ఆదివారం, జనవరి 15, 2012

సంక్రాంతి శుభాకాంక్షలు

గిలిగింతలు పెట్టే చలిలో వెచ్చని భోగిమంటలు, చలికి వణుకుతూనే తెల్లవారుఝామున చేసే తలస్నానాలు, పిల్లలకు పోసే పుల్ల భోగిపళ్ళు తీయని చెఱకు ముక్కలు, నిండు అలంకరణతో ఇంటింటికీ తిరుగుతూ అలరించే గంగిరెద్దులు, కమ్మని గానంతో ఆకట్టుకునే హరిదాసులు, ప్రతి ఇంటిముందూ తీర్చి దిద్దిన రంగురంగుల రంగవల్లులు. చిక్కుడు, గుమ్మడి కూరల్తో తినే పెసర పులగం, అరిసెలు, చక్రాలు ఇతర పిండివంటలు, కొత్తబియ్యంతో చేసిన పాయసాలు, పులిహారలూ, కనుమ రోజు మినప గారెలు కోడి కూరలూ. తెలుగింట  మూడురోజులు ఏరోజుకారోజు ప్రత్యేకతతో నిజంగా పెద్ద పండుగ పేద్ద పండుగే అనిపించేలా జరుపుకునే భోగి, సంక్రాంతి మరియూ కనుమ మూడురోజులను మీరంతా మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ..

మిత్రులందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

13 కామెంట్‌లు:

  1. వేణూ గారు సంక్రాంతి శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  2. సంక్రాంతి శుభాకాంక్షలు వేణూజీ...
    మీరు చెప్పినవి ఏ ఒక్కటీ చూడకుండా.. సగం నిద్రలో మత్తుగా గడిచిపోయింది ఈ పండగరోజు నాకు... ;) ;)

    రిప్లయితొలగించండి
  3. అబ్బా...యెమి ఊరిస్తున్నావు...వెణు...ఒక్క కొడి
    కూర తప్ప....నీకు పండగ శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  4. వేణూ గారు మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  5. పండగ సంబరమంతా మీదే:) సరే, మీకు హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  6. welcome...welcome...సంక్రాంతి శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  7. నెనర్లు హరే..
    రాజ్ నెనర్లు :) హహహ పండగ ఒకోసారి ఇలా కూడా ఎంజాయ్ చేయాలిలే ఎప్పుడూ ఒకేలా చేస్తే ఏముంది.
    శశిగారు నెనర్లు :) ఓహో ఒక్కకోడి కూర వద్దంటారా ఐతే రెండుకోళ్ళతో చేయించేద్దాంలేండి కూర :-P
    శ్రావ్యా, జయగారు, తృష్ణ గారు, మాల గారు నెనర్లు :-)

    రిప్లయితొలగించండి
  8. వేణు గారూ మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  9. కాస్త ఆలస్యంగా వచ్చానా? అయినా ఫరవాలేదులెండి!చాలా బాగా వర్ణించారు! మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  10. మీరు శుభాకాంక్షలు చెప్పే విధానం చాలా బాగుంటుంది వేణూ శ్రీకాంత్ గారూ! మరోమారు సంక్రాంతి శుభాకాంక్షలు. :)

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.