శుక్రవారం, జులై 04, 2008

అంతా మన మంచికే...

బహుశా ఈ కధ మీరందరూ వినే ఉంటారు, నేను ఎప్పుడో విన్నాను కాని పూర్తి గా మర్చిపోయాను. ఈ రోజు నేను కొంచెం డల్ గా ఉంటే నా నేస్తం చైతు మళ్ళీ గుర్తు చేసిన ఈ కధ నాకు చాలా బాగా నచ్చింది అప్పుడప్పుడు చదువుకోడానికి బావుంటుంది అని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.

అనగనగా ఒక రాజ్యం లో ఓ రోజు రాజు గారు కత్తి విద్యా నైపుణ్యాన్ని పెంపొందించుకోడానికి సాధన చేస్తుండగా అనుకోకుండా ఒక వేలు కొంత తెగి కింద పడిందట, అది చూసి రాజు గారు మధన పడుతుంటే పక్కనే ఉన్న బుద్ది శాలి అయిన మంత్రి అది చూసి "ఓ రాజా !! బాధ పడకు అంతా మన మంచికే జీవితం లో ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అని భావించాలి ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది అలానే మీ వేలు తెగడం కూడా మీ మంచికే అని హితవు పలికాడుట.

అది విన్న రాజు గారి అరికాలి మంట నెత్తికెక్కి "ఈ మూర్ఖ మంత్రి నేను వేలు తెగి బాధ పడుతుంటే అంతా మన మంచికే అని హితవు పలుకుతాడా..." అని కోపం తెచ్చుకుని...."ఎవరక్కడ ఈ మూర్ఖ మంత్రి ని చెఱసాల లో బంధించండి" అని ఆజ్ఞా పించాడుట. వెంటనే భటులు వచ్చి మంత్రి గారిని చెఱసాల లోనికి తీసుకు వెళ్తూ "ఎమయ్యా మంత్రి గారు.. రాజు గారు అంత బాధ పడుతూ ఉంటే నీ పాలికి నువ్వు ఊరుకోకా అట్టా అంటివే..ఇప్పుడు నీ పరిస్తితి ఏందీ..." అని అడిగారుట.

దానికి మంత్రి గారు చిరు నవ్వు నవ్వుతూ ఇది కూడా నా మంచికే జరిగి ఉంటుంది కారణం లేకుండా ఏదీ జరుగదు అని అన్నాడుట. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత రాజు గారు అడవికి వేటకు వెళ్ళి అక్కడ తప్పి పోయి అడవి మనుషులకు దొరికి పోయారుట. అక్కడ వారు రాజు గారిని చూసి "ఆహా ఈ రోజు మంచి నర బలి దొరికింది.." అని బలికి అంతా సిద్దం చేసేంతలో ఒకడు రాజు గారి తెగిన వేలు చూసి "ఔరా!!.. ఈ నరుడికి ఒక అవయవ లోపం ఉన్నది... బలికి పనికి రాడు... విడిచి పెట్టండీ..." అని రాజు గారిని వదిలి పెట్టేసారుట.

అప్పుడు రాజు గారు "బ్రతుకు జీవుడా!!..." అని అనుకుని ఎలానో కష్ట పడి తిరిగి రాజ్యానికి చేరుకుని నేరుగా చెఱసాల లో ఉన్న మంత్రి గారి వద్దకు వెళ్ళి మంత్రి వర్యా మిమ్మలను అనవసరం గా అవమానించినాను ఆ నాడు నా వేలు తెగడం వల్లనే కదా నేను బతికి బట్ట గలిగాను, కనుక మీరు అన్నది సబబే ఏమి జరిగినా మన మంచికే అనుకోవలె అంతా మన మంచికే అని నేను కూడా ఒప్పుకుంటున్నాను అని అన్నారుట. అది అంతా విన్న మంత్రి గారు బటుల వైపు తిరిగి చూసారుటోయ్ రాజు గారు నన్ను చెఱసాల లో బంధించక పోయి ఉంటే నేను కూడా రాజు గారి వెంట వెళ్ళి ఉండే వాడ్ని. అప్పుడు అన్ని అవయవాలు సరిగా ఉన్న నన్ను బలి ఇచ్చేవారు అందుకే రాజు గారు నన్ను చెఱసాల లో పెట్టుట కూడా నా మంచికే జరిగినది అని అనగా... బటులు నిజమే ప్రభు మీరు చెప్పినది అని అన్నారుట.

కనుక మనమందరం కూడా జీవితం లో ఏమి జరిగినా అంతా మన మంచికే అనుకుని ఎక్కువ కుంగి పోకుండా Take it easy ఊర్వశీ!! అని అనేసుకోవాలనమాట.... :-)

--మీ వేణు.

10 కామెంట్‌లు:

  1. కథ బాగుంది.చివరి మెసేజ్ మీద నాకు కొన్ని రిజర్వేషన్లున్నాయి లెండి.

    రిప్లయితొలగించండి
  2. ఈ ఊర్వశి ఎక్కడనుండి వచ్చింది...?!

    రిప్లయితొలగించండి
  3. katha chaala baagundi. intaku mudu chadive unna malla chadivelaa undi. neeti kathalu ante le.

    oka saari naaku exam lo bhayamkaram gaa marks vacchai.. enta gaa ante.. lecturers were shokced. :-O appudu oka ammayi naa daggariki vacchi "antaa mana manchike" andi. I was so frustrated at that time.. and asked.. tell me the good, I just want to know that!!

    atu tarvataa.. I realized how foolish I was doing it. "Take whatever comes your way, use it for your better.. don't look why it happened .. that's not your business" anna lesson nerchukunna.

    idi naa swagatham.. ikkade sandharbham gaa anipinchi cheppa.. anyadaa bhaavinchakandi.

    ilaa rojO kO chinna naaTi sangathulu cheptaarani aasistoo..

    purnima

    రిప్లయితొలగించండి
  4. @మహేష్
    నెనర్లు, ఏమిటో ఆ రిజర్వేషన్లు శలవిచ్చేయండి.
    @మేధ
    నెనర్లు, తను శంకర్ ప్రేమికుడు సినిమా లోంచి నా అనుమతి అడక్కుండానే వచ్చేసిందండీ.
    @పూర్ణిమా
    నెనర్లు, మీ స్వగతాన్ని ఇక్కడ పంచుకున్నందుకు ఆనందించడమే తప్ప అన్యధాభావించడానికి ఏమీ లేదండీ... అంత మంచి టపా లు వ్రాస్తూ బిజీ గా వుండి కూడా వీలు చూసుకుని ఇక్కడ కామెంట్ లు వదులుతున్నందుకు మీ అందరికీ బోలెడు నెనర్లు.

    రిప్లయితొలగించండి
  5. వేణూశ్రీకాంత్ .. ఈ కథ నేను చదివాను ఇంతకు ముందు. నాకు జెన్రల్ గా నీతికథలంటే మంట, కానీ ఈ కథ బాగా నచ్చింది. టెకిటీజీ పాలసీ నా ఊతపదం :)
    మహేష్ .. పైన పూర్ణిమ చెప్పిన సంఘటన చక్కగా వివరిస్తుంది ఎటువంటి సంఘటనైనా మన మంచికే ఎందుకో

    రిప్లయితొలగించండి
  6. @కొత్తపాళీ గారు,
    వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లండీ..

    రిప్లయితొలగించండి
  7. వేణూ,
    చదివిన కథే అయినా మళ్ళీ చదవడం బాగుంది. అప్పుడప్పుడు కొంచెం డల్ గా ఉంటు ఉండండి, ఇలా పాత కథలను గుర్తు చేస్తో!

    మహేష్,
    మీ రిజర్వేషన్లు ఏమిటో ఊహించడానికి ప్రయత్నిస్తున్నాను. అంత శ్రమ ఎందుకులే అంటారా, మరి ఒక టపా రాయండి, మీ బ్లాగులో దీని మీద!

    రిప్లయితొలగించండి
  8. సుజాత గారు నెనర్లు,
    డల్ గా ఉంటే చిరాకండీ... మంచి కధలు గుర్తు చేసుకుని వ్రాస్తాలెండి కానీ డల్ గా ఉండమని కోరుకోకండి మీకు పుణ్యముంటుంది :-)

    రిప్లయితొలగించండి
  9. nenu cheppina kadha baga raasaaru venu..chadavadaaniki bagundi..nuvveppudu yappy ga undu..
    :)
    appudu inka manchi posts ivvagalavu..andukee

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.