నేటినుండి కొత్త సంవత్సరం మొదలవుతుంది కదా... 2016కు మనసారా స్వాగతం
పలుకుతూ "నిన్నకీ నేటికీ ఏం మారిందనీ గోడమీద కాలెండరు తప్ప" అంటూ
నిరుత్సాహపరిచే ఆలోచనలకు తావివ్వకుండా.. నిన్నటికన్నా రేపు
మెరుగ్గా ఉంటుందనే నమ్మకమే నేటికి ఇంధనం కనుక ఆశావహ దృక్పధంతో ప్రతి ఒక్కరూ
ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ బ్లాగ్ మిత్రులు అందరికీ
ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ కొత్త ఏడాదిలో మీ దిగుళ్ళు
వందోవంతవ్వాలనీ సంతోషాలు వందింతలవ్వాలనీ మనసారా కోరుకుంటున్నాను.
బ్లాగులకు సంబంధించినంత వరకూ 2015 వెళ్తూ వెళ్తూ మిగిల్చిన విషాదం కూడలి అస్తమయం. ఇన్నేళ్ళగా తెలుగు బ్లాగులకు నిర్విరామంగా అందించిన సేవలను నిలిపివేస్తూ కూడలి మూసివేయాలనే నిర్ణయం వెనుక కారణం తెలియదు కానీ తెలుగు బ్లాగులకు వారు అందించిన సేవలను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. నా బ్లాగ్స్ కు సంబంధించినంత వరకూ ఎన్ని అగ్రిగేటర్స్ వచ్చినా కూడా నిన్న మొన్నటి వరకూ ట్రాఫిక్ సోర్స్ లో ప్రధమంగా నిలిచింది "కూడలి" మాత్రమే.
నేను బ్లాగు వ్రాయడం ప్రారంభించిన తొలిరోజుల్లో అంటే 2008 టైమ్ లో కంప్యూటర్ ఆన్ చేసి ఉన్నంత సేపు ఒక విండోలో కూడలి నిత్యం ఓపెన్ చేసే ఉంచేవాడ్ని. అలాగే ఏదైనా కొత్త పోస్ట్ వ్రాసిన ప్రతిసారి అందులో కనిపించేవరకూ రిఫ్రెష్ చేస్తూ చెక్ చేసుకునే వాడ్ని. అటువంటి కూడలిని ఈ మధ్య తెరిచినది చాలా తక్కువ సార్లే అయినా కూడా ఇకపై పని చేయదని తెలిసి దిగులుగా అనిపిస్తుంది.
తెలుగు బ్లాగుల గురించి అసలేమీ తెలియని రోజుల్లో వ్రాసే వారిని అందరినీ ఒకే వేదికపైకి తెచ్చి ఒకరితో ఒకరికి పరిచయాలను పెంచుకోవడంలోనూ మరిన్ని బ్లాగుల గురించి తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడింది. కూడలే కనుక లేకపోతే నేను చాలా మంది ఆత్మీయ మిత్రులను కలుసుకోగలిగి ఉండేవాడ్ని కాదు. బ్లాగులు వ్రాసే అలవాటే చాలా వరకు తగ్గిపోయిన ఈ రోజుల్లో కూడలి నిర్ణయం సబబే అనుకోవచ్చేమో. ఏదేమైనా ఇన్నేళ్ళగా కూడలి అందించిన సేవలకు వీవెన్ గారికి తనకి సాయపడిన ఇతర నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు వేణు గారు.
రిప్లయితొలగించండికూడలి అస్తమయం బాధ కలిగిస్తోంది. బ్లాగుల వైభోగం అంతా కూడలి చలువే అనడం అతిశయోక్తి కాదేమో!
థాంక్స్ జ్యోతిర్మయి గారు.. కూడలి గురించి కరెక్ట్ గా చెప్పారండీ.
తొలగించండిగుర్తుకొస్త్తున్నాయి... గుర్తుకొస్తున్నాయి... ఎన్నో మంచి బ్లాగులు, ఎందరో మంచి బ్లాగరులు, ఏంటో చూస్తుండగానే అన్నీ మారిపోయాయి. చివరికి మిగిలేవి జ్ఞాపకాలేనేమో.... miss koodali and miss those days
రిప్లయితొలగించండిఅవును లక్ష్మి గారు.. మిస్ దోజ్ డేస్.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
తొలగించండి