“సముద్రమంత ప్రేమని పొందాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం అంకితం”
సినిమాప్రారంభానికి ముందు ఈ లైన్ చూసి ఒకింత ఆశ్చర్యపోయాను ఎంటీ ఈ సినిమా హీరో ఏదో కొంతకాలమే ప్రేమిస్తాను అని అంటాడు అన్నారు ఇక్కడచూస్తే సముద్రం అంత ప్రేమ అంటున్నాడు కొంతకాలంలో అదెలా సాధ్యం అని. సినిమా పూర్తయ్యాక భాస్కర్ చెప్పింది అదే అనిపించింది కొంతకాలం ప్రేమిస్తే సముద్రమంత ప్రేమ చూడలేవు కనుక ప్రేమ తగ్గడమోలేదా పాతబడడమో జరిగినపుడు విడిపోవడానికి కారణాలు కాకుండా ఆప్రేమను పెంచుకోవడానికి ఇంకొంచెం ప్రేమించడానికి కారణాలు అణ్వేషించు అలా జీవితకాలం ప్రేమించి చరమాంకంలో సముద్రమంత ప్రేమని ఆస్వాదించు అని. ప్రేయసిని సంతోషపెట్టడానికి ఆబద్దాలాడటం ఏమాత్రం ఇష్టంలేని నిజాయితీగల ఓ కుర్రాడు అలా అబద్ధాలు ఆడేబదులు ప్రేయసికోసం తనని తాను మెల్లగా మార్చుకోవడం ఇంకా సింపుల్ గా చెప్పాలంటే “Don’t sacrifice anything for anybody” అనే అభిప్రాయం నుండి “Sacrifice anything for your Love” అనుకునే వరకూ చేసిన ప్రయాణమే ఈ ఆరెంజ్.
ఒప్పుకోవడానికి కష్టమనిపించినా తెలిసో తెలియకో మనలో నూటికి తొంభై మందిమి మన జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తుంటాం, అది నిర్లక్ష్యం కూడా కాదు we just take them for granted. ప్రేమించడం మొదలైన కొత్తలోనో పెళ్ళైన కొత్తలోనో ప్రయత్నించినంతగా మన ప్రేమని ప్రదర్శించాలని, ఎదుటి మనిషిని సంతోషపెట్టాలని ఆరాటపడటం రాను రాను తగ్గిపోతుంది. అంతమాత్రాన ప్రేమతగ్గిపోయినట్లు అర్ధంకాదు దైనందిన జీవితాల్లో పడి ఇతరత్రా బాధ్యతలవల్ల కొంత ఇవన్నీ కుదరకపోవచ్చు. మరీ కుర్రపిల్లల్లా ఆ చేష్టలేమిటీ అని ఎవరన్నా ఏమైనా అంటారేమో అన్న బిడియం కూడా కారణం కావచ్చు. ఈ సినిమాలో పెళ్ళిరోజు గ్రాండ్ గా జరుపుకుంటూ వాళ్ళ అందమైన మొదటి పరిచయాన్ని నెమరువేసుకుంటున్న హీరోయిన్ తండ్రిని హీరో ఒక ప్రశ్న వేస్తాడు “ఈ రోజు మీరు మీ ప్రేమని ఎలా express చేశారంకుల్” అని. దానికి అతనిదగ్గర సమాధానం ఉండదు, అతనిదగ్గరేకాదు మనలో చాలామంది దగ్గర ఆ సమాధానం ఉండదు. అలా సమాధానంలేకుండా ఉండకూడదు అనే ఆరెంజ్ చెప్తుంది.
నేను రామ్ చరణ్ ని చూడటానికి ఇంకా పూర్తిగా అలవాటుపడలేదు, చాలా చోట్ల ఫ్రెష్ లుక్ తో పెప్పీగా కనిపించినా అక్కడక్కడా ఘోరంగా కూడా కనిపించాడు. ఈ సినిమాలొ డాన్స్ నాకు బాగానచ్చింది, చరణ్ మాటల్లోనే చెప్పాలంటే “కరెంట్ షాక్ కొట్టి కిందపడి గిలగిల కొట్టుకుంటున్నట్లు, చీపురు లేకుండా నేల ఊడుస్తున్నట్లు ఉండే జిమ్నాస్టిక్ స్టెప్స్ ఒకటి కూడా లేవు” అన్నీ కూడా ఫ్రీఫ్లోయింగ్ మూమెంట్ తో ఏమాత్రం కష్టపడకుండా అలవోకగా వేసేలా పాటల మూడ్ కి తగినట్లుగా మంచి ఆహ్లాదకరమైన స్టెప్స్ కంపోజ్ చేశారు. నాగబాబువేసిన చిన్న పాత్ర సినిమాకి చాలా కీలకం సినిమా ఎసెన్స్ అంతా ఆ ఒక్క చిన్నపాత్రతో చక్కని సన్నివేశాలతో చెప్పేశాడు. కానీ ఇతని లెగ్ చిరంజీవికి ఏ సినిమాలో కూడా అచ్చిరాలేదు అదే చరణ్ కి కూడా కంటిన్యూ అవుతున్నట్లుంది, ఈ పాత్రకి ఏ జగపతి బాబు లాంటివారినో ఉపయోగించుకుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. హాస్యం అంతర్లీనంగా ఉంది పొట్టచెక్కలయ్యేల నవ్వించే సన్నివేశాలు కాదు ప్రత్యేకమైన ట్రాక్ లేదు కానీ చిరునవ్వులు పూయించే సున్నితమైన హాస్యం ఉంది. ఈ ప్రేమకథకు ప్రేక్షకుని పాత్రలో బ్రహ్మానందాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు కొన్ని చోట్ల ఇతని కామెంట్స్ మన అభిప్రాయాలతో సరిగ్గా సరిపోతాయి :-) ఇక పాటలగురించి చెప్పేదేముంది పదే పదే వినదగ్గ పాటలు కనీసం ఒక ఏడాది పాటు వినిపిస్తూనే ఉంటాయి.
సినిమా టైటిల్స్ చివర షాట్ లో స్క్రీన్ మొత్తం తెల్లని దుమ్ముతో నిండి ఉంటుంది అది మెల్లగా సద్దుమణిగి స్క్రీన్ మీద ఒక సగం అంతా జెనీలియా మొహం మిగతాసగంలో పైన ఒక మూల దర్శకత్వం భాస్కర్ అన్న పేరు కనపడతాయి. ఈ దర్శకుడి జెనీలియా పిచ్చి గురించి చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేమి కావాలి. సినిమాపై అన్ని కోట్లు ఖర్చుపెట్టిన నిర్మాత ఈవిడ దుస్తులపై ఇంకాస్త ఖర్చుపెట్టి ఇంకో నాలుగంగుళాలు పొడవు కుట్టిస్తే బాగుండేది. అయినా దుస్తులు పొడవు తగ్గే కొద్దీ రేటు పెరుగుతుందనుకుంటా కదా ఆ లెక్కన చూస్తే నిర్మాతకి కాస్త డబ్బులు మిగిలేవేమో. కానీ గుడ్డిలో మెల్ల ఏమిటంటే ఈవిడ ఇంట్లోఉన్నపుడైనా కాస్త నిండుగా ఒళ్ళు కప్పుకుని పరువు నిలబెట్టింది అంతవరకుసంతోషం. పొట్టిబట్టలు పిచ్చిజుట్టుతో యంగ్ గా కనిపించవచ్చు అని ఎవరుచెప్పారోకాని ముందువాళ్ళని తన్నాలి. ఇక తన ఇంట్రడక్షన్ ని చూసి సినిమా అంతా ఇంతేఉంటుందా ఇంటర్వెల్ లో బయటపడటం ఎలాగా అని ఆలోచిస్తున్నటైంలో ఆ సన్నివేశాల్లో తనని చూసి ప్రేమలో పడిన చరణ్ వాళ్ల అక్కతో “ఇవ్వాళ సిడ్నీలో ఓ తింగరిదాన్ని చూశాను” అని చెప్పడంతో పోనిలే దర్శకుడికి కనీసం ఆ క్లారిటీ ఉందికదా అని కుదుటపడ్డాను. అనుకున్నట్లుగానే మొదట్లో తను అలా ఎందుకు ఉంది రాను రాను ఎలా చేంజ్ అయింది అన్నది బాగానే చూపించాడు.
ఈ సినిమాలో కథ గురించి చెప్పుకోడానికి పెద్దగా ఏమీలేదు ఇప్పటికే చాలా రివ్యూలలో చెప్పేశారు కూడా కదా ఉన్న కాస్త కథ గురించీ అందుకే ఇక నేను ఆ పాయింట్ టచ్ చేయడంలేదు. గ్రాఫిటీ బాగుంది స్ప్రే క్యాన్ ఫైట్ ప్రత్యేకంగా ఉంది కానీ అంత గొప్పగా అనిపించలేదు. ఇక స్కైడైవింగ్ ఫైట్ తో మన చెవుల్లో ఏకంగా పూల మొక్కలే పెట్టేశాడు అనిపించింది ఏమాత్రం కన్విన్సింగ్ గా లేదు. అసలా ఫైట్ మొత్తం ఎత్తేస్తే ప్రభుపాత్ర మరికొంతబాగా ప్రజంట్ చేసినట్లు ఉండేది, నా అనుమానం అది భాస్కర్ స్క్రిప్ట్ లో ఉండిఉండదు ఫ్యాన్స్ కోసం వేసిన వేషాలయి ఉండచ్చు. ట్రూత్ / డేర్ గేం సన్నివేశం నాకు చాలా నచ్చింది. అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి “ప్రేమించిన అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు నటించడం మహాపాపంరా” లాంటి డైలాగ్స్ మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి.
ఆరెంజ్ name is not about the fruit, it’s about the color, it’s about the freshness. సినిమాకి ఈ పేరుతోనే ఒక తాజాదనం తీసుకువచ్చాడు భాస్కర్. మొదటినుండి చివరివరకూ ఏదో కొన్నిచోట్లతప్ప ప్రతి ఫ్రేం లోనూ ఆ తాజాదనం ప్రతిఫలించింది. ఈ సినిమాని హైదరాబాద్ నేపధ్యంలో తీసి ఆ తాజాదనం తీసుకురావాలంటే చాలా క్రియేటివిటీ కావాలి అదిలేకే సిడ్నీ నేపధ్యాన్ని గ్రాఫిటీని ఎన్నుకున్నాడు. సినిమాకి రిపీట్ ఆడియెన్స్ అయిన మాస్ కి ఈ సినిమాలోని గాఢత అర్ధంకాక, యువతకి ఈ సినిమాలోని నిజాయితీని ఎదుర్కొనే ధైర్యంలేక ఈసినిమాని ఫ్లాప్ చేశారేమో అనిపించింది. ఈ సినిమా అయ్యాక వస్తుంటే నేనువిన్న కామెంట్ “మా ఫ్రెండ్ చెప్పింది నిజమే మామ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఈ సినిమాకి చచ్చినా రాకూడదు”.
నిజాయితీగా ప్రేమగురించి ఆలోచింపచేసే సినిమా ఆరెంజ్. నిజమైన ప్రేమకీ ప్రేమ అనే భ్రమకి తేడాతెలియని యువత మిస్ అవకుండా చూడవలసిన సినిమా ఆరెంజ్. మేం ప్రేమిస్తున్నాం ప్రేమలోఉన్నాం అని అనుకునే వాళ్ళని పక్కన పెడితే మీరు మీ ప్రేయసినో జీవితభాగస్వామినో నిజంగా ప్రేమిస్తున్నట్లైతే ఈ సినిమా చూశాక తనదగ్గర మీ ప్రేమని మరోసారి వ్యక్తీకరించాలనీ తననుండి తొలినాటి అదే ప్రేమని మళ్ళీ మళ్ళీ పొందాలనీ ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒక వైవిధ్యమైన స్క్రిప్ట్ తో ముందుకు వచ్చిన భాస్కర్‍నీ, ప్రయోగమనో మూడోసినిమానేకదా అనో భయపడకుండా ధైర్యంగా సినిమా చేయడానికి అంగీకరించిన రామ్ చరణ్‍నీ అభినందించి తీరాలి.
భాస్కర్ ని అభినందించకుండా ఎందుకు తిడుతున్నారో తెలియడం లేదు..
రిప్లయితొలగించండిబావుంది రివ్యూ ,మొదటి కామెంట్ నాదే ;-)
బాగా రాసారు
రిప్లయితొలగించండిమొదటి సారి చూసి నప్పుడు అర్ధం కాలేదు నా మట్టి బుర్రకి
రేపు రెండో సారి వెళ్ళాలి
ఎంత ఓపిగ్గా వ్రాసారండి:))
రిప్లయితొలగించండిసమీక్ష మీ వ్యక్తిత్వమంత మృదువుగానూ ఆహ్లాదకరంగానూ ఉంది. ప్రేక్షకులకి సినిమా ఆ మాత్రం ఆహ్లాదం కలిగిస్తే ఇక అంతకంటే కోరుకునేదేం లేదు.
రిప్లయితొలగించండిvery nice review.
రిప్లయితొలగించండి>>నూటికి తొంభై మందిమి మన జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తుంటాం, అది నిర్లక్ష్యం కూడా కాదు we just take them for granted
రిప్లయితొలగించండిఅవును.. ఆ భావం ఆటోమేటిక్ గా వచ్చేస్తుందనుకుంటా..! మొన్నామధ్య మా ఫ్రెండ్ ఇదే చెప్పి [గర్ల్ ఫ్రెండ్ స్టేటస్ నుండి వైఫ్ స్టేటస్ కి దిగజారిపోయాను] అని బాధపడింది..!
ఇక సినిమా గురించి: నిజాన్ని అంత కళ్ళెదుట నించోబెడితే డైజెస్ట్ చేసుకోవడం కష్టం కదా! అందుకే ప్రేమిస్తున్నామనే భ్రమలో ఉండడం బెటర్ అనుకునే చాలామందికి నచ్చి ఉండకపోవచ్చు!
జెనీలియా అయితే భయానకం.. మొదటి పావుగంటలోనే బయటకి వచ్చేద్దామన్నంత చిరాకు వచ్చింది..
Good review and nice presentation.
రిప్లయితొలగించండిReally this is good movie. But intentionally some people are writing negative reviews about this movie.
Even though they are educated they could not able to digest the movie concept and facts simply writing the bad review.
Honestly speak this is bad culture. If we don't encourage these kind of movies and want to see regular 6 fights, 6 songs, 1 sister sentiment in movies then what is the need for new movies. Repeatedly we can watch the old movies.
మొదటి సారి గా ఈ మూవీ పై అర్ధవంత మైన రివ్యూ/వ్యాసం చూస్తున్నాను. థాంక్ యూ .
రిప్లయితొలగించండిజెనిలియా డ్రెస్ లు ఒకటి /రెండు షార్ట్ గా ఉన్నాయేమో ...చరణ్ ఫాన్స్ కోసం(?) ..అది కాక ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్ కదా...
నిజానికి ఆ అమ్మాయి స్క్రిప్ట్ కి తగ్గట్టు గా చేసింది అనుకొంటున్నాను... సాంగ్స్ లో చాల బాగుంది.
ఇప్పటి వరకు హీరోయిన్ ని ఒక వ్యక్తిత్వం వున్నట్లు గా చూపించేది భాస్కర్ ఒక్కడే కదా !!!!!!!... అ౦దరు హీరోయిన్స్ తన కధలకు సూట్ అవ్వరేమో వేణు గారు ...
ఏది ఏమైనా 'బొమ్మరిల్లు' లాంటి మంచి అర్ధవంత మైన పేరు పెడితే సినిమా కొంత నడిచేది ...క్రేజ్ కి పోయి ఆరెంజ్ అన్నారు...
మొత్తానికి యింత మంచి మూవీ తారక్ ఇప్పట్లో చెయ్యలేడు.కాబట్టి చరణ్ కి కలిసొచ్చే అ౦శమే
సినిమాకి రిపీట్ ఆడియెన్స్ అయిన మాస్ కి ఈ సినిమాలోని ఘాడత అర్ధంకాక, యువతకి ఈ సినిమాలోని నిజాయితీని ఎదుర్కొనే ధైర్యంలేక ఈసినిమాని ఫ్లాప్ చేశారేమో అనిపించింది.//
రిప్లయితొలగించండినాకు కూడా అలానే అనిపించింది.
nice review.
సినిమాకి రిపీట్ ఆడియెన్స్ అయిన మాస్ కి ఈ సినిమాలోని ఘాడత అర్ధంకాక, యువతకి ఈ సినిమాలోని నిజాయితీని ఎదుర్కొనే ధైర్యంలేక ఈసినిమాని ఫ్లాప్ చేశారేమో అనిపించింది. baaga chepparu..
రిప్లయితొలగించండిVenugaaru ... great review... :) :)
nice one !
రిప్లయితొలగించండిచాలా బాగుంది...నాకు ఆరెంజ్ సినిమా మీద రెండు,మూడు రివ్యూలు నచ్చాయి.అందరూ ఎదో ఒక లోపాలు ఎత్తిచూపారు...కాని మీరు సినిమని చాలా పాసిటివ్ గా చెబుతూ....సునిశితంగా లోపాలగురించి చెప్పారు. నిజ్జంగా చాలా బాగుంది. మీ పోస్ట్ చదివిన తరువాత నేను ఆరెంజ్ ని ఇంకో కోణంలో చూసాను...వేణుగారు...మీ పోస్ట్ సూపర్ హిట్ అండీ :)
రిప్లయితొలగించండివేణూ గారూ...ఘాడత కాదు..గాఢత...భాస్కర్ గారు చూశారంటే,పరిగేట్ఠుకొచ్చి తన్నేసి, మీ మీద ఓ బజ్జు పెట్టేస్తారు....ః))...బొమ్మరిల్లు భాస్కర్ కాదు..మన భాస్కర్ గారే మరి...
రిప్లయితొలగించండిI agree with Indu :)
రిప్లయితొలగించండిసినిమా కాంసెప్ట్ మంచిదే కానీ సరిగ్గా చెప్పలేక కంగాళీ చెసాడు దర్శకుడు. షాజాం పదాంసీ వున్న పార్టులో చెప్పినంత క్లారిటీతో సినిమా అంతా తీసివుంటే ఎంతో బావుండేది.
రిప్లయితొలగించండిమనవాళ్ళు వ్రాసిన అన్ని రివ్యూలు చదవలేదు. ఎవరయినా తమ జీవితానికి అన్వయించుకొని, ఈ సినిమాని ఐడెంటిఫై చేసుకొని వ్రాసారో లేదో తెలియదు కానీ ... నేను ఆ పని చేయబోతున్నాను. వచ్చే వారమే మా ఆవిడతో ఆరెంజ్ కథలు ప్రారంభం. ప్రేమ కూడా నిజాయితీగా వుండలని వాంఛించే ఈ అమాయకుడు ఈమధ్యే ఎలా మారిపోయేడు, ఏం మారిపోయేడు, ఆ మార్పు సాధిస్తున్న ఘనవిజయాలు ఏంటనేది చూస్తారు. ఇంకో విషయం మా మధ్య ప్రేమ లేకపోవడమే బావుంది...స్వేఛ్ఛగా వున్నాం ... ఆత్మవంచనల్లేవ్. అందుకే మేము ఏ కొంచెం ప్రేమ చూపించినా గొప్పగా కనపడుతోంది ... అలా అలా ఇంకా ఇంకా.
మీ రివ్యూ సో సో
<>
రిప్లయితొలగించండిHow do they know with out experiencing the issue??? charan had failures to understand it..isn't it...so no way it is connected to youth... does it make sense?
సినిమా నచ్చిందీ, మీ సమీక్ష నచ్చిందండి.
రిప్లయితొలగించండిఈ సినిమా సిడ్నీలో తీయడాన్ని నేను సమర్ధిస్తాను. ఎందుకంటే చరణ్ పాత్ర చర్యలకి అతను క్రియేటివ్ పర్సన్ అయితేనే కుదురుతుంది. కానీ హైదరాబాదులో బొమ్మలు గీస్తున్నాడని అనేదానికన్నా సిడ్నీలో గ్రాఫిటీ ఆర్టిస్టు అంటే చరణ్ రేంజికి(?) సరిపోతుందిగా.
నాగబాబు సెంటిమెంటు భలే పట్టారే, నేను అతన్ని చూడగానే ఈ సినిమాకి సమస్యేంటో తెలిసింది :-)
జెనీలియా తింగరి చేష్టలు కొత్తేంకాదుగా, ఈ సినిమా ఆమెవలన చెడిపోయిందని ఎందుకు అందరూ (మీరుకాదు) ఆమెని బ్లేమ్ చేస్తున్నారో! పైగా రెండో సగంలో బాగానే నటించిందనిపించింది.
హరేకృష్ణ గారు నెనర్లు,
రిప్లయితొలగించండిఅప్పారావు శాస్త్రిగారు నెనర్లు, నా వ్యాసం మీరు మళ్ళీ సినిమాగురించి ఆలోచించేలా చేయగలిగినందుకు సంతోషం.
సిరిసిరిమువ్వగారు నెనర్లు :-)
కొత్తపాళీగారు నెనర్లు :-) ఓ క్షణం అలా గాల్లోతేలి మళ్ళీ కిందపడ్డానండీ మీ వ్యాఖ్యచూసి. ఏదో నెలలో ఒక నాలుగైదుసార్లు అదీ నేను ప్రొజెక్ట్ చేసుకునేటువంటి వ్యక్తిత్వాన్ని మాత్రమే మీరు చూడగలుగుతున్నారన్న విషయం మీరు మరిచిపోకండి :-D అన్నట్లు ఈ సినిమా ఆహ్లాదాన్ని కలిగించదండి ఆలోచింపచేస్తుంది అది నచ్చకే కన్ఫ్యూజింగ్ అని అనేస్తున్నారు చాలామంది.
నీహారిక గారు నెనర్లు.
మేధ గారు నెనర్లు, మీ ఫ్రెండ్ ఎవరోకానీ నిజం చెప్పారండీ.. ఆభావం తెలియకుండానే వచ్చేస్తుంది. సినిమాగురించి మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. జెనీలియా పాత్ర మొత్తంగా చూస్తే పర్వాలేదనిపించిందండి మొదట్లో అలా బిహేవ్ చేయడాన్ని బాగానే జస్టిఫై చేశాడు.
లక్ష్మణ్ Thanks for your comments. కొందరు కావాలని నెగటివ్ పబ్లిసిటీ ఇవ్వడం మరికొందరికి సినిమాని అర్దంచేసుకునేంత ఓపికలేకపోవడం కారణం. ఇక ఫిక్స్డ్ ఫార్మాట్ సినిమాలంటారా ఎవరి టేస్ట్ వాళ్ళది కదండి ఆ సినిమా ప్రేక్షకులని ఏమనే హక్కు మనకు లేదు.
రిప్లయితొలగించండిమౌళి గారు నెనర్లు, జెనీలియా స్క్రిప్ట్ కు తగినట్లు చేసిందనడంలో ఏ సందేహమూలేదండి డ్రస్సులవిషయంలో మీరుచెప్పినట్లు పాటల్లోనూ ఇంట్లో ఉన్నపుడూ కాస్త నయమేలెండి. భాస్కర్ హీరోయిన్స్ గా ఇంకెవరూ సూట్ అవరు అనేదానిమీద కాస్త ఆలోచించాల్సిందేనండి. పేరేదైనా ఫలితం ఇంతే ఉండేది అని నా అభిప్రాయం ఈ సినిమా సబ్జెక్ట్ ని ఫేస్ చేయడం సగటు ప్రేక్షకుని వల్ల కాలేదు.
బద్రి గారు నెనర్లు
వేణూరాం గారు నెనర్లు
a2zdreams గారు నెనర్లు
ఇందుగారు నెనర్లు
రిప్లయితొలగించండికౌటిల్యగారు నెనర్లు, వెంటనే టపాలో సరిచేశానండి.
అజ్ఞాత గారు నెనర్లు
శరత్ గారు నెనర్లు, మంచి ప్రయత్నమండి మీ వ్యాసపరంపర గురించి ఎదురుచూస్తాను. క్లారిటీ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు తను చెప్పాలనుకున్న విషయమే అటువంటిది కనుక అలాంటి స్క్రీన్ ప్లే తప్పలేదు అనిపించింది.
మౌళి గారు మీ ఈ కామెంట్ అర్ధంకాలేదండి, యువత ఈ సినిమాకి ఎందుకు కనెక్ట్ కాలేదు అన్న విషయం వివరిస్తున్నారా... అది అనుభవంతోనే తెలుసుకోవాలని లేదండి సినిమా డైలాగ్స్ ఫాలో అవుతూ శ్రద్దగా చూసి కాస్త ఆలోచిస్తే అర్ధమయ్యేలా బాగానే కమ్యునికేట్ చేశాడు అనిపించింది.
జెబి గారు నెనర్లు, నిజమేనండి సిడ్నీ గ్రాఫిటీ నేపధ్యం సరిగా సరిపోయింది. హ హ నాగబాబు సెంటిమెంటే కాదండి అతని వలన ఆ పాత్రలో పంచ్ లేకుండా పోయింది మరొకరెవరైనా ఐతే ప్రేక్షకులు నిర్లక్ష్యం చేయకుండా మరికాస్త అటెన్షన్ చూపించేవారు ఆ పాత్రమీద. నిజమే స్క్రిప్ట్ కు తగినట్లు జెనీలియా బాగానే చేసింది.
మొత్తానికి ఈ సినిమా మీద ఒక సెన్సిబుల్ రివ్యూ చదివాను.. చాలా బాగా రాశారు వేణూ.. ఒకసారైనా చూడొచ్చనే ఆశావాదాన్ని నింపారు :) ప్రేమకి సంబంధించి అంత గాఢమైన ఫిలసాఫికల్ పాయింట్ చెప్తూ జెనీలియాని హీరోయిన్ గా తీసుకోవడం అనేది నాకు అసలు ఎక్కని మొదటి పాయింట్. అఫ్కోర్స్ భాస్కర్ కి ఉన్న హాసిని పైత్యం తెలిసినా ఇందులో అయినా డిఫరెంట్ గా చూపించి ఉండాల్సింది.. బొమ్మరిల్లు, శశిరేఖ పరిణయం చూశాక ఇక ఈ అమ్మాయి సినిమాలు చూడకూడదని నిశ్చయించుకున్నాను.. నా టెన్షన్ అల్లా ఆ తింగరి వేషాలు చూసి అబ్బాయిలంతా అసలు సిసలు అమ్మాయి ఇలానే ఉండాలి కాబోలు అని డిసైడ్ అయిపోతారేమో అని :-)
రిప్లయితొలగించండిఇంకా నేను చూడలేదోచ్.. కానీ మీ రివ్యూ చదువుతుంటే ఖచ్చితంగా చూడాలనే ఉంది..:) టపా చాలా బాగుంది..
రిప్లయితొలగించండిఈ సినిమా ఓషో స్కూల్ ఆఫ్ థాట్ నుంచి వచ్చింది. అయితే చివర్లో హీరో జీవితాంత ప్రేమను ఒప్పుకోవడంతో మొత్తం అస్తవ్యస్తంగా తయారయ్యింది. చివర్లో హీరో హీరోవిను పెళ్ళి చేసుకోకపోయి ఉంటేనే బావుండేది. :)) (జెనీలియాను ఓ మూడు గంటలు భరించలేకపొయాం. అతను జీవితాంతం ఎలా భరిస్తాడు?:)))
రిప్లయితొలగించండిచరణ్ కూడా కాస్త పిచ్చినవ్వులతో విసిగించాడు.
అయ్యో నేను అన్నాను సరే , ఇవ్వాళా ఒక న్యూస్ చదివా...భాస్కర్ నెక్స్ట్ మూవీ లో కూడా జెనీ :)
రిప్లయితొలగించండిభాస్కర్ సినిమాకో అర్ధం, హీరొయిన్ కో విలువ వున్నాయని నమ్మే వ్యక్తి గా కనిపిస్తున్నాడు ...
( ౩ మూవీస్ లోను హీరో ప్రాబ్లం క్రియేట్ చేస్తే , హీరొయిన్ సాల్వ్ చేస్తుంది :) )
@శరత్ గారు
//// ఇంకో విషయం మా మధ్య ప్రేమ లేకపోవడమే బావుంది...స్వేఛ్ఛగా వున్నాం ... ఆత్మవంచనల్లేవ్.////
ఇది మాత్రమె సాధ్యం అ౦డి ...త్వరగా వ్రాయండి మరి
నేను టైటిల్స్, ఓ పదిహేను నిముషాల సినిమా మిస్ అయ్యానండి. థీం బాగానే ఉన్నా, అబద్ధాల గురించి చెప్పినంతగా ప్రేమ వ్యక్తీకరణ గురించి ప్రేమ పెంచుకొనే విధానం గురించి చెప్పలేదు. రాంచరణ్ అసలు బాగాలేడు. అది కూడా కొంత ఫ్లాప్ కి కారణమయిందేమో. కాని మీ విశ్లేషణ మాత్రం తప్పకుండా చాలామంది అభిప్రాయాన్ని మారుస్తుంది.
రిప్లయితొలగించండినిషిగంధా నెనర్లు, జెనీలియా గురించి బాగా చెప్పారు :-) కానీ ఈ సినిమాలో స్క్రిప్ట్ మేరకు నటించింది అనిపించిందండీ మొదట్లో ఆ తింగరి వేషాలు అవసరం, అల్రెడీ తనని అలా చూడటాన్కి అలవాటయ్యారు కదా జనం అని బహుశా తననే కంటిన్యూ చేసి ఉండచ్చు భాస్కర్.
రిప్లయితొలగించండిఅపర్ణ గారు నెనర్లు, కనీసం ఒక్కసారి చూడాల్సిన సినిమా అండి ఏ విధమైన అంచనాలు లేకుండా ఓపెన్ మైండ్ తో కేవలం ఎంటర్ టైన్మెంట్ కోసం కాక కాస్త ఆలోచించడానికి సిద్దమై వెళ్ళండి సినిమా నచ్చుతుంది.
రవిగారు నెనర్లు, ఓషో స్కూల్ ఆఫ్ థాట్ గురించి నాకు తెలియదండి.. చివర్లో జీవితాంతం ప్రేమకు అతను ఒప్పుకోలేదు ప్రేమ కొంతకాలమే బాగుంటుంది అన్న మాటకు కట్టుబడి ఉన్నాడు కాకపోతే కొత్త అమ్మాయిలో కొత్త ప్రేమ వెతికేబదులు ఒకే అమ్మాయిలో కొత్తప్రేమకోసం కొత్తకారణాలు వెతుకుతాను అంటాడు. హ హ చరణ్ నవ్వులు గురించి బాగా చెప్పారు :)
మౌళి గారు నెనర్లు :-) ఎవరెన్ని చెప్పినా భాస్కర్ మ్యానియా ని కొట్టిపారేయలేమండి. అన్నట్లు పరుగులో కానీ ఆరెంజ్ లోకానీ హీరోయిన్ ప్రాబ్లం సాల్వ్ చేసినట్లు కనిపించదే. కేవలం బొమ్మరిల్లు లో మాత్రం ఆ క్లారిటీ కనిపిస్తుంది.
జయగారు నెనర్లు, నిజమేనండి నిజాలు చెప్తాను కొంతకాలమే ప్రేమిస్తాను అన్న రెండు పాయింట్స్ మీద చేసినంత ఫోకస్ మెయిన్ పాయింట్ పై పెట్టలేదు అది ఒక సర్‍ప్రైజ్ లా చివర్లో ప్రజెంట్ చేశాడు అందుకే అందరికీ ఎక్కలేదు ఆ పాయింట్. హ హ చరణ్ లుక్స్ కి మనం ఇంకా అలవాటుపడాలి లెండి :-)
@పరుగులో కానీ ఆరెంజ్ లోకానీ హీరోయిన్ ప్రాబ్లం సాల్వ్ చేసినట్లు కనిపించదే
రిప్లయితొలగించండిtruth or dare tarvatha, hero ni samskarinchadam modalu peduthundi ..back and forth lo cheppadam valla meeru miss ayyaru :)
next parugu, antha interest gaa choodaledu nenu ...so meere gamaninchandi
Orange choosaka matram trivikram, kani inke director (ippati vallu) heroins kaani nachadam ledandi :(
krishnavamsi kontha better :) ...Genie KV tho kooda chesindi kadaa:)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమౌళి గారు సంస్కరించడం మొదలు పెడుతుంది అంటారా :-) లేదండి సినిమాలో చరణ్ ఆలోచనల్లో క్లారిటీని నింపింది నాగబాబుపాత్ర. జెన్నీ కేవలం స్థిరంగా తన నిర్ణయానికి తాను కట్టుబడి ఉంది అంతే. జాబ్ ఆఫర్ తీసుకురావడం సంస్కరణ అంటే ఇక నేనేం చెప్పలేను.
రిప్లయితొలగించండిమొత్తానికి మీ కామెంట్ దర్శకులు వాళ్ళ హీరోయిన్స్ ని ఎలా తీర్చిదిద్దుతున్నారు అన్న ఆలోచనలో పడేసింది నన్ను, కుదిరితే త్వరలో ఒక పోస్ట్ రాస్తాను. అన్నట్లు మీరు శేఖర్ కథానాయికల గురించి ఏమంటారు. లీడర్ లో రిచా పాత్ర గురించి మాత్రమే ఆలోచించండి.
1. nagabaabu chepped...vine stage loki ela vachchadu?
రిప్లయితొలగించండి2. nagababu cheppinaa first scene 'the end' vastundi kadaa ...
3. charan nammakaalu geni ni marchi natlu gaa Geni nammakaalu Charan ni maarchaayi
4. Nagababu lekunna Geni Charan kosam wait chesedi ani oka chota cheppistadu.(nagababu cheppinaa charan alaa stick avvadu :) )
5. Asalu Nagababu charecter lo naku clarity ledu ...
anta manchi attitude unnavadu..roaddu meedaa, parkullo phone lonu enduku beebhatm gaa arustoo untaadu? (intlo valliddarikee ayye godavalu viewrs ki choopinchadaanikaaa)
6.Sare Nagababu Charan ki chepthadu, charan andarooo male charecters nE target chesaadu..
Magavallakunde(leda yevarikainaa) insecurity ni Nagababu name tho first time director touch chesadu :)
eee cinimaa Bommarillu ku konasaagimpu gaaa anipistondi ...
రిప్లయితొలగించండిPrakaash raju ni JayaSudha yeppudooo yenduku correct cheyyaledu, anna question ki oka answer ee movie laa undi ippudu choostE...
Idi Bhaskar conclusion...:)
@శేఖర్ కథానాయికల
రిప్లయితొలగించండిSekhar ni poorthi gaa marchipoyaanu...Anand movie lo comertial scenes yekkuva pettadam tho nenu poorthigaa accept cheyyadam ledu :)
kaani Sekhar metured heroine charecters ni present chestaadu :)
(ante chala takkuvamandi unde zone)
happy to see you want to take my comment in good way and thinking to analyse on Director-Heroine Duo
naa prayatnam phalinchinatte , thank u
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినేను ఈ సినిమా చూడలేదు. మీ రివ్యూ లు కొన్ని చదివాను. మీ శైలి , మీరు వాడే భాష కొత్త పాళీ గారన్నట్టు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి.
రిప్లయితొలగించండిHappy to see your blog though i'm too late.
అన్నట్టు, నేను చదివినంత వరకు చాలా విషయాల్లో మీ అభిప్రాయాలు, ఆలోచనలు నాకు చాలా దగ్గరగా ఉంటాయి :)
సమీక్ష మిమ్మల్ని reflect చేస్తోందిగానీ సినిమాని కాదేమో అనిపిస్తోంది!
రిప్లయితొలగించండిమహేష్ గారు చాలా బాగా చెప్పారు
రిప్లయితొలగించండిసినిమా కాన్సెప్ట్ బాలేదు
ఈయన రచనా శైలి బాగుంది
మౌళి గారు జెన్నీ ఆలోచనలు చరణ్ ఆలోచనాధోరణి మార్చుకోవాల్సిన అవసరం కల్పించాయి అనేది నిజమే. నాగబాబు యాటిట్యూడ్ అభిప్రాయాలు ఎంత మంచివయినా ఇన్స్టంట్ రియాక్షన్ నుండి తప్పించుకోలేకపోవడం వలన వీధుల్లోనూ పార్కుల్లోనూ అలా అరిచినట్లు చూపించాడు. ఇన్ సెక్యూరిటీగురించి మిరు చేసిన వ్యాఖ్య నాకు అర్దంకాలేదు.
రిప్లయితొలగించండిసాయి ప్రవీణ్ గారు నెనర్లు, నా అభిప్రాయాలు, ఆలోచనలు మీకు దగ్గరగా ఉన్నట్లనిపించినందుకు సంతోషం.
మహేష్ గారు నెనర్లు, సున్నితంగా భలే చెప్పారండి :-) సినిమాని నేచూసిన దృక్కోణం నుండి ప్రజంట్ చేశాను నాలాగే ఆలోచిస్తూ సినిమా చూసినవారు ఐడెంటిఫై చేసుకున్నారు. బహుశా మిమ్మల్ని సినిమాలో ఆకర్షించిన అంశాలు వేరయి ఉండవచ్చు, ఏదేమైనా ముందు ముందు రివ్యూలు రాసేప్పుడు మీ కామెంట్ ని కూడా గుర్తుంచుకుంటాను.
అప్పారావు శాస్త్రిగారు నెనర్లు :-)
నేను సినిమా చూసాను కానీ ,పెద్దగా నచ్చలేదు .ముక్యంగా జెనిలియా ఓవర్ యాక్షన్,మేకప్,డ్రెస్సింగ్,అస్సలు నచ్చలేదు.జెన్నీగురించే సెకండ్ షో అయినా వెళ్లేము(మా వారికి ఇష్టం లేకపోయినా). చరణ్ యాక్షన్కూడా ఎందుకో అంత బాగాలేదు. .మీ రివ్యూ చదివాక మీరు చెప్పిన వేలో ఆలోచిస్తూ ఇంకోసారి చూడాలేమో ...అంత బాగా రాసారు...
రిప్లయితొలగించండిDirector bhaskar is genius .
రిప్లయితొలగించండిheroin glamor or hero image cinema ni mingeyya kundaa choosu konnaru...
act cheyyadam ante trim gaa make up chesikoni colorfull ga kanipinchadam kaadu kadaaa..
.aa character mood ni reflect chese costumes matrame use chesadu...charan ki koodaa :)
genilia entha chakkaga untundoo songs lo matrame choopinchaadu :)
yevvarini hurt cheyyalani cheppadam ledu ani manavi.
రాధిక(నాని) గారు నెనర్లు. మళ్ళీ ఏం చూస్తారులే కానీ రివ్యూలు మరిచిపోయి మళ్ళీ ఓ సారి సినిమా గురించి ఆలోచించి చూడండి.
రిప్లయితొలగించండిమౌళి గారు భాస్కర్ గ్లామరస్ గా చూపించడానికి ప్రయత్నించినా కానీ అవి నప్పలేదు అనిపించిందండి నాకు. కొంతమందికి అది కూడా నచ్చింది. ఏదేమైనా మీరు మాంఛి పాజిటివ్ యాటిట్యూడ్ తో ఆలోచిస్తున్నారు ఈ సినిమాగురించి అనిపిస్తుంది:-)
ikkadA ka secret undi ..Movie lo Genelia prathi dress ki, movie ki oka pattern undi :)
రిప్లయితొలగించండిCharanki koodaa undeMo...choodAli :)
nenEm positiv gaa aalochinchadaM ledu ...hero chandaalaM attire to cheste verity role anE mee reviewrs ki heroin koodA alAnti roles vEstundi ani teliyaka pothe yela...
Jenelia Dress sequence ani oka post veyyalsi vachettu undi...
kani andarooo 2nd time choosi koodA ardham kaledantE appudu chepthaa :)
హ్మ్.. మీ రివ్యూవర్స్ అని నన్ను సగటు రివ్యూవర్స్ తో కలపకండి, వాళ్ళు ఫీల్ అవుతారు:-) నేను సీరియస్ గా రాసిన రివ్యూలు అరడజను కూడా ఉండవు. I will wait for your post on the pattern.
రిప్లయితొలగించండిavunu, meeru cinimani ardham chesikodaaniki try chesaaru...kani intaku mundu varaku comments vrasEppudu meeru married anukonnAnu ...
రిప్లయితొలగించండిso meeku konta ardham kakapovadam sababE
ex: chepthaa evening...am busy now :(
meeru inkA yemainA questions untE nenu create chesina thread (@my blog) lo veyyandi ..am back to home :)
inkA costumes vyAsam antArA ... kaneesam oka 5 metured viewrs ni choosAka matrame share cheyyagalanu :)
శ్రీకాంత్ గారు,
రిప్లయితొలగించండిఈ సినిమా గురించి ఇంత పోసిటివ్ టాక్/రివ్యూ ఇక్కడ మాత్రమే చూసాను.
మీ శైలే శైలి.
అనిర్విన్ గారు నెనర్లు, చాలామంది బ్లాగర్లు ఒకసారి చూడచ్చనే అంటున్నారండి :-)
రిప్లయితొలగించండిహే.....నేను మార్గదర్శిలో చేరాను...సినిమా చూసానోచ్....మీరు ఈ టపా రాసినప్పటినుంచి అనుకుంటున్నాను కామెంటుదామని..సినిమా చూడకుండా ఏం పెడతాం అని రాయలేదు..ఎట్టకేలకు సినిమా చూసానోచ్.... మీ రివ్యూ చదివి తర్వాత చూసాను కదా...సినిమా కాంప్లికేటడ్ గా ఉన్నా బాగానే అర్ధమయ్యింది..కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయనిపించింది. ఫస్ట్ కొంచెం బోర్ గా అనిపించినా తర్వాత బాగానే ఉందనిపించింది. జెనిలీయా నటన కొంచెం సేపు చిరాకు పెట్టినా తర్వాత బానే నటించిందనిపించింది. చరణ్ బానే చేశాడు...
రిప్లయితొలగించండిమీ రివ్యూ చద్వకుండా వెళ్ళి ఉంటే నాక్కూడా మాములు సినిమా అనే అనిపించి ఉండొచ్చు.
సినిమాని అర్ధమయ్యేలా రివ్యూ రాసినందుకు మీకు థాంక్స్ చెప్పాలి....
:)
స్నిగ్ద గారు నెనర్లు, హమ్మయ్య సినిమా మీకు నచ్చిందనమాట సంతోషం.. నిజమేనండి డైలాగ్స్ కొన్ని బాగున్నాయ్.. జెనీలియాకూడా మొదట్లో అలా చేసినా తర్వాత స్వభావాన్నిమార్చి చక్కని వివరణ ఇచ్చారు. సినిమా చూశాక మీ అభిప్రాయాన్ని ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిHi Venu garu...
రిప్లయితొలగించండిAccording to the review which i heard, i havn't seen the movie till now. After reading your blog, i am planning to see the movie now. Nice presentation :)
-- Shailu.
Shailu గారు నెనర్లు, Erase all the reviews and Watch it with open mind… సినిమాలో కొంచెం ఆలొచనకి స్కోప్ ఉంది కాబట్టి ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ కాకుండా కాస్త లీనమై చూస్తే ఖచ్చితంగా నచ్చుతుందనుకుంటున్నాను. సినిమా చూశాక ఎలా అనిపించిందో చెప్పడం మరువకండి.
రిప్లయితొలగించండి