స్టడీ అవర్ కోసం నిద్ర లేపడానికి వచ్చే వార్డెన్ ని రోజుకోరకంగా మోసం చేసి అతనికి చిక్కకుండా ఒక రూం లోనుండి ఇంకో రూంలోకి అవసరమైతే మంచం కింద, ఒకోసారి బిల్డింగ్ చివర మెట్లమీద కూడా ముసుగుపెట్టి నిద్రపోవడంతో మావాడికి వాడి అల్లరికి రోజు మొదలౌతుంది. మా వార్డెన్ గారు కూడా మమ్మల్నందరినీ ఒకసారి లేపేసి ఇక వాడ్ని వేటాడ్డంలో బిజీ ఐపోయేవారు. వాళ్ళిద్దరు టాం & జెర్రీ ఆటాడుకుంటుంటే మాకు మంచి కాలక్షేపమై నవ్వులతో ఉదయపు నిద్రమత్తంతా వదిలి పోయేది. ఇక అక్కడి నుండీ బాత్రూం దగ్గర ప్లేస్ కోసం మిగిలిన వాళ్ళతో గొడవేసుకోవడం.. బ్రేక్ ఫాస్ట్ టైం లో మెస్ వార్డెన్ తో రెట్టింపు ఇడ్లీలకోసమో చపాతీలకోసమో ఇవేమీ కాదంటే నేనే ముందేసుకోవాలంటూ పక్కవాడితో సాంబార్ బక్కెట్ కోసమో గొడవేసుకునేవాడు అన్నీ సరదాకే లెండి. మాకు మాత్రం బ్రహ్మాండమైన కాలక్షేపం.
ఇక అదయ్యాక ఉదయం 9 గంటలకి ఒక గంటపాటు రోజుమార్చి రోజు ఏదో ఒక సబ్జెక్ట్ లో మాకు స్లిప్ టెస్ట్ లు పెట్టేవారు. వార్డెన్లే పేపర్ సెట్ చేసి గంటకి సరిపోయేలా నాలుగైదు ప్రశ్నలకన్నా ఎక్కువ లేకుండా పెట్టే చిన్న పరీక్ష కాబట్టి దాన్ని స్లిప్ టెస్ట్ అనేవారు. కానీ మా జిలానీ మాత్రం స్లిప్పులు పెట్టుకుని చూసి రాసేది కాబట్టి దాన్ని స్లిప్ టెస్ట్ అంటారు కాబోలునని వాడంతట వాడే సొంతంగా నిర్వచనం చెప్పేసుకున్నాడు. దాంతో ప్రతి టెస్ట్ కూ ఖచ్చితంగా స్లిప్పులు ప్రిపేర్ చేసుకుని తెచ్చుకునేవాడు. వాటిని వార్డెన్ కం ఇన్విజిలేటర్లకి కనపడకుండా రోజుకో కొత్త ప్రదేశంలో కొత్త రకంగా దాచిపెట్టి వార్డెన్ కి తెలీకుండా వాటిని చూసి రాయడానికి విశ్వప్రయత్నం చేసేవాడు. కానీ రోజూ వార్డెన్ కి దొరికి పోయేవాడు. ఒరే నీకు ప్రశ్నలు తెలియవు కదా అసలు ఏం స్లిప్పులు తెస్తావు రా అంటే ఫార్ములాలు అవీ రాసి తెచ్చుకుంటాను అని చెప్పేవాడు. కాకపోతే వార్డెన్ తన ఏకాగ్రతనంతా వాడిమీద చూపించి వాడిదగ్గర స్లిప్ లు వెదకడానికి వాడ్నిగమనించడానికే ప్రాముఖ్యతనిచ్చేప్పటికి సందట్లో సడేమియా అంటూ అవసరమయినపుడు మేం పక్కన ఒకళ్ళకొకళ్ళకి హెల్ప్ చేసుకుంటూ రాసుకునే వాళ్ళం :-) ఆవిధంగా మాఅందరికీ వాడు బోల్డంత ఎంటర్ టైన్మెంట్ ఇవ్వటంతో పాటు సాయం కూడా చేసేవాడనమాట.
ఇక క్లాస్ లు జరిగేటప్పుడు మా లెక్చరర్లందరికీ మావాడు శుద్దమొద్దని ప్రగాఢమైన విశ్వాసం కనుక వాడిమీద ప్రత్యేకమైన శ్రద్ద చూపించేవారు. బి.ఎన్.కె. గారనీ మాకు రేఖాగణితం చెప్పడానికి ఒక సార్ వచ్చేవారు ఆయనకి మా జిలానీ ప్రియశిష్యుడు. మా సార్ తరహానే ప్రత్యేకంగా ఉండేది, బ్లాక్ బోర్డ్ దగ్గరలో ఉన్నంత సేపు బాగానే కుదురుగా ఉండేవారు కానీ ఆ ఏరియా దాటి మా మధ్యలోకి వస్తే బాక్సింగ్ రింగ్ లో కదులుతున్న బాక్సర్ గుర్తొచ్చేవాడు. అచ్చం అలానే మునివేళ్ళ మీద అటు ఇటు వేగంగా కదులుతూ ఒక్కొక్కరినీ ప్రశ్నలడుగుతూ జవాబు చెప్పలేని వాళ్ళని వంగోబెట్టి వీపు మీద అరచేత్తో ఘాఠ్టిగా ఒక్క చరుపు చరిచేవాడు మాలో కొందరికైతే వాతలు తేలి సాయంత్రం వరకూ స్పష్టంగా అంతే ఉండేవి. అబ్బ ఆయన గురించి తలుచుకుంటుంటేనే వీపు మీద మంట పుట్టి వెన్నులోంచి వణుకు వస్తుంది :-(
ఆయన క్లాస్ లో మా జిలానీ హైడ్రామా నడిపేవాడు వాడ్ని ప్రశ్న అడగడంతోనే స్టార్ట్ వాడికెలాగూ రాదని తెలుసు పక్కన మేమెవరమన్నా అందిస్తే మా వీపులు సాఫ్ చేసేవారు మా బి.ఎన్.కె అందుకని మేం నోర్మూసుకుని కూర్చునే వాళ్ళం. మనకసలే హెల్పింగ్ నేచరెక్కువకదా మొదటిసారి అలా అందించబోయి ఆయన చేతిలో దెబ్బలు తిన్నది నేనే. ఇక మా సార్ దగ్గరికి రావడం తోనే మా వాడు పెద్దగా పొలికేకలు “సార్ సార్ వద్దుసార్.. కొట్టద్దు సార్.. వీపు మీద సెగ్గడ్డ లేచింది సార్.. కావాలంటే రేపు కొట్టండి సార్.. లేదంటే చేతిమీద కొట్టండి సార్.. రేపు చదువుకుని వస్తాను సార్..” ఇలా వాడికి తోచిన విధంగా డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించేవాడు, సార్ చెయ్యెత్తగానే “అయ్యో.. అమ్మో.. అబ్బో..” అని పెడబొబ్బలు పెట్టి గోల గోలగా క్లాస్ అంతా కల్లుతాగిన కోతిలా గంతులేసి పెద్ద సీన్ క్రియేట్ చేసేవాడు. మా సార్ ఒకోసారి నేను ఇంకా కొట్టలేదురా సరే ఈ రోజు వదిలేస్తాలే అని వాడు కాస్త సైలెంట్ అవ్వగానే ఠపీమని పీకేవారు.
ఇలాంటి రోజుల్లో ఒక వింటర్ లో మా జిలాని గాడికి ఈ దెబ్బలు తప్పించుకోడానికి మహత్తరమైన ఐడియా వచ్చింది ఒక రోజు ఉదయాన్నే క్లాసులు మొదలయ్యే ముందరే మా అందరితో ఛాలెంజ్ చేశాడు “ఒరే చూడండ్రా ఈ రోజు బి.ఎన్.కె గారి నుండి ఎలా తప్పించుకుంటానో..” అని మేం అంతా రోజూకన్నా కాస్త బొద్దుగా కనిపిస్తున్న జిలానీ గాడ్ని చూస్తూ ఏం చేస్తాడబ్బా అని అనుకున్నాం. క్లాసు మొదలైంది మా సార్ యథావిధిగా మావాడ్ని ఏదో ప్రశ్న అడగటం వీడు చెప్పలేకపోవడం జరిగాయి ఎప్పట్లానే మావాడు డ్రామా స్టార్ట్ చేసినా కాస్తంత విజయంతోకూడిన నవ్వు వాడిమొహంలో మాకు తెలుస్తుంది. మా సార్ వాడ్ని వంగోబెట్టి అరచేత్తో ఒక్కటిచ్చాడు ఎప్పుడూ వచ్చే టపామనే శబ్దం కాకుండా ఏదో పరుపు మీద కొట్టినట్లు చప్పుడైంది.
మా సార్ సామాన్యుడా వెంటనే విషయం గ్రహించేశారు ఒరే నువ్ అలాగే ఉండరా అని చొక్కా పైకెత్తారు.. లోపల ఇంకో చొక్కాకనిపించింది.. మా జిలాని గాడి ఫేస్ లో నవ్వు మాయమైంది :-) మా సార్ ఆ లోపలి చొక్కాని కూడా పైకెత్తారు దానిలోపల ఇంకోటి అలా మొత్తం నాలుగు చొక్కాలు లోపల ఒక పలచని స్వెటర్ వేసుకుని మాంచి కుషన్ లాగా తయారు చేసుకుని వచ్చాడు మా వాడు. మా సార్ ఆ స్వెటర్ కూడా పైకిలెపే సరికి ఇక మా వాడి విలయతాండవం మళ్ళీ మొదలైంది “సార్ సార్ తప్పైపోయింది సార్ ఒక చొక్కా అయినా ఉంచి కొట్టండి సార్..” అని ఒకటే గోల కానీ అలా చేస్తే మా సార్ బి.ఎన్.కె ఎందుకౌతారు మొత్తం తీసేసి ఒట్టి వీపు మీద చాచిపెట్టి ఒక్కటిస్తే ఆ వాతలు తెల్లారేవరకూ తగ్గలేదు పాపం. అంతే మావాడు మళ్ళీ ఆయన ముందు ఇంకెప్పుడూ అలాంటి ట్రిక్కులు ప్రయోగించే ధైర్యం చేయలేదు.
చెప్పడం మరిచాను ఆయన దెబ్బలు తప్పించుకోవడానికి నేను కూడా ఓ చిన్న ట్రిక్ ప్లే చేసేవాడ్ని :-) ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం గురించి ఏకొంచెం సంశయమున్నా కాస్త భయపడుతూ బిక్కు బిక్కు మంటూ బెదురు చూపులు చూసేవారి మీదే ఆయన దృష్టి ఎక్కువ ఉండేది, అలాంటివారిని ఎక్కువగా లేపి జవాబు చెప్పమనేవాడు. అందుకని ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబులు తెలిసినా తెలియక పోయినా నాకు అన్నీ తెలిసినట్లు నన్ను అడగట్లేదేమిటి అన్నట్లుగా అత్యుత్సాహం ప్రదర్శించేవాడ్ని. ఆయన వీడికి జవాబు తెలుసులే అనుకుని నాలాంటివారిని అడిగేవాడు కాదు, నా ట్రిక్ చాలా కాలమే పని చేసి నన్ను దెబ్బలనుండి రష్చించేసింది.
ఈ పై యానిమేషన్ చూశారా. పూర్తిపాటకి ఇక్కడ చూడండి. చాలా పాత వీడియో నాలుగేళ్ళక్రితంది కానీ నాకు చాలా నచ్చిన వీడియో.. ఆ పాటే సింప్లీ సూపర్బ్ అనుకుంటే ఎవరు చేశారో కానీ యానిమేషన్ చాలా బాగా చేశారు. పాటపాడేటప్పుడు హిప్పో ముఖ కవళికలు, కుక్క డ్యాన్స్, దాని డ్యాన్స్ చూసి హిప్పో ఫేస్ లో ఏహే ఏంటీ అల్లరి అన్నట్లు చూసే చూపులు మొత్తం నాకు చాలా చాలా ఇష్టం.. ఎలాంటి మూడ్ లో ఉన్నపుడైనా నన్ను హాయిగా నవ్వించేస్తుంది ఈ వీడియో. డాన్స్ పేరుతో ఈ కుక్కచేసే అల్లరి చూస్తే అప్పుడప్పుడు మా జిలానీ గుర్తొస్తుంటాడు. ఇప్పుడెక్కడున్నాడో తెలీదు కానీ ఈ టపా చదివి మళ్ళీ కలిస్తే బాగుండు అనిపిస్తుంది.
మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
సర్వేజనా సుజనోభవంతు,
సర్వేసుజనా సుఖినోభవంతు.
సర్వేజనా సుజనోభవంతు,
సర్వేసుజనా సుఖినోభవంతు.
అవునండీ,బాగా చెప్పారు..ఇలాంటి వాళ్ళుంటేనే క్లాస్ సందడిగా ఉంటుంది...
రిప్లయితొలగించండిమీ హాస్టల్ అనుభవాలు బాగున్నాయి...
:)
సంక్రాంతి శుభాకాంక్షలు....
ఏంటి వేణూ..పండగ సెలవలా..టపాల మీద టపాలు వ్రాసేస్తున్నారు!
రిప్లయితొలగించండిమీ హాస్టలు అనుభవాలు చదువుతుంటే కొత్త బంగారులోకం సినిమా గుర్తుకొస్తుంది.
శుభ సంక్రాంతి.
మీ జిలాని గురించి చెబితే వీడు మా ఇంజనీరింగ్లో జిలాని ఏమో అని డౌట్ గా ఉంది. :) బొద్దు/అల్లరి అన్ని వాడే గాని చదువులో కూడా ఇంటెలిజెంటే మరి. Yఎ వూరండీ మీది? మావాడు గుంటూర్, నెల్లూర్లలో చదివాడుట.
రిప్లయితొలగించండిహహః..బాగుంది వేణు గారు..:)
రిప్లయితొలగించండిమా క్లాసు లో కూడా ఇలాంటి అబ్బాయి ఉండే వాడు..బాబోయ్ మేము నవ్వ లేక పోయే వాళ్ళం... :)
మా వాళ్ళందరూ...నాకు టచ్ లో నే ఉన్నారు..
ఇంకా అదే అల్లరి కంటిన్యూ అవ్తోంది.. :)
సంక్రాంతి శుభాకాంక్షలు.. :)
ఇలాంటివాళ్ళు ఒక్కళ్ళుంటే చాలు ఆ ఇంటెన్సివ్ ఇంటర్ ఎన్ని సంవత్సరాలైనా చదవొచ్చు అనిపిస్తుంది :))
రిప్లయితొలగించండిఫోటోలు మాత్రం భలే దొరికాయిగా!
మీకూ, మీ కుటుబసభ్యులకీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు :-)
మీ పార్ట్ 9 కి కామెంట్లు డిసేబుల్ చేసారని ఇక్కడ రాస్తున్నాను..
రిప్లయితొలగించండిటపా బాగుంది!! . మా యూనివర్సిటీ లో రాఖీలు కట్టి, నా రాఖీ బ్రదర్ అదీ అంటూ తిరిగిన అమ్మాయిలు కూడా కోకొల్లలు.. మీ కథ వింటే గుర్తొచ్చింది. ఒక అబ్బాయి ఇలాగే బ్లాక్ మెయిల్ కోసం పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం ఫార్స్ చేసి, ఎవరూ పట్టించుకోవటం లేదని, డిపార్ట్ మెంట్ ముందు వచ్చి మరీ పడిపోయాడు :)అప్పుడు అందరూ విసుక్కుంటూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు ..
ఎంత బాగుందో .. నేను కూడా విజయవాడలో చదువుకున్నప్పుడు .. హాస్టల్ లో మంచం కింద అది పడుకునేదాన్ని :) బాగుంది .. వీడియో సూపరు :) మీరు కేక అంతే :)
రిప్లయితొలగించండి- కావ్య
స్నిగ్ద గారు నెనర్లు, నిజమేనండి ఒకళ్ళుంటే క్లాసంతా సందడిగా ఉంటుంది.
రిప్లయితొలగించండిసిరిసిరిమువ్వ గారు నెనర్లు, నిజమేనండి కొత్తబంగారులోకంలో కొన్ని సీన్లు చూసినప్పుడు నాకు మా హాస్టల్ రోజులు గుర్తొచ్చాయి :-) ఏం లేదండీ పండగముందు నిన్నటి సీరియస్ టపాతో చాలామందికి మూడాఫ్ చేశా అనిపించింది అందుకని కాసేపు నవ్విద్దామని వెంటనే ఈ టపా వేశాను.
బుడుగు గారు నెనర్లు, నేచదివింది నేచెప్పేది విజయవాడ సిద్దార్ధ రెసిడెన్షియల్ కాలేజ్ కబుర్లండీ..
నిషి నెనర్లు, హహ నిజమే ఒక్కడుంటే ఎన్నేళ్ళైనా చదివేసేయచ్చు అలసట తెలీకుండా.. నాకు ఫోటోలు చూసినపుడు అదే అనిపించింది భలే దొరికాయి అని :)
కృష్ణప్రియ గారు నిన్న ఏదో హడావిడిలో తెలీకుండా డిజేబుల్ చేశానండీ ఇపుడు మళ్ళీ ఎనేబుల్ చేశాను.
కావ్య నెనర్లు :-) హ హ నువ్వు కూడా ఇలాంటి అల్లరి లో ముందుండేదానివనమాట హాస్టల్ కబుర్లతో ఒక సిరీస్ మొదలెట్టేసేయ్ మరి:-)
ఇవన్నీ "చైనా కొండ్రుపాడు" కబుర్లా?
రిప్లయితొలగించండిఇలాంటివి చదువుతుంటే జీవితంలో ఒక్కసారైనా హాస్టల్ లో ఉండి చదువుకోలేకపోయాననే దిగులు మళ్ళీ తలెత్తుతుంది.
జిలానీ లాంటి వాళ్ళు స్కూల్లో, కాలేజీ లో తప్పకుండా ఉంటారు. ఉండాలి కూడా! ఇలాంటి వాళ్ళే ఆ రోజుల్ని తీయని జ్ఞాపకాలుగా ఎక్కువరోజులు ఉంచగలుగుతారు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఇవి తెలుసుకుంటే బాగుంటుందిగా
స్లిప్ టెస్ట్ కి ఇచ్చిన నిర్వచనం చాలా బాగుంది. హాస్టల్ అనుభవాలు అంతకంటే బాగున్నాయి. నా హాస్టల్ ని కూడా గుర్తు తెస్తున్నారు. కాకపోతే అలా చదివించే హాస్టల్ కాదులెండి. ఇది వేరు.మీ అందరి ఫ్రెండ్స్ ని ఒకసారి కలుసుకొండి. చాలాబాగుంటుంది. హ్యాపీ సంక్రాంతి.
రిప్లయితొలగించండిసుజాత గారు నెనర్లు.
రిప్లయితొలగించండిచైనా కొండ్రుపాడు ??? అంటే ఏంటండీ నాకు అర్ధం కాలేదు.
హ్మ్ నిజమేనండీ హాస్టల్ రోజులను సరిగా ఉపయోగించుకుంటే సరదాకు సరదా లోకఙ్ఞానాకి లోకఙ్ఞానం బోలెడంత సంపాదించుకోవచ్చు.
జయ గారు నెనర్లు, మరీ మనకి దొరికిన మిత్రుల మనస్తత్వం మరీ హింసించేలా ఉంటే తప్ప హాస్టల్ ఏదైనా ఎంజాయ్ చేయచ్చండి.
వేణుగారూ...మీ జిలానీ భలే కామెడీగా ఉన్నాడే! మా క్లాసులోను ఒకడుండే వాడు...లెక్చలర్లందరికీ అతనంటే చిరాకు.అయినా కూడా అల్లరి ఆపేవాడు కాదు.మళ్ళీ క్లాసు మధ్యలో వెధవ డౌట్లు వస్తాయ్ మహానుభావుడికి!! మా అందరికీ మంచి టైం పాస్! హ్మ్! మీరు పెట్టిన ఆ వీడియో భలే ఉంది.కుక్క....బాగుంది :))))
రిప్లయితొలగించండిబాగుంది వేణుశ్రీకాంత్ గారూ.. :) ఒకవైపు ఆ కోతిచేష్టలు నిరసిస్తూనే అందరూ మెచ్చుకోవడం, తీపిగుర్తుగా స్మరించుకోవడం , మీకేమని పిస్తుంది? .... మహానుభావుడు డార్విన్ సరిగానే చెప్పాడని అనిపించట్లేదూ? :)) :P
రిప్లయితొలగించండిఇందు గారు నెనర్లు :-) హ హ నిజమేనండి డౌట్స్ మర్చిపోయాను మావాడికి కూడా చిత్రవిచిత్రమైన డౌట్స్ వచ్చేవి పైగ సార్ అటెన్షన్ కోసమని ఏదో అడగాలని అడుగుతున్నట్లు అనిపించేది వాడు అడుగుతుంటే. హ హ నిజమే కుక్క డ్యాన్స్ సూపర్.
రిప్లయితొలగించండిSnkr గారు నెనర్లు :-) హ హ కదా నిరసించడం ఏమీలేదు లెండి ఒకోసారి విసుగొస్తుంది కానీ ఓవర్ ఆల్ గా నవ్వొచ్చేది. మరే మావాడ్ని చూస్తే డార్విన్ సిద్దాంతం నిజమే అనిపిస్తుంది ఎవరికైనా.
హహ్హహ్హా.. వేణు గారు, భలే ఉంది టపా.
రిప్లయితొలగించండి>>బాక్సింగ్ రింగ్ లో కదులుతున్న బాక్సర్ గుర్తొచ్చేవాడు.
>>రోజూకన్నా కాస్త బొద్దుగా కనిపిస్తున్న జిలానీ గాడ్ని చూస్తూ
:))) సూపర్..
వేణు గారు..హాస్టల్ లో చదువుకుంటే ఇన్ని పోస్ట్ లు రాయొచ్చన్నమాట .....
రిప్లయితొలగించండినాకు హాస్టల్ గాని ఆ వాతావరనం గురించి గాని ఏమి తెలియదండి .... నాకు మా ఊరు పక్క వూరి మొహం తప్ప ఏమి తెలియదులేండీ
వేణు గారు, భలే ఉంది టపా.మీ హాస్టలు అనుభవాలు చదువుతుంటే కొత్త బంగారులోకం సినిమా గుర్తుకొస్తుంది.
అప్పు నెనర్లు :-) మీకు టపా నచ్చి ఎంజాయ్ చేసినందుకు సంతోషం.
రిప్లయితొలగించండిశివరంజని నెనర్లు :-) బ్లాగ్ టపాలకోసం కాదు కానీ హాస్టల్ జీవితం బోలెడు పాఠాలు నేర్పింది, అలానే మొదటి సారి ఇంటి నుండి దూరంగా గడిపిన ఒంటరి జీవితం అంతులేని బాధనుకూడా మిగిల్చింది. హాస్టల్ నాకు నచ్చిందా నచ్చలేదా అనే విషయమై నాకు ఇప్పటికీ అయోమయమే.
దెబ్బలు తప్పించుకోడానికి మీచిట్కానే నేనూ ఫాలో అయ్యేవాడిని.. చాలా చక్కని ఫలితం ఇచ్చింది :-) :-)
రిప్లయితొలగించండిమురళిగారు నెనర్లు :-) హ హ కదా నిజమే భలే బురిడీ కొట్టించేవాడ్ని ఆప్లాన్ తో :-)
రిప్లయితొలగించండిచాలా బాగున్నాయి మీ హాస్టల్ కబుర్లు:)).
రిప్లయితొలగించండిరాధిక(నాని) గారు నెనర్లు :-)
రిప్లయితొలగించండిvenu garu mee post bavundandi, nenu kuda hostel lo baga enjoy chesedaanni friends tho kalisi. Maa friend di inko route .Sir question adigithe complicated english terms tho fast ga cheppedi , Sir ki adhi cheppina answer ardhakaka malla repeat cheyyamani adagadaniki bhayam vesi tanani malla question adigevallu kaadu
రిప్లయితొలగించండిThanks లక్ష్మిగారు. హ హ మీ ఫ్రెండ్ ఐడియా కూడా బాగుంది :-)
రిప్లయితొలగించండిమీ హాస్టల్ అనుభవాలు బాగున్నాయి .
రిప్లయితొలగించండికొత్త బంగారులోకం సినిమా చూస్తున్నట్టు అనిపించింది.
Thanks Sailu gaaru.
రిప్లయితొలగించండిహహహ ఈ లెక్కల మాష్టార్లందరూ ఇలా వీపు మీద కొట్టే విద్యలో కూడా ట్రైనింగ్ తీసుకుని వస్తారేమో వేణు గారూ! మా రాధాకృష్ణ మాష్టారు కూడా ఇంతే! ఇలాగ మా క్లాసులో రాంబాబు అని ఒకబ్బాయి ఉండేవాడు. అతను రాకపోతే ఆదివారం స్కూలుకి వెళ్లినట్టు అనిపించేది! ఒకసారిలానే మా మాష్టారు ఏదో అడిగితే అతను చెప్పలేదు! ఆయనకి కోపమొచ్చి ఏరా నీకు ఆమ్బోతుకి తేడా ఎంటిరా? అదీ తింటుంది నువ్వు తింటావ్ ఎంత చెప్పినా దానికీ బుర్రకెక్కదు నీకూ ఎక్కదు అంటారు వెంటనే ఇతను నాకు బట్టలున్నాయి దానికి లేవు మాష్టారూ అన్నాడు అంతే ఇహ! వీపు విమానం, ఫైర్ ఇంజను, జెట్టు, కారం మిల్లు, పిండి మర అన్ని మోతలు కలిపి అతని వంటి మీద మోగాయి!
రిప్లయితొలగించండిధన్యవాదాలు రసజ్ఞ గారు, పొద్దున్నే భలే నవ్వుకున్నాను మీ రాంబాబు గారి ఎపిసోడ్ చూసి మహా స్పాంటేనియస్ కుర్రాడిలా ఉన్నాడు :-) ఇలాంటి విధ్యార్ధులు అలాంటి మాష్టర్లు లేకపోతే చదువు పెద్ద బోర్ అనిపించేస్తుంది లెండి :-)
రిప్లయితొలగించండివేణు గారికి నమస్కారం!
రిప్లయితొలగించండితెలుగు భాషాభిమానులని బెంగుళూరు నగరంలో సమావేశ పరచే ప్రక్రియలో మిమ్మల్ని సంప్రదిస్తున్నాను. మరిన్ని వివరాలకై veera.sj@rediffmail.com కి ఒక టెస్ట్ మెయిల్ పంపగలరు.
ఇట్లు
శశి
శ్రమ తీసుకుని కాంటాక్ట్ చేసినందుకు ధన్యవాదాలు శశి గారు. ప్రస్తుతం నేను బెంగళూరులో ఉండటం లేదు కనుక సమావేశంలో పాల్గొనలేను.
తొలగించండి