Sand sculptor Sudarshan Patnaik pays tribute to the People's President through this unique sand art |
మరణం అనివార్యమని తెలిసినా ఆత్మీయులనో ఆత్మ బంధువులనో కోల్పోయినపుడు మనసు బాధపడక మానదు. అదీ కలాం గారి లాంటి మహోన్నతమైన మనిషి దూరమైతే మిన్ను విరిగి మీద పడినంతగా చలించి పోవడం సహజమే. కానీ ఈ సమయంలో ఆయన మరణాన్ని చూసి కన్నీరు కార్చవద్దు ఆయన మహోన్నతమైన జీవితాన్ని చూసి గర్వపడదాం.. స్ఫూర్తి పొందుదాం.. దదాపు గత మూడు దశాబ్దాలుగా (బహుశా ఇస్రో/డీఅర్డీఓ గురించి తెలిసిన వారికి అంతకు ముందు నుండే) ఈ దేశంలోని ప్రతి ఒక్కరిలో ముఖ్యంగా విధ్యార్ధులలో యువతలో ఆ మహానుభావుడు రగిలించిన స్ఫూర్తి వెలకట్టలేనిది.
ఎన్ని విజయాలు సాధించినా.. ఎన్ని కీర్తి శిఖరాలని అధిరోహించినా.. ఎంతటి ఉన్నతమైన పదవులు స్వయంగా ఆయన్ని వరించినా.. ఆయన మాత్రం తన సింప్లిసిటీని వదలక అందరికి అందుబాటులో ఉంటూ కామన్ మాన్ గా ప్రతి ఒక్కరి అభిమానానికి పాత్రులయ్యారు. ఈ దేశపు ప్రధమ పౌరునిగా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా విద్యార్ధుల కోసం ఉపన్యాసాలు ఇవ్వడానికి ఎంత దూరమైనా ఎన్ని కిలోమీటర్లైనా ఆ విద్యాలయం చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా వందా రెండొందలమంది చదువుకునే చిన్న పబ్లిక్ స్కూల్స్ నుండి ఐ.ఎస్.బి. ఐ.ఐ.ఎమ్ ల వరకూ ఎక్కడికైనా ఎంతటి ప్రయాసకైనా ఓర్చి వెళ్ళేవారు.
చివరికి వారికి అంత్యంత ఇష్టమైన ఈ వ్యాపకంతోనే ఐ.ఐ.ఎం లొ లివబుల్ ఎర్త్ స్పీచ్ లో భాగంగా నాయకత్వ లక్షణాలని గురించి యువతకు చక్కని స్పీచ్ ఇస్తూ తన చివరి క్షణాలు విద్యార్ధులతో గడపడం చూస్తే. ఆయన లేకపోవడం కొంచెం బాధను కలిగించినా ఇలా తనకిష్టమైన పని చేస్తూ అనాయాస మరణం పొందడం ఎందరికి సాధ్యం చెప్పండి అనిపిస్తుంది. మిసైళ్ళూ రాకెట్లే కాదు మరణం సైతం ఆయనకి సలాం చేసి గులామైందని అనిపించక మానదు. అందుకే నాకు ఆయన మరణం చూసి కన్నీరు రావట్లేదు.. ఆయన లాంటి ఒక ఉత్తమ భారతీయుని జీవితాన్ని చూసి గర్వంగా ఉంది..
అంతటి మహా మనిషి సైతం సామాన్య మానవుల్లా ఎనభై నాలుగేళ్ళకే మరణించాలా? మరికొంతకాలం జీవించి ఉంటే బాగుండేదని అనిపించినా.. అలాంటి మహోన్నతులకు మరణం ఉండదు.. ఈ దేశపు ప్రతి పౌరుడి గుండెలో వెలుగై శాశ్వతంగా కొలువుంటారు అనే నిజం ధైర్యాన్నిస్తుంది. ఆ నవ్వు ముఖం, వారి స్ఫూర్తినిచ్చే మాటలు అన్నీ ఏదో క్షణంలో గుర్తొస్తూనే ఉంటాయి. కుదిరితే మళ్ళీ మాకోసం ఈ దేశ ప్రజలలో మరిన్ని తరాలలో స్ఫూర్తి నింపడం కోసం కలాం గారు ఈ దేశంలోనే జన్మించాలని మనసారా కోరుకుంటున్నాను.. ఎంత వద్దనుకున్నా కానీ వారి అంతిమ క్షణాలను గురించిన ఈ పోస్ట్ ఛదివినపుడు ఎందుకో తెలియకుండా హృదయంతో పాటు కనులు చెమరించాయి.
ఇండియా ఈజ్ యే డెవలప్డ్ కంట్రీ అని ధైర్యం గా చెప్పండి అన్న యేకైక వ్యక్తి మీరు..వుయ్ సేల్యూట్ యు సర్ ఫర్ యువర్ మోస్ట్ పవర్ఫుల్, థాట్ ప్రవోకింగ్, డివైన్ ప్రెజెన్స్..నైస్ ఆర్టికల్ వేణూగారూ..
రిప్లయితొలగించండిథాంక్స్ శాంతి గారు.
తొలగించండికలాం గారు నిస్సందేహంగా గొప్ప వ్యక్తి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ ప్రజలని, ముఖ్యంగా యువతని ఇంతగా ప్రభావితం చేసిన వ్యక్తి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. కలలని నిజం చేసుకోవడం సాధ్యమే అన్న అద్భుతమైన నమ్మకాన్ని ఈ దేశ యువతకి అబ్దుల్ కలాం మాత్రమే కలిగించారు.
రిప్లయితొలగించండికాని కొంతమంది సాడిస్ట్ మేధావులకి ఆయన గొప్పతనం కనపడటం లేదు. ప్రపంచం అంతా ఆయనని కీర్తిస్తుంటే, ఈ ఉలిపికట్టెలు ఆయనలోని లోపాలు వెదికే పనిలో పడ్డాయి. దళితుడైనందువల్లే నారాయణన్ గారికి రెండోసారి రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వకుండా కలాం గారికి మతతత్వవాదులు అవకాశం ఇచ్చారట. మరి చిన్న పిల్లలతో సహా దేశమంతా కలాం గారు రెండోసారి రాష్ట్రపతి అవ్వాలని కోరుకున్నా, UPA ఆయనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని వీళ్ళు అడగరు. నిజమైన లౌకికవాది అయిన కలాం గారికి కూడ మతతత్వం అంటగట్టారు ఈ సూడో సెక్యులరిస్టులు. ఇంత నెగటివ్‌గా ఎలా ఆలోచిస్తారో?
థాంక్స్ బోనగిరి గారు..
తొలగించండిఅటువంటి అర్టికల్స్ కు అనవసర ప్రచారం కల్పించడం కూడా నాకు ఇష్టం లేదండీ. డిస్కషన్ కూడా దండగే.
Nicely written tributes to People's President.
రిప్లయితొలగించండిథాంక్స్ శ్రావ్య.
తొలగించండిKalaam..India Kohinoor...
రిప్లయితొలగించండిNice article from Venu garu
థాంక్స్ శ్రీను గారు.
తొలగించండిthere are holidays for gandhi jayanti, nehru jayanti etc... but for Dr. Kalam...may be the only person in history, in whose honor RBI worked on a sunday.
రిప్లయితొలగించండిA true inspiration
అవును అజ్ఞాత గారూ కలాం గారు కూడా అదే కోరుకున్నారని అంటారు.. శలవు బదులు అదనంగా పని చేయాలని. థాంక్స్ ఫర్ ద కామెంట్..
తొలగించండి