శుక్రవారం, జులై 11, 2008

మా బేబీ ఖాన్ కబుర్లు...

:-) నేను చెప్ప బోయేది నా ఇంజినీరింగ్ క్లాస్ మేట్ బేబీ గురించి. వాడ్ని బేబీ అనీ ఖాన్ అనీ ఎవడి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పిలచే వాళ్ళు. వాడికి ఆ నిక్ నేం ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో గుర్తు లేదు, చూడటానికి కొంచెం సినీ హీరో శ్రీకాంత్ లా ఉంటాడు (అంటే బూతద్దం పట్టుకుని వెతికితే కాసిన్ని పోలికలు కనబడతాయ్ లెండి) కాస్త పొట్టిగా బుజ్జి గా ఉంటాడు అందుకే ఆ పేరు వచ్చిందనుకుంటా. మనిషి చాలా మంచోడు సరదాగా అందరితో కలిసిపోయి ఎవరికన్నా హెల్ప్ కావాలి అంటే అందరికన్నా ముందు ఉంటాడు. కాకపోతే ప్రతీ గుంపు లోను ఒకడు బకరా కావాల్సిందే కదా మా వాడు ఆ కేటగరీ అనమాట అదీ కాక వాడు చేసే పనులు కూడా అంతే ఉంటాయ్...

అంటే బేబీ కి ముందు పేరుంటుంది కానీ అది కూడా చెప్పేస్తే "ఏంటి మావా!! నన్నిలా అన్‌పాపులర్ చేస్తున్నావ్" అంటాడు అని చెప్పకుండా వదిలేస్తున్నా.. మా వాడు అప్పట్లోనే అంటే మాకెవరికీ ఐశ్వర్యా రాయ్ గురించి పెద్దగా తెలీక ముందే తన పోస్టర్ తెచ్చి రూం లో అంటించుకున్న కళాపోషకుడు కూడా. వాడికి ఓ పాత స్కూటర్ ఉండేది మా ఫ్రెండ్స్ లో అది డ్రైవ్ చేయని వాడు ఉండే వాడు కాదు డ్రైవింగ్ వచ్చినవాడు రాని వాడు అని లేకుండా అందరూ ట్రయల్స్ వేసే వాళ్ళు. ఇక దీని పై ట్రిపుల్స్ (ముగ్గరమూ భారీ కాయులమే) వెళ్తుంటే చూడాలి...పాపం అది బ్రతుకు జీవుడా అనుకుంటూ అష్ట కష్టాలు పడుతూ వెళ్తుండేది...

సాధారణం గా వైజాగ్ సిరిపురం జంక్షను లో ఎప్పుడూ పోలీసులు ఉండే వారు. సో ముగ్గురిలో ఒకళ్ళు ముందే దిగి నడుచుకుంటు వెళ్ళి జంక్షను దాటాక మళ్ళీ ఎక్కే వాళ్ళం. పోలీసు మమ్మల్నిలా గమనించాడేమో ఓ రోజు మాకు పోలీస్ ఎవరూ కనిపించ లేదు ఆహా!! పదరా మామ ఎవరూ లేరు అనుకుని వెళ్తుంటే పక్క నుండి సడన్ గా ఊడి పడ్డాడు... మా వాడు వదుల్తాడా నేనేనా తక్కువ తింది అని బండి ని ముప్పైనాలుగు వంకర్లు తిప్పి ఇంచు మించు మమ్మల్ని పడేసినంత పని చేసి ఎలా అయితేనేం ఫైన్ భారి నుండి తప్పించాడు.

మా వాడికి పాటలు అంటే కూడా చాలా ఇష్టం కాకపోతే పాట సాహిత్యానికీ స్వరానికీ మధ్య లంకె గుర్తు పెట్టుకోడం కాస్త కష్టం. దాంతో శంకరాభరణం పాటని ప్రేమికుడు లో "ముక్కాబ్‌లా... స్టైల్ లోనూ ఈ పాటని దేవదాసు లోని "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..." స్టైల్ లోనూ పాడుతుండే వాడు. ఓ సారి ఏదో కాంపిటీటివ్ పరీక్ష వ్రాయడానికి అందరూ ట్రైన్ లో హైదరాబాద్ ప్రయాణమయ్యారు. మరి యూత్ ట్రైన్ ఎక్కితే ఏదో ఒకటి చెయ్యాలి కదా అప్పట్లో అంత్యాక్షరి ఇంకా ఫ్రెష్ గా ఉన్న ఆటలలో ఒకటి సో అందరు అంత్యాక్షరి ఆడుతుంటే "గ" అనే అక్షరం వచ్చింది. మా వాడికి ఉన్నట్లుండి ఏమైందో ఒక్క సారి "మామా నేను పాడతా..." అని మొదలెట్టాడు... "గొహ్...దా...రీగ...ట్టుందీ...." అని ఏదో పాడాడు... అంతే ఓ పది సెకన్లు భయంకరమైన నిశ్శబ్దం...వాడి పదాలు అర్ధం చేసుకోడానికి అంత టైమ్ పట్టిందనమాట.

ఒకటి రెండు పదాలు పాడాడు (మా మీద దయతో సాధారణం గా వాడు అంతకన్నా పాడడు లెండి...) వాడి పాటలో కొన్ని పదాలు అర్ధమయ్యాయి కాని ఎవ్వరికీ ఆ పాట అసలు ట్యూన్ గుర్తు రాలేదు అంతగా పక్కన ఉన్న వాళ్ళ మెదళ్ళు కరప్ట్ అయిపోయాయి... మాఫ్రెండ్స్ అందరికీ వాడి షాక్ లు అలవాటే కదా...సో ఇదేదొ పాత పాట చాలా బావుంటుంది అని సరైన ట్యూన్ కోసం నింపాదిగా కుస్తీ పడుతున్నారు....కానీ అప్పటి వరకు పక్కనే కూర్చుని అంత్యాక్షరి ఎంజాయ్ చేస్తున్న ఓ నడివయసు పెద్దాయన అవస్థ చూడాలీ...మాటల్లో వర్ణించ లేం ఆయన పాపం నెత్తీ నోరు కొట్టుకుంటూ "సార్ ఈ పాట నాకు చాలా ఇష్టమైంది సార్.... అసలు నేను ఈ పాట ట్యూన్ మర్చి పోడమేంటి సార్... అయ్యో!! చాలా మంచి పాట సార్... గుర్తు రావడం లేదు సార్... అని నానా హైరానా పడ్డారు...కాసేపు శాంతించండి అదే వస్తుంది ఇది మాకలవాటే అని ఎవరెంత చెప్పినా పాట దొరికే వరకు ఊరుకో లేదు.

మీరంతా మా వాడి పాట వినే అదృష్టనికి నోచుకోక, నే రాసింది చదువుతున్నారు కాబట్టి ఈ పాటికే మీకు పాట ఏంటి అనేది అర్ధం అయి ఉంటుంది, ఒక వేళ అర్ధం కాకపోతే అది మూగ మనసులు సినిమా లోని "గోదారి గట్టుందీ.... గట్టుమీదా చెట్టుందీ.." అనే పాట అనమాట.

ఇంకా మా బేబీ చాలా పెద్ద manipulator, గుర్తున్న నాలుగు పదాలని ఏదో ఓ పాట ట్యూన్ లో ఇరికించి పాడేసినట్లే మతలబులు చేయడం లో ముందుంటాడు. మేమంతా ఇంజనీరింగ్ 3 వ సంవత్సరం లో industrial tour పేరుతో దేశాటనకి వెళ్ళినప్పుడు ట్రైన్ లో రిజర్వేషన్ ప్రాబ్లం వస్తే మావాడే ఎలాగో TC ని మేనేజ్ చేసి ఏదో రకం గా కనీసం ఓ నాలుగైదు బెర్త్ లైనా సంపాదించేవాడు. ఎలా చేసావ్ మావా అంటే ఏముంది మామా ఎవరికీ కనపడకుండా TC చేతిలో వందో యాభయ్యో పెట్టేయడమే అనే వాడు.

ఓ సారి నార్త్ ఇండియా లో ఏదో ఊర్లో ట్రైన్ బాగా రష్ గా వుంది మా టిక్కెట్స్ కన్‌ఫర్మ్ అవ లేదు, రిజర్వేషన్ బోగీ లో కూడా జనరల్ కంపార్ట్‌మెంట్ లాగా నిండుగా ఉన్నారు జనం... మా వాడు ఇంకో ఇద్దరం TC వెనకాల తిరిగి మిగిలిన ఫ్రెండ్స్ అందరం ఉన్న చోటికి వచ్చాం మన వాడు మంచి manipulation మూడ్ లో ఉన్నాడు చూస్తే నేమో బెర్త్ నిండా హిందీ జనం... వాళ్ళతో హిందీ లోనే మాట్లాడాలి మన వాడి హిందీ అంతంత మాత్రం...దాంతో బెర్త్ కి ఒక అంచున కూర్చోడానికి సిద్ద పడుతూ... "జర జరుగూ భాయ్..." అన్నాడు మేమంతా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళం చూసుకుని నవ్వుకుంటుంటే ఓ క్షణమాగాక వాడూ మాతో శృతి కలిపి "ఏమంటే ఏంటి పని జరిగిందా లేదా ఇదే మరి manage చేయడమంటే.." అన్నాడు. వాడి body language అర్ధం చేసుకుని వాళ్ళు చోటిచ్చార్లెండి అదీ వాడి బడాయి.

అప్పుడు నవ్వుకున్నాం గాని నేను మొదటి సారి హైదరాబాద్ వచ్చాక ఒక లోకలైట్ తో ఇది చెప్తే "అబే చల్.. దీన్‌కీ జోక్ అంటార్‌ బే పాగల్!!..." అని ఒకళ్ళంటే "మాక్కి..కిరికిరి... దీన్ల జోకేడుందివయా... సక్కంగనే మాట్లాడిండు గదా మీ పోరగాడు...." అని ఇంకోళ్ళన్నారు... ఔ మల్ల!! అని గమ్మున ఉండి పోయా...

13 వ్యాఖ్యలు:

 1. బేబీ ఖాన్ పేరే భలే ఫన్నీగా ఉంది.
  :)

  గ్రూప్ కి ఒకరు ఉంటారేమో ఇలాంటివాళ్ళు. బాగున్నాయి మీ బేబీ ఖాన్ కబుర్లు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఓ! బేబీ ఖాన్ పేరే భలేగా ఉందే...

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @Venu, మహేష్, ప్రవీణ్
  మీ వ్యాఖ్యలకు నెనర్లండీ...అవి మేమంతా కలిసి వాడికి పెట్టుకున్న ముద్దు పేర్లు లెండి వాడి అసలు పేరు వేరే ఉంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. Lovely post.. did read it as soon as u posted. comment cheyyadaaniki late ayyindi.

  I'm very happy that u r posting often!! keep going!!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఔ మల్ల. ఎమున్నాదివయా గిందుల జోకు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. హిహిహి బాగుందిగానీ అందుల జోకేవిటొ నాకు కూడా ఆర్ధం కాలేదండి. ఆయ్! :-D

  ప్రత్యుత్తరంతొలగించు
 7. Missing Baby..! You forgot his other name Venu.. "Sherry baby!". And i cannot forget the times in Chennai.

  I just came across your blog Venu.. So refreshing! Love to see more

  -King

  ప్రత్యుత్తరంతొలగించు
 8. హ హ EMSN :) కావాలనే ఆ పేరు చెప్పలేదు :-)
  ఇంకో వారానికి నేనీ బ్లాగ్ మొదలుపెట్టి మూడేళ్ళు పూర్తవుతాయి :-) ఇన్నాళ్ళకి ఈ బ్లాగ్ నీ కంట్లో పడటమే కాక నిన్ను మెప్పించినందుకు ఆనందంగా ఉంది :-) మన ఇంజనీరింగ్ కాలేజ్ కబుర్లు తక్కువే రాశానని చెప్పుకోవచ్చేమో... ఇంకా ఆలోచించి రాయాలి... మళ్ళీ ఎపుడో మెల్లగా మొదలెడతాను..
  Thanks for your feedback :-)

  ప్రత్యుత్తరంతొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.