~*~*~ ఇది సీరియల్ కాదు ఏ టపాకు ఆ టపానే విడిగా కూడా చదువుకోవచ్చు.. నేను విజయవాడ సిద్దార్థ రెసిడెన్షియల్ లో ఇంటర్మీడియట్ చదివేరోజుల్లో జరిగిన ఈ హాస్టల్ కబుర్ల గురించి పరిచయం లేని వారు విజయవాడ హాస్టల్లో అన్న లేబుల్ పై క్లిక్ చేస్తే ముందు 5 టపాలు చదవవచ్చు.~*~*~
ఇలాంటి ఒక ఆదివారం నా నేస్తాలంతా వేరే వేరే పనుల మీద తలోదిక్కు వెళ్ళడంతో నేను ఒంటరి వాడినైపోయాను. క్రితంవారమే ఇంటికి కూడా వెళ్ళివచ్చాను కనుక ఒంటరిగా తిరిగేసొద్దాం అని ఈడుపుగల్లు నుండి విజయవాడ RTC బస్టాండ్ కు వెళ్ళే సిటీబస్ ఎక్కి రాఘవయ్యపార్క్ దగ్గర దిగాను. మేం సాధారణంగా ఆ చుట్టుపక్కల ఏరియాలన్నీ సర్వేచేసేవాళ్లం బీసెంట్ రోడ్, స్వర్ణాపేలస్, ఆ దగ్గరలోని పాతపుస్తకాల షాపులు, రాజ్ యువరాజ్ థియేటర్ సెంటర్ ఇంకా వాటి దగ్గర రీడింగ్ రూములూ అన్నీ నడిచి తిరిగేవాళ్ళం. నేను కూడా అలాగే తిరుగుతూ కొన్ని పాత పుస్తకాలు కొనుక్కుని చీకటి పడ్డాక డిన్నర్ గురించి ఏంచేద్దామా అని ఆలోచిస్తున్నంతలో ఒక బార్ & రెస్టారెంట్ కనిపించింది. మా కారంపూడిలో పక్కింటి సత్యం వల్లనైతేనేమి ఇంకొన్ని దుస్సంఘటనలవల్ల అయితేనేమి నాకు చిన్నప్పటినుండి కూడా తాగినవాళ్ళను చూస్తే భయం.
గమనిక : సర్వకాల సర్వావస్థలయందునూ ఏవిధమైన ఆల్కహాల్ పానీయమైననూ సేవించుట ఆరోగ్యానికి హానికరమని పిల్లలు పెద్దలు అందరూ గుర్తించ ప్రార్ధన.కానీ ఆ క్షణం ఒక చిన్న చిలిపి ఆలోచన వచ్చింది దానికి తోడు లోపలనుండి పలావు ఘుమ ఘుమలు రారమ్మంటూ పట్టిలాగుతున్నాయి, గమనించి చూస్తే అప్పటికింకా ఏడుగంటలే అవడం మూలాన్నేమో పెద్దగా రష్ కూడా లేదు. సరే అని “సాహసం సేయరా ఢింభకా” అని నాకు నేనే ధైర్యం చెప్పుకుని లోపలికి అడుగుపెట్టాను. ఒక ప్లేట్ పలావు ఒక థమ్సప్ ఆర్డర్ చేసి కూర్చున్నాను. బయటికి పలావు వాసన మాత్రమే వచ్చింది కానీ లోపల సిగరెట్లు మందు నీచు కలిసిన ఘోరమైన వెగటు వాసనతో కడుపులో తిప్పడం మొదలైంది.
“వెయిటర్ ని చూస్తే కాస్త మంచోడు లాగానే కనిపిస్తున్నాడు మనకి కోపరేట్ చేస్తాడంటావా లేక అడగ్గానే పుసుక్కున నవ్వేసి ఆటపట్టిస్తాడా...” అని ఆలోచనలు ఒక వైపు.
“ఎవడికి తిక్కరేగి సినిమాలో చూపించినట్లు బాటిల్ పగలకొట్టి మన మీదకి ఫైటింగ్ కొస్తాడో ఒక వేళ అలా వస్తే వాడ్ని ఎలా ఎదుర్కోవాలి? చేతికి అందుబాటులో ఎమేం వస్తువులు ఉన్నాయ్? మనం బెండ్ అవడానికి ఎటువైపు సామాన్లు లేకుండా ఖాళీ ఉంది? పంచ్ ఎలా ఇవ్వాలి?” అని శివ రేంజ్ లో ఫైట్ ప్లానుల ఆలోచనలు మరొక వైపు..
“ఇక్కడ నన్ను ఎవరైనా చూసి అమ్మకి చెప్తే నా పరిస్థితి ఏంటి? మూడో తరగతి నుండి ఇంతవరకూ తన్నులు తినలేదన్న రికార్డ్ బ్రేక్ అవుతుందా? చదువు మానిపిస్తారా?..” అన్న ఆలోచనలు మరో వైపు ఇలా నానావిధాలుగా టెన్షన్ పడుతుండగా వెయిటర్ ఫుడ్ తెచ్చాడు.
అతన్ని “ఒక్క క్షణం బాస్” అని ఆపి “ఒక క్వార్టర్ విస్కీ బాటిల్ తెస్తావా ఖాళీది” అని అడిగాను. అతనొకసారి వార్నీ ఈడిక్కూడా మందుగావాల్సొచ్చిందా అన్నట్లు పైనుండి కిందకి చూసి చిరాగ్గా “ఏం బ్రాండ్?” అని అడిగాడు. దానికి నేను “ఆహ ఏ బ్రాండ్ ఐనా పర్లేదు ఖాళీబాటిల్ కావాలి దాన్లో ఈ థమ్సప్ పోసి ఇవ్వు” అని అడిగాను. విషయం అర్ధం కాగానే అతని మొహంలో చిరాకు స్థానే ఆసక్తి ప్లస్ అల్లరి కనిపించాయ్.. నవ్వుతూ “ఏం బాస్ లవ్వర్ కి టోకరా ఇవ్వడానికా?” అని అడిగాడు. “ఎందుకోకందుకు నువ్వు ఇవ్వరా బాబు” అంటే “కుదరదు బాస్ మాశేఠ్ చూస్తే బిల్ ఏస్తాడు” అన్నాడు. నాకు ఎలాగైనా ఆ క్వార్టర్ బాటిల్ లో కూల్ డ్రింక్ పోసుకుని వెళ్ళి మావాళ్ళ ముందు దేవదాస్ రేంజ్ లో కలర్ ఇవ్వాలన్న కోరిక పెరిగిపోతుంది. సరదా గురించి చూస్తున్నానే కానీ ఆ సీసా నేను క్యాంపస్ లోకి తీసుకువెళ్తే ఒకవేళ అదిబయటపడితే వచ్చే అనర్థాలగురించి ఆ క్షణం ఆలోచించలేదు.
మెటల్ ఆల్కహాల్ ఫ్లాస్క్ |
సీసాతో పాటు నా కలలు కూడా బద్దలై వాస్తవంలోకి వచ్చి ఎక్కడా అని తలదించి చూస్తే.. కవర్లో సీసా ముక్కలు ముక్కలై... థమ్సప్ నేను కొన్న పుస్తకాలని పూర్తిగా తడిపేసి గాజుపెంకులు ప్లాస్టిక్ సంచికి చేసిన కన్నంలోంచి కిందకి కారుతూ నా ప్యాంట్ పైకి కూడా చింది అంతా బంక బంకగా ఖంగాళీ సీన్. అనుమానం వచ్చి తల ఎత్తి పక్కలకి చూస్తే ఒకరిద్దరు అనుమానంగా నా వైపే చూస్తూ కనిపించారు. హిహిహి అని ఒక వెర్రినవ్వు నవ్వి హమ్మయ్య పర్లేదు ఎవరూ సీరియస్ గా తీసుకున్నట్లు లేదులే అని తల మరోపక్కకి తిప్పగానే పక్కనే కిళ్ళీ బంకు దగ్గరనుండి నిర్లక్ష్యంగా సిగరెట్ కాలుస్తూ “ఏంట్రా అది?” అని అడుగుతూ ఒక కానిస్టేబుల్ నా వైపు నడవడం మొదలెట్టాడు. నా పై ప్రాణాలు పైనే పోయాయ్ “ఒరేయ్ వేణుగా ఐపోయిందిరా.. నీ జీవితం మఠాష్.. జాగ్రత్తగా డీల్ చేయకపోయావో నీశేషజీవితమంతా జైల్లోగడపాల్సిందే.. నీ ఎంకమ్మా.. నువ్వూ నీ దిక్కుమాలిన ఐడియాలు..” అని నన్ను నేనే మనసులో బండ బూతులు తిట్టుకుంటూ సాధ్యమైనంత నవ్వుముఖంతో మాక్సిమమ్ మర్యాదతో ఇది సార్ జరిగింది కావాలంటే ఆ బార్ లో వెయిటర్ సాక్ష్యం సార్ అని మొత్తం స్టోరీ వినిపించాను.
మరి నా ఫేస్ లో అమాయకత్వం కనిపించిందో, నా భయం చూసి జాలేసిందో, నా మాటతీరు నచ్చిందో, తను వయసులో ఉన్నపుడు చేసిన అల్లరి గుర్తొచ్చిందో గాని అతనుకూడా టోన్ మార్చేసి నవ్వుతూ “అల్లరి చేయాలనుకుంటే చాలదోయ్ తగిన తెలివితేటలు కూడా ఉండాలి... డ్రింక్ లో గ్యాస్ ఉంటుంది కదా నువ్వు సంచి ఊపడంవల్ల లోపల ప్రెజర్ ఎక్కువై సీసా పగిలి ఉంటుందిలే కంగారు పడకు..” అని సర్దిచెప్పి బంకులో ఇంకో క్యారీబ్యాగ్ ఇప్పించి “పుస్తకాలు అందులో పెట్టుకుని బుద్దిగా హాస్టల్ కి వెళ్ళు..” అని పంపించాడు. నేను తిరిగి చూడకుండా అదిరే గుండెని అరచేత పట్టుకుని ఎలాగో హాస్టల్ లో పడ్డాను. అలా హీరోనవుదామనుకున్న నా కల నెరవేరక జీరోగా మిగిలిపోవడమే కాక ఎంత ఆరబెట్టినా ఆ పుస్తకాలకు ఉన్న బంక వదలక చాన్నాళ్ళపాటు వాటిని ముట్టుకున్నపుడల్లా ఆ పోలీస్ మొహమే గుర్తొచ్చి వణుకొచ్చేది.
ఇప్పుడు ఎప్పుడైనా ఈ సంఘటన గుర్తొస్తే ఇలా అనిపిస్తుంటుంది.. అప్పట్లో ఇంత టెర్రరిజం లేకపోబట్టి గానీ అదే ఇప్పటి రోజుల్లో ఐతే ముందు నన్ను షూట్ చేసేసి తర్వాత ఏం జరిగిందో ఎంక్వైరీ చేసి ఉండేవాడేమో.
గమనిక : ఆల్కహాల్ సేవించుట ఆరోగ్యానికి హానికరమని పిల్లలు పెద్దలు అందరూ గుర్తించ ప్రార్ధన. అది శరీరంపై కలుగజేయు దుష్ఫలితాల గురించి తెలుసుకోవడానికి ఈ క్రింది చిత్రం చూడండి.
హహహ. భలే ఉందండీ మీ అనుభవం. ఎంతైనా ఇంటర్ వయసులో భలే తుంటరి ఆలోచనలు వస్తాయి కదా :)
రిప్లయితొలగించండిహ్హహ్హహ్హ! వేణుగారు! భలే ఐడియా వచ్చిందండీ...హ్మ్! దెబ్బకి దడుచుకుని ఉంటారుగా! పాపం! నాకు ఒకసారి ఇంతే జరిగింది.మీకు కూల్డ్రింక్..నాకు ప్లాస్టిక్ కవర్లో సీల్ చేసిన చెరుకు రసం. అది నా లాబ్ నోట్స్ మీద చింది..నానా యాగి అయ్యింది లేండీ...హ్మ్! బాగుంది మీ దేవదాస్ ఙ్గ్నాపకం :))
రిప్లయితొలగించండిహహహహాహ్హహ్హా....అంతా భ్రాంతియేనా జీవితానా బ్రాందీ లేదా...ఆశా నిరాశేనా...మిగిలేదీ చింతేన....
రిప్లయితొలగించండిఅయ్యా దేవదాసా,
ప్లానులందు పక్కా ప్లానులే వేరయా
బ్లాగుదభిరామ ఎన్నెలమ్మా
:-))
రిప్లయితొలగించండిఇంతలా కష్టపడే బదులు, ఖాళీ విస్కీ సీసాలో ఆఖరున మిగిలిన నాలుగు చుక్కలు మూతికి రాసుకొని వెళ్ళి బిల్డప్ కొట్టుండాల్సింది. :-))
good post venu garu
రిప్లయితొలగించండిఎన్నెల గారి పాట కి చిన్న సవరణ,
రిప్లయితొలగించండిఅంతా థమ్సప్పేనా జీవితానా విస్కీ లేనే లేదా
ఆశా నిరాశేనా మిగిలేది పగిలిన సీసా యేనా
చివరికి ఏమైనా సాధించారా లేక ఇంకా ఖాళీ సీసాలు వెదుకుతూనే ఉన్నారా?
హా హా హ.. బావుంది వేణు గారు..:)
రిప్లయితొలగించండిplease watch & subscribe
రిప్లయితొలగించండిhttp://bookofstaterecords.com/
for the greatness of telugu people.
హహ్హహ్హా..వేణు గారు, భలే ఉన్నాయి మీ ఇంటర్‌లో సాహసాలు.
రిప్లయితొలగించండి>>అప్పట్లో ఇంత టెర్రరిజం లేకపోబట్టి గానీ అదే ఇప్పటి రోజుల్లో ఐతే ముందు నన్ను షూట్ చేసేసి తర్వాత ఏం జరిగిందో ఎంక్వైరీ చేసి ఉండేవాడేమో.
సూ...పర్:)
చాల బాగుంది :-)
రిప్లయితొలగించండిసాయి ప్రవీణ్ నెనర్లు, హ హ ఇంటర్లో తుంటరి ఆలోచనలు ఇదేదో టైటిల్ బాగున్నట్లుందే :)
రిప్లయితొలగించండిఇందు గారు నెనర్లు, రామచంద్రా!! చెఱుకు రసమంటే నానా యాగీ అయి ఉంటుంది కదా :)
ఎన్నెలగారు నెనర్లు, హ హ మీ కవిత్వం బాగుంది.
నాగప్రసాద్ గారు నెనర్లు, మా వాళ్ళు అలా వాసన చూసి నమ్మే రకాలు కాదులెండి అందుకే బాటిల్ ఐతే పక్కా అని ప్లానేశా :)
శివప్రసాద్ గారు నెనర్లు.
బులుసుగారు నెనర్లు, హ హ మీ పాట సవరణ బాగా సరిపోయిందండి. ఆహా సాధించకేం.. సిగరెట్లు,మందు భావి రోగష్టి లక్షణాలే కానీ హీరో లక్షణాలు కావు అన్న ఙ్ఞానం సాధించానండి :-D ...
రిప్లయితొలగించండివేణూరాం నెనర్లు.
అప్పు నెనర్లు, నిజంగా నిజమండీ బాబు అంతే జరిగి ఉండేది ఈరోజుల్లో ఐతే.
చిన్ని గారు నెనర్లు.
వేణూ గారూ,
రిప్లయితొలగించండినిజంజెప్పండి, ఆ విస్కీబాటిల్ ఎలా ఖాళీ అయ్యింది ఆఁ?? :))))
బెజవాడా లో కొంతకాలమ్ మా మమయ్యగారు ఉన్నారు. వారు అద్దెకున్న ఇంటికి, కొండ గుర్తు గా కల్లు కాంపౌడ్ దాటిన తరువాత ఎడమపక్క రోడ్డులో మూడో ఇల్లురా అని జెప్పారు.
ఇంటరు అయ్యీఅవగానే అనుకుంటాను, వారి ఇంటికివెళ్లాల్సివచ్చి ఆ పురం దాక వెళ్ళి, దారినబోతున్న ఒకాయాన్ని - ఇక్కడ కల్లుకాంపౌండ్ ఎక్కడండీ అని అడిగాను ..
అప్పటికి మంచితనమ్ బతికే ఉండటంవల్ల...
ఆయన నన్ను ఛెడామడా తిట్టాడు.
ఊకదంపుడు గారు ష్ష్..గప్ చుప్.. :-D
రిప్లయితొలగించండిహహ మీ అనుభవం బాగుంది. అలా బుద్దిచెప్పాలనుకునే మంచి పెద్దలు ఇప్పటికీ ఉన్నారండి కాకపోతే ఆ కుర్రాడు గబుక్కున ఏ కత్తోతీసి పొడిచిపారేస్తాడేమో ఎందుకొచ్చిన గొడవ అని సైలెంట్ గా ఉంటున్నారు.
హహహ అయ్యో వేణూ మీ సీను సితార అయిపోయిందన్నమాట.....మరింకెప్పుడైనా పోజు కొట్టడానికి ప్రయత్నిచారా లేదా?
రిప్లయితొలగించండిసౌమ్య నెనర్లు :-) ఆ దెబ్బతో అలాంటి సాహసం చేద్దామన్న ఆలోచన మళ్ళీ రాలేదండి.
రిప్లయితొలగించండిidea adurs andi :).. konchem implementation tannindi but all is well that ends well.
రిప్లయితొలగించండిమీ బ్లాగ్ ఇప్పుడె చూశానండి టపాలు మాత్రం చాల బాగున్నాయి .చాల బాగ వ్రాస్తున్నారు
రిప్లయితొలగించండివేణు గారు సారీ.. సారీ.. వేణు the దేవదాస్ గారు ........ what an idea sir ...
రిప్లయితొలగించండిభలే ఉన్నాయి మీ ఇంటర్‌లో సాహసాలు.
నానాయాగీ ఏంటీ? రెండు రోజుల్లో లాబ్ ఎక్జాం పెట్టుకుని నేను చేసిన ఘనకార్యం ఇది.అప్పటికే ఎండలోపెట్టి ఆరబెట్టా! అయినా ఆ వాసన భరించలేకపోయా! అలాగే ముక్కు మూసుకుని లాబ్లోకి తీసుకెళ్ళి టేబుల్ మీద బుక్ పెడితే...'అమ్మా! తల్లి! ముందు ఆ బుక్ బైట పడేయ్! నీకు నేను లాబ్ లొ ఫుల్ల్ మార్కులు వేస్తా!' అని బ్రతిమిలాడింది మా మేడం.అదీ సంగతి :))
రిప్లయితొలగించండిశ్రీ గారు నెనర్లు నిజమేనండి ఆ పోలీస్ వదిలేసినపుడు నేను అదే అనుకున్నాను..
రిప్లయితొలగించండిఆశోక్ పాపాయి గారు నెనర్లు. Welcome to my blog :)
శివరంజని గారు నెనర్లు, హ హ ఆ వయసులో వచ్చే చిలిపి ఆలోచనలు అలాంటివండి :)
ఇందు గారు హ హ ఏం జరిగినా అది మనమంచికే అని అందుకే అన్నారండీ.. మొత్తానికి చెరుకు రసం మీకు ఫుల్ మార్కులు సంపాదించి పెట్టిందనమాట :-)
హహ్హహ్హ!బాగుందండి తమాషాగా . ఉహించుకుంటుంటే నవ్వొస్తుంది:))
రిప్లయితొలగించండిహ్హ హ్హ హ్హ వాటెనైడియా సర్. ఇలాంటిదే నేను కూడా ఆపిల్ జూస్ తో కటింగిద్దామని ట్రైచేశాకాని వర్కవుటవ్వలేదు ఇంట్లో.
రిప్లయితొలగించండిరాధిక(నాని) గారు నెనర్లు, మరే అప్పుడు వీరోలాఫీల్ ఐ చేశాకానీ ఇప్పుడు నాకూ నవ్వొస్తుందండి.
రిప్లయితొలగించండి3g గారు నెనర్లు, మీ ఐడియా సూపరండి కానీ అప్పట్లో యాపిల్ జ్యూస్ అంతగా ఫేమస్ కాదు పదేళ్ళక్రితం అమెరికాలో మొదటిసారి యాపిల్ జ్యూస్ చూసినపుడు “హర్రే ఇదేదో రంగు వాసన కూడా చాలా దగ్గరగా ఉన్నట్లుందే ఇది మనకి అప్పుడే తెలిసినట్లైతే మన ప్లాన్ విజయవంతమయ్యేది” అని అనుకున్నా.
టపా తో పాటు ప్రచురించడంలో మీ రెస్పాన్సిబిలిటీ కూడా బాగా నచ్చిందండీ నాకు..
రిప్లయితొలగించండిఅవునండి. టపా బాగుంది. మురళి గారు చెప్పినట్టు మీరు బాధ్యతగా ఆ నోట్ పెట్టడం మళ్ళీ అన్ని వివరాలు తెలిపే విధంగా ఆ బొమ్మ పెట్టడం బాగుంది.
రిప్లయితొలగించండిhillarious :)
రిప్లయితొలగించండిమురళి గారు, శిశిర గారు, కృష్ణ గారు నెనర్లు.
రిప్లయితొలగించండిఆ నోట్ మరియూ పర్యవసానాల బొమ్మ పెట్టడం వల్ల అలవాటున్నవారు మారినా మారకపోయినా ఈ టపా ద్వారా అటువైపు ఆకర్షింపబడేవారికి ఒక హెచ్చరికలా ఉంటుందనిపించి పెట్టానండి. మీకు నచ్చినందుకు సంతోషం.