అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

గురువారం, జులై 31, 2008

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే !!

ఓ నాల్రోజులు గా ఎందుకో ఈ పాట పదే పదే గుర్తొస్తుంది. ఈ పాట సాహిత్యమో లేదా mp3 నో దొరుకుతుందేమో అని వెతుకుతుంటే ఓ నెల క్రితం సుజాత(గడ్డిపూలు) గారు కూడా ఈ పాట గుర్తు చేసుకోడం చూసాను. మొత్తం మీద నా కలక్షన్ నుండి తవ్వి తీసి సాహిత్యం తో పాటు వినడానికి లింక్ కూడా ఇస్తే అందరూ మరో సారి ఈ మధురమైన పాట ని ఆస్వాదిస్తారు, తెలియని వాళ్ళకి పరిచయం చేసినట్లూ ఉంటుంది అని ఈ రోజు ఈ పాట ఇక్కడ మన అందరి కోసం. పాలగుమ్మి గారి సాహిత్యం వేదవతీ ప్రభాకర్ గారి గానం తో ఈ పాట చాలా హాయైన అనుభూతినిస్తుంది.Amma Donga Ninnu C...సాహిత్యం: పాలగుమ్మి విశ్వనాథ్సంగీతం : పాలగుమ్మి విశ్వనాథ్గానం...

బుధవారం, జులై 30, 2008

గంగామహల్ రిచ్చా(క్షా)బండి పిడుగురాళ్ళ...

శీర్షిక చూసి కాసింత కన్‌ఫ్యూస్డ్ ఫేస్ పెట్టేసి మనోడేంటీ రాజకీయాల్లోకి గానీ ఎళ్తన్నాడంటావా ఈ మధ్య బజారయ్య, రిచ్చాబండి అని టపాలు వ్రాస్తున్నాడు....అని మీలో మీరే కొస్చెనింగ్ సేసుకుంటున్నారా...? ఏం భయపడకండి నేను రాజకీయాల్లోకి అస్సలు వెళ్ళబోడం లేదు... ఇది ఆ బాపతు టపా కానే కాదు !! మీరు నిర్భయం గా చదవచ్చు... సరే ఇక విషయం లోకి వస్తే... మీరు ఏప్పుడైనా సినిమా హాలు దగ్గర్లో ఉన్న ఇంట్లో ఉండటం జరిగిందా ? అంటే ఈ మధ్య కాదు కానీ కనీసం ఓ పదేళ్ళ కి ముందు. నాకు పిడుగురాళ్ళ లో ఉన్నప్పుడు ఆ అదృష్టం పట్టింది, నేను 7, 8 తరగతులు అక్కడే చదువు కున్నాను లెండి. మా నాన్న గారు...

గురువారం, జులై 24, 2008

అలలు కలలు ఎగసి ఎగసి...

ఈ రోజు ఉదయం ఆరు దాటి ఒక పది నిముషాలు అయి ఉంటుందేమో నేను ఆఫీసుకు బయల్దేరి బస్ కోసం నడుస్తూ నా IPOD లో యాదృచ్చిక పాటలు (Shuffle songs కి ఇంతకన్నా మంచి పదం దొరకలేదు నా మట్టిబుర్రకి) మీట నొక్కగానే మొదట గా ఈ పాట పలకరించింది. సూర్యోదయమై ఓ అరగంట గడిచినా, ఇంకా సూర్యుడు మబ్బుల చాటు నే ఉండటం తో ఎండ లేకుండ మంచి వెలుతురు. అటు చిర్రెత్తించే వేడి ఇటు వణికించే చలీ కాని ఉదయపు ఆహ్లాదకరమైన వాతావరణం లో ఈ పాట వింటూ అలా నడుస్తుంటే. ఆహా ఎంత బావుందో మాటల లో చెప్ప లేను. ఈ పాట కి సంభందించిన ప్రతి ఒక్కరినీ పేరు పేరు నా పొగడకుండా ఉండ లేకపోయాను. మీకు తెలుసా ఈ పాట ఇళయరాజా...

బుధవారం, జులై 23, 2008

మా బడి లో..బజారయ్య..

బజారయ్య నేను ఆరో తరగతి వరకు చదివిన మా వీధి బడి లో ఉండే వాడు. మా బడికి వాచ్‌మన్, అటెండర్, క్లీనర్, రిక్షావాడు, ఇంటర్వల్ లో తినుబండారాలు అమ్ముకునే వ్యాపారి అన్నీ అతనే... చాలా చిత్రం గా అతని భార్య పేరు బజారమ్మ. పెళ్ళయ్యాక మార్చుకుందో లేకా బడి లో అంతా అలా ఆవిడ పేరు మార్చేసారో తెలీదు. బజారయ్య కి ఓ చేయి ఉండేది కాదు. మోచేతి నుండి కిందకి ఓ నాలుగు అంగుళాలు వుండేది. దాన్ని కదిలించ గలిగే వాడు, అప్పుడప్పుడూ దానినే గ్రిప్ కి ఉపయోగించుకునే వాడు. ఆ చెయ్యి ఎలా ఇరిగింది బజారయ్యా అని అడిగితే ఓ చిన్న నవ్వు నవ్వేసి "ఏదో లే ఏణూ అయ్యన్నీ ఇప్పుడెందుకు.." అనే వాడు. సాధారణమైన...

శుక్రవారం, జులై 18, 2008

నేనూ నా చదువూ...

అలా కాన్వెంట్ భారి నుండి తప్పించుకుని మా బడి లో చేరాక, మొదట్లో కొంచెం మారాం చేసినా తర్వాత్తరవాత అక్కడ ఫ్రెండ్స్ తయారవ్వడం తో బాగానే బడికి వెళ్ళే వాడ్ని. చిన్నప్పుడు అమ్మ నాన్న చదవమని చెప్పే వాళ్ళు కానీ మరీ కూర్చో పెట్టి రుద్దే వారు కాదు. పైగా అప్పటి లో టీవీ లు ఉండేవి కాదు కదా సో రేడియో లు లేదా సినిమాలు ప్రధాన వినోద సాధనాలు. మనకి ఆటల మీద అంత ఇష్టం ఉండేది కాదు కాబట్టి బుద్ది గా ఇంట్ళోనే ఉండేవాడ్ని. మా ఇంట్లో రేడియో ఉన్నా కూడా దానికేసే కళ్ళప్పగించి చూస్తూ కూర్చోవాల్సిన పని లేదు కాబట్టి ఒక పక్కన అది మోగుతున్నా అది వింటూ అమ్మా నాన్న నాతో ఆడుకోడమో, కధలు,...

బుధవారం, జులై 16, 2008

కాన్వెంట్‌కెళ్దాం..ఛలో..చలో..

అసలు నేను పుట్టటమే ఓ 10 రోజులు ఆలస్యం గా పుట్టానుట. మా డక్టరాంటీ "వీడు లోపల తిష్టేసుకు కూర్చున్నాడు కదిలే లా లేడు.." అని పాపం అమ్మకి ఆపరేషను చేసి నన్ను బయటకి తీసిందిట ఆ కోపం/చిరాకు/ఖంగారు లోనేనేమో ఆవిడ నా కుడి చేతి మణికట్టుకి కొంచెం కింద గాటు పెట్టేసింది. నాతో పాటు పెద్దదవుతూ ఆ మార్క్ ఇప్పుడు కూడా అలానే వుంది.. సో అలా లేట్ అవడం వల్ల బాగా బలహీనం గా వుండటం, తెల్లగా పుట్టాల్సిన వాడ్ని నల్లగా పుట్టడం ఇలాంటివి అన్నీ జరిగాయంటూ ఉంటుంది అమ్మ. నాకు ఒకటిన్నర సంవత్సరం దాటినా కూడా సరిగా నిలబడ లేక పోయే వాడ్నిట. దాంతో మా అబ్బాయి ఇలా ఉంటే లాభం లేదు మా అబ్బాయిని...

ఆదివారం, జులై 13, 2008

పరువమా..చిలిపి పరుగు తీయకూ..

ఒకో రోజు ఉదయం నిద్ర లేచింది మొదలు రోజంతా ఒకే పాట పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. Haunting or something అంటారే అలా అనమాట. మీకూ అలా ఎప్పుడైనా అనిపించిందా....మీరు గమనించి ఉండరేమో కాని ఖచ్చితం గా మీరూ ఫేస్ చేసి ఉంటారు. ఏదో ఒక పాట ఉదయాన్నే రేడియో లో విన్నదో ఎవరన్నా ఇంట్లో వాళ్ళు హమ్ చేసిందో అలా సడన్ గా మనల్ని అంటుకుని రోజంతా అదే పాట గుర్తొస్తుంటుంది. నాకు ఈ రోజు నిద్ర లేవగానే ఎందుకో ఈ పాట గుర్తొచ్చింది రోజు మొత్తం మీద ఒక 10-15 సార్లు హమ్ చేసి ఉంటాను ఇక లాభం లేదు అని బ్లాగ్ లో పెట్టేస్తున్నా.చిన్నపుడు అప్పుడప్పుడూ ఉదయం పూట రేడియో లో విజయవాడ కేంద్రం వివిధ...

శనివారం, జులై 12, 2008

వీరయ్య మాష్టారు...

నేను నరసరావుపేట వదిలి పిడుగురాళ్ళ లో 7 వ తరగతి జాయిన్ అయ్యాక మన చదువుకి గ్రహణం పట్టడం మొదలైంది కానీ అంతకు ముందు అంటే ప్రైమరీ స్కూల్ లో ఉండగా 6 వ తరగతి వరకూ నేను క్లాస్ లో అందరికన్నా చిన్న వాడ్ని చదువులో కాస్త చురుకైన వాడ్ని. మా వీధి బడి లో చాలా మంది మాష్టర్లకి నేను ప్రియ శిష్యుడ్ని. నేను మొదటి తరగతి నుండీ అదే బడిలో చదువుకునే వాడ్ని. మా బడి, మొదట్లో అంటే నేను ఒకటో తరగతి చదివేప్పుడు మా ఇంటి పక్కనే ఉండేది. అసలు నేను ఈ బళ్ళో పడటం వెనక ఓ చిన్న పిట్ట కధ ఉంది అది రేపు చెప్పుకుందాం లెండి...నేను ఐదో తరగతి చివర్లో ఉన్నపుడనుకుంటా మా వీరయ్య మాష్టరు గారు మా...

శుక్రవారం, జులై 11, 2008

మా బేబీ ఖాన్ కబుర్లు...

:-) నేను చెప్ప బోయేది నా ఇంజినీరింగ్ క్లాస్ మేట్ బేబీ గురించి. వాడ్ని బేబీ అనీ ఖాన్ అనీ ఎవడి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పిలచే వాళ్ళు. వాడికి ఆ నిక్ నేం ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో గుర్తు లేదు, చూడటానికి కొంచెం సినీ హీరో శ్రీకాంత్ లా ఉంటాడు (అంటే బూతద్దం పట్టుకుని వెతికితే కాసిన్ని పోలికలు కనబడతాయ్ లెండి) కాస్త పొట్టిగా బుజ్జి గా ఉంటాడు అందుకే ఆ పేరు వచ్చిందనుకుంటా. మనిషి చాలా మంచోడు సరదాగా అందరితో కలిసిపోయి ఎవరికన్నా హెల్ప్ కావాలి అంటే అందరికన్నా ముందు ఉంటాడు. కాకపోతే ప్రతీ గుంపు లోను ఒకడు బకరా కావాల్సిందే కదా మా వాడు ఆ కేటగరీ అనమాట అదీ కాక వాడు...

సోమవారం, జులై 07, 2008

సొగసు చూడ తరమా !..

ఇది గుణశేఖర్ రెండవ సినిమా అనుకుంటా, తన మొదటి సినిమా లాఠీ లో వయొలెన్స్ ఎక్కువ ఉంటుంది అది హిట్ కాకపోయినా కొన్ని సీన్స్ చాలా బావుంటాయ్. ఇతను రెండో సినిమా పూర్తి వ్యతిరేకం గా చాలా సాఫ్ట్ సబ్జెక్ట్ తీసుకుని భార్యా భర్తల మధ్య రిలేషన్ ని చక్కగా చూపిస్తాడు. ఇందులో ఆర్ట్ వర్క్ వైవిధ్యం గా బావుంటుంది, ఈ సినిమా లోని ప్రింటెడ్ చీరలు సొగసు చూడ తరమా చీరలు గా కొంత కాలం బాగానే హవా కొనసాగించాయనుకుంటా... ఇంద్రజ characterization and presentation సినిమా కే హైలెట్.నేను ఇంజనీరింగ్ చదివే రోజులలో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్స్ పరం గా హిట్ అవునో కాదో గుర్తు...

ఆదివారం, జులై 06, 2008

పైనాపిల్

నిన్న మా వైష్ణవి పేల్చిన ఇంకో మంచి జోక్ గురించి చెప్పడం మర్చిపోయానండీ... here it isవైషు: అమ్మా టేబుల్ పైన అదేంటి ..?అమ్మ: ఓ అదా...అదీ..పైనాపిల్ (pineapple) రా...వైషు: అవునా...(ఓ నిముషం అలా వెళ్ళివచ్చి)వైషు: "అమ్మా నాకు పైనాపిల్ కావాలి ఇంకా కిందాపిల్ కూడా కావాలి..."అమ్మ: !!!!...:-)పైనాపిల్ ని పైన ఆపిల్ గా విడగొట్టేయడమే కాకుండా దానికి కింద ఆపిల్ అని కౌంటరు కూడా వేసేసిన మా వైషు తెలివికి అవాక్కవడం తప్ప మేమేం చేయగలం చెప్పండి.-- మీ వ...

శనివారం, జులై 05, 2008

బుడుగులు..బుడిగీలు..పిడుగులు..

నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఛా! ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు బాబూ అని అంటారా... నిజమే లెండి ఏదో విక్రమార్కుడు సినిమా లో అత్తిలి సత్తిబాబు లాంటి వాళ్ళకి తప్ప మనలో చాలా మందికి పిల్లలు అంటే ఇష్టమే ఉంటుంది. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టమే కానీ పెంపకం లో ఉండే చాకిరి, పెంకి పిల్లలు చేసే అల్లరి ఒకోసారి భరించడం కష్టమేమో అనిపిస్తుంది. కాని ఎన్ని కష్టాలు పడినా వాళ్ళు చూపించే ప్రేమ చూడగానే అన్నీ ఒక్క క్షణం లో మర్చిపోతాం. ఉదాహరణకి మధ్యాహ్నమో లేక ఉదయాన్నో నిద్ర లేచిన వెంటనే సగం మత్తు తో అలా మన దగ్గరికి వచ్చి మెడని కావలించుకుని బుజం మీద పడుకోడమో... లేదూ ఆటల...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.