ఒద్దికగా చిరుసవ్వడితో పారే సెలయేరు ’సహజ’ ఐతే.. హోరుమని ఎగిరి దూకే జలపాతం ’శ్రుతి’. వీళ్ళిద్దరూ ఇంచుమించు 120 మంది అబ్బాయిలు నాలుగు సెక్షన్ లు ఉన్న మా ఇంటర్మీడియట్ కాలేజ్ లో మా సెక్షన్ లో మాతోపాటు చదువుకునే అమ్మాయిలు. ఒకే క్యాంపస్ లో ఉన్న స్కూల్ ని మినహాయిస్తే మా కాలేజ్ మొత్తానికి వీరిద్దరే అమ్మాయిలు. శ్రుతి అవసరాన్ని బట్టి అబ్బాయిలతో మాట్లాడుతూ కామెంట్లకు కౌంటర్లు వేస్తూ ఉండేది కానీ సహజ బొత్తిగా వంచిన తల ఎత్తకుండా తిరిగేది, ఎవరికైనా తను ఎదురు పడినా బుద్దిగా పక్కకు తప్పుకునేవాళ్ళే కానీ తనని కామెంట్ చేసేవాళ్ళెవరూ ఉండేవారు కాదు తనని తన వైఖరిని చూస్తే ఒక ఆరాధనా భావమే తప్పించి అల్లరి చేయాలని ఎవరికీ అనిపించదు.
***
మా రూం S8 లో ఉన్న ఏడుగురిలో నేను, భరత్, బాజీ ఒకటీంలా కలిసి తిరిగేవాళ్ళం మిగిలిన వాళ్ళలో రాకుమర్ ఒకడు. మేం హాస్టల్లో చేరిన కొత్తలో మాకు వీడో పెద్ద ఆశ్చర్యార్ధకం ఎందుకంటే మొదటి సారి హాస్టల్లో చేరిన మేమందరం ఇంటి మీద బోలెడంత బెంగపెట్టుకుని సొంతంగా మాపనులు మేం సరిగా చేసుకోలేక బిక్కు బిక్కుమంటూ భయం భయంగా తిరుగుతుంటే మా రాకుమార్ గాడు తన మూడో తరగతి నుండీ తల్లిదండ్రులకి దూరంగా హాస్టల్ లో ఉండటం వల్ల ఏ విధమైన బెంగ, దిగులు లేకుండా ఎవర్నీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా తిరిగేవాడు. వీడు ఇలా ఎలా ఉండగలిగేవాడా అని అప్పట్లో అంతగా అవగాహనలేని మేమంతా ఆశ్చర్యపోయేవాళ్ళం. వాళ్ళ అమ్మానాన్న మాంచి సౌండ్ పార్టీ అవడంతో మాకు అపుడపుడు క్యాంటీన్ లో కేకులు కూల్డ్రింక్ లు స్పాన్సర్ చేసేవాడు. వాడి ధోరణి రూపం అన్నిటిని కలిపి వాడిని ఇదివరకు హాస్టల్ లో గాబ్రేల్ అని పిలిచేవారని తనే చెప్పుకున్నాడు మేంకూడా అదేపేరుతో పిలిచేవాళ్ళం.
సెకండ్ ఇయర్ మొదలయ్యాక కొన్నాళ్ళకి మా రాకుమార్ గాడు మా ’సహజ’ తో కాస్త చనువుగా మెలగడం మొదలెట్టాడు మెస్ లోనూ అప్పుడప్పుడూ క్లాస్ లోనూ శలవురోజుల్లో ఒకోసారి ఏంకాంతంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కనిపించడం మొదలెట్టారు. కాస్తో కూస్తో మంచిపేరున్న మా గ్యాంగ్ తో కానీ కాలేజిలో ఇంకెవ్వరితోకానీ మాట్లాడని సహజ వీడితో ఎందుకు మాట్లాడుతుందా అని కూపీలాగితే తెలిసిందేమిటయ్యా అంటే ఆ ఏడు రాఖీ పండగ రోజున మా రాకుమార్ గాడు ఒక రాఖీపట్టుకుని వెళ్ళి చెల్లెమ్మా అంటూ సహజ తో రాఖీ కట్టించుకున్నాడుట మేమందరం శలవుల్లో ఉండటం వలన ఈ విషయం మాకు తెలియలేదు. సరే బొత్తిగా ఏకాకి లా బతుకుతున్న సహజకు అన్నయ్య దొరికాడంటే సంతోషమే కదా అనుకుని మేమంతా మిన్నకుండిపోయాం. ఇలా కొన్ని రోజులు గడిచాక...
***
ఒక రోజు సాయంత్రం నేను ఏదో కొనుక్కోవడానికి క్యాంటీన్ వైపు వెళ్ళాను అక్కడే ఉన్నా మా రాకుమార్ గాడు వేణూ ఈ రోజు నీకు పార్టీరా అంటూ తినలేను రా బాబు అంటున్నా వినకుండా నాకు సమోసా, కేక్, కూల్ డ్రింక్ ఇప్పించాడు. అక్కడ కూర్చున్నంతసేపు వాడి మాటతీరు కొంచెం తేడాగా అనిపించింది అప్పగింతలు చెప్తున్నట్లు.. మిమ్మల్ని ఎపుడైనా బాధ పెడ్తే క్షమించమని అడుగుతూ ఇలా ఏదేదో మాట్లాడాడు. అక్కడ నుండి రూంకి వచ్చేసిన తర్వాత ఎందుకో నాకు అనుమానం వచ్చి మా భరత్ గాడిదగ్గర ఈ విషయం కదిలించాను వాడికీ నాలాంటి అనుభవమే అయింది తనకి కూడా ఏదో అనుమానంగా ఉంది అదీకాక సహజ కూడా ఈ రోజు మెస్ లో ఎక్కడా కనపడలేదు ఏదో జరుగుతుందని చెప్పాడు. మేం వెంటనే శ్రుతిని సహజ గురించి కనుక్కోమని పురమాయించి మెల్లగా రాకుమార్ గాడ్ని గమనించడం మొదలుపెట్టాం.
డిన్నర్ అయ్యే సరికి శ్రుతిద్వారా మాకు తెలిసిన విషయమేమిటంటే మావాడు తనకి జీవితం మీద విరక్తి కలుగుతుందని తనంటే ఎవరికీ ఇష్టం లేదనీ తను ఎవ్వరికీ అఖ్ఖర్లేదనీ సహజ దగ్గర నానా రకాల వాగుడూ వాగి తానా రోజు రాత్రి ఆత్మహత్య చేసుకోబోతున్నానని చాలా సీరియస్ గా చెప్పాడుట. పాపం మా సహజ ఎవరైనా మా లెక్చరర్ గట్టిగా హోంవర్క్ చేశావా అని అడిగితేనే బొటా బొటా కన్నీళ్ళు కార్చేరకం ఇంక మావాడు వేసిన సినిమాకి పూర్తిగా డీలా పడిపోయి ఆ ముందురోజు తిండికూడా తినకుండా ఏడుస్తూ కూర్చుందట. మావాడికేం కాకుండా మేం చూసుకుంటాం అని అమ్మాయిలిద్దరికీ హామీ ఇచ్చి పంపేసి నేను భరత్ గాడు మావాడ్ని రక్షించే ప్రయత్నంలో పడ్డాం. జీవితం ఎంత విలువైనదో ఇండైరెక్ట్ గా వాడికి అర్ధమయ్యేలా మాట్లాడుకోవడం ఎదిగొచ్చిన పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు ఎంత బాధ పడతారో ఏవో వేరేసంఘటనలు ఉదహరిస్తూ మాట్లాడుకోవడం లాంటివి చేసి.
రూంలో ఉన్న కత్తి, కత్తెర, బ్లేడ్లు లాంటి పదునైన వస్తువులన్నీ టంగ్ క్లీనర్ తో సహా ఇంకా తాళ్ళు బ్యాట్లు లాంటివన్నీ పక్క ఫ్రెండ్స్ రూంలో దాచిపెట్టేసి, ఆ రాత్రి వాడు నిద్ర పోయాక ఇక బయటకి రాకుండా లోపల కొందరం ఉండి రూం బయట నుండి తాళం వేసి లోపల ఒకళ్ళం బయట ఒకళ్ళం నిద్ర మానుకుని కాపలా కాసాం. ఆ రాత్రి ఎలా గడిపామో తలచుకుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళు జలదరిస్తుంది. ఇంత డ్రామా ఎందుకు వాడ్ని ఒక్కటి పీకి ప్రిన్సిపాల్ కి అప్పగిస్తే పోయేది కదా అంటారా.. మాకు స్పష్టంగా వాడి ఉద్దేశ్యం తెలిసే సరికి రాత్రి అయింది అదీకాక మాకు వాడి ప్లాన్ తెలిసిందని తెలిస్తే వాడు మాకు దూరంగా వెళ్ళి మరేదన్నా ప్రయత్నం చేయచ్చు అందుకని మేం ఏమీ తెలియనట్లే వాడ్ని కాపాడే ప్రయత్నం చేశామనమాట. ఎలా అయితేనేం ఆ రాత్రి గడిచింది తెల్లవారి స్టడీ అవర్ నడుస్తుండగా నేను మా భరత్ గాడు రాకుమార్ గాడ్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాం చివరలో ఎనిమిది గంటలు కావస్తుందనగా వాడు లేచి బయటకి వెళ్ళాడు వెంటనే మేం కూడా అనుసరించబోతుండగా ఎదురుగా ఛండశాసనుడిలా మా ఏ.ఓ గారు ఎదురయ్యారు ఆయన వెనుకే మా రాకుమార్ గాడు కూడా..
కిక్కురు మనకుండా మేం గిరుక్కున వెనక్కితిరిగి రూంలోకి వచ్చి కూర్చున్నాం ఏ.ఓ గారు లోపలికి వచ్చి అమ్మాయిలను S8 రూమ్మెట్సునూ రాకుమారుడితో సహా మా క్లాస్ లో ఉండమని మిగిలిన వాళ్ళందరినీ బయటకి వెళ్ళిపోమన్నారు. మాకు బెల్టు దెబ్బలు ఖాయమని తెలిసిపోతుంది 6th sense అప్పటికే హెచ్చరించటం మొదలెట్టింది ఏఏ దెబ్బలని ఎలా కాచుకోవాలా అని ప్లాన్లు గీయడం మొదలెట్టాను. ఆయన ఇంటరాగేషన్ మొదలైంది మనమసలే సత్యహరిశ్చంద్రుడికి వారసులం కదా ఉన్నదున్నట్లు అన్నీ నిజాలు చెప్పేశాను. మా ఏ.ఓ గారు వీరభద్రుని అవతారంఎత్తి తాటతీస్తానొక్కక్కడిదీ అని తిట్టి.. లెక్చరర్లు ఎవరైనా సహజని గట్టిగా ఏదైనా ప్రశ్న అడిగితే ఏడ్చేస్తుంది అలాంటి అమ్మాయిని అసలు ఇంత టార్చర్ పెట్టాలని ఎలా అనిపించింది రా అంటూ వెంటనే సమాచారమివ్వనందుకు మా అందర్నీ కూడా తిట్టేసి వార్నింగ్ ఇచ్చేసి రాకుమారుడ్ని అప్పటికప్పుడే సస్పెండ్ చేసేసి ఊళ్ళో ఉన్న వాళ్ళ బంధువులకు అప్పగించేశారు.
ఆ తర్వాత ఎపుడో పరీక్షలు రాయడానికి మా క్యాంపస్ కి వచ్చిన రాకుమారుడితో మాట్లాడాక తను కేవలం ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడని అందరితో అనిపించుకోవడానికి మా సహజతో పరిచయం పెంచుకోవడానికీ రాఖీని అడ్డంపెట్టుకున్నాడే కానీ నిజమైన అభిమానం కాదనీ... అలా కొంత కాలం మాట్లాడాకా బుద్దిమారి ఆత్మహత్య డ్రామాద్వారా సింపతీ సంపాదించి సహజకు దగ్గరవ్వాలని పన్నాగం పన్నాడనీ అర్ధం చేసుకుని నివ్వెరపోయాం. తీవ్రమైన మానసిక సమస్యలతో బాధ పడుతున్న వాడికి మా రూంమేట్స్ అంతా కూర్చుని కాస్త హితబోధ చేయడానికి ప్రయత్నించాం.
ఒక దుస్సంఘటన మన మనసుల్లో ముద్రించుకుపోయినంత ఘాడంగా మంచి సంఘటనలు గుర్తుండవు కదా, ఆ తర్వాత ఎన్నోసార్లు పరాయి స్త్రీలో తోబుట్టువును చూసే ఎందరో నిజాయితీపరులను నా కళ్ళారా చూసినప్పటికీ ఇప్పటికి కూడా పరిచయం పెంచుకోవడానికి చెల్లెమ్మా అంటూ దగ్గరయి అరవ సినిమా సిస్టర్ సెంటిమెంట్ సీన్లను కళ్ళముందు నిలబెట్టే అన్నలను చూస్తే అరక్షణం పాటైనా నా మనసు కీడు శంకిస్తూనే ఉంటుంది. ఆనాటి మా సహజ పడిన మెంటల్ టార్చర్ గుర్తొస్తూనే ఉంటుంది.
ఉంటారండీ ఇలాంటి తేడా జనాలు...మనమే వాళ్ళని జాగ్రత్తగా డీల్ చెయ్యాలి.
రిప్లయితొలగించండిమంచి పని చేసారు ఆ అబ్బాయి ఏం చేసుకోకుండా..అదంతా నాటకమని తెలిసిన తరువాత మీరు ఒక రోజు ముసుగు సెషన్ పెట్టుండాల్సింది...ఈ జన్మలో ఇంక అలాంటి పనులు చేసుండడు..
వేణు గారు...
రిప్లయితొలగించండిఇది చదివాకా ...నాకు ఒక చేదు అనుభవం గుర్తొచ్చింది..
కానీ ఎవరైనా ఒకరి అభిప్రాయాలూ,ఇష్టాలు ఇంకొకరి మీద వేసి...
మానసికంగా బాధ పెడ్తే...ఎలా ఉంటుందో ..ఆలోచించాలి.. :(
వేణు,
రిప్లయితొలగించండిఆ" రాకుమారుడి " కి హిత బోధ చేశారా? నాలుగు తగిలిస్తే సరిపోయేది గా...:-)) మీరన్నది నిజమే. అనవసరమైన వరసలు కలిపి మాట్లాదేవాళ్లకు, నిజంగా ప్రేమాభిమానాలతో ఆత్మీయంగా మాట్లాదేవాళ్లకు తేడా ఆ వయసులో తెలియకపోయినా తర్వాతర్వాత ఈజీ గా తెలిసిపోతుంది.
వేణూ.. ఏంటో, నాకైతే ఏం కామెంటాలో కూడా అర్థం కావడం లేదు. ఇంత తేడా జనాలు నాకైతే ఎదురు పడలేదు. కల్పన గారన్నట్లు నాలుగు తగిలించాల్సింది.. తిక్క కుదిరేది..
రిప్లయితొలగించండిఅమ్మాయి బొమ్మచూసి, మొదటి పేరా చదివి నేనింకేమో అనుకున్నాను. ఇటువంటి ట్విస్ట్ ఊహించలేక పోయాను. రాకుమార్ అంత వికృతం గా ఆలోచించాడంటే ఆశ్చర్యంగా ఉంది. బహుశా మానసిక వైద్యుడికి చూపించాలి అనుకుంటాను. లేకపోతే ధన మదం అయినా అయిఉండవచ్చు. అల్లాంటి వాళ్ళకి దండోపాయమే మంచి మందు.
రిప్లయితొలగించండిఇటువంటి వాళ్లకు కల్పన గారన్నట్లు ఆ ట్రీట్మెంట్ బెట్టరేమో పాపం ఆ సహజ పరిస్థితి ...మీరన్నట్లు ఇటువంటివి చూశాక విన్నాక నిజంగా ఎవరన్న మంచి ఉద్దేశం తో అంటే కూడా నమ్మలేం
రిప్లయితొలగించండిnice post venugaaru.. :)
రిప్లయితొలగించండిహబ్బ! వేణూగారూ! నాకు భలే కోపమొచ్చేసింది ఆ రాకుమారుడిమీద! పాపం కదా సహజ! :(( కల్పన గారి మాటే నామాట కూడా! నాలుగు పీకాల్సింది మీరందరూ కలిసి.అప్పుడు ఇంకో అమ్మయి జోలికి వెళ్ళే సాహసం కూదా చేసేవాడు కాదు :X
రిప్లయితొలగించండిమొత్తానికి ఎంతో అప్రమత్తతతో ఆ అబ్బాయిని వేయి కళ్ళతో కనిపెట్టుకుని ఉన్నారుగా!! పాపం ఆ సహజ కూడా ఎంత టెన్షన్ పడి ఉంటుందో! నేను చదివేప్పుడు కూడా ఇంచుమించు ఇలాంటి అనుభవమే ఒకసారి ఎదురైంది.. కాకపోతే ఇక్కడ అమ్మాయే అలా ఆత్మహత్య నాటకం ఆడింది.. కొంతమందిమి ఆ అమ్మాయి చుట్టూనే తిరుగూ కాపలా కాస్తుంటే ఇంకొందరు వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి తనకి వంట్లో బాలేదని అబద్దం చెప్పి వెంటనే వచ్చేట్లు చూశారు.. ఆ తర్వాత సంగతి తెల్సి, కళ్ళు తిరిగినంత పనయ్యింది!
రిప్లయితొలగించండిస్నిగ్ద గారు, కిరణ్ గారు, కల్పన గారు, అప్పూ, సుభ్రహ్మణ్యం గారు, భానూ గారు, వేణూరాం, ఇందు, నిషి నెనర్లు.
రిప్లయితొలగించండివాడ్ని గట్టిగా ఏమన్నా అంటే మళ్ళీ ఏమైనా చేసుకుంటాడేమో మనకెందుకొచ్చిన రిస్క్ లే అని వదిలేశామండీ.
ఆ వయసులోనే మీరు, మీ మిత్రులు చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించారండీ..
రిప్లయితొలగించండిమురళి గారు నెనర్లు.
రిప్లయితొలగించండిelantivallukuda untara
రిప్లయితొలగించండిమావాడున్నాడు వంశీ గారు, థ్యాంక్స్ ఫర్ ద కామెంట్.
రిప్లయితొలగించండి