మత్తు వదలరా
నిద్దుర మత్తు వదలరా
ఆ మత్తులోనబడితే
గమ్మత్తుగా చిత్తవుదువురా...
మత్తు వదలరా
నిద్దుర మత్తు వదలరా
హ్మ్.. ఏంటో ఘంటసాల గారి కమ్మటి గొంతులో ఈ పాటింటుంటే జోలపాడుతున్నట్లుండి నాకే నిద్రొస్తుంది ఇంక నిద్రపోయే పాండా గాడేం లేస్తాడు... ఇది కాదు కానీ ఇంకోపాటతో ట్రైచేద్దారి...
తెల్లారేదాకా ఏ గొడ్డూ కునుకు తియ్యదూ..
గింజా గింజా ఏరకుంటే కూత తీరదూ..
ఓ గురువా సోమరిగా ఉంటే ఎలా?
బద్దకమే ఈ జన్మకు వదిలి పోదా..?
గురకలలో నీ పరువే చెడును కద...
దుప్పటిలో నీ బతుకే చిక్కినదా?
గింజా గింజా ఏరకుంటే కూత తీరదూ..
ఓ గురువా సోమరిగా ఉంటే ఎలా?
బద్దకమే ఈ జన్మకు వదిలి పోదా..?
గురకలలో నీ పరువే చెడును కద...
దుప్పటిలో నీ బతుకే చిక్కినదా?
వీడేంటీ నిద్రలేవమంటే చిత్రమైన ఆసనాలేస్తున్నాడు
లేవర..లేవరా..
“అబ్బా పోరా..”
సుందర.. సుందరా..
“తంతానొరేయ్..”
చాలు రా నిద్దరా..
“థూ..ఈ సారినిద్దర్లేపావంటే సంపేత్తానొరేయ్”
సుందర.. సుందరా..
“తంతానొరేయ్..”
చాలు రా నిద్దరా..
“థూ..ఈ సారినిద్దర్లేపావంటే సంపేత్తానొరేయ్”
వార్నీ.. నేన్రా ఈ బ్లాగువాడ్ని..
అడ్డగాడిదలా.. ఓహ్ నువ్ పాండావి కదూ.. అడ్డపాండాలా పడుకున్నది కాక నిన్ను
అమ్మాబాబు అంటూ మర్యాదగా నిద్రలేపుతుంటే నన్నే తిడతావా?? హన్నా... లే
ముందు..
“హబ్బా బ్లాగోడివి ఐతే ఏంటి గురూ.. మాంచి నిద్ర చెడగొట్టావ్.. ఇంకొన్నాళ్ళు పడుకోనివ్వు.. చాలా బద్దకంగా ఉంది.. ఐనా ఇపుడు నువ్వింత అర్జంట్ గా నన్ను నిద్రలేపి ఏం వెలగపెట్టాలంటా ?"
"ఏమంటే ఏం చెప్తాం మాకు మాకు బోల్డు కబుర్లు ఉంటాయోయ్ ఐనా నా బ్లాగుకు అతిధిగా వచ్చి సెటిల్ అయిందేకాక లేవమంటే నీ గోలేంటీ... ఇప్పటికే నా ఫ్రెండ్స్ అందరూ నిన్నూ నన్ను కలిపి తిట్టుకుంటున్నారు తెలుసా?"
"ఏంటీ
తిడుతున్నారా ?? ఎవరు.. ఎవరు మనల్ని తిడుతుంది.. కమాన్ చెప్పు.. రెండు
కుంగ్ ఫూ కిక్కులిచ్చానంటే కిక్కురుమనకుండా పడుకుంటారు..."
"అదుగో ఇందుకే నిన్ను ఆ కుంగ్ ఫూ సినిమాలు ఎక్కువ చూడద్దనేది ఇదివరకూ ఎంత స్వీట్ గా క్యూట్ గా ఉండేవాడివి ఇపుడేమో ఇలా రౌడీలా తయారయ్యావ్..."
"అదుగో ఇందుకే నిన్ను ఆ కుంగ్ ఫూ సినిమాలు ఎక్కువ చూడద్దనేది ఇదివరకూ ఎంత స్వీట్ గా క్యూట్ గా ఉండేవాడివి ఇపుడేమో ఇలా రౌడీలా తయారయ్యావ్..."
"హిహి తిడుతున్నారనే సరికి ఏదో కొద్దిగా ఆవేశం వచ్చిందిలే బాసు... అదీకాక కాస్త బద్దకం కూడా వదిలిచ్చుకోడానికి పనికి వస్తుంది కదాని రెండు మూవ్ లు ప్రాక్టీస్ చేశా.."
"సరే సరే లే ఇక సాగింది చాలు గానీ ఇంద ఈ కేక్ తినేసి మన ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేసి బయల్దేరితే నేను నా పని చూసుకుంటా.."
"ఏంటో బాసు బొత్తిగా అలవాటై పోయింది నీ బ్లాగ్ వదిలి వెళ్ళాలనిపించడంలేదు పోనీ నీకు అడ్డం రాకుండా అప్పుడప్పుడూ అవసరమైతే సాయం చేస్తూ ఇక్కడే ఓపక్కన తిరుగుతూ ఉండనా.. ఎంతైనా మనం మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా నీ బ్లాగ్ ఫ్రెండ్స్ అందరికీ నన్ను కూడా పరిచయం చేయ్..."
"సరే సరే లే ఇక సాగింది చాలు గానీ ఇంద ఈ కేక్ తినేసి మన ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేసి బయల్దేరితే నేను నా పని చూసుకుంటా.."
"ఏంటో బాసు బొత్తిగా అలవాటై పోయింది నీ బ్లాగ్ వదిలి వెళ్ళాలనిపించడంలేదు పోనీ నీకు అడ్డం రాకుండా అప్పుడప్పుడూ అవసరమైతే సాయం చేస్తూ ఇక్కడే ఓపక్కన తిరుగుతూ ఉండనా.. ఎంతైనా మనం మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా నీ బ్లాగ్ ఫ్రెండ్స్ అందరికీ నన్ను కూడా పరిచయం చేయ్..."
"హ్మ్ సరే రోజూ వచ్చి నిన్ను చూస్కోడం నాకు కూడా అలవాటైపోయింది నువ్ లేకపోతే వెలితిగానే ఉంటుందేమో. సో అలా సైడ్ బార్ లో ఓ పక్కన తిష్టవేసేయ్ కానీ మళ్ళీ బద్దకమంటూ నిద్రొస్తుందంటూ నాకు అడ్డం రాకూడదు సరేనా.."
"అలాగే గురూ నేను అస్సలు అడ్డంరాను నువ్వు హాయిగా కబుర్లు చెప్పుకో" (మనసులో:హు! వీడి బద్దకానికి నిద్రకీ నన్ను బాధ్యుడిని చేస్తున్నాడు.. దొంగమొహం..)
"నేస్తాలూ కొంచెం దగ్గిరగా రండి మా బాసు వినకుండా మీకో విషయం చెప్పాలి.. ఈ రోజు నుండీ ఈ బ్లాగ్ వాడు మళ్ళీ మీకు సుత్తేయడం మొదలు పెడతాడుట, మా గురువుగారు శ్రీశ్రీ బుడుగు గారు ఆర్డర్ వేస్తే సర్లేకదా అని పాపం ఇన్ని రోజులూ ఏదో ఒకలా మిమ్మల్ని నేను రష్చించేశాను ఇకపై మీకు భరించక తప్పదు... నేను కూడా ఆ పక్కనే ఉండి మనవాడ్ని కాస్త అదుపులో పెడతాలెండి."
"మరి కొత్త సంవత్సరం కదా మీకోసం నా అంత పేఏఏ..ద్ద... కేక్ ఇంకా ఒక మంచి గ్రీటింగ్ కార్డ్ తీసుకు వచ్చాను మరి అవి అందుకుని నాతో కూడా దోస్తీ కట్టేసి ఈ బ్లాగ్ కి వచ్చినపుడు నన్ను కూడా పలకరిస్తుండండేం.."
"హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్."
"ఆ విషెస్ చెప్పేశాను బాసు.. ఇక వస్తా.."
"ఆ ఆ సరే టాటా.."
నేస్తాలూ అదనమాట విషయం..
అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు..
ప్రతిరోజూ ప్రతిక్షణం అవధులులేని ఆనందం మీ సొంతమవాలని కోరుకుంటున్నాను...
అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు..
ప్రతిరోజూ ప్రతిక్షణం అవధులులేని ఆనందం మీ సొంతమవాలని కోరుకుంటున్నాను...
Vigneswaraaya namaha ... Welcome back annayya :-) HAPPY Happy New Year annayya :-)
రిప్లయితొలగించండిఅబ్బా మా అందరికి New year ఎంత హేపీ గా start చేసవో తెలుసా నువ్వు బ్లాగ్లోకి రావడం తో:-)
రిప్లయితొలగించండిబ్రేక్ ఇచ్చింది నువ్వు ..... పాపం ఆ పాండాల మీద తోసేస్తున్నావా...... హేయ్ బండ పాండాలు చెప్పేది వింటున్నారా ? మా అన్నయ్య అలా సైడ్ కి కుర్చోమన్నాడు కదా అని ... మళ్ళీ మా అన్నయ్య బ్లాగ్ లోకి వచ్చే సాహసం చేసావో అరికాళ్ళ లో వాతలు పడతాయి నీకు ...... సైలెంట్ గా నోటి మీద వేలేసుకుని చేతులు కట్టుకుని మా అన్నయ్య చెప్పే కబుర్లు ఆలకించి బోలెడు జ్ఞానం తెచ్చుకో తెలిసిందా ...... అన్నయ్య ఈ రోజు నుండి నీ బ్లాగ్ లో పోస్ట్ లు కామెంట్స్ మాత్రమే కనిపించాలి కాదని పాండాలు కనిపించాయో :-P
రిప్లయితొలగించండిమీకు కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు !
రిప్లయితొలగించండిపాండా తో మీ ముచ్చట్లు సూపర్ గా ఉన్నాయి :))Welcome back !
welcome back ...... మీకు కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు !
రిప్లయితొలగించండిWelcome back Venu!
రిప్లయితొలగించండిHave a rocking new year ahead!
Happy new year!
welcome back !మీకు కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు !
రిప్లయితొలగించండిమీకు హృదయపూర్వక నూతన
రిప్లయితొలగించండిసంవత్సర శుభాకాంక్షలు.
Wish You A Very Happy New Year 2012
happy new year .
రిప్లయితొలగించండిస్వాగతం సుస్వాగతం ,
రిప్లయితొలగించండిWelcome back,
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Wow!
రిప్లయితొలగించండిSo happy to see you venu garu
ఈ బ్లాగ్ లోగోరి ఆటలానే లగెత్తాలని మనస్పూర్తిగా కోరుకొంటూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు :)
బ్లాగ్లోకానికి పునః స్వాగతం వేణు గారూ.మీకు, ఇన్నాళ్ళు మీ బ్లాగులో రెస్ట్ తీసుకుని ఇప్పుడే బద్ధకంగా లేచిన మీ కుంగ్ ఫూ పాండా కి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండి:-)))
రిప్లయితొలగించండిHappy New Year Venu!
Welcome Back.
WOW...... welcome back vEnujee.. ;)
రిప్లయితొలగించండిమొత్తానికి కొత్త సంవత్సరానికి ఊపు తెచ్చారు.
ఇక ఈ రోజు మొదలు వారానికి ఒకటన్నా కుంగ్ ఫూ పాండా కిక్కులు కావాలి మాకు మీ పోస్టుల ద్వారా
నూతన సంవత్సర శుభాకాంక్షలతో...
రాజ్ కుమార్
WOW...... welcome back vEnujee.. ;)
రిప్లయితొలగించండిమొత్తానికి కొత్త సంవత్సరానికి ఊపు తెచ్చారు.
ఇక ఈ రోజు మొదలు వారానికి ఒకటన్నా కుంగ్ ఫూ పాండా కిక్కులు కావాలి మాకు మీ పోస్టుల ద్వారా
నూతన సంవత్సర శుభాకాంక్షలతో...
రాజ్ కుమార్
వావ్...వేనుజి :D :D
రిప్లయితొలగించండిreally very happy to c u back...
wish u a very ahppy new year...
ఆ పాండా ఇక మా కంట్రోల్ లో ఉంటాడు లెండి..నిద్రపోతే మొట్టుతునే ఉంటాం :D :P
and template kuda keko keka :D
:):) మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలండీ..
రిప్లయితొలగించండిపాపం, పాండాని అంటే అన్నారు కాని, మా కోరిక తీరబోతోంది. అంతే చాలు. ఆ పాండాని మళ్ళీ తిరిగి రానీయకండి:) మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలండి.
రిప్లయితొలగించండివావ్ వేణుగారు వెల్కం బాక్....
రిప్లయితొలగించండినూతన సంవత్సర శుభాకాంక్షలు...మీ బ్లాగులో బోలేడు కబుర్లు చదవచ్చన్న మాట...వెయిటింగ్ అండి...:)
హహహ సూపర్...హమ్మయ్య పండా ని పంపించేసారుగా...ఇంక బుద్ధిగా ఓ పక్కన కూరుంటాడులెండి.
రిప్లయితొలగించండిఎల్కం ఎల్కం...మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!
వేణు గారు
రిప్లయితొలగించండినూతన సంవత్సర శుభాకాంక్షలు
ooh! You are back..!!!
రిప్లయితొలగించండిWishing you a fabulous new year ahead.. :)
మీ బ్లాగు రూపురేఖలు మార్చేసారుగా.. (కొత్తవే కదూ!) చాలా బాగుంది. :)
రిప్లయితొలగించండిNice to see you back Venu..
Happy new year to you too! :)
చెల్లాయ్(రంజని), శ్రావ్య, విష్వక్సేనుడు గారు, సుజాత గారు, అను గారు, రాజి గారు, మాల గారు, గురూజీ, హరే, శంకర్ జీ, పద్మ గారు, రాజ్, కిరణ్, సుభ గారు, జయ గారు, స్నిగ్ధ గారు, సౌమ్య, శేఖర్, మేధ గారు, మధుర అందరికీ పేరు పేరునా ధన్యవాదాలూ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆలస్యంగా జవాబిస్తున్నందుకు మన్నించండి.
రిప్లయితొలగించండిఅలాగే చెల్లాయ్ ఇకపై పాండాలు అడ్డంరాకుండా చూసుకుంటాను.
హహహ పాండాతో నా ముచ్చట్లు మీకు నచ్చినందుకు సంతోషం శ్రావ్యగారు.
హరే, లగోరి ఒక్కటేనా పిచ్చిబంతాటలో లాగా ఒద్దా :-P
మా పాండా తరపున కూడా మీకు ధన్యవాదాలు శంకర్ జీ..
హహహ రాజ్ కుంగ్ ఫూ కిక్ లు నావల్ల ఏమౌతాయి ఏదో మాములు టపాలతో అప్పుడప్పుడు పలకరిస్తాను.
హహహ కిరణ్ పాండాని మరీ ఎక్కువ మొట్టేయకండి చిర్రెత్తగలదు మావాడికి :-)
జయగారు అలాగేనండీ పాండాను తిరిగి రానివ్వకుండా ఆపడానికి ప్రయత్నిస్తాను.
అవును మధురా బ్లాగ్ రూపురేఖలు పూర్తిగా కొత్తవే టపాతో పాటు సర్ ప్రైజ్ గా ఉండాలని 31st నైట్ అంతా కూర్చుని ఓ రెండు టెంప్లేట్స్ తీసుకుని కలిపి తీరిగ్గా కస్టమైజ్ చేశాను :-)
వావ్! మొత్తానికి నిద్ర లేపేశారుగా పాండాని..వెరీ హేప్పీస్ :))
రిప్లయితొలగించండిమీక్కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు..
Thanks నిషీ..
రిప్లయితొలగించండిఅడ్డగాడిదలా.. ఓహ్ నువ్ పాండావి కదూ.. అడ్డపాండాలా పడుకున్నది కాక నిన్ను అమ్మాబాబు ....ha...ha...happy new year...
రిప్లయితొలగించండిThanks శశిగారు మీక్కూడా :-)
రిప్లయితొలగించండిwow.. wonderful!! I am extremely happy...
రిప్లయితొలగించండిThanks Murali garu :)
రిప్లయితొలగించండిలేటుగా చూశాను. Happy to see your blog now.
రిప్లయితొలగించండిThanks Chandu S gaaru.
రిప్లయితొలగించండిహమ్మయ్య మొత్తానికి మా ఎదురుచూపులు ఫలిన్చాయన్నమాట.
రిప్లయితొలగించండిమీకు స్వాగతం వేణు గారు
ధన్యవాదాలు శైలబాల గారు :-)
రిప్లయితొలగించండి