ఆదివారం, జులై 06, 2008

పైనాపిల్

నిన్న మా వైష్ణవి పేల్చిన ఇంకో మంచి జోక్ గురించి చెప్పడం మర్చిపోయానండీ... here it is

వైషు: అమ్మా టేబుల్ పైన అదేంటి ..?

అమ్మ: ఓ అదా...అదీ..పైనాపిల్ (pineapple) రా...

వైషు: అవునా...(ఓ నిముషం అలా వెళ్ళివచ్చి)

వైషు: "అమ్మా నాకు పైనాపిల్ కావాలి ఇంకా కిందాపిల్ కూడా కావాలి..."

అమ్మ: !!!!...:-)

పైనాపిల్ ని పైన ఆపిల్ గా విడగొట్టేయడమే కాకుండా దానికి కింద ఆపిల్ అని కౌంటరు కూడా వేసేసిన మా వైషు తెలివికి అవాక్కవడం తప్ప మేమేం చేయగలం చెప్పండి.

-- మీ వేణు

3 వ్యాఖ్యలు:

  1. వేణూ,ఇప్పుడే చూస్తున్నా ఈ టపా! మా పాప కూడా ఒకసారి రెస్టారెంట్ లో మేము పైనాపిల్ జూస్ ఆర్డర్ చేస్తే "మీరిద్దరూ పైనాపిల్ తెప్పించుకుని నాకు కిందాపిల్ జూస్ చెప్పండి"అనేసరికి ఏమనాలో తోచలేదు.

    ప్రత్యుత్తరంతొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.