గిలిగింతలు పెట్టే చలిలో వెచ్చని భోగిమంటలు, చలికి వణుకుతూనే తెల్లవారుఝామున చేసే తలస్నానాలు, పిల్లలకు పోసే పుల్ల భోగిపళ్ళు తీయని చెఱకు ముక్కలు, నిండు అలంకరణతో ఇంటింటికీ తిరుగుతూ అలరించే గంగిరెద్దులు, కమ్మని గానంతో ఆకట్టుకునే హరిదాసులు, ప్రతి ఇంటిముందూ తీర్చి దిద్దిన రంగురంగుల రంగవల్లులు. చిక్కుడు, గుమ్మడి కూరల్తో తినే పెసర పులగం, అరిసెలు, చక్రాలు ఇతర పిండివంటలు, కొత్తబియ్యంతో చేసిన పాయసాలు, పులిహారలూ, కనుమ రోజు మినప గారెలు కోడి కూరలూ. తెలుగింట మూడురోజులు ఏరోజుకారోజు ప్రత్యేకతతో నిజంగా పెద్ద పండుగ పేద్ద పండుగే అనిపించేలా జరుపుకునే భోగి, సంక్రాంతి మరియూ కనుమ మూడురోజులను మీరంతా మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ..
మిత్రులందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.













14 comments:
వేణూ గారు సంక్రాంతి శుభాకాంక్షలు!
సంక్రాంతి శుభాకాంక్షలు వేణూజీ...
మీరు చెప్పినవి ఏ ఒక్కటీ చూడకుండా.. సగం నిద్రలో మత్తుగా గడిచిపోయింది ఈ పండగరోజు నాకు... ;) ;)
అబ్బా...యెమి ఊరిస్తున్నావు...వెణు...ఒక్క కొడి
కూర తప్ప....నీకు పండగ శుభాకాంక్షలు
వేణూ గారు మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!
పండగ సంబరమంతా మీదే:) సరే, మీకు హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.
welcome...welcome...సంక్రాంతి శుభాకాంక్షలు!
సంక్రాంతి శుభాకాంక్షలు .
నెనర్లు హరే..
రాజ్ నెనర్లు :) హహహ పండగ ఒకోసారి ఇలా కూడా ఎంజాయ్ చేయాలిలే ఎప్పుడూ ఒకేలా చేస్తే ఏముంది.
శశిగారు నెనర్లు :) ఓహో ఒక్కకోడి కూర వద్దంటారా ఐతే రెండుకోళ్ళతో చేయించేద్దాంలేండి కూర :-P
శ్రావ్యా, జయగారు, తృష్ణ గారు, మాల గారు నెనర్లు :-)
వేణు గారూ మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు..
నెనర్లు జ్యోతిర్మయి గారు :-)
కాస్త ఆలస్యంగా వచ్చానా? అయినా ఫరవాలేదులెండి!చాలా బాగా వర్ణించారు! మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!
ధన్యవాదాలు రసఙ్ఞ గారు.
మీరు శుభాకాంక్షలు చెప్పే విధానం చాలా బాగుంటుంది వేణూ శ్రీకాంత్ గారూ! మరోమారు సంక్రాంతి శుభాకాంక్షలు. :)
ధన్యవాదాలు కొత్తావకాయ గారు :-)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి