ఆదివారం, జనవరి 01, 2012

నూతన సంవత్సర శుభాకాంక్షలు..


మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
ఆ మత్తులోనబడితే గమ్మత్తుగా చిత్తవుదువురా...
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
హ్మ్.. ఏంటో ఘంటసాల గారి కమ్మటి గొంతులో ఈ పాటింటుంటే జోలపాడుతున్నట్లుండి నాకే నిద్రొస్తుంది ఇంక నిద్రపోయే పాండా గాడేం లేస్తాడు... ఇది కాదు కానీ ఇంకోపాటతో ట్రైచేద్దారి...
తెల్లారేదాకా ఏ గొడ్డూ కునుకు తియ్యదూ..
గింజా గింజా ఏరకుంటే కూత తీరదూ..
ఓ గురువా సోమరిగా ఉంటే ఎలా?
బద్దకమే ఈ జన్మకు వదిలి పోదా..?
గురకలలో నీ పరువే చెడును కద...
దుప్పటిలో నీ బతుకే చిక్కినదా? 
వీడేంటీ నిద్రలేవమంటే చిత్రమైన ఆసనాలేస్తున్నాడు
లేవర..లేవరా..
“అబ్బా పోరా..”
సుందర.. సుందరా..
“తంతానొరేయ్..”
చాలు రా నిద్దరా..
“థూ..ఈ సారినిద్దర్లేపావంటే సంపేత్తానొరేయ్”
వార్నీ.. నేన్రా ఈ బ్లాగువాడ్ని.. అడ్డగాడిదలా.. ఓహ్ నువ్ పాండావి కదూ.. అడ్డపాండాలా పడుకున్నది కాక నిన్ను అమ్మాబాబు అంటూ మర్యాదగా నిద్రలేపుతుంటే నన్నే తిడతావా?? హన్నా... లే ముందు..
“హబ్బా బ్లాగోడివి ఐతే ఏంటి గురూ.. మాంచి నిద్ర చెడగొట్టావ్.. ఇంకొన్నాళ్ళు పడుకోనివ్వు.. చాలా బద్దకంగా ఉంది.. ఐనా ఇపుడు నువ్వింత అర్జంట్ గా నన్ను నిద్రలేపి ఏం వెలగపెట్టాలంటా ?"

"ఏమంటే ఏం చెప్తాం మాకు మాకు బోల్డు కబుర్లు ఉంటాయోయ్ ఐనా నా బ్లాగుకు అతిధిగా వచ్చి సెటిల్ అయిందేకాక లేవమంటే నీ గోలేంటీ... ఇప్పటికే నా ఫ్రెండ్స్ అందరూ నిన్నూ నన్ను కలిపి తిట్టుకుంటున్నారు తెలుసా?"
"ఏంటీ తిడుతున్నారా ?? ఎవరు.. ఎవరు మనల్ని తిడుతుంది.. కమాన్ చెప్పు.. రెండు కుంగ్ ఫూ కిక్కులిచ్చానంటే కిక్కురుమనకుండా పడుకుంటారు..."

"అదుగో ఇందుకే నిన్ను ఆ కుంగ్ ఫూ సినిమాలు ఎక్కువ చూడద్దనేది ఇదివరకూ ఎంత స్వీట్ గా క్యూట్ గా ఉండేవాడివి ఇపుడేమో ఇలా రౌడీలా తయారయ్యావ్..."
"హిహి తిడుతున్నారనే సరికి ఏదో కొద్దిగా ఆవేశం వచ్చిందిలే బాసు... అదీకాక కాస్త బద్దకం కూడా వదిలిచ్చుకోడానికి పనికి వస్తుంది కదాని రెండు మూవ్ లు ప్రాక్టీస్ చేశా.."
"సరే సరే లే ఇక సాగింది చాలు గానీ ఇంద ఈ కేక్ తినేసి మన ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేసి బయల్దేరితే నేను నా పని చూసుకుంటా.."
"ఏంటో బాసు బొత్తిగా అలవాటై పోయింది నీ బ్లాగ్ వదిలి వెళ్ళాలనిపించడంలేదు పోనీ నీకు అడ్డం రాకుండా అప్పుడప్పుడూ అవసరమైతే సాయం చేస్తూ ఇక్కడే ఓపక్కన తిరుగుతూ ఉండనా.. ఎంతైనా మనం మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా నీ బ్లాగ్ ఫ్రెండ్స్ అందరికీ నన్ను కూడా పరిచయం చేయ్..."

"హ్మ్ సరే రోజూ వచ్చి నిన్ను చూస్కోడం నాకు కూడా అలవాటైపోయింది నువ్ లేకపోతే వెలితిగానే ఉంటుందేమో. సో అలా సైడ్ బార్ లో ఓ పక్కన తిష్టవేసేయ్ కానీ మళ్ళీ బద్దకమంటూ నిద్రొస్తుందంటూ నాకు అడ్డం రాకూడదు సరేనా.."

"అలాగే గురూ నేను అస్సలు అడ్డంరాను నువ్వు హాయిగా కబుర్లు చెప్పుకో" (మనసులో:హు! వీడి బద్దకానికి నిద్రకీ నన్ను బాధ్యుడిని చేస్తున్నాడు.. దొంగమొహం..) 
"నేస్తాలూ కొంచెం దగ్గిరగా రండి మా బాసు వినకుండా మీకో విషయం చెప్పాలి.. ఈ రోజు నుండీ ఈ బ్లాగ్ వాడు మళ్ళీ మీకు సుత్తేయడం మొదలు పెడతాడుట, మా గురువుగారు శ్రీశ్రీ బుడుగు గారు ఆర్డర్ వేస్తే సర్లేకదా అని పాపం ఇన్ని రోజులూ ఏదో ఒకలా మిమ్మల్ని నేను రష్చించేశాను ఇకపై మీకు భరించక తప్పదు... నేను కూడా ఆ పక్కనే ఉండి మనవాడ్ని కాస్త అదుపులో పెడతాలెండి."

"మరి కొత్త సంవత్సరం కదా మీకోసం నా అంత పేఏఏ..ద్ద... కేక్ ఇంకా ఒక మంచి గ్రీటింగ్ కార్డ్ తీసుకు వచ్చాను మరి అవి అందుకుని నాతో కూడా దోస్తీ కట్టేసి ఈ బ్లాగ్ కి వచ్చినపుడు నన్ను కూడా పలకరిస్తుండండేం.."

"హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్."
"ఆ విషెస్ చెప్పేశాను బాసు.. ఇక వస్తా.."
"ఆ ఆ సరే టాటా.."
నేస్తాలూ అదనమాట విషయం..
అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు..
ప్రతిరోజూ ప్రతిక్షణం అవధులులేని ఆనందం మీ సొంతమవాలని కోరుకుంటున్నాను...
 

34 కామెంట్‌లు:

  1. Vigneswaraaya namaha ... Welcome back annayya :-) HAPPY Happy New Year annayya :-)

    రిప్లయితొలగించండి
  2. అబ్బా మా అందరికి New year ఎంత హేపీ గా start చేసవో తెలుసా నువ్వు బ్లాగ్లోకి రావడం తో:-)

    రిప్లయితొలగించండి
  3. బ్రేక్ ఇచ్చింది నువ్వు ..... పాపం ఆ పాండాల మీద తోసేస్తున్నావా...... హేయ్ బండ పాండాలు చెప్పేది వింటున్నారా ? మా అన్నయ్య అలా సైడ్ కి కుర్చోమన్నాడు కదా అని ... మళ్ళీ మా అన్నయ్య బ్లాగ్ లోకి వచ్చే సాహసం చేసావో అరికాళ్ళ లో వాతలు పడతాయి నీకు ...... సైలెంట్ గా నోటి మీద వేలేసుకుని చేతులు కట్టుకుని మా అన్నయ్య చెప్పే కబుర్లు ఆలకించి బోలెడు జ్ఞానం తెచ్చుకో తెలిసిందా ...... అన్నయ్య ఈ రోజు నుండి నీ బ్లాగ్ లో పోస్ట్ లు కామెంట్స్ మాత్రమే కనిపించాలి కాదని పాండాలు కనిపించాయో :-P

    రిప్లయితొలగించండి
  4. మీకు కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు !
    పాండా తో మీ ముచ్చట్లు సూపర్ గా ఉన్నాయి :))Welcome back !

    రిప్లయితొలగించండి
  5. welcome back ...... మీకు కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి
  6. welcome back !మీకు కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి
  7. మీకు హృదయపూర్వక నూతన
    సంవత్సర శుభాకాంక్షలు.

    Wish You A Very Happy New Year 2012

    రిప్లయితొలగించండి
  8. స్వాగతం సుస్వాగతం ,

    Welcome back,

    మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  9. Wow!
    So happy to see you venu garu

    ఈ బ్లాగ్ లోగోరి ఆటలానే లగెత్తాలని మనస్పూర్తిగా కోరుకొంటూ
    నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

    రిప్లయితొలగించండి
  10. బ్లాగ్లోకానికి పునః స్వాగతం వేణు గారూ.మీకు, ఇన్నాళ్ళు మీ బ్లాగులో రెస్ట్ తీసుకుని ఇప్పుడే బద్ధకంగా లేచిన మీ కుంగ్ ఫూ పాండా కి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  11. WOW...... welcome back vEnujee.. ;)

    మొత్తానికి కొత్త సంవత్సరానికి ఊపు తెచ్చారు.
    ఇక ఈ రోజు మొదలు వారానికి ఒకటన్నా కుంగ్ ఫూ పాండా కిక్కులు కావాలి మాకు మీ పోస్టుల ద్వారా

    నూతన సంవత్సర శుభాకాంక్షలతో...

    రాజ్ కుమార్

    రిప్లయితొలగించండి
  12. WOW...... welcome back vEnujee.. ;)

    మొత్తానికి కొత్త సంవత్సరానికి ఊపు తెచ్చారు.
    ఇక ఈ రోజు మొదలు వారానికి ఒకటన్నా కుంగ్ ఫూ పాండా కిక్కులు కావాలి మాకు మీ పోస్టుల ద్వారా

    నూతన సంవత్సర శుభాకాంక్షలతో...

    రాజ్ కుమార్

    రిప్లయితొలగించండి
  13. వావ్...వేనుజి :D :D
    really very happy to c u back...
    wish u a very ahppy new year...
    ఆ పాండా ఇక మా కంట్రోల్ లో ఉంటాడు లెండి..నిద్రపోతే మొట్టుతునే ఉంటాం :D :P

    and template kuda keko keka :D

    రిప్లయితొలగించండి
  14. :):) మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలండీ..

    రిప్లయితొలగించండి
  15. పాపం, పాండాని అంటే అన్నారు కాని, మా కోరిక తీరబోతోంది. అంతే చాలు. ఆ పాండాని మళ్ళీ తిరిగి రానీయకండి:) మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలండి.

    రిప్లయితొలగించండి
  16. వావ్ వేణుగారు వెల్కం బాక్....
    నూతన సంవత్సర శుభాకాంక్షలు...మీ బ్లాగులో బోలేడు కబుర్లు చదవచ్చన్న మాట...వెయిటింగ్ అండి...:)

    రిప్లయితొలగించండి
  17. హహహ సూపర్...హమ్మయ్య పండా ని పంపించేసారుగా...ఇంక బుద్ధిగా ఓ పక్కన కూరుంటాడులెండి.

    ఎల్కం ఎల్కం...మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  18. వేణు గారు
    నూతన సంవత్సర శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  19. మీ బ్లాగు రూపురేఖలు మార్చేసారుగా.. (కొత్తవే కదూ!) చాలా బాగుంది. :)
    Nice to see you back Venu..
    Happy new year to you too! :)

    రిప్లయితొలగించండి
  20. చెల్లాయ్(రంజని), శ్రావ్య, విష్వక్సేనుడు గారు, సుజాత గారు, అను గారు, రాజి గారు, మాల గారు, గురూజీ, హరే, శంకర్ జీ, పద్మ గారు, రాజ్, కిరణ్, సుభ గారు, జయ గారు, స్నిగ్ధ గారు, సౌమ్య, శేఖర్, మేధ గారు, మధుర అందరికీ పేరు పేరునా ధన్యవాదాలూ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆలస్యంగా జవాబిస్తున్నందుకు మన్నించండి.

    అలాగే చెల్లాయ్ ఇకపై పాండాలు అడ్డంరాకుండా చూసుకుంటాను.
    హహహ పాండాతో నా ముచ్చట్లు మీకు నచ్చినందుకు సంతోషం శ్రావ్యగారు.
    హరే, లగోరి ఒక్కటేనా పిచ్చిబంతాటలో లాగా ఒద్దా :-P
    మా పాండా తరపున కూడా మీకు ధన్యవాదాలు శంకర్ జీ..
    హహహ రాజ్ కుంగ్ ఫూ కిక్ లు నావల్ల ఏమౌతాయి ఏదో మాములు టపాలతో అప్పుడప్పుడు పలకరిస్తాను.
    హహహ కిరణ్ పాండాని మరీ ఎక్కువ మొట్టేయకండి చిర్రెత్తగలదు మావాడికి :-)
    జయగారు అలాగేనండీ పాండాను తిరిగి రానివ్వకుండా ఆపడానికి ప్రయత్నిస్తాను.
    అవును మధురా బ్లాగ్ రూపురేఖలు పూర్తిగా కొత్తవే టపాతో పాటు సర్ ప్రైజ్ గా ఉండాలని 31st నైట్ అంతా కూర్చుని ఓ రెండు టెంప్లేట్స్ తీసుకుని కలిపి తీరిగ్గా కస్టమైజ్ చేశాను :-)

    రిప్లయితొలగించండి
  21. వావ్! మొత్తానికి నిద్ర లేపేశారుగా పాండాని..వెరీ హేప్పీస్ :))
    మీక్కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  22. అడ్డగాడిదలా.. ఓహ్ నువ్ పాండావి కదూ.. అడ్డపాండాలా పడుకున్నది కాక నిన్ను అమ్మాబాబు ....ha...ha...happy new year...

    రిప్లయితొలగించండి
  23. లేటుగా చూశాను. Happy to see your blog now.

    రిప్లయితొలగించండి
  24. హమ్మయ్య మొత్తానికి మా ఎదురుచూపులు ఫలిన్చాయన్నమాట.
    మీకు స్వాగతం వేణు గారు

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.