నేను ఇంజనీరింగ్ చదివే రోజులలో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్స్ పరం గా హిట్ అవునో కాదో గుర్తు లేదు కాని అప్పటి యువత హృదయాలలో మాత్రం బాగానే చోటు సంపాదించుకుంది. ఈ సినిమా లో కొన్ని పాటలు ప్రత్యేకించి ఈ పాట సిరివెన్నెల గారి సాహిత్యానికి అందమైన సంగీతం తోడై వినడానికి చాలా బావుంటుంది one of my all time favorites. ఈ పాట మరియూ సాహిత్యం మీ కోసం. ఈ పాట వినడానికి కింద play button click చేయండి లేదా ఈ సినిమాలో పాటలు అన్నీ వినడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చిత్రం : సొగసు చూడ తరమా
సంగీతం : రమణి ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : కె.జే.యేసుదాస్
సొగసు చూడ తరమా !..
సొగసు చూడ తరమా.. నీ సొగసు చూడ తరమా..
మరుని నారి, నారి గ మారి.. మదిని నాటు విరిశరమా...
||సొగసు చూడ||
సొగసు చూడ తరమా !..
హే..హె.... హే..హే..హె...
కులుకే సుప్రభాతాలై.. కునుకే స్వప్న గీతాలై..
ఉషా కిరణమూ... నిషా తరుణమూ...
కలిసె కలికి మేనిగా రతి కాంతుని కొలువుగా,
వెలసే చెలి చిన్నెలలో....
సొగసు చూడ తరమా !!
పలుకా చైత్ర రాగాలే, అలకా గ్రీష్మ తాపాలె,
మదే.. కరిగితే... అదే.. మధుఝరీ...
చురుకు వరద గౌతమీ... చెలిమి శరత్ పౌర్ణమీ,
అతివే.. అన్ని ఋతువు లయ్యే....
సొగసు చూడ తరమా.. నీ సొగసు చూడ తరమా..
మరుని నారి, నారి గ మారి.. మదిని నాటు విరిశరమా...
||సొగసు చూడ||
సొగసు చూడ తరమా !...
సంగీతం : రమణి ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : కె.జే.యేసుదాస్
సొగసు చూడ తరమా !..
సొగసు చూడ తరమా.. నీ సొగసు చూడ తరమా..
మరుని నారి, నారి గ మారి.. మదిని నాటు విరిశరమా...
||సొగసు చూడ||
సొగసు చూడ తరమా !..
హే..హె.... హే..హే..హె...
కులుకే సుప్రభాతాలై.. కునుకే స్వప్న గీతాలై..
ఉషా కిరణమూ... నిషా తరుణమూ...
కలిసె కలికి మేనిగా రతి కాంతుని కొలువుగా,
వెలసే చెలి చిన్నెలలో....
సొగసు చూడ తరమా !!
పలుకా చైత్ర రాగాలే, అలకా గ్రీష్మ తాపాలె,
మదే.. కరిగితే... అదే.. మధుఝరీ...
చురుకు వరద గౌతమీ... చెలిమి శరత్ పౌర్ణమీ,
అతివే.. అన్ని ఋతువు లయ్యే....
సొగసు చూడ తరమా.. నీ సొగసు చూడ తరమా..
మరుని నారి, నారి గ మారి.. మదిని నాటు విరిశరమా...
||సొగసు చూడ||
సొగసు చూడ తరమా !...
నాకెందుకో ' సొగసు చూడ తరమా ' అనగానే మొదట గుర్తొచ్చేది 'మిస్టర్ పెళ్ళాం ' లోని పాట. I was so fascinated about that song !
రిప్లయితొలగించండిమొదట 'లాఠీ ' సినిమా చూడగానే అనుకున్నాను, సినిమాలో లోపాలున్నా, టెక్నికల్ గా ఈ డైరక్టర్ బాగా తీసాడు అని. తరువాత మీరు చెప్పినట్టు ఈ 'సొగసు చూడ తరమా ' లో ఫొటొగ్రఫీ కాని, ఆర్ట్ వర్క్ కానీ, సున్నితమైన భావాలు కానీ డైరక్టర్ టేస్ట్ ని తెలిపాయి. 'యమలీల 'లో ఇంద్రజ కి, 'సొగసు చూడతరమా 'లోని ఇంద్రజ కి ఎంతో వైవిధ్యం !
Though this movie is based on hollywood flick 'Indecent proposal', Guna Sekhar made this movie well.
మీ క్రొత్త టెంప్లేట్ చాలా బాగుంది వేణూ. It looks pleasant and nice to read. !
రిప్లయితొలగించండి:)
Thanks about the template Venu ji, i am glad you liked it Ya even font is little bigger and easy to read now.
రిప్లయితొలగించండిఅవును రెండు పాటలూ ఇంచు మించు ఒకే సమయం లో వచ్చాయి కానీ యేసుదాస్ గారి గొంతు వల్ల నాకు ఈ పాటే ఎక్కువ గుర్తొస్తుంటుంది. నేను ఆయన అభిమానిని అవడం ఒక కారణమేమో. మిస్టర్ పెళ్ళాం పాట లో తెలుగుదనం ఇంకా ఎక్కువ ఉట్టి పడుతుంది లేండి ఎంతైనా బాపు గారి ఛాయిస్ కదా...