మంగళవారం, అక్టోబర్ 19, 2010

ఓంకార్ పై ఓ సరదా వీడియో

నాకు శతృవులు చాలా తక్కువ, అసలు లేరనే చెప్పచ్చేమో.. ఇదివరకు ఆఫీస్ లో కొందరు తెలుగు తెలిసిన కొలీగ్స్ నన్ను అజాతశతృవు అని పిలిచే వాళ్ళు. అలా ఉండగలగటానికి ముఖ్య కారణం నా కోపాన్ని అదుపులో ఉంచుకోవడం. ఒక రెండుమూడేళ్ళ క్రితంవరకూ చాలా కంట్రోల్డ్ గా ఉండగలిగే వాడిని ఈ మద్య ఆ నిగ్రహం కాస్త కొరవడిందనుకోండి. ఇలాంటి నాకు కూడా ఒకోసారి అకారణంగా ఎదుటి వాళ్ళేమీ చేయకుండానే కొందరు వ్యక్తులను చూస్తేనే ఒళ్ళంతా తేళ్ళు జెర్రులు పాకుతున్నంత కంపరం పుట్టి చిరాకు వస్తుంది. బహుశా వారు గతంలో నన్ను పెట్టిన హింస అలా అకారణ ద్వేషానికి కారణం కావచ్చు. అలాంటి వారిలో ప్రత్యక్షంగా పరిచయం ఉన్నవారు ఎవరూ లేకపోయినా టీవీ యాంకర్ ’ఓంకార్’ ప్రముఖుడు.

ఇతనెవరు అంటే వివరించే ఓపిక నాకిప్పుడులేదు కానీ వీలైతే ఈ టపా చదవండి. ఇతను ఈ మధ్య జీనియస్ అని ఇతను తీసే సిన్మాలో సెలెక్షన్ కోసం ఒక కొత్త రియాలిటీ షో ఒకటి మొదలెట్టాడు. దానికి కొన్ని తెలుగు కామెడీ సీన్లు కలిపి ఇతని మీదఉన్న కసి అంతా తీరేలా బహు చక్కగా తయారు చేసిన ఈ కామెడీ వీడీయో చూసి హాయిగా నవ్వుకోండి. ఇతగాడికి ఇలాంటి ఎన్ని వీడియోలు తయారు చేసినా బుద్దిరాదు. కాస్త నిడివి ఎక్కువే కానీ ఏం భయపడకండి ఇతన్ని అంత సేపు భరించాల్సిన దౌర్భాగ్యాన్ని నాబ్లాగుద్వారా మీకు కలుగ నిస్తానా. అందులో అధికభాగం కామెడీ క్లిప్సే ఉన్నాయి అదీకాక ఈ వీడియో ఖచ్చితంగా మీకితని మీదున్న కసిని కొంతైనా తీరుస్తుందని నాదీ హామి.

ఈ వీడియో తయారు చేసిన అసలు జీనియస్ కు నా జోహార్లు. ఇందులో వాడిన మహెష్ ఖలేజ క్లిప్ అయితే అసలు ముందు సీన్లో ఓంకార్ వైపే చూస్తూ తిడుతున్నట్లనిపించింది. ఇక బ్రహ్మానందం మేడమీదనుండి పరిగెట్టుకు వస్తూ చెప్పే "దరిద్రనారాయణుని దిక్కుమాలిన అవతారం" ఆ మ్యూజిక్కూ ఎంత చక్కగా సరిపోయిందో మాటల్లో చెప్పలేను. ఇక ఆర్తి పెట్టిన చీవాట్లు, "తిక్క కుదిరింది తింగరి వెధవకి" లాంటి బ్రహ్మానందం తిట్టిన తిట్లు, వీరభద్రరావుగారు ఇతని వెర్రిపై చేసిన వ్యాఖ్యానం గురించి చెప్పనే అక్కర్లేదు కంక్లూజన్ కూడా కేక.  ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇతనెవరో కానీ ఓంకార్ బాదితుల సంఘం అద్యక్షుడిలా ఉన్నాడు అందరి మనోభావాలను ఇట్టే పట్టుకుని ఎంచక్కా ప్రజెంట్ చేసేశాడు. చూసి ఆనందించండి.

40 వ్యాఖ్యలు:

 1. ఈ చెత్త ఓంకార్ ని చూస్తే ఎంత చిరాకో , గొంగళి పురుగులు పాకుతున్నట్టు ఉంటుంది. రోజుకి ఒకసారి అయిన వీడి మొహం చూడాల్సిన కర్మ.. వీడని నేను తిట్టుకొని రోజు అంటూ లేదు.
  వీడియో బాగుంది , కాని ఇది సరిపోదేమో వాడి ఓవర్ ఆక్షన్ కి .. అసలు వీడి shows ఎవరైనా చూస్తారా? ఈ బ్లాగ్ లోకం లో ఎవరైనా మీడియా లో వర్క్ చేసే వాళ్ళు ఉంటె కొంచెం
  మా టీవీ management కి చెప్పి పుణ్యం కట్టుకోండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నేను ఇందాకే ఈ వీడియొ చూసాను..ఈ దరిద్రుడి 'జీనియస్ ' షో మీద ఒక పోస్ట్ పెడదామనుకునేలోగా మీరే పెట్టేసారు నాకు ఆ శ్రమ లేకుండా.. :) ఇంత నీచుడ్ని,దరిద్రుణ్ణి నేను ఎక్కడా చూడలేదు...చిన్నపిల్లల జీవితాలు నాసెనం చేసే లాగ డాన్స్ షొలు వాడి బొంద!! (ఆ వీదియొ లో చెప్పినట్లు) ఇలంటి మృగాల్ని అరెస్ట్ చేయకుండా ఇంకా ఎందుకు ఇలా తిరగనిస్తున్నారో....వాడి మీద వీడియోలు కాదు కేసులు పెట్టలి..వెధవ...వెధవన్నర వెధవ!! త్రాష్టుడు..నిక్రుష్టుడు...నీచుడు...దరిద్రుడు... నిజంగానే దరిద్రనారాయణుని అవతారము...

  ప్రత్యుత్తరంతొలగించు
 3. :) టి.వి 1 లో ఇతని మీద వచ్చే పేరడీ షో భలే ఉంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. actually... ఈ షోలో అందరూ ఓంకార్ను మించి ఓవర్‌యాక్షన్ చేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Omkar ni chuste andariki chala chiraku, asahyam kalugutundhi

  ప్రత్యుత్తరంతొలగించు
 6. vadini chustheni kamparampuduthundi.vadu vadi vedava programs...........

  ప్రత్యుత్తరంతొలగించు
 7. vadi programs anni rakunda evarana apthe masanthiga vuntundi ,vadi programs chusi payepoye athe thelivi chupinche pilalu thagutharu..........

  ప్రత్యుత్తరంతొలగించు
 8. sry chede poye atheka thelivi chupe pilalu ane na ardam........

  ప్రత్యుత్తరంతొలగించు
 9. హ హ సూపరు, చివర్లో కంక్లూజన్, మధ్యలో వచ్చే దవిలాగు "వాడొక సాడిస్తు, ప్రజలని ఏడిపించడమే వాడికి అలవాటు" మాత్రం అదిరిపోయాయి. సరిగ్గా సరిపోయాయి. అసలు ఓంకార్ ని చూస్తేనే ఒంటి మీద తేళ్ళు, జెర్రులు పాకురుతున్నటనిపిస్తుంది నాకు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. "వీడబ్బ తొండకి విగ్గు పెట్టినట్టుగా ఉంది", ఏవియస్ డైలాగ్ ఎంత కరెక్ట్ గా సరిపోయిందో! :)))
  వీడియో మాత్రం సూపర్.. ఇలాంటివి ఎన్ని చూస్తే ఆ మహానుభావుడికి జ్ఞానం కలుగుతుందో!

  ప్రత్యుత్తరంతొలగించు
 11. hahaha..very funny...ఆ ఓంకార్ మాహాశయుడికి ఇది చూసి బుధ్ధి వస్తుంది అని నేను అనుకోను....ఇంకా ఫ్రీ పబ్లిసిటీ అని హ్యపీ గా ఫీల్ అవుతాడు..... తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు...ఈయనగారి డాన్స్ షోలు ముదిరి...సినిమా తీసేదాకా వచ్చాయి.... చూసే వాళ్ళ ఖర్మ అంతే...

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ఇందాకే ఫేస్‌బుక్‌లో ఈ వీడియో పై కామెంటు పెట్టి వస్తున్నా...ఈడి కోసం ఆలోచించి కొత్తగా రాయడం వేస్ట్ అని అదే కామెంట్ రాస్తున్నా..

  ప్ర: తెలుగు టివీ ప్రేక్షకులకు టార్చర్ ఎప్పుడు మొదలైంది?

  స: 2004లో (జెమిని మ్యూజిక్ అప్పుడే మొదలైందనుకుంటా) పెడితే 2010 వరకు కొనసాగుతుంది..

  ప్ర: ప్రపంచంలో అతిపెద్ద టార్చర్‌ కాండిడేట్లు ఎవరు?
  స: అప్పట్లో ప్రభాకర్‌ ఇప్పుడు ఓంకార్...

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఎవరిక్కడ ఓంకార్ ని మామూలుగా తిట్టింది
  మా మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి :)

  నాగార్జున కేవ్వ్వ్ :D

  ప్రత్యుత్తరంతొలగించు
 14. ఒకటో అఙ్ఞాత నెనర్లు, మీ రిక్వెస్ట్ బాగుందండీ. నిజమే ఎవరైన చెప్తే బాగుండు.

  రెండో అఙ్ఞాత నెనర్లు, బాగా చెప్పారు.

  శివ గారు నెనర్లు, ఆహా మీరెంత అదృష్టవంతులండి. ఇంతవరకూ ఇతని భారిన పడలేదంటే చాలా గ్రేట్ ఇకపై కూడా ఇతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయకండి సార్, అనవసరంగా హెల్త్ పాడైపోతుంది.

  శిశిర గారు నెనర్లు, ఓ అవునా నేను ఆ షో చూడలేదండీ.

  ఇండియన్ మినర్వా గారు నెనర్లు, నిజమేనండి చూసిన నాలుగు నిముషాలకే నాకు కూడా ఆ ఫీలింగ్ కలిగింది.

  మూడో అఙ్ఞాత గారు నెనర్లు, నాకు కూడా అంతేనండీ అందుకే ఈ వీడియో చూసి కాస్త శాంతించి వెంటనే బ్లాగ్ లోపెట్టేశాను.

  ఆ.సౌమ్యగారు నెనర్లు, మరే కరెక్టుగా చెప్పారు. ఎవరైనా ఆ పుణ్యం కట్టుకుంటారా అని ఎదురు చూస్తున్నాను.

  నిషిగంధ గారు నెనర్లు, నాకైతే ఆ అఙ్ఞానికి ఙ్ఞానం కలుగుతుందన్న నమ్మకం కొంచెం కూడా లేదండీ.

  జగ్గంపేట గారు నెనర్లు, నిజమే అవసరం లేదు కానీ నాలాంటి వారి కసి కొంతైనా ఉపశమిస్తుందని, అదీకాక మా అందరి మనోభావాలని పట్టుకుని ఇంత చక్కని వీడియో తయారు చేసిన అతని శ్రమ అందరూ గుర్తించాలనీ ఏదో చిన్ని ప్రయత్నం అంతే.

  ఇందు గారు నెనర్లు, నిజమేనండి చూసే వారి ఖర్మ అంతే... కానీ ప్రకటనలతోనే చావగొట్టేస్తాడండీ ఇతను, తప్పించుకోవడం మహ కష్టం.

  నాగార్జున నెనర్లు, హ హ మీ వ్యాఖ్య అదిరింది :-)

  హరేకృష్ణ గారు నెనర్లు, హ హ మరే ఇతన్ని మాములుగా తిట్టకూడదు :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 15. హహహహహ్హ .....మీకు శత్రువు ఉన్నాడు అంటే ఎవరో అనుకున్నా... .....మీలాంటి వారికి కూడా కోపం తెప్పించడం లో సిద్దహస్తుడు ఓంకార్

  >>>>అప్పట్లో ప్రభాకర్‌ ఇప్పుడు ఓంకార్...<<<<<<
  నాగార్జున గారు మీ డైలాగ్ కెవ్వు కేక

  ప్రత్యుత్తరంతొలగించు
 16. baboyiiii ...అసలు వీడు ఏ జాతి కి చెందినవాడు ?
  వీడిని లేపెయ్యాలంటే ఏ నెంబర్ కి sms పంపాలో చెప్పి పుణ్యం కట్టుకోండి .

  ప్రత్యుత్తరంతొలగించు
 17. శ్రావ్స్ గారు నెనర్లు, హ హ ఆ నెంబర్ ఏదో తెలిస్తే మాఅందరికి కూడా చెప్పి పుణ్యంకట్టుకోండి :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 18. మీ టపాలన్నీ ఏకబిగిన చదివేస్తున్నా...నేను బ్లాగ్లోకానికి వచ్చి సంవత్సరం అవుతున్నా మీ బ్లాగు ఇప్పటిదాకా ఎలా చదవకుండా ఉన్నానో..మీ narration super...అన్నిటికీ కామెంటు పెడదామనున్నా మనకి మహా బద్దకంగా...కాని దీనికి మాత్రం పెట్టకుండా ఉండలేకపోతున్నా....ఎందుకంటే ఆ వంకరగాణ్ణి ద్వేషించేవాళ్ళల్లో నేను ముందువరసలో ఉంటా...అప్పట్లో ఆదిత్య మ్యూజిక్ అని ఛానెల్ ఉండేది..అప్పట్నించీ పట్టుకుంది తెలుగు ప్రేక్షకులకి ఈ శని..అదే తర్వాత జెమిని మ్యూజిక్ అయ్యింది....అప్పట్లోనే వీడి తెలుగు చూసి హైదరాబాదు వెళ్ళి మరీ వీణ్ణి కొట్టొద్దామనిపించేది...అప్పట్లోనే వీడికి సెటైరుగా అమృతంలో ఒక రెండు ఎపిసోడ్స్ వచ్చాయ్...భలే ఉంటాయిలే..."ఫోన్ కొట్టు సోది పెట్టు"అని...సూపర్...యాంకర్ మామూలుగా మాటాడుతున్నాడని వాడి నోట్లో ఏదో పెడతారు..ఒకచోటే నుంచుని మాటాడుతున్నాడని షూలో ఐస్ క్యూబ్స్ వేస్తారు..సూపర్ కామెడీలే...ఇక వాడిగుండా నేను టీవీ చూడటం తగ్గించేశా..వెధవ ఇలాంటి చెత్త ప్రోగ్రామ్స్ చేస్తున్నాడన్నమాట....అమృతం తర్వాత ఇన్నాళ్ళకి మళ్ళా నా కసి తీరింది వాడిమీద..హాయిగా నవ్వుకున్నా...ః)))....చాలా థాంక్స్...

  ప్రత్యుత్తరంతొలగించు
 19. కౌటిల్య గారు నెనర్లు,
  నా అదృష్టమేమో ఇతని మ్యూజిక్ చానల్ యాంకరింగ్ ఎప్పుడూ చూడలేదు. చూస్తే ఇంకెంత ద్వేషించే వాడ్నో... హ హ అలా నాలాంటి వారికందరికీ కసి తీరాలనే ఈ వీడియో అందరితో పంచుకున్నానండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. వేణూ,

  సీరియస్ పోస్ట్ ఒకరి రాసి ఇటు వచ్చి ఈ ఫన్నీ వీడియొ చూసి పడీ పడీ నవ్వుకున్నాను. వీడి మోహానికి ఆ క్లిప్పింగ్స్ అతికినట్లు సరిపోయాయి గా...

  ప్రత్యుత్తరంతొలగించు
 21. కల్పన గారు నెనర్లు, హహ మిమ్మల్ని నవ్వించగలిగినందుకు సంతోషం :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 22. asalu
  omakar chesina mistake yemiti?

  meerantha itlaa thidutunnaru.

  naakem artham kavatledu.
  meelo yevaraina naku reasons cheppandi.

  na id
  nagatejaswi@hotmail.com

  ప్రత్యుత్తరంతొలగించు
 23. veelainantha tvaragaa mee ans ivvandi.
  lekunte mee andarnee nenu
  "ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వలేని క్రూరులుగా" అనుకోవాల్సివస్తుంది

  ప్రత్యుత్తరంతొలగించు
 24. నేను అనుకొన్నది కరెక్టే

  మీరంతా ఈ బ్లాగు ఓనర్ తో సహా ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వలేని వారే

  ప్రత్యుత్తరంతొలగించు
 25. వేణు గారు ఇది మీ బ్లాగేనా ?:(

  ప్రత్యుత్తరంతొలగించు
 26. నాగతేజస్విని గారు.. మీకు అసలు ఓంకార్ ఎవరో తెలుసా.. అతను చేసిన ప్రోగ్రాంస్ ఏవైనా చూశారా.. అతని యాంకరింగ్ చూశారా.. మీకు నచ్చిఉంటే సంతోషం. ఆ విషయం చెప్పేసి వదిలేయండి. జీహ్వకోరుచి అని సరిపెట్టుకుంటాం.. ఇక్కడ తనని తిడుతున్నవారందరికీ అతని యాంకరింగ్, ఓవర్ యాక్షన్.. పోగ్రాంలు కూర్చేపద్దతి ఇవేవీ నచ్చక తిడుతున్నారు. వాళ్ళకామెంట్స్ లోనే ఈ విషయాలు మీరు గమనించవచ్చు.

  అయ్యా/అమ్మా అనానిమస్ గారు ఫలానా టైంలోపు జవాబివ్వకుంటే ఇదనుకుంటాం అదనుకుంటాం అని మీరు ఎవరిని బెదిరిస్తున్నారో నాకు అర్ధం కావడంలేదు. నా బ్లాగ్ ఫాలో అవుతూ కామెంట్ వచ్చిన మరుక్షణమే జవాబివ్వడం కన్నా ముఖ్యమైన పనులు ఇక్కడ వ్యాఖ్యానించిన వారికీ నాకూ కూడా చాలా ఉన్నాయి అని నా ఉద్దేశ్యం.

  ప్రత్యుత్తరంతొలగించు
 27. Hi Venu,

  Can you please give link for the video. It says it is removed because of copyright.

  ప్రత్యుత్తరంతొలగించు
 28. వేణుగారూ,
  దొంగలు పడ్డ ఆర్నెల్లకి అన్నట్టుగా మీటపా పెట్టిన ఆర్నెల్లతర్వాత ఈ వ్యాఖ్య రాస్తున్నా. వీడియోని చూడడానికి అవకాశం లేదు...టైమ్ దాటిపోయినట్టుంది. దయచేసి మళ్ళీ అప్ లోడ్ చెయ్యండి. చూసి ఆనందిస్తాం. ఓంకార్ దురభిమానుల్లో నేనూ ఉన్నాను....ఇంతకు ముందెక్కోడో చూసానే అనుకుంటూ ఉండేదాన్ని...ఆదిత్య మ్యూజిక్ ఛానెల్లోనా...వీడియో అప్ లోడ్ చెయ్యడం మరచిపోకండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 29. వేణుగారూ,
  దొంగలు పడ్డ ఆర్నెల్లకి అన్నట్టుగా మీటపా పెట్టిన ఆర్నెల్లతర్వాత ఈ వ్యాఖ్య రాస్తున్నా. వీడియోని చూడడానికి అవకాశం లేదు...టైమ్ దాటిపోయినట్టుంది. దయచేసి మళ్ళీ అప్ లోడ్ చెయ్యండి. చూసి ఆనందిస్తాం. ఓంకార్ దురభిమానుల్లో నేనూ ఉన్నాను....ఇంతకు ముందెక్కోడో చూసానే అనుకుంటూ ఉండేదాన్ని...ఆదిత్య మ్యూజిక్ ఛానెల్లోనా...వీడియో అప్ లోడ్ చెయ్యడం మరచిపోకండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 30. confused గారు, సుధగారు వీడియో లింక్ అప్డేట్ చేశాను ఇపుడు పనిచేస్తుంది చూడండి :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 31. నేను ఒప్పుకుంటా

  1.ఓంకార్ యాంకరింగ్ చాలా ఓవర్ గా ఉంటాది
  NO DOUBT

  2.ఓంకార్ ప్రోగ్రామ్స్‌ కూడా అంత సూపర్ గా ఏమి ఉండవ్

  ఇక్కడ కామెంట్ చేసిన 30 మందికి ఈ 2 విషయాలు బాగా తెలుసు.
  మరి అతని కార్యక్రమాలు నచ్చకపోతే TV కట్టేసి పడుకోండి
  or
  వేరే ఛానెల్ కి మారండి.

  ఆ మాత్రం దానికి ఇంత దారుణంగా తిట్టాలా!

  డబ్బులు ఓంకార్ వి.
  తనకి నచ్చినట్టు కార్యక్రమాన్ని డిజైన్ చేసుకొంటాడు.
  ఇంకా అతని కార్యక్రమాల్ని తెలుగు ఛానెల్స్ ఏం చూసి తీసుకుంటున్నాయి.

  ప్రకటనలు ఇచ్చేవాళ్ళు మీ 30 మంది అసహ్యించుకొంటునారని యాడ్స్‌ ఇవ్వడమే మానేసారా!

  ఇలాంటి ఓంకార్ కి బుద్థి రావాలంటే తిట్టడం కాదు.
  మీ 30 మంది తలా ఒక 100 రూపాయలు వేసకొని ఒక కార్యక్రమాన్ని చేయండి.
  మీలో ఒకరే యాంకరింగ్ చేయండి.
  ఏ ఛానల్ కైనా అమ్మండి.
  program ante itla undalani omkar ki prabhakar ki teliyacheyandi.


  TV annaaka chala progrmas vastay.
  avnnee chudalani rule unda?.

  nachithe chudandi.
  nachakapothe tv kattesi haiga padukondi.

  anthe gaani yevarino yenduko thitte hakku manaki yevaru icharu.

  deshaanni dochuku tine politicians,
  ugravaadulu
  itlaanti vaari meeda meeru tapaa lu raayandi.

  anthe gaani yedo 1 hour entertainamenu kosam programs chesukune vaalla meeda kaadu.

  ap lo minimum prajalu omakar programs chustaru.
  i am sure.
  lekapothe inni programs omkar or prabhakar cheyaleru.

  nenu cheppindi 100% correct.
  ademante
  మీరంతా ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వలేని వారే.

  roju ki okkasaraina omkar tv lo kanpistadu.
  bahusa itla kanpichadame meeku nachatledemo.


  and meeroka maata annaru.
  meeku chala panulu unnaayani.

  mari panulu unte ,aa panule chesukovachu kadaa.
  yevvarakee ye maatram upayogapadani oka worst topic ni raasi janam meeda rudddu tunnaaru.

  prapamchanni peedustundi
  OMKAR anna level lo,
  idedo ugravaadam laanti prmaadakaramaina vishayamga raasaru.

  intha kante manchi topics leva?

  cheduga anipiste daani gurinchi maatladu kovadam yenduku.
  manchi gurinche maatladukundaam.
  .

  namaste

  ప్రత్యుత్తరంతొలగించు
 32. వేణూ శ్రీకాంత్ గారు,
  కూడలిలో కామెంట్ పట్టుకుని ఇక్కడకొచ్చి మొత్తం చదివేసి, వీడియో చూసి ఎంజాయ్ చేసాను. నాకు టివి నాలెడ్జ్ తక్కువ కాబట్టి ఓంకార్ అంటే ఎవరో నాకు ముందు తెలియలేదు. తమాషా ఏంటంటే, మీరు విరామానికి విరామం ప్రకటించేసి కొత్తగా రాసారేమో అనుకున్నాను. తిరగేసి తేదీలు చూస్తే తెలిసింది ఇది పాత టపా అని.
  Am I looking confused! Omkar mahima. anyways, come back and keep writing.

  ప్రత్యుత్తరంతొలగించు
 33. అనిర్విన్ గారు నెనర్లు, ఇంకాలేదండీ.. నే విరామానికి విరామం ప్రకటించలేదు. ఎవరికో నామీదో ఓంకార్ మీదో అభిమానం ఎక్కువై ఈ టపాను బయటకులాగారు అంతే :-) వీడియో చూసి ఎంజాయ్ చేసినందుకు సంతోషం.

  ప్రత్యుత్తరంతొలగించు
 34. అఙ్ఞాత గారు నాకు తెలిసి ఇక్కడ ఎవరూ ఇతని కార్యక్రమాలను పనికట్టుకుని చూసి కామెంట్ చేసి ఉండరు. వేరే కార్యక్రమాల మధ్యలో ఐదునిముషాలకు ఒకసారి ప్రసారం చేసే ఇతని కార్యక్రమాల తాలూకూ దిక్కుమాలిన ప్రోమోస్ లో ఈ వ్యక్తి అకృత్యాలకు బలయిన వారే ఎక్కువ.
  అయినా మీరు ఒక్క నయాపైసా కూడా చెల్లించకుండా చదివే నా బ్లాగ్ లో నేనేం రాయాలో చెప్తూ నేను రాసిన వాటిని విమర్శిస్తున్నారు మరి మేము డబ్బులు ఇచ్చి సబ్ స్క్రైబ్ చేసి చూసే టీవీ ఛానల్లో ఇలాంటి దిక్కుమాలిన ప్రోగ్రాంస్ ను వాటి ప్రమోస్ నూ ప్రసారంచేస్తున్నందుకు విమర్శించే హక్కు మాకుకూడా ఉంటుంది కదండీ.. ఇంత చిన్న లాజిక్ మీరెలా మిస్ అయ్యారు.
  నేనో ఇక్కడ వ్యాఖ్యలు రాసే వారో ఒక కార్యక్రమం తీసి చూపక్కర్లేదు టీవీల్లో వచ్చే మంచి కార్యక్రమాలు చాలానే ఉన్నాయి.. బుద్దుంటే వాటిని చూసి నేర్చుకోవచ్చు అతను.
  ఒక్కసారి పౌరహక్కులచట్టాన్ని తిరగేయండి ఇతనిని తిట్టే హక్కు ఎవరిచ్చారో అర్ధమౌతుంది.
  మీకు నచ్చే టాపిక్స్.. సీరియస్ టాపిక్స్.. మీదృష్టిలో మంచి టాపిక్స్ రాసే బ్లాగ్స్ చాలానే ఉన్నాయి.. కనుక మీరు నాకు ఛానల్ మార్చుకోమని సలహా ఇచ్చినట్లుగానే మీరు ఈ బ్లాగ్ విండో మూసేసి హాయిగా మీకు నచ్చిన బ్లాగ్స్ చదువుకోండి నామానాన నన్ను వదిలేయండి.
  ఆ వ్యక్తి నన్ను పెట్టిన హింసకు ప్రతిగా నా అక్కసు నా బ్లాగ్ లో వెళ్ళబోసుకుంటూనే ఉంటాను.. నచ్చినవాళ్ళు నాతోపాటు హింసకు గురి కాబడిన వాళ్ళు వాళ్ళ ఆక్రోశాన్ని సైతం కామెంట్ల రూపంలో ఇక్కడ వెళ్ళబోసుకుంటారు.
  టాపిక్ ఈజ్ ఓవర్ !! ఇకపై ఈ విషయమై అఙ్ఞాతల కామెంట్లు ప్రచురించను.. ఈ విషయమై మీరింకా ఏమైనా చెప్పాలనుకుంటే మీ బ్లాగ్ ఉపయోగించుకోండి..

  ప్రత్యుత్తరంతొలగించు
 35. అఙ్ఞాత గారు, శ్రీకర గారు, నాగతేజస్వి గారు మీ కామెంట్స్ పబ్లిష్ చేయడం ద్వారా మరో వివాదానికి నా బ్లాగును వేదిక చేయడం ఇష్టంలేక మీ వ్యాఖ్యలను ప్రచురించడంలేదు. ఐతే మీకు కలిగిన సందేహాలను నివృత్తి చేయడం ఈబ్లాగ్ ఓనర్ గా నా బాధ్యత కనుక ఈ క్రింది సమాధానం ఇస్తున్నాను.
  నాకూ ఓంకార్ కూ వ్యక్తిగతమైన పరిచయంలేదు..
  బ్లాగులు అలాగే పని చేస్తాయి.. బ్లాగులంటే ఇవే..
  బ్లాగ్ లో వచ్చే కొత్త టపాలు మాత్రమే కాదు కొత్త వ్యాఖ్యలు సైతం సంకలిని లోని ప్రత్యేకమైన పేజ్ లో కనిపిస్తాయి. కనుక ఇది వరకు చదవని టపాలలో వ్యాఖ్యలు సంకలినిలో కనిపిస్తే అవి ఎంత పాత టపాలైనా వెళ్లి చదివి నచ్చితే స్పందించే అలవాటు సగటు బ్లాగర్లకు ఉంటుంది. నేనూ అలా మిస్ అయిన పాత టపాలు చదివిన సంధర్బాలు అనేకం ఉన్నాయి. సంకలినుల గురించి తెలుసుకోవాలంటే ఈ బ్లాగ్ పేజ్ లో చివర ఉన్న మాలిక, కూడలి, జల్లెడ, హారం అని ఉన్న లింక్స్ పై క్లిక్ చేయండి.

  ప్రత్యుత్తరంతొలగించు

పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీకామెంట్ రెండు వారాలకు ముందు ప్రచురించిన టపాలో ఐతే పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. Google Chrome Browser లో కామెంట్స్ పబ్లిష్ అవడంలేదు అని కంప్లైంట్ వచ్చింది. సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.