బుధవారం, మే 20, 2020

కనులు కనులను దోచాయంటే...

ఈ సినిమా టైటిల్ చూసినపుడు అబ్బా ఇది మరో రొటీన్ ప్రేమకథ అయుంటుందిలే అని అనిపించి కనీసం ట్రైలర్ కూడా చూడలేదు నేను. అప్పటికీ డుల్కర్ మంచి మంచి స్క్రిప్ట్స్ ఎన్నుకుంటాడు అనే నమ్మకం ఉన్నా కూడా దూరంగానే ఉన్నాను. అలా రిలీజైనపుడు మిస్సయిన ఈ సినిమా మొన్న ఓటీటీ(ఆహా)లో అనుకోకుండా చూసే అవకాశం దొరికింది. సినిమా గురించి రివ్యూలు చదవకుండా ఏం తెలియకుండా చూడడంతో నన్ను బాగానే థ్రిల్ చేశారు.

ఓ రకంగా చెప్పుకోవాలంటే ఇది కూడా ప్రేమ కథ లాంటిదే కానీ ప్రేమ కథ కాదు. ఆ టైటిల్ ఎందుకు పెట్టారో సినిమా చూశాక కానీ మనకు పూర్తిగా అర్ధం కాదు. ఈ జెనర్ లో వచ్చే సినిమాల్లో హాలీఉడ్ సినిమాలకీ మన సినిమాలకీ ఓ ప్రధానమైన తేడా ఉంటుంది అది నైతికత. హీరో దొంగ ఐనా కూడా రాబిన్ హుడ్ తరహా మంచి దొంగలా ఉండాల్సిందే తప్ప మామూలుగా రియలిస్టిక్ గా ఉంటే కుదరదు.

ఈ సినిమా ఆవిషయంలో కాస్త వెసులుబాటుతో ఇచ్చిన క్లైమాక్స్ నాకు నచ్చింది. "ఇలాంటి సినిమాలతో సభ్యసమాజానికి ముఖ్యంగా యువతకి ఏం మెసేజ్ ఇద్దామని" అని అనుకునే టైప్ మీరైతే బహుశా ఈ సినిమా మీకు నచ్చకపోవచ్చు. ఓ కథని కాస్త సినిమాటిక్ లిబర్టీస్ తో అక్కడక్కడా థ్రిల్ చేస్తూ ఎంటర్ టైనింగ్ గా చెప్తే చాలు అని అనుకుంటే మీకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇట్సె క్లీన్ ఎంటర్టైనర్.

సినిమాలోని థ్రిల్స్ ఎంజాయ్ చేయాలంటే ఇక ముందుకు చదవకుండా ’ఆహా’ ఓటీటీ ప్లాట్ఫార్మ్ లోనో, టీవీలో ప్రదర్శించినపుడో ఈ సినిమా చూసొచ్చాక చదవండి.

కథ విషయానికి వస్తే ఈజీ గోయింగ్ ఆవారా బ్యాచ్ అయిన అనాథ హీరో గారు(డుల్కర్) ఓ ఫ్రెండ్ తో కలిసి రకరకాల మోసాలతో డబ్బు సంపాదిస్తూ లావిష్ గా బతికేస్తుంటారు. అలాంటి సమయంలో అందం అమాయకత్వం కలబోసిన హీరోయిన్(రీతూ వర్మ) తో ప్రేమలో పడతారు. ఆ ప్రేమ ప్రభావంతో ఈ పనులన్నిటికి స్వస్తి చెప్పి ఎక్కడైనా గౌరవంగా పని చేసుకుంటూ బ్రతకాలని నిర్ణయించుకుంటారు.

ఐతే చేసిన పాపం వెంటాడకుండా ఊరుకోదు కదా ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ (గౌతం మీనన్) వీరి మోసాల గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. హీరోగారు పోలీసులకి దొరికి పోయారా, చేసిన తప్పులకు శిక్ష అనుభవించారా, వారి ప్రేమ కథ ఏమైంది అసలు చేసిన మోసాలు ఎటువంటివి అనేది తెలియాలంటే మీరు కనులుకనులను దోచాయంటే సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పూర్తిగా దర్శకుడి సినిమా, ముఖ్యంగా స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నాడు. అక్కడక్కడా కొన్ని మోసాల విషయంలో ఇది ఇంత సులువా అనిపించేలా కాస్త సినిమాటిక్ లిబర్టీస్ తీస్కున్నప్పటికీ చాలా వరకూ థ్రిల్ చేయగలిగాడు. ఈ సినిమా చూశాక ఆన్ లైన్ షాపింగ్ చేసే ముందు ఓ నిముషం ఆలోచించకుండా ఉండలేం. ఇంకా ఇందులో టచ్ చేసిన ఇతర మోసాలు కూడా కొత్తగా ఉన్నాయి.

కాస్టింగ్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది ముఖ్యంగా హీరోయిన్ గా రీతూ వర్మని తీస్కోడం చాలా ప్లస్ అయింది. డుల్కర్ ఆల్రెడీ ప్రూవెన్ నటుడు ఈ పాత్ర తను మరింత అలవోకగా చేసేశాడు. మిగిలిన నటీనటులంతా కూడా పాత్రల్లో ఒదిగిపోయారు. పాటలు ప్రత్యేకంగా గుర్తుండక పోయినా నేపథ్య సంగీతం సన్నివేశాలని ఎలివేట్ చేస్తూ చక్కగా అమరింది. సినిమాటోగ్రఫీ తో సహా మిగతా టెక్నికల్ టీమ్ అంతా కూడా మంచి ఔట్ పుట్ ఇచ్చారు.

ఈ తరహా దోపిడీ దొంగల సినిమాలు ఇష్టపడే వాళ్ళు మాత్రమే కాకుండా వైవిధ్యభరితమైన ఎంటర్టైనింగ్ సినిమాలు నచ్చే వాళ్ళు మిస్ అవకుండా చూడదగిన సినిమా కనులు కనులను దోచాయంటే.

4 వ్యాఖ్యలు:

 1. వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ..నైస్ ఆర్టికల్..

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారూ.. చాన్నాళ్ళ తర్వాత మీ కామెంట్ చూడడం సంతోషంగా ఉంది.

   తొలగించు
 2. మీ సలహాని పట్టుకుని ధైర్యం చేసేశాను వేణుగారూ.. 🙂
  మీరన్నట్టు కొన్ని కొన్ని cinematic liberties ని మినహాయిస్తే different సినిమా ఇది.. 👍

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సినిమా చూసి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు రవికిరణ్ గారూ. ఎస్ చిన్న చిన్న సర్ ప్రైజ్ లతో సరదాగా అనిపించిందండీ నాక్కూడా :-)

   తొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.