డాక్టర్ రాజశేఖర్ ని బిగ్ స్క్రీన్ మీద చూసి ఎన్నాళ్ళవుతుందో అని లెక్కలేసుకుంటే అప్పుడెప్పుడో చూసిన అల్లరి ప్రియుడు గుర్తొస్తుంది ఆ తర్వాత ఇంక ఇంతవరకూ నేను థియేటర్లో చూసిన సినిమాలేవీ గుర్తు రావడమే లేదు. అలాంటిది ఇన్నాళ్ళకు ఒక పవర్ ఫుల్ ట్రయలర్ ప్లస్ ప్రవీణ్ సత్తార్ మీద ఉన్న నమ్మకం నన్ను థియేటర్ వైపు నడిపించింది. థియేటర్లో ఉన్న ఇతరులు కూడా "రాజశేఖర్ సినిమా మొదటి సారి థియేటర్లో చూస్తున్నా మామా" అని అనుకోవడం విని నవ్వుకున్నాను.
సినిమా మొదటిసగం పూర్తయే సరికి వావ్! వావ్! వావ్! వావ్! వాటే మూవీ! అనుకుని ఆశ్చర్యపోవడం నా వంతైంది. రెండవ సగం పూర్తయేసరికి ఆ వావ్ లలో కొన్నివావ్ లు తగ్గిపోయినా కానీ ఓవరాల్ గా మంచి యాక్షన్ థ్రిల్లర్ చూసిన అనుభూతి కలిగించారు ప్రవీణ్ అండ్ టీమ్. కమర్షియాలిటీ కోసం హాస్యం కోసం అక్కడక్కడ అనవసరంగా చేసిన ప్రయత్నాల వల్ల ఇది కేవలం ఒక మంచి సినిమాగా మాత్రమే మిగిలిపోయింది కానీ అవి కూడా లేకుండా ఉండుంటే తెలుగు యాక్షన్ సినిమా ట్రెండ్ ని మార్చగలిగే సినిమా అయి ఉండేది.
హాలీఉడ్ సినిమాలను అనుకరిస్తూ ఇటువంటి భారీ యాక్షన్ సన్నివేశాలు ఇదివరకు కూడా కొన్ని సినిమాలలో ప్రయత్నించినా కానీ ఈ సినిమాలో అ సన్నివేశాలు కావాలని తెచ్చిపెట్టినట్లుగా అతికించినట్లుగా కాక కథలో ఇమిడిపోయేలా వ్రాసిన ప్రవీణ్ రైటింగ్, దానికి చక్కగా అమరిన నేపధ్యసంగీతం, సినిమాటోగ్రఫీ కలిసి ఒక మంచి అనుభూతిని మన సొంతం చేస్తాయ్. సినిమా మొదటి సగం ఐతే హాస్య సన్నివేశాలని తప్పిస్తే చాలా చక్కని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపాడు సినిమాని.

ఈ సినిమాలో కీలకమైన పాత్ర పోషించినది టెక్నికల్ టీమ్, సినిమాటోగ్రఫీ అందించిన టీం అంజి, గికా చెలిడ్జే, బకుర్ చికోబవ, సురేష్, శ్యామ్ ఇంకా నేపధ్య సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల, ఎడిటింగ్ తో ఫస్ట్ హాఫ్ ని పరిగెట్టించిన ధర్మేంద్ర కాకరాల కృషిని అభినందించి తీరాలి. సినిమా కథ గురించి నేను ఏమీ చెప్పదలచుకోలేదు... సాథారణంగా స్పై థ్రిల్లర్స్ లో ఉండే కథే ఇది కూడా. అయితే ఆ కథను ఒక్కో ముడీ విప్పుకుంటూ చెప్పిన తీరు చాలా బాగుంది. అలాగే అక్కడక్కడా సినిమాటిక్ లిబర్టీస్ తీస్కున్నా కానీ యాక్షన్ సన్నివేశాలతో సహా చాలా సన్నివేశాలలో లాజిక్ ను వదిలి పెట్టలేదు. సినిమాలో కొన్ని నెగటివ్ పాయింట్స్ ఉన్నా కూడా ఈ గ్రిప్పింగ్ నెరేషన్ వాటిని పట్టించుకోకుండా ఉండేలా చేస్తుంది.
మొత్తం మీద ఒక్కొ సినిమాకి ఒక్కో జెనర్ ని ఎన్నుకుంటున్న ప్రవీణ్ సత్తారు ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తనదైన శైలిలో మనముందుకు తీస్కొచ్చారు. యాక్షన్ స్పై థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు తెలుగు తెరమీద వైవిధ్యమైన సినిమాలను చూడాలనుకునే వాళ్ళు, ఒకప్పటి (ఆహుతి, అంకుశం, మగాడు, అల్లరి ప్రియుడు) రాజశేఖర్ అభిమానులు మిస్సవకుండా చూడవలసిన సినిమా పి.ఎస్.వి. గరుడవేగ. వీలైతే కథ గురించి తెలుసుకోకుండా ట్రైలర్ ఇక్కడ చూసి సినిమాకి వెళ్ళండి ప్రవీణ్ అండ్ టీం మిమ్మల్ని నిరాశ పరచరు.
ఈ మధ్య పెద్దగా సినిమాలు చూడటం లేదు. మీ మాటల పై భరోసా ఉంచి,ఈ సినిమా తప్పక చూస్తాను.
రిప్లయితొలగించండిథాంక్స్ శ్రీరామ్ గారు. తప్పకుండా చూసి ఎలా ఉందో చెప్పండి.
తొలగించండిOh. ఎన్నాళ్ళకి! థాంక్స్ అండీ. చాలా బాగా రాసారు.
రిప్లయితొలగించండిథాంక్స్ ఫర్ ద కామెంట్ సుజాత గారు.
తొలగించండిreview chadivite baagaane anipistondi .
రిప్లయితొలగించండిథాంక్స్ ఫర్ ద కామెంట్ మాల గారు.. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందండీ..
తొలగించండినాకు సెకండ్ హాఫ్ రివ్యూల్లో రాసినంత చెత్తగా అనిపించలేదు. అక్కర్లేని ఐటెమ్ సాంగ్ , పాటా తీసేసి ఉంటే ఇంకా గొప్పగా ఉండి ఉండేది.
రిప్లయితొలగించండిప్రవీణ్ సత్తార్.. ఇరగ.
బింగో రాజ్ కుమార్... నిజమే ఫస్టాఫ్ తో పోలిస్తే కాస్త స్పీడ్ తగ్గింది కానీ రివ్యూల్లో చెప్పినంత బ్యాడ్ గా లేదు. ఆ పృథ్వీ ఎపిసోడ్ మొత్తం లేపేసుండుంటే సినిమా ఇంకొంచెం బావుండేది. నో డౌట్ ప్రవీణ్ సత్తార్ ఇరగన్నర :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.
తొలగించండి