మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి, వాటిని ప్రోత్సహించడం అటువంటి చిత్రాలని అభిమానించే వారు తప్పక చేయవలసిన పని. ఇంచుమించు రెండేళ్ళ క్రితం "క్రాంతిమాధవ్" దర్శకత్వంలో వచ్చిన ఒక చక్కని చిత్రం "ఓనమాలు". ఈ చిత్రానికి ఖదీర్ బాబు రాసిన పదునైన సంభాషణలు ఆకట్టుకుంటూనే ఆలోచింప చేస్తాయి. ఇంత చక్కని సినిమాను మాటీవీ వారు
ఈ శనివారం ఫిబ్రవరి 7 న రాత్రి 8 గంటలకు మొదటిసారి ప్రసారం చేస్తున్నారు. ఈ చిత్రం విడుదలైనపుడు చూడడం కుదరని వారు ఈ సదవకాశాన్ని వదులుకోకుండా తప్పక చూడండి. ఈ చిత్రం పై అప్పట్లో నేను రాసిన రివ్యూ
ఇక్కడ చదవచ్చు.
ఈ చిత్ర దర్శకుడు "క్రాంతిమాధవ్" "శర్వానంద్", "నిత్యామీనన్" జంటగా తీసిన కొత్త చిత్రం "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" ఈరోజే (ఫిబ్రవరి ఆరున) విడుదలై "మళ్ళీ మళ్ళీ రావిలాంటి చిత్రాలు" అంటూ విమర్శకుల అభినందనలు పొందడం సంతోషించ దగిన విషయం.
ఈ సినిమాకోసం ఎన్ని రోజులనుండీ ఎదురుచూస్తున్నానో.ధన్యవాదాలు,ముందుగానే తెలిపినందుకు.
రిప్లయితొలగించండిI am waiting for this movie from a long time..Is it feb7th or 8th ?? I am in US.. It was "julayi" movie on feb 7th 8 pm
రిప్లయితొలగించండిఓహ్ సారీ అండీ... వాళ్ళు ఇచ్చిన ప్రోమోస్ ప్రకారం అయితే ఫిబ్ సెవెన్త్ శనివారం రాత్రే రావాల్సి ఉందండీ.. బహుశా ఏవైనా వేరే ఇబ్బందుల వల్ల మార్చేశాడేమో. ఇక్కడ ఇండియా లో కూడా జులాయ్ సినిమాయే టెలికాస్ట్ అయింది. మళ్ళీ ఎపుడో తెలిస్తే ఇక్కడ కామెంట్స్ లో అప్డేట్ చేస్తాను.
రిప్లయితొలగించండిఫ్రెండ్స్, ఇపుడీ ఓనమాలు చిత్రాన్ని యూ ట్యూబ్ లో చూడవచ్చు.
రిప్లయితొలగించండిఇక్కడ చూడండి : https://www.youtube.com/watch?v=j0hIc0rM8nc