ప్రయాణం లో చికాకులు ఎన్ని ఉన్నా చివరికి విమానం శంషాబాద్ విమానాశ్రయం లో ల్యాండ్ అయింది, లగేజి పికప్ కోసం మెల్లగా Baggage Carousel (ఈ పక్కన ఫోటో లో ఉన్నది) దగ్గరకు చేరుకున్నాను. నేపద్యం లో విమానాశ్రయం సిబ్బంది రక రకాల ప్రకటనలు చేస్తున్నారు వాటిలో ఒకటి, "విమానాశ్రయము నందు మీకు పెయిడ్ పోర్టర్ సౌకర్యము కలదు..మీ సామాను మోయుటకు పోర్టర్ సిబ్బంది సేవలను ఉపయోగించు 'కొన' వచ్చును.." అని అంటూ చెప్తుంది. ఇది చాలా శ్రద్దగా విన్నాడేమో నా పక్కన ఉన్న ఒకాయన పాపం కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తరపున సాయం చెయ్యడానికి వచ్చిన వాళ్ళ మీద గయ్ గయ్ మంటూ విరుచుకు పడి పోయాడు. మాములు గా అయితే పాపం మర్యాద గా చెప్పి ఉండే వాడేమో కానీ "మరి ఎవరు ఎయిర్ లైన్స్ వాళ్ళో ఎవరు పోర్టర్ సిబ్బందో ఎలా తెలుస్తుంది ఎందుకు వచ్చిన గోలా, నా సామాను నేనే మోసుకుంటే పోలా !!" అని అనుకున్నాడేమో, దాంతో వాళ్ళు బలి. నాకు ఆ కింగ్ ఫిషర్ జనాలని చూస్తే బోల్డు కొంచెం జాలేసింది :-) విజయ్ మాల్యా నేమో అతి మర్యాదలూ.. అతిథి మర్యాదలూ అని "Hospitality is more important" అని సిబ్బంది కి తర్ఫీదు ఇచ్చి పంపుతుంటే, అంత మర్యాద కి అంత గా అలవాటు పడని మనవాళ్ళు ఆ సర్వీసుని సరిగా అర్ధం చేసుకో లేక సిబ్బంది ని కసురుకుంటుంటే,, ఏం చేయాలో పాలు పోక పాపం సతమతమౌతున్నారు ఈ కింగ్ ఫిషర్ సిబ్బంది. సరే కింగ్ ఫిషర్ గురించి మరో రోజు రాస్తాను, మన టపా విషయానికి వస్తే...
నా ట్రిప్ లో నేను ఎక్కువ భాగం రోడ్ మీదే గడపాల్సి వచ్చింది. సో అవసరమైనప్పుడల్లా ఓ రెంటల్ కార్ తీసుకుని ఊళ్ళు తిరగడం జరిగింది నేను ఇండియా లో ఉన్నప్పుడు అంటే 2006 డిశంబర్ వరకూ కూడా చెవీ వ్యాన్ లు అంతగా పేరు తెచ్చుకోలేదు. కానీ మొన్న ఎక్కడ చూసినా ఛెవీ టవేరా (ఈ పక్కన ఫోటో లో ఉన్నది) chevrolet Tavera నే కనిపించింది. ఏ ట్రావెల్స్ వాడ్ని ఆడిగినా ముందు ఇదే బండి ఇవ్వడం మొదలు పెట్టారు. అప్పట్లో సుమో, తర్వాత క్వాలిస్ ఆ తర్వాత స్కార్పియో కొన్ని రోజులు తిరిగింది కానీ దాన్ని త్వరలోనే ఈ బండి రిప్లేస్ చేసింది సార్ అని కథలు కథలు గా చెప్పారు ట్రావెల్స్ జనాలు. అమెరికా లోనే అంతంత మాత్రం గా ఉపయోగించే ఈ అమెరికన్ వ్యాన్ ఇంతగా ఆంద్రా లో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అనేది నేను ఊహించలేదు. సరే అలాంటి ఓ పన్నెండు గంటల ట్రిప్ లో ఓ రోజు కంభం అనే ఊరిలో బోజనం చేయాల్సి వచ్చింది.
ఊరు చూస్తే చాలా చిన్న ఊరు లా ఉంది, అప్పటికే టైమ్ తొమ్మిదిన్నర అయిందీ, ఈ ఊరు దాటితే మరో ఊరు రావడానికి ఎంత లేదన్నా అరగంట టైం పడుతుంది సో ఇక్కడే ఏదో తినేద్దాం అని ఏదో చిన్న సెంటర్‌లా కనిపించిన చోట ఆపి, మా డ్రైవర్ దిగి వెళ్ళి కనుక్కుని వచ్చి "పైన సెంటర్ లో ఉన్నాయంటండీ.." అని అంటే మళ్ళీ బయల్దేరాం కొంచెం దూరం వెళ్ళాం కానీ ఎక్కడా ఏమీ కనిపించ లేదు ఇంతలో ఆ దారిన పోయే ఒకతను కనిపింఛాడు. అతనిదగ్గర లో బండి ఆపి "బాబూ ఇక్కడ మంచి హోటల్స్ ఏమున్నాయ్.." అని అడిగాం అతను మేం అడగడం ఆలశ్యం ఓ క్షణం ఆలో చించి మీకు ఎలాంటి బోజనం కావాలి అని అడిగి ఇదిగో ఫలానా సెంటర్ కి వెళ్తే ఫలానా హోటల్ ఉంటుంది అక్కడకి వెళ్ళండి అని వివరం గా స్పీడ్ బ్రేకర్ లు సిగ్నల్ లైట్స్ తో సహా దారి చెప్పడమే కాకుండా అక్కడ ఏమేం దొరుకుతాయో ఏవి బాగుంటాయో చాలా వివరంగా ఓపిక గా ఏమాత్రం విసుగు లేకుండా చెప్పాడు. ఆ హోటల్ మీదేనేమిటోయ్ కొంపదీసి అంటే "లేదండీ మా ఊర్లో రుచికరమైన బోజనం అక్కడే దొరుకుద్దండీ.." అని చెప్పాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి శలవు పుచ్చుకున్నాక మేమంతా ఒకరి మొహాలు ఒకరం చూసుకుంటూ మొత్తానికి భలే వాడిని అడిగాం అనుకున్నాం.
తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది చాలా చిన్న హోటల్ శుబ్రత గురించి కొంచెం అనుమానం వచ్చింది. ఒక పది నిముషాలు కాస్త రేట్ ఎక్కువ వసూల్ చేసే పెద్ద హోటల్ దొరుకుతుందేమో అని వెతికి.. ఏమీ దొరక్క సరె మా దానయ్య మీద భరోసా ఉంచి అక్కడే తిందాం అని కూర్చున్నాం. వడ్డించే ముందు అతను ముందుగా వాష్ బేసిన్ లో చేయి కడుక్కుని మొదలు పెట్టటం చూసాక పర్లేదు ధైర్యం గానే తినచ్చు అనుకున్నాం. మా దానయ్య చెప్పినట్లే భోజనం వేడిగా, చాలా రుచి గా ఉంది. హోటల్ చూసి పదార్దాల రుచిని అంచనా వేయ కూడదు అని మరో సారి నిర్ధారించుకున్నాను. మొత్తం మీద ఆ దారిన పోయే దానయ్య పుణ్యమా అని అంత రాత్రి వేళ ఆ కంభం లొ కమ్మని భోజనం చేసాం. ఇటువంటి సౌలభ్యం ఈ అమెరికా లో బాగా మిస్ అవుతాను నేను. ఇక్కడ అలా దారే పోయే వాడిని ఆపితే వాడేం చేస్తాడో అని భయం, అదే కాక ఏదో డౌన్ టౌన్ లో తప్ప అసలు ఇక్కడ రోడ్ మీద జనం కనపడటమే గగనమాయె, సో చచ్చినట్లు దారి లో కనిపించిన ఏ చెత్త రెస్టారెంట్ లోనో దొరికిన గడ్డి తిని తృప్తి పడాల్సిందే...
ఇదే ట్రిప్ లో ఒక సారి ఆళ్ళగడ్డ సమీపిస్తుండగా చాంతాడు లాంటి ట్రాఫిక్ జామ్ ఎదురైంది మా బండి చివరి లో ఉంది ముందంతా కనుచూపు మేరా బస్ లు లారీ లు ఆగి ఉన్నాయి. మేము ట్రాఫిక్ జామ్ ని సమీపిస్తూ దేవుడా దీన్లో నుండి ఎప్పటికి రా బాబు బయట పడేది అని అనుకుంటూ, ఏమైంది అని వాకబు చేస్తే. మరో దానయ్య స్వచ్చందం గా ముందుకు వచ్చి "సెంటర్ లో ఎరువులు అందలేదని రైతులు ధర్నా చేస్తున్నారండీ ఇప్పట్లో తేలే లా లేదు చాలా సెపటి నుండీ బళ్ళు ఆగున్నాయ్.. మీరేడికెళ్ళాళా? " అని అడిగాడు. ఊరు దాటి వెళ్ళాళి బాబు అని చెప్తే "అయితే మీరు కాస్త ఎనక్కి వెళ్ళి ఆ కనబడే మట్టి రోడ్డంబడి వెళ్తే ఊళ్ళో సందులగుండా సెంటర్ లో ధర్నా ని తప్పించుకుని ఎళ్ళచ్చు.." అని దారి చెప్పాడు. అతను చెప్పిన రూట్ లో వెళ్ళి ఒక ఇరవై నిముషాల్లో మళ్ళీ హైవే ఎక్కాం మనసులోనే అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఇలా సాయం తీసుకోడం లో కూడా రిస్క్ ఉందండోయ్.. ప్రత్యేకంగా రాత్రి పూట మీరు ప్రయాణం చేయాల్సి వచ్చినపుడు ఎప్పుడూ కూడా ఇలా మధ్య లో అడిగిన వాళ్ళ కి మీ చివరి గమ్యం చెప్పకండి. వాళ్ళెవరో తెలియదు కనుక దొంగలు అయ్యే అవకాశం కూడా ఉంది కనుక వీలైనంత దగ్గర ఊరి పేరు మాత్రం చెప్పండి చాలు. అందరూ మంచి వాళ్ళే దొరకరు కదా మన జాగ్రత్త లో మనం ఉండాలి మరి.
కుహు కుహూ.. కూసే..
-
డబ్బు డబ్బు డబ్బు చిత్రంలోని ఒక మధురమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట
ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
ఎంబెడెడ్ వీడి...
3 సంవత్సరాల క్రితం
బాగున్నాయి మీ india కబుర్లు.. నిజమే మీరు చెప్పింది కూడా తెలియని వారికి వివరాలు చెప్పకపోవడం
రిప్లయితొలగించండిఇలాంటి ప్రయాణాలప్పుడు హైవేల్లో చిన్న చిన్న దాబా ల్లో పుల్కాలు పప్పు, కూర లాంటివి రుచిగా ఉంటాయి. నా ఓటు వాటికే:)
రిప్లయితొలగించండిబోల్డు కొంచెం జాలేసింది :-)
రిప్లయితొలగించండినాకైతే ఇది చూడగానే అప్పుడప్పుడూ బస్సులలో లేక దగ్గరి వూర్లకు వెళ్లే ట్రైన్ లలో "కొంచం జరగండి అని మనకు చోటు లేకుండా ఆక్రమించేసుకొని...తమకోసం మనం చేసిన అపారమైన త్యాగాన్ని గుర్తించకుండా.......మనకు పెట్టకుండా బఠానీలు శనక్కాయ్ లు తినేసే వాళ్లు గుర్తొచ్చారు :)
బాగున్నాయి మీ కబుర్లు..
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిavunanadi mana india lo manchi vallu chala mandhe vunnaru kani india inka yendhuku venaka pade vundho ardham kavadam ledu?miku yemaina thelisthe naku konchem chepudhuruu....
రిప్లయితొలగించండివేణూ, మీరు రాగానే ట్రావెల్ వాళ్ళు అమెరికా వాసన పసిగట్టేసి ఉంటారు. అందుకే చెవీ టవేరా అంటగట్టారు .అది లేకపోతే ఫోర్డ్ ఎండీవర్ అయినా తగిలించేవారు. లేకపోతే మన వైపు క్వాలిస్ లు,సుమోలు ఇంకా బాగానే దొరుకుతున్నాయి. సుమో కొంచెం కష్టం గానీ స్కార్పియో బాగానే ఉంటుంది ఇలా ఊళ్ళవెంట తిరగడానికి.
రిప్లయితొలగించండి"ఇలా అమెరికాలో అడిగితే వాడేం చేస్తాడో అని భయం"....నిజమే! కానీ హైదరాబాదు వంటి సిటీల వరకూ ఈ భయం వచ్చేసింది. అదృష్టం , ఇంకా మన పల్లెలు ఆ స్థాయికి చేరకపోవడం.
రమ్య గారు,
బాగా చెప్పారు. పైగా అదేంటో, ఇలా ప్రయాణాల్లో ఉంటే ధాబా చూడగానే ఆకలి విజృంభిస్తుంది కదా!
సుజాత గారు చెప్పిన 'అమెరికా వాసన ' కరెక్టేనేమో!? మేము అంతకుముందు వెళ్ళినప్పుడు సుమో కావాలంటే 'లేదు కొత్తది స్కార్పియో అని వచ్చింది.. చాలా బావుంటుంది ' అని వద్దన్నా అదే ఇచ్చారు.. దానికి రెంట్ ఎక్కువైనా రైడ్ చాలా బాగుందనుకోండి అది వేరే విషయం :-)
రిప్లయితొలగించండిపైన పెట్టింది మన కొత్త ఎయిర్ పోర్ట్లోని ఫోటో నా!?
venu gaaru,
రిప్లయితొలగించండిemai poyaru........nenu roju mee blog open chesi chustunna....kotta tapa emanna post chesaremo ani.... how are you? busy ga vunnara ?
subbu
నేస్తం నెనర్లు.
రిప్లయితొలగించండిరమ్య గారు నెనర్లు. మీరు చెప్పిన ధాభా ఫుడ్ నాకు కూడా ఇష్టం.
నేను, ప్రపుల్ల చంద్ర గారు నెనర్లు.
అను గారు నెనర్లు. కేవలం మంచితనం అభివృద్ది కారకం కాలేదండీ... దానికి చాలా కారణాలు ఉన్నాయ్.
సుజాత గారు నెనర్లు. లేదండీ అతను మాకు తెలిసిన ట్రావెల్ వాడే సో అలా అంటగట్టే ఆవకాశం లేదు కాకపోతే నేను ఘాట్ లో తిరగేది ఎక్కువ అందుకని 3-4 ఏళ్ళ కన్నా పాత వెహికిల్స్ తీసుకోడానికి ఇష్ట పడను అక్కడ తేడా వస్తుంది. అదీకాక నేను చెప్పింది రోడ్ మీద ఎక్కువగా కనిపించిన వెహికిల్స్ చూసి, కేవలం మా వాడి దగ్గర వెహికిల్స్ మాత్రమే చూసి కాదు.
నిషిగంధ గారు నెనర్లు, అవునండీ ఫోటో కొత్త ఎయిర్పోర్ట్ లోనిదే..
సుబ్బు నెనర్లు, కొంచెం బిజీ గా ఉండటం వల్ల పోస్ట్ చేయలేదండీ. అన్నట్లు సారీ, తప్పని సరి అయి నా బ్లాగ్ లో అనానిమస్ కామెంట్స్ తీసేసాను దయచేసి ఐడీ క్రియేట్ చేసుకోని కానీ గూగుల్ ఐడీ తో కానీ కామెంట్ చేయండి.