మిత్రులందరికీ వినాయక చవితి మరియూ రంజాన్ శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయురారోగ్యఐశ్వర్యాలతో సదాకాపాడుగాక. రెండు పండుగలు ఒకే రోజు రావడంతో ఊరంతా పండుగ వాతావరణం, ఎక్కడచూసినా కొత్తబట్టల రెపరెపలు బంధుమిత్రుల కోలాహలం చూడటానికి కనులకింపుగా చాలా బాగుంది. ఇదివరకు పండుగ రోజు బయటకి వెళ్తే కొన్ని వీధులు కళకళలాడుతూ కొన్ని వెలవెల బోతూ కనిపించేవి కానీ ఈ రోజు చాలా చోట్ల సందడే. ఈ రెండు పండుగలతోనూ నెలవంక ముడిపడి ఉండటం ఇంకో విశేషం, కాకపోతే ఒకరు నెలవంకని చూడద్దంటే ఇంకొకరు చూశాకే పండుగ చేసుకొమ్మంటారు అది వేరే విషయం అనుకోండి.
పోయినేడు అనుకుంటాను వినాయకచవితి రోజు ఏదో పనిమీద సాయంత్రం ఆఫీస్ కి వెళ్ళి కాస్త ఆలశ్యంగా తిరిగి వస్తూ ఓ ముస్లిం సోదరుని ఆటో ఎక్కాను. అతను నేను రోజూ వెళ్ళే దార్లో కాకుండా కాస్త జనసమ్మర్ధం ఉండే చుట్టూ తిరిగి వెళ్ళే దారిలో తీసుకుని వెళ్తున్నాడు. "ఏంటి సోదరా ఈ రూట్ ఎంచుకున్నావ్?" అని అడిగితే "ఈ రోజు వినాయక చవితి కదా భయ్యా అసలే ఆ రూట్ నిర్మానుష్యంగా ఉంటుంది నేను ఒక్కడ్నే దొరికితే ఇక అంతే" అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను "ఛా ఊరుకోవోయ్ మనం బెంగళూరులో ఉన్నాం ఇక్కడ అలాంటి గొడవలు ఎప్పుడూ చూడలేదు ఉండవేమో కదా" అని అంటే అతను "లేదు సార్ ఈ ఏరియా విలేజే కదా ఇక్కడ వినాయకచవితి రోజు రాత్రికి ముస్లింల మీద రంజాన్ రోజు రాత్రి హిందువుల మీద దాడి చేస్తారు, మామూలు వాళ్ళకి ఏం ఉండదు కొందరు రౌడీ బ్యాచ్ ఉంటారు వాళ్ళు మందుకొట్టి వచ్చి ఎవడన్నా ఒంటరిగా దొరికితే పండగ చేసుకుంటూ ఉంటారు" అని చెప్పాడు. నేను ఔరా అనుకుని అతను క్షేమంగా ఇల్లు చేరాక ఒక మిస్ కాల్ ఇవ్వమని చెప్పి నా ఇంటికి చేరుకున్నాను. బహుశా ఈ ఏడు రెండు పండగలు ఒకే రోజు రావడం వల్ల ఎవరికి వారు పండుగ చేసుకుని ఎదుటి వాళ్ళు కూడ మంచి జోష్ మీదుంటారులే అని గొడవలు లేకుండా కామ్ గా ఉండవచ్చు అనుకుంటున్నాను.
కానీ ఈ రెండు పండుగలు ఒకే రోజు రావడం వల్ల ఒక చిన్న నష్టం కూడా ఉంది, అదేంటో చెప్తా కానీ వీడు తిండి గోల ఎత్తకుండా ఏ టపా ముగించడు కదా అని నన్ను తిట్టకండేం. నిజానికి ఈ రెండు పండుగలలో కూడా తిండికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదా. చిన్నతనంలో ఎప్పుడూ మా ఇంటి ఎదురుగానో లేక దగ్గరలోనో తప్పని సరిగా ఒక ముస్లిం కుటుంబంతో మాకు అనుభందం ఉండేది. నర్సరావుపేటలో ఉన్నపుడు భాషా వాళ్ళు మా ఎదురింట్లోనే ఉండేవాళ్ళు రంజాన్ రోజు వాళ్ళు సేమ్యా పాయసం బిర్యానీ మరికొన్ని వంటకాలు మా ఇంటికి పంపిస్తే వినాయక చవితి రోజు గారెలు పులిహోర, పొంగలి, పూర్ణాలు, ఉండ్రాళ్ళు ఇత్యాది వంటలు వాళ్ళకు పంపించే వాళ్ళం. ఇలా ఒకే రోజు రావడం వల్ల మనకు నాన్వెజ్ బిర్యానీ టేస్ట్ చేసే అవకాశం ఉండదు కదామరి పాయసంతోనే సరిపెట్టుకోవాలి.
ఇంక ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళే అలవాటు ఉన్నవారు అయితే ఈ ఏడు బహుశా ఆ అలవాటు వాయిదా వేసుకోవలసిందే. కావాలంటే లంచ్ ఒకచోట డిన్నర్ ఒకచోట కానిచ్చేయచ్చనుకోండి. నాకు వాళ్ళింటి బిర్యానీ కానీ పాయసం కానీ ప్రత్యేకమైన రుచితో ఉండి చాలా నచ్చేవి. నాకు చిన్నప్పటినుండీ సగ్గుబియ్యంతో చేసే పాయసం చాలా ఇష్టం, గ్లాసులు గ్లాసులు నిర్మొహమాటంగా తాగేస్తాను సేమ్యాఖీర్ అంతగా ఇష్టం ఉండదు. కానీ అదేంటో వాళ్ళు ఇచ్చే ఖీర్ లో సగ్గుబియ్యం లేకపోయినా ఒక ప్రత్యేకమైన రుచితో చాలా బాగుండేది. ఇంకెక్కడ ఎన్ని చోట్ల తాగినా ఆ రుచి ఎక్కడా తగలలేదు. ఇదేమాట భాషా వాళ్ళ అమ్మగారితో అంటే ఈ సేమ్యా ఈద్ కోసం ప్రత్యేకంగా చేతి మిషన్ తో తయారు చేస్తారు అందుకేనేమో బహుశా ఆరుచి అని నవ్వేసేవారు.
మరోసారి మిత్రులందరికీ వినాయక చవితి మరియూ రంజాన్ శుభాకాంక్షలు.
టపా చదివిన ఓ స్నేహితుడు ఇప్పుడే చిన్న అనుమానం లేవనెత్తాడు. అతని సందేహం ’పండగ’ కరెక్టా ’పండుగ’ కరెక్టా అలాగే ’మిత్రులు’ కరెక్టా లేక ’మితృలు’ కరెక్టా. గూగులమ్మని అడిగితే రెండు వాడుకలకు పుట్టెడు ఉదాహరణలు చూపించింది. సో నాకు ఎలా వాడినా కరెక్టేనేమో అనిపించింది మీరేమంటారు ?
ఫోటోలు ఇక్కడ మరియూ ఇక్కడ నుండి సంగ్రహించబడినవి వారికి ధన్యవాదములు.
కుహు కుహూ.. కూసే..
-
డబ్బు డబ్బు డబ్బు చిత్రంలోని ఒక మధురమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట
ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
ఎంబెడెడ్ వీడి...
3 సంవత్సరాల క్రితం
hi venu ,
రిప్లయితొలగించండిchala baga rasavu ...!
:-)
vinayaka chavithi subhakankhalu
మీకు, మీ కుటుంబానికి
రిప్లయితొలగించండివినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు
వినాయకచతుర్థి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిటపా చదివిన ఓ స్నేహితుడు ఇప్పుడే చిన్న అనుమానం లేవనెత్తాడు. అతని సందేహం ’పండగ’ కరెక్టా ’పండుగ’ కరెక్టా అలాగే ’మిత్రులు’ కరెక్టా లేక ’మితృలు’ కరెక్టా. గూగులమ్మని అడిగితే రెండు వాడుకలకు పుట్టెడు ఉదాహరణలు చూపించింది. సో నాకు ఎలా వాడినా కరెక్టేనేమో అనిపించింది మీరేమంటారు ?
రిప్లయితొలగించండిసావిరహే గారు, హరేకృష్ణ గారు, పద్మార్పిత గారు నెనర్లు. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండివేణూ శ్రీకాంత్ గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిహారం
వినాయక చవితి,రంజాన్ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిమీకు, మీ కుటుంబానికి
రిప్లయితొలగించండివినాయక చతుర్థి శుభాకాంక్షలు Venu garu :)
వినాయక చవితి శుభాకాంక్షలు బ్రదర్...
రిప్లయితొలగించండివేణు గారు,టపా చాలా బాగుంది...వినాయక చవితి శుభాకాంక్షలండీ...
రిప్లయితొలగించండిభాస్కర రామిరెడ్డి గారు, పరిమళంగారు, సృజన&గీతాచార్య, స్నిగ్ద గారు నెనర్లు, మీకు కూడా శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిమీరిలా కొత్త కొత్త డవుట్లు పెట్టకండి సార్.. చిలుక కరెక్టా,చిలక కరెక్టా అని నిన్న నేనూ ఆలోచించాను
రిప్లయితొలగించండి..బాగా రాసారు ..అమ్మొ అలా కొట్టుకుంటారా పండగలప్పుడు... హుం ... పండుగ శుభాకాంక్షలు :)
హ హ చిలక కన్ఫ్యూజన్ నాకు కూడా ఉంది నేస్తం :) హుం ఈ లిస్ట్ కి అంతే ఉండదేమో... మీకు కూడా శుభాకాంక్షలు. నిజమే ఏదో పల్లెల్లో ఇలా గొడవలుపడతారు అని తెలుసు కానీ బెంగళూర్లో ఊహించలేదు.
రిప్లయితొలగించండినిజమేనండీ ఒకే రోజు రెండు పండుగలు వస్తే మీరు చెప్పినట్టే ఉంటుంది ..మా ఇంటి దగ్గర కూడా ఇలాగే జరిగింది... ,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలండీ...
రిప్లయితొలగించండిఈసారి రెండు పండుగలు రావడం నాకు చాలా exciting గా అనిపించింది. కొట్టుకుంటారని మాత్రం తెలీదు సుమండీ. రెండు మతాలవారూ ఒకేరోజూ ఆనందంతో సంబరాలు చేసుకోవడం బావుంది. కానీ ఈ నెలవంక చూడడం, చూడకుండా ఉండడం గురించి నాకు తట్టనేలేదు సుమండీ....మీరు మంచి point చెప్పారు.
రిప్లయితొలగించండిపండుగ, మితృడు కరక్ట్.
ఇంకో సవరణ మీరు రెండు చోట్ల "ఈ ఏడు" అని రాసారు అది తప్పు. "యేడు" అని రాయాలి. "యేడాది" అనేది సరి అయిన పదం ఏడాది కాదు.
ఇది నా అవగాహన, తప్పని పెద్దలెవరైనా చెబితే సరిదిద్దుకుంటాను
శివరంజని గారు నెనర్లు, మీకు కూడా వినాయకచవితి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఆ.సౌమ్య గారు నెనర్లు, నేను కొన్ని తెలుగు నిఘంటువులు, ప్రింట్ మీడియా కూడా వెతికిన తర్వాత పండుగ, మిత్రుడు, ఏడు కరెక్ట్ అని ఫిక్స్ అయ్యానండి. సంవత్సరానికి అంకెకి ఒకే పదం అని ఇదివరకు మా మాష్టారు కూడా అన్నట్లు గుర్తు. ఏడు అన్న వాడుక సరిఐనదే అనుకుంటున్నాను. చూద్దాం మరింకెవరైనా చెప్తారేమో.
"ఏడాది" సరి అయిన పదమండీ, ఇప్పుడే బ్రౌణ్యంలో చూసాను. నేనే తప్పు....ఈ పాలికి సెమించేయండి :)
రిప్లయితొలగించండిఅయ్యో అంతపెద్ద మాటలెందుకండీ, నాకూ ఇలాంటి తికమకతికలు బోలెడు :)
రిప్లయితొలగించండివేణూ గారూ చాలా బాగుంది మీరు మీ అభిప్రాయాల్ని పంచుకున్న తీరు. మీ బ్లాగ్ ఒపెన్ చెయగానే virus వుంది అని వస్తొంది. ఒపెన్ చేయవద్దు అని anti virus సలహా కుడా వస్తోంది.
రిప్లయితొలగించండిPBVSN రాజు గారు ఏమోనండీ నాకు వైరస్ అలర్ట్ ఏమీ రావడంలేదు అలా. వేరే సిస్టం నుండి కూడా చూశాను.
రిప్లయితొలగించండిavunu virus threat ravatam ledu.
రిప్లయితొలగించండిదసరా శుభాకాంక్షలు .
రిప్లయితొలగించండిమాల గారు నెనర్లు, మీకు కూడా దసరా శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిహ్మ్..ముస్లింలు రంజాన్ కి చేసుకునే ఆ స్వీట్ ని "షీర్ కుర్మా" అంటారు..చాలా డిఫరెంటుగా ఉంటుంది..చేసె విధానం కూడా వేరు...మా క్లాసుమేటు ఒకమ్మాయి ఎప్పుడూ ఇచ్చేది...బాగా లాగించేవాణ్ణి..ః))
రిప్లయితొలగించండి